చిక్కం
చిక్కం అనగా మొలలో దోపుకునే డబ్బు సంచి[1]. పశువులు పంటను తినేయకుండా మూతికి కట్టె చిన్న బట్ట ను కూడా చిక్కం అంటారు.[2] పశువులు మెయ్యటానకి వీల్లేకుండా మూతికివేసే జల్లెడ; దీన్ని వెదురుబద్దలు, తాడు, పేము, దూసరతీగె మొ.వాటితో అల్లుతారు.
గతంలో పల్లే వాసులు ముఖ్యంగా గొర్రెల కాపరులు తమ జీవాలను మేత కొరకు అడవికి తోలు కెళ్లే టప్పుడు తమ మధ్యాహ్న బోజనానికి ఒక ముద్ద సంగటి, చింత కాయ వూరి బిండి ఒక గుడ్డలో మూట గా కట్టి దాన్ని ఒక విధమైన సంచితో పెట్టి బుజానికి తగిలించు కొని వెళ తారు. వాటిని తీసుకు పోవడానికి ఉపయోగించే సంచిని కూడా చిక్కం అంటారు.
ఇది ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో, పరిసర ప్రాంతాల ప్రాంతాలలో ఒకప్పుడు వాడుకలో వుండేది. చిక్కం సన్నని దారాలతో అల్లిన ఒక చిన్న సంచి లాంటి సాధనము.
తీగలు లోనగువానితో అల్లి పసులమూతికి దగిలించెడు బుట్ట /. దారముతో అల్లిన సంచి / మొలలో దోపుకునే డబ్బు సంచి అనే అర్థాలు కూడా ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రభారతి నిఘంటువు ప్రకారం చిక్కం
- ↑ "చిక్కం | అమర్కోష్". అమర్కోష్.భారత్. Retrieved 2025-09-29.