చిత్‌పవన్ బ్రాహ్మణులు
| చిత్పవన్/కోకనస్థ బ్రాహ్మణులు | |
|---|---|
| మతాలు | హిందూమతం |
| భాషలు | మరాఠీ భాష, గుజరాతీ భాష, కన్నడం, చిత్‌పవనీ కొంకణి. |
| జనాభా గల రాష్ట్రాలు | కొంకణ్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, మధ్య ప్రదేశ్, గుజరాత్) |

చిత్పవన్ బ్రాహ్మణులు లేదా కోకనస్థ బ్రాహ్మణులు మహారాష్ట్ర తీరప్రాంతమైన కొంకణ్‌లో నివసించే మహారాష్ట్ర బ్రాహ్మణ సమాజం. ప్రారంభంలో పదిహేడవ శతాబ్దం చివరలో దూతలుగా, గూఢచారులుగా పనిచేసేవారు. 18 వ శతాబ్దంలో బాలాజీ విశ్వనాథ్ భట్ కుటుంబానికి చెందిన పీష్వా వారసులు మరాఠా సామ్రాజ్యానికి వాస్తవ పాలకులైనప్పుడు ఈ సమాజం ప్రాముఖ్యతను సంతరించుకుంది. 18వ శతాబ్దం వరకు, కర్ణాటక-మహారాష్ట్ర ప్రాంతంలోని పురాతన బ్రాహ్మణ సమాజమైన దేశస్థ బ్రాహ్మణులు చిత్‌పవన్‌లను తక్కువగా చూసేవారు.[1][2][3]
జయంత్ లేలే ప్రకారం, పీష్వా యుగంలోనూ, బ్రిటిష్ యుగంలోనూ చిత్‌పవన్‌ల ప్రభావాన్ని బాగా అతిశయోక్తి చేసి చూపారని అంటాడు. అత్యంత ప్రముఖమైన పీష్వాల కాలంలో కూడా, వారి రాజకీయ చట్టబద్ధతను, వారి ఉద్దేశాలనూ పరిపాలనలోని అన్ని స్థాయిల వారు, చివరికి శివాజీ వారసులు కూడా విశ్వసించలేదు అని అతను అన్నాడు. ఆంగ్లో-మరాఠా యుద్ధాలలో పీష్వాలు ఓడిపోయిన తర్వాత, బ్రిటిష్ ఇండియా లోని బొంబాయి ప్రెసిడెన్సీలో పాశ్చాత్య విద్య వైపు తరలివచ్చిన హిందూ వర్గాలలో చిత్‌పవన్‌లు కూడా ఒకరని అతను చెప్పాడు.[4]
చరిత్ర
[మార్చు]మరాఠా పాలనలో ఎదుగుదల
[మార్చు]
1707 కి ముందు చిత్‌పవన్‌ల గురించి తెలిసింది చాలా తక్కువ.[5] బాలాజీ విశ్వనాథ్ భట్, ఒక చిత్‌పవన్, రత్నగిరి నుండి పూణే - సతారా ప్రాంతానికి వచ్చారు. సమర్థవంతమైన పరిపాలకుడిగా ఆయనకున్న ఖ్యాతి ఆధారంగా ఆయనను అక్కడికి తీసుకువచ్చారు. త్వరలోనే అతను ఛత్రపతి షాహు దృష్టిని ఆకర్షించాడు. బాలాజీ చేసిన పని ఛత్రపతికి ఎంతగానో నచ్చడంతో, ఆయనను 1713లో పీష్వాగా (ప్రధానమంత్రిగా) నియమించాడు. ఆయన సువ్యవస్థితమైన పరిపాలనను నడిపాడు. 1720 లో ఆయన మరణించే నాటికి, మరాఠా సామ్రాజ్య విస్తరణకు పునాది వేశాడు. అప్పటి నుండి మరాఠా సామ్రాజ్యం పతనమయ్యే వరకూ, పీష్వా పీఠాన్ని భట్ కుటుంబ సభ్యులే అధిష్టించారు.[6]
బాలాజీ బాజీ రావు, అతని కుటుంబం మరాఠా సామ్రాజ్యపు సర్వోన్నత అధికారాన్ని అధిరోహించడంతో, కొంకణ్ నుండి చిత్‌పవన్ వలసదారులు పెద్ద సంఖ్యలో పూణేకు రావడం ప్రారంభించారు.[7][8] అక్కడ పీష్వా అన్ని ముఖ్యమైన పదవులను తన కులస్థులకే ముట్టజెప్పాడు.[5] చిత్‌పవన్ బంధువులకు పన్ను మినహాయింపు, భూమి మంజూరులతో బహుమతులు లభించాయి.[9] 1762-63లో, ఆజాద్ బిల్గ్రామి ఇలా రాసాడు:
సాధారణంగా మరాఠాలకు, ప్రత్యేకించి దక్కనీ బ్రాహ్మణులకు, ప్రజలందరి జీవనాధారాలను లాక్కొని, వాటిని తమ సొంతం చేసుకోవాలనే కోరిక ఉంటుంది. వారు జమీందార్లను గానీ, గ్రామ పెద్దలు, గ్రామ కరణాల వంటి చిన్న వ్యక్తుల జమీందారీలను కూడా వదిలిపెట్టరు. ప్రాచీన వంశాల వారసులను అత్యంత క్రూరంగా నిర్మూలించి, తమ ఆధిపత్యాన్ని స్థాపించుకుంటారు. కొంకణి బ్రాహ్మణులు యావత్ ప్రపంచానికి అధిపతులు (మాలిక్) కావాలని కోరుకుంటారు.[10]
