చిత్రా సింగ్
చిత్రా సింగ్ | |
|---|---|
2012లో చిత్ర | |
చిత్రా షోమ్[1] | |
| ఇతర పేర్లు | చిత్రా దత్తా, చిత్ర |
| వృత్తి | గాయని |
| క్రియాశీలక సంవత్సరాలు | 1970–1990 |
| ప్రసిద్ధి | గజల్, శాస్త్రీయ సంగీతం, భక్తి గీతం, జానపద సంగీతం |
| Spouse(s) | దేబో ప్రసాద్ దత్తా (విడాకులు 1969) జగ్జీత్ సింగ్ (1969-2011 (మరణం)) |
చిత్రా సింగ్ (జననం 1940 ఏప్రిల్ 11), ఒక భారతీయ గజల్ గాయని.[2] ఆమె తన రెండవ భర్త జగ్జిత్ సింగ్ తో కలిసి గజల్ శైలిని ప్రాచుర్యంలోకి తెచ్చింది.[3] "ఘజల్ ప్రపంచానికి రాజు, రాణి" గా గౌరవప్రదమైన ఈ భార్యాభర్తల ద్వయం 1970, 80 లలో అత్యంత విజయవంతమైన భారతీయ సంగీతాన్ని సృష్టించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]చిత్ర ఒక బెంగాలీ హిందూ కుటుంబంలో చిత్రా షోమ్ గా జన్మించింది. ఆమె విద్యను పూర్తి చేసిన తరువాత, ఆమె ఒక ప్రముఖ ప్రకటనల ఏజెన్సీలో ఎగ్జిక్యూటివ్ అయిన దేబొ ప్రసాద్ దత్తాను వివాహం చేసుకుంది. వివాహం 1950ల మధ్యలో జరిగింది, ఈ జంటకు 1959 లో మోనికా అనే కుమార్తె జన్మించింది.[4]
అయితే, వివాహానికి ముందుగానే ఆమెకు జగ్జిత్ సింగ్ తో పరిచయమున్నది. దీంతో 1969లో, చిత్ర తన భర్త ప్రసాద్ కు విడాకులు ఇచ్చి, జగ్జిత్ సింగ్ ను తిరిగి వివాహం చేసుకుంది. తన 9 ఏళ్ల కుమార్తెను తనతో తీసుకువెళ్ళింది.[5][6][7]
జగ్జీత్ సింగ్ పంజాబీ సిక్కు నామ్ధారీ కుటుంబానికి చెందినవాడు. కాగా వీరిది రాజస్థాన్ లోని శ్రీగంగానగర్. వారు మొదటిసారిగా 1967లో ఒక రికార్డింగ్ స్టూడియోలో కలుసుకున్నారు. చిత్రకు జగ్జీత్ లోని వ్యక్తిత్వం ఎంతగానో ఆకర్షించింది
ఈ జంటకు 1970 ఆగస్టు 20న కుమారుడు వివేక్ సింగ్ కలిగాడు. డెబ్బైల మధ్యలో, చిత్రా సింగ్, జగ్జీత్ సింగ్ వారి గజల్లకు ప్రసిద్ధి చెందారు. ఎంతగా అంటే "గజల్ల రాజు-రాణి" గా ఎదిగారు.[8] 1990 జూలై 27న జరిగిన రోడ్డు ప్రమాదంలో వివేక్ మరణించాడు. తన కొడుకు మరణించిన రోజు నుండి చిత్ర ఎప్పుడూ బహిరంగంగా పాడలేదు, ఏ పాటను రికార్డ్ చేయలేదు.
