చిందం ఆశన్న
| చిందం ఆశన్న | |
|---|---|
చిందం ఆశన్న | |
| జననం | చిందం ఆశన్న 1972 August 10 కుచలాపూర్ తలమడుగు , మండలం ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ , ఇండియా |
| నివాస ప్రాంతం | వాల్మీకి నగర్ ఆదిలాబాద్ ఆదిలాబాద్, తెలంగాణ |
| వృత్తి | తెలుగు భాషోపాధ్యాయుడు |
| ప్రసిద్ధి | కవి, రచయిత, |
| మతం | హిందూ మతం |
| భార్య / భర్త | ప్రమీల |
| పిల్లలు | వివేక్ చైతన్య, కృష్ణ చైతన్య, హైందవి |
| తండ్రి | లచ్చన్న |
| తల్లి | గంగమ్మ |
తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాదు జిల్లా తలమడుగు మండలం కుచలాపూర్ గ్రామానికి చెందిన కవి, రచయిత, గాయకుడు, తెలుగు భాషోపాధ్యాయుడు. ప్రముఖ కవి సింగిరెడ్డి నారాయణరెడ్డి గారిచే 2016లో ఉత్తమ భాషోపాధ్యాయుడుగా పురస్కారం అందుకున్నాడు[1][2].
బాల్యం - విద్యాభ్యాసం
[మార్చు]చిందం ఆశన్న 1972 ఆగష్టు 10 న చిందం లచ్చన్న, గంగమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం,ఆదిలాబాదు జిల్లా, తలమడుగు మండలంలోని కుచలాపూర్ గ్రామంలో జన్మించాడు. ప్రాథమిక విద్య స్వంత గ్రామంలో చదివి ఉన్నత విద్య ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదు నుండి యం.ఎ తెలుగు టి.పి.టి శిక్షణ ను పూర్తి చేశాడు.
సాహిత్య సేవ
[మార్చు]వృత్తి రీత్యా ప్రభుత్వ తెలుగు భాషోపాధ్యాయుడిగా పని చేస్తున్న చిందం ఆశన్న ప్రవృత్తి రీత్యా కవి, రచయిత గా సాహితీ రంగంలో రాణిస్తున్నారు. సామాజికాంశాల పై మాండలిక, వ్యవహరిక పదాలతో అనేక వచన కవితలు రచించి ప్రాచుర్యం పొందినారు. భగవద్గత్తమైన సాహిత్య వ్యాసంగంలో అలవోకగా ఛందో బద్ధమైన కవితాధారాలతో తన ఇష్ట దైవమైన జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణస్వామి గురించి భక్తి శ్రద్ధలతో శతకం రచించారు.
పద్య ప్రక్రియలోని మాధుర్యాన్ని పసిగట్టి చక్కటి ఆటవెలది పద్యాల రచనకు పూనుకున్నాడు. తెలంగాణ రచయితల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలు చేస్తూ, జిల్లాలో తెలుగు భాషాభిమానులు, విద్యార్థులచే కవిసమ్మేళనాలు, ప్రముఖ కవుల జయంతి, వర్ధంతి వేడుకలు నిర్వహిస్తూ వారిచే వచన కవితలు, కథలు రాయిస్తూ తెలుగు భాష వికాసం కోసం తన వంతు కృషి చేస్తున్నారు[3]. పాఠశాల ప్రారంభానికి ముందు మొదలయ్యే బడి బాట పై చక్కటి పాట రాసి సంగీతం చేర్చి జిల్లా పాలనాధికారి చే విడుదల చేయించడం విశేషం.వివిధ ప్రాచీన దేవాలయాల స్థల పురాణాలే ఇతి వృత్తంగా పాటల రచన సంగీతం సమకూర్చి విడుదల చేసి యూ ట్యూబ్ లో పెట్టడం వలన అది అత్యంత ప్రజాదరణ పొందడం గొప్ప విషయం.
రచనలు
[మార్చు]1.ద్విత్వసంయుక్తాక్షరాలు నేర్పడం ఎలా ? (సూక్ష్మాంశ పరిశోధన)
2.క్రీడా జ్యోతి జాతర్ల
3.ఆదిలాబాద్ జిల్లా ప్రాచిన దేవాలయాలు,
5.శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ శతకం
6.జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణస్వామి శతకము (పద్యకావ్యం జైనాథ్ స్థలపురాణం చరిత్ర)
7.కాల మేఘం (వచన కవిత్వం)
పురస్కారాలు
[మార్చు]- . ఉత్తమ సాహితీవేత్త - 2015
- . ఉత్తమ భాషోపాధ్యాయుడు- 2016
- . ఉత్తమ జిల్లా ఉద్యోగి 2017
(ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి రివార్డు)
- . ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2020 (లయన్స్ క్లబ్ ఆదిలాబాదు జిల్లా వారిచే)
- . ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు -2022
(ఆదిలాబాదు జిల్లా స్థాయిలో)
- . ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం-2025
(ఆదిలాబాద్ జిల్లాపాలనాధికారి శ్రీ రాజర్షిషా చే)
మూలాలు
[మార్చు]- ↑ "Bhairamdev Temple: ఈ గుడిలో శివలింగాన్ని ఎత్తితే కోరిన కోరిక నెరవేరాల్సిందే." telugu.news18.com. 2025-01-24. Retrieved 2025-09-30.
- ↑ telugu, NT News (2023-07-10). "కవులు, కళాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం". www.ntnews.com. Retrieved 2025-09-30.
- ↑ "ప్రజల ముంగిట 'జిల్లా సమగ్ర స్వరూపం'". EENADU. Retrieved 2025-09-30.