మరోవైపు, పీష్వాల పాలనలో మహార్లు అవమానాలకు గురయ్యారు. వారిని అంటరానివారిగా చూశారు.[11] 1818లో మరాఠా సామ్రాజ్యం పతనానికి బంధుప్రీతి[12][13][14][15][16] అవినీతి [14] [16] కారణాలని చరిత్రకారులు పేర్కొన్నారు. రాజకీయ అదృష్టంతో పాటు సామాజిక హోదా పెరగడానికి చిత్‌పవన్‌ల ఈ ఎదుగుదల ఒక ఉత్తమ ఉదాహరణ అని రిచర్డ్ మాక్స్‌వెల్ ఈటన్ పేర్కొన్నాడు.[8]
బ్రిటిష్ శకం
[మార్చు]
1818 లో మరాఠా సామ్రాజ్యం పతనమైన తర్వాత, చిత్‌పవన్‌లు తమ రాజకీయ ఆధిపత్యాన్ని బ్రిటిష్ వారికి కోల్పోయారు. గతంలో వారి కుల సహచరులైన పీష్వాలు ఇచ్చినంత స్థాయిలో బ్రిటిష్ వారు చిత్‌పవన్‌లకు ఆర్థిక సహాయం అందించలేదు. జీతం, అధికారం గణనీయంగా తగ్గాయి. బ్రిటిష్ పరిపాలనలో మెరుగైన అవకాశాల కారణంగా పేద చిత్‌పవన్ విద్యార్థులు దానికి అలవాటుపడి ఆంగ్లం నేర్చుకోవడం ప్రారంభించారు. [9] 1901 జనాభా లెక్కల ప్రకారం, పూణే జనాభాలో సుమారు 5% మంది బ్రాహ్మణులుండగా, వారిలో సుమారు 27% మంది చిత్‌పవన్‌లు ఉన్నారు.[17]
19వ, 20వ శతాబ్దాల హిందూ సంస్కరణ ఉద్యమాలలో కొంతమంది ప్రముఖ వ్యక్తులు చిత్‌పవన్ బ్రాహ్మణ సమాజం నుండి వచ్చారు. వీరిలో ధోండో కేశవ్ కార్వే, [18] జస్టిస్ మహాదేవ్ గోవింద్ రానడే, [19] వినాయక్ దామోదర్ సావర్కర్, [20] [21] గోపాల్ గణేష్ అగార్కర్, [22] వినోబా భావే [23] [24] ఉన్నారు.
మార్పుకు అత్యంత బలమైన ప్రతిఘటన అదే వర్గం నుంచి వచ్చింది. అగ్రగాములు, పాతతరం వారు చాలాసార్లు ఘర్షణ పడ్డారు. 1892లో పూనా క్రిస్టియన్ మిషన్‌లో టీ తాగినందుకు గాను డి.కె. కార్వేను వెలివేశారు. తిలక్ కూడా కుల, మత నియమాలను ఉల్లంఘించి 1919లో ఇంగ్లాండ్‌కు వెళ్లినందుకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. [25]
సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే వెనుకబడిన కులాల వారికి విద్యను అందించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, "పూణేలోని చిత్‌పవన్‌లు దళితులను, వెనుకబడిన వారినీ పాఠశాలల్లో చేరడానికి అనుమతించేవారు కాదు" అని చరిత్రకారుడు ఉమేష్ చటోపాధ్యాయ చెప్పాడు. వారి నుండి వచ్చిన ఈ వ్యతిరేకత ఫలితంగా ఫూలే పూణేలో, దాని పరిసర ప్రాంతాలలో పాఠశాలలను స్థాపించాడు.[26]
గాంధీ సంప్రదాయంలో చిత్‌పవన్ సమాజంలో ఇద్దరు ప్రధాన రాజకీయ నాయకులు ఉన్నారు: మహాత్మా గాంధీ తన గురువుగా గుర్తించిన గోపాల కృష్ణ గోఖలే, ఆయన అత్యుత్తమ శిష్యులలో ఒకరైన వినోబా భావే. గాంధీ, భావేను "తన శిష్యులలో రత్నం" అని వర్ణించాడు. గోఖలేను తన రాజకీయ గురువుగా గుర్తించాడు. అయితే, చిత్‌పవన్ సమాజం నుండి గాంధీకి బలమైన వ్యతిరేకత వచ్చింది. హిందూ జాతీయవాద రాజకీయ సిద్ధాంతమైన హిందుత్వను