మోనికా మొదట అవార్డు గెలుచుకున్న సినిమాటోగ్రాఫర్ జహంగీర్ చౌదరితో ప్రేమలో పడింది. వారు 1988లో వివాహం చేసుకున్నారు. ఇద్దరు కుమారులకు తల్లిదండ్రులు అయ్యారు. 2005లో, మోనికా చౌదరి నుండి విడాకులు తీసుకొని, ముంబై విక్రోలిలో ఉన్న ఒక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అయిన బ్రిటిష్ జాతీయుడు మార్క్ హౌఘ్టన్ రోజర్ అట్కిన్స్ ను వివాహం చేసుకుంది. 2007లో, మోనికా అట్కిన్స్ పై వేధింపుల కేసు పెట్టింది. 2008లో, ఒక మేజిస్ట్రేట్ అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసాడు, కానీ అతను అప్పటికే దేశం విడిచి పారిపోయాడు. 2009లో, 50 ఏళ్ల మోనికా ఆత్మహత్య చేసుకుంది.[9] ఆమెకు అర్మాన్ (17), ఉమైర్ (12) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.[10] ఈ సంఘటన జరిగిన రెండు సంవత్సరాల తరువాత, జగ్జీత్ సింగ్ 2011లో మెదడులో రక్తస్రావం కారణంగా మరణించాడు. చిత్ర ఇప్పుడు తన ఇద్దరు మనుమలతో నివసిస్తోంది.[11]
డిస్కోగ్రఫీ
[మార్చు]| ఎ మైల్‌స్టోన్ (1976) |
| ది అన్‌ఫర్గెటబుల్స్ (1978) |
| గోల్డ్ డిస్క్ (1979) |
| ఏ మేరే దిల్ (1980) |
| లైవ్ ఎట్ వెంబ్లీ |
| లైవ్ ఎట్ రాయల్ ఆల్బర్ట్ హాల్ |
| ది లేటెస్ట్ |
| డిజైర్స్ |
| అర్థ్/సాథ్ సాథ్ |
| చిరాగ్ |
| లైవ్ ఇన్ ట్రినిడాడ్ |
| మై ఔర్ మేరీ తన్హాయీ (1981) |
| ది లేటెస్ట్ (1982) |
| ఎక్స్టసీస్ (1984) |
| ఎ సౌండ్ అఫైర్ (1985) |
| ఎకోస్ (1985–86, లైవ్ రికార్డింగ్‌లు) |
| బియాండ్ టైమ్ (1987) |
| మీర్జా గాలిబ్ (1988) |
| సమ్‌వన్ సమ్‌వేర్ (1990) |
| హోప్ (1991) |
| హలో వరల్డ్ (2025) |
మూలాలు
[మార్చు]- ↑ "Flying solo with Chitra Singh". 8 January 2016.
- ↑ Sahara, Rashtriya (1997). "Rashtriya Sahara, Volume 5, Issues 1-6". Google Books. Sahara India Mass Communication. Retrieved 28 April 2015.
- ↑ "Jagjit & Chitra Singh". AllMusic.
- ↑ "'I want to marry your wife,' Jagjit Singh asked Chitra's ex-husband..." Retrieved 8 February 2018.
- ↑ Ayesha (February 8, 2022). "पहले दोनों बच्चों की हुई मौत फिर पति का भी साथ छूटा, जगजीत सिंह की पत्नी की जिंदगी सिखाती हैं दर्द के साथ जीना". Navbharat Times. Retrieved June 12, 2023.
- ↑ "When Jagjit Singh asked for Chitra's hand from her estranged husband: 'I want to marry your wife'". The Indian Express. October 9, 2021. Retrieved June 12, 2023.
- ↑ "Jagjit called me Mummy, I called him Papa - Chitra Singh".
- ↑ "This Retro Video Of Jagjit Singh And His Wife Chitra Singing 'Punjabi Tappe' Is Pure Gold!". Indiatimes (in Indian English). 2017-02-08. Retrieved 2024-08-11.
- ↑ "Chitra Singh daughter found hanging; was depressed, says family". 30 May 2009.
- ↑ "Triple tragedy for Jagjit Singh's wife Chitra".
- ↑ Farook, Farhana (April 18, 2018). "Chitra Singh remembers her husband - The unforgettable Jagjit Singh". Filmfare. Retrieved June 12, 2023.