Jump to content

చిత్త బసు

వికీపీడియా నుండి
చిత్త బసు

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జనరల్ సెక్రటరీ
పదవీ కాలం
1979 మార్చి 19 – 1997 అక్టోబర్ 5
ముందు ఆర్.కె. హల్దుల్కర్
తరువాత దేబబ్రత బిశ్వాస్

పదవీ కాలం
1989 – 1997 అక్టోబర్ 5
ముందు తరుణ్ కాంతి ఘోష్
తరువాత రంజిత్ కుమార్ పంజా
నియోజకవర్గం బరాసత్
పదవీ కాలం
1977 – 1984
ముందు రణేంద్రనాథ్ సేన్
తరువాత తరుణ్ కాంతి ఘోష్

పదవీ కాలం
1957 – 1962
ముందు అమూల్యధన్ ముఖోపాధ్యాయ
తరువాత హెచ్.కె. బసు
నియోజకవర్గం బరాసత్

వ్యక్తిగత వివరాలు

జననం 1926 డిసెంబర్ 25
డాకా , బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా
మరణం 1997 October 5(1997-10-05) (వయసు: 70)
బీహార్ , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ ఫార్వర్డ్ బ్లాక్
పూర్వ విద్యార్థి కలకత్తా విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు

చిత్త బసు (25 డిసెంబర్ 1926 - 5 అక్టోబర్ 1997) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బరాసత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

చిత్త బసు భారత జాతీయ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తర్వాత 1939లో సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన ఫార్వర్డ్ బ్లాక్ లో చేరి 1945లో ఆశాజనక విద్యార్థి నాయకుడిగా, 1947 నుండి 48 వరకు పార్టీ యువజన విభాగం, ఆల్-ఇండియా యుబా లీగ్ ప్రధాన కార్యదర్శిగా, భారతదేశ విభజన తర్వాత శరణార్థుల పునరావాస పనుల్లో మునిగిపోయాడు. ఆయన 1972లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, మార్చి 1979లో ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశాడు.

చిత్త బసు 1957లో మొదటిసారిగా అప్పటి అవిభక్త 24 పరగణాల జిల్లాలోని బరాసత్ నుండి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆయన 1966లో రాజ్యసభ సభ్యుడిగా, 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బరాసత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మొదటిసారి 6వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. చిత్త బసు 1980, 1989, 1991 & 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన1996లో యునైటెడ్ ఫ్రంట్ స్టీరింగ్ కమిటీ సభ్యుడయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. Mishra, Mayank (6 October 1997). "Chitta Basu: A Man of Determination And Courage". Business Standard. Archived from the original on 12 October 2018. Retrieved 12 October 2018.
  2. "Forward Bloc leader Chitta Basu dead". Rediff.com. 6 October 1997. Retrieved 12 October 2018.
  3. Banerjee, Santanu (6 October 1997). "Chitta Basu dies in sleep aboard Howrah-bound train". The Indian Express. Archived from the original on 23 August 1999. Retrieved 12 October 2018.
  4. "Quicktakes -- Chitta Basu is dead". The Indian Express. 6 October 1997. Archived from the original on 5 November 1999. Retrieved 12 October 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=చిత్త_బసు&oldid=4604231" నుండి వెలికితీశారు