స్థాపించినది, చిత్‌పవన్ బ్రాహ్మణుడైన వినాయక్ దామోదర్ సావర్కర్. అనేక ఇతర చిత్‌పవన్‌లు కూడా దీనిని స్వీకరించారు. ఎందుకంటే ఇది పీష్వాలు, వారి కుల సహచరుడైన తిలక్ వారసత్వానికి తార్కిక కొనసాగింపు అని వారు భావించారు. ఈ చిత్‌పవన్‌లు ఫూలే మొదలుపెట్టిన భారతీయ సాంఘిక సంస్కరణ ఉద్యమమూ, గాంధీ ప్రజా రాజకీయాలూ తమకు సరిపోవని భావించారు. ఈ సమాజంలోని అధిక సంఖ్యలో ప్రజలు సావర్కర్, హిందూ మహాసభ, చివరకు ఆర్‌ఎస్‌ఎస్‌ల వైపు చూశారు. అట్టడుగు వర్గాల నుండి తమ ప్రేరణను పొందారు.[27]
20వ శతాబ్దంలో బ్రాహ్మణ వ్యతిరేక హింస
[మార్చు]చిత్‌పవన్ అయిన నాథూరామ్ గోడ్సే, మహాత్మా గాంధీని హత్య చేసిన తరువాత, మహారాష్ట్రలోని బ్రాహ్మణులు, ప్రధానంగా మరాఠా కులస్థుల హింసకు లక్ష్యంగా మారారు.[28][29]
పూణే విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రవేత్త అయిన వి.ఎం. సిర్సికర్ ఇలా అన్నాడు:
మరాఠాలకు గాంధీజీపై ఉన్న ప్రగాఢమైన ప్రేమ వల్లే అల్లర్లు జరిగాయని నమ్మడం అతిశయోక్తి అవుతుంది. బ్రాహ్మణులను నిందించడానికి, వారి ఆస్తులను తగలబెట్టడానికీ గోడ్సే వాళ్ళకు అక్కరకు వచ్చాడు, అంతే.[30]
హత్య తర్వాత జరిగిన హింసాకాండ, చిత్‌పవన్ పట్వర్ధన్ కుటుంబం పాలించిన సంస్థానాలైన సాంగ్లీ వంటి వాటిపై ప్రభావం చూపింది. అక్కడ బ్రాహ్మణులపై జరిగిన దాడులలో మరాఠాలతో పాటు జైనులు, లింగాయతులు కూడా చేరారు. ప్రత్యేకంగా ఇక్కడ కలిగిన నష్టం సుమారు ₹1.6 కోట్లు. ఈ సంఘటనతో 1948 మార్చి నాటికి పట్వర్ధన్ సంస్థానాలను బొంబాయి ప్రావిన్స్‌లో హడావిడిగా విలీనం చేసారు. ఈ చర్యను ఇతర బ్రాహ్మణులు వ్యతిరేకించారు, ఎందుకంటే విలీనమైన ప్రావిన్స్‌లో మరాఠాలకు ఆధిపత్యం ఉంటుందని వారు భయపడ్డారు.[31]
సైనికంగా
[మార్చు]చిత్‌పవన్‌లు తమను తాము యోధులుగా, పురోహితులుగా భావించుకున్నారు.[32] పీష్వాల ప్రాబల్యం పెరగడంతో సైనిక వ్యవహారాల్లో చిత్‌పవన్‌ల ప్రమేయం ప్రారంభమైంది.[33] సైనిక, ఇతర సేవల్లో చేరడానికి వారి సుముఖత దక్కన్‌లో వారికి ఉన్నత హోదాను, అధికారాన్ని సంపాదించిపెట్టింది. [34]
సంస్కృతి
[మార్చు]వారి ఒరిజినల్ నివాస ప్రాంతమైన కొంకణ్‌లో, వారి ప్రధాన వృత్తి వ్యవసాయం. అయితే కొందరు తమ కుల సభ్యుల మధ్య ఆచారాలు నిర్వహించడం ద్వారా డబ్బు సంపాదించారు.[35]
మానవ శాస్త్రవేత్త డోనాల్డ్ కర్ట్జ్ రాసిన దాని ప్రకారం, 20వ శతాబ్దం చివరిలో చిత్‌పవన్‌ల సంస్కృతి గురించి ఉన్న అభిప్రాయాలు ఏమిటంటే, వారు పిసినారి అనిపించేంత పొదుపుగా, ఉదాసీనంగా, నమ్మదగనివారుగా, కుట్రపూరితంగా కూడా ఉండేవారు.[36] స్వయంగా చిత్‌పవన్ అయిన తిలక్ ప్రకారం, అతని సమాజం పరిశుభ్రతకూ కష్టపడి పనిచేయడానికీ ప్రసిద్ధి చెందింది. కానీ వారు దేశస్థుల నుండి దయ, ఉదారత వంటి సద్గుణాలను నేర్చుకోవాలని ఆయన సూచించాడు.[37] మరాఠా సామ్రాజ్యం ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు, పూణే నగరంలో 150 మంది పెద్ద, చిన్న వడ్డీ