చిత్రదర్శిని(Kaleidoscope)
చిత్రదర్శిని అనేది సిలెండరు ఆకారం కలిగివుంటుంది. అందులో గాజు ముక్కలు,రకరకాల,రంగుల పూసలు వుంటాయి.వీక్షకుడు ఒక వైపు నుండి చూస్తే ఇతర కాంతి కిరణాలు అద్దాల మీద పడటం వల్ల జరిగే పరావర్తనము ఒక రంగుల నమూనాను సృష్టిస్తుంది.
నమూనా
[మార్చు]చిత్రదర్శిని, బహుళ పరావర్తనము నియమము పై ఆధారపడి ఉంటుంది.చిత్రదర్శినిలో అద్దాలను ఒక దానితో ఒకటి కొంత కోణాన్ని చేసేటట్టు ఏర్పాటు చేస్తారు(సామాన్యంగా 600 ల కోణం ). సాధారణంగా చిత్రదర్శినిలో మూడు అద్దాలను 600 కోణంలో పెట్టినప్పుడు అవి ఒక సమబాహు త్రిభుజము ఏర్పడుతుంది.ఈ600 కోణం 7 నకిలి ప్రతిబింబాలను సృష్టిస్తుంది. గొట్టాన్ని తిప్పినప్పుడు ఆ రంగుల వస్తువులు వివిధ నమూనాలను ఏర్పరుస్తుంది.అనియంత్రిత నమూనాలు పరావర్తనముల వలన అందమైన సుష్ట నమూనాలుగా కనిపిస్తాయి. ఆధునిక చిత్రదర్శినిలను ఇత్తడి గొట్టాలతో,చెక్క,ఉక్కు మొదలైన వాటితో చేస్తున్నారు.వస్తువులను చూడడానికి ఎక్కడైతే ఉంచుతామో దానిని వస్తువు చాంబర్' లేదా 'వస్తువు సెల్' అంటారు.
చరిత్ర
[మార్చు]సర్ డేవిడ్ బ్రూవ్స్టర్ 1815 లో చిత్రదర్శినిని కనుగొన్నడు.అతను 1817 లో ఫిలిప్ కార్పెంటర్ ని తన భాగస్వామిగా చేసుకుని రెండు వందల వేల చిత్రదర్శిని లను అమ్మారు.దీనిని తర్వాత శాస్త్రపయోగ వస్తువుగా కాకుండా ఆట వస్తువుగా వాడటం మొదలైంది.
ప్రచురణలు
[మార్చు]Cozy Baker-The Brewster Kaleidoscope Society వ్యవస్థాపకుడు చిత్రదర్శిని లను పోగుచేసి, వాటిని కళాకారులు ఎలా తయారుచేస్తారో పుస్తకాలను రచించారు. ఆ పుస్తకాలలో ఒకటి Kaleidoscope Artistry.చిత్రదర్శిని ల గురించి సంచికలు కుడా వెలువడుతాయి.దాని పేరు The New Kaleidoscope.
పరిశ్రమ
[మార్చు]చిత్రదర్శిని లను ఎక్కువగా తక్కువ ఖర్చు అయ్యే పదార్ధాల నుండి తయారుచేస్తారు.వీటిని యెక్కువగా చిన్న పిల్లల ఆట బొమ్మలగా వాడతారు.
ఇది కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- [1]
- [2][permanent dead link] చిత్రదర్శిని