చిత్తూరు మహమ్మద్ హబీబుల్లా
చిత్తూరు మహమ్మద్ హబీబుల్లా | |
|---|---|
సుప్రసిద్ద వైద్యులు, పద్మశ్రీ డాక్టర్ హబీబుల్లా గారు | |
| 1937 ఆంధ్రప్రదేశ్, భారతదేశము | |
| మరణం | 10 జూలై 2010 |
| వృత్తి | గాస్ట్రో ఎంటరాలజిస్టు |
| పిల్లలు | డాక్టర్ ఏజాజ్ హబీబ్ |
| పురస్కారాలు | పద్మశ్రీ ఖ్వారిజ్మి అంతర్జాతీయ అవార్డు |
సి. ఎం. హబీబుల్లా గా ప్రసిద్దులైన చిత్తూరు మహమ్మద్ హబీబుల్లా భారతీయ వైద్యులు. ఆయన గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో భారత దేశంలో సుప్రసిద్ధుడు.[1][2]
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన 1937 లో భారతదేశ దక్షిణాది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు.[3] 1958 లో గుంటూరు వైద్య కళాశాల నుండి ఎం.బి.బి.ఎస్ పట్టాను పొందారు. తరువాత ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని, చండీగడ్ లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుండి ఎం.డి పట్టాలను పొందారు.[1]
కెరీర్
[మార్చు]ఆయన ఉస్మానియా వైద్య కళాశాలలో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా కెరీర్ ప్రరంభించారు. 1975 నుండి 1992 వరకు ఆ విభాగానికి అధిపతిగా యున్నారు. తరువాత 1994 వరకు ప్రధానాద్యాపకునిగా పనిచేసారు.[1] ఆయన హైదరాబాదు లోని దక్కన్ కాలేజి ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సెంటర్ ఫర్ లివర్ రీసెర్చ్ అండ్ డయాగ్నాసిస్ విభాగంలో డైరక్టరుగా తన సేవలనందించారు.[3] ఆయన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ విద్యకు డైరక్టరుగా కూడా పనిచేసారు.[1] ఆయన భారతదేశం లోని నేషనల్ సైన్సు అకాడమీలో 1997 లో ఫెలోషిప్ పొందారు.[3] ఆయన అనేక శాస్త్రపరమైన ప్రచురణలు చేసి గుర్తింపబడ్డారు.[4][4]
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- 1 2 3 4 5 Springer (October 2010). "Chittoor Mohammed Habibullah". Indian Journal of Gastroenterology. 29 (5): 175–176. doi:10.1007/s12664-010-0053-9.
- ↑ "Learning from Expert". Learning from Expert. 2014. Archived from the original on 2015-01-02. Retrieved January 2, 2015.
- 1 2 3 "NASI". NASI. 2014. Retrieved January 2, 2015.
- 1 2 "Listing on Pubfacts". Pubfacts. 2014. Archived from the original on 2015-09-24. Retrieved January 2, 2015.
- ↑ "KIA". KIA. 2014. Archived from the original on 2013-12-15. Retrieved January 2, 2015.
- ↑ "Padma Awards" (PDF). Padma Awards. 2014. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved November 11, 2014.
- ↑ "డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డులు : స్నాతకోత్సవం డీఎస్సీ అవార్డు". Archived from the original on 2016-06-02. Retrieved 2016-05-21.
ఇతర లింకులు
[మార్చు]- "Listing on Pubfacts". Pubfacts. 2014. Archived from the original on 2015-09-24. Retrieved January 2, 2015.
- వైద్యవృత్తికే అంకితమైన డాక్టర్ హబీబుల్లా Mon, 6 Sep 2010[permanent dead link]