Jump to content

చిత్ర సోమన్

వికీపీడియా నుండి
చిత్ర సోమన్
Personal information
Nationalityభారతీయురాలు
Born (1983-07-10) 1983 జులై 10 (వయసు: 43)
Sport
Sportట్రాక్ అండ్ ఫీల్డ్
Eventఅథ్లెటిక్స్
Achievements and titles
Personal best(s)200 మీ: 24.74 (దోహా 2006)
400 మీ: 51.3 (చెన్నై 2004)
400 మీ హర్డిల్స్: 57.70 (లుధియానా 2005)
Medal record
మహిళల అథ్లెటిక్స్
Representing భారతదేశం
కామన్‌వెల్త్ క్రీడలు
Silver medal – second place 2006 మెల్‌బోర్న్4 × 400 మీ రిలే
ఆసియా క్రీడలు
Gold medal – first place 2006 దోహా 4 × 400 మీ రిలే
ఆసియా ఛాంపియన్షిప్స్
Gold medal – first place 2005 ఇంచియోన్ 4 × 400 మీ రిలే
Gold medal – first place 2007 అమ్మాన్ 4 × 400 మీ
Gold medal – first place 2007 అమ్మాన్ 4 × 400 మీ రిలే
Silver medal – second place 2009 గ్వాంగ్ఝౌ 4 × 400 మీ రిలే

చిత్ర కులతుమ్మురియిల్ సోమన్ (జననం 1983 జూలై 10) కేరళ కొట్టాయంలోని మట్టక్కరలో జన్మించింది. ఈమె తండ్రి కొట్టాయంకి, తల్లి కంజిరపల్లికి చెందినవారు. ఈమె 400 మీటర్ల పరుగులో ప్రత్యేకత కలిగిన భారతీయ క్రీడాకారిణి. 2004 వేసవి ఒలింపిక్స్ లో సోమన్ తన సహచరులు సత్తి గీత, కె. ఎం. బీనామోల్, రజ్వీందర్ కౌర్ లతో కలిసి 4 x 400 మీటర్ల రిలే విభాగంలో ఏడవ స్థానంలో నిలిచింది. ఈ జట్టు, గీతకు బదులుగా మన్‌జీత్ కౌర్ పరుగెత్తి, హీట్స్‌లో 3: 26.89 నిమిషాల జాతీయ రికార్డును నెలకొల్పింది[1]2006 కామన్వెల్త్ క్రీడలలో రజత పతకం సాధించిన భారత జట్టు తరఫున కూడా సోమన్ పోటీ పడింది. ఈమె 2007 జూన్ 23న గౌహతిలో జరిగిన ఆసియా గ్రాండ్ ప్రి సిరీస్‌లో 400 మీటర్ల రేసులో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 2007 జూలైలో అమ్మాన్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ పోటీలలో భారత మహిళల 4×400 మీటర్ల రిలే జట్టుకు స్వర్ణ పతకాన్ని సాధించడంలో ఈమె నాయకత్వం వహించింది. ఫిబ్రవరి 2008లో దోహాలో జరిగిన 3వ ఆసియా ఇండోర్ ఛాంపియన్షిప్ ఇన్ అథ్లెటిక్స్లో భారత మహిళల 4×400 మీటర్ల రిలే జట్టుకు మరో విజయాన్ని అందించడం ద్వారా చిత్ర మళ్లీ తన సత్తా చాటింది.[2][3]

400 మీటర్ల పరుగులో ఈమె వ్యక్తిగత ఉత్తమ సమయం 51.30 సెకన్లు, ఇది జూన్ 2004లో సాధించింది, 2011లో ఈమె పంజాబ్‌కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది.


మూలాలు

[మార్చు]
  1. "Commonwealth All-Time Lists (Women)".
  2. "MEDAL WINNERS OF ASIAN GAMES". Athletics Federation of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 July 2021.
  3. "இந்திய விளையாட்டு வீராங்கனைகள் இதுவரை வென்றுள்ள பதக்கங்கள் எத்தனை?". BBC Tamil. 25 February 2020. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 July 2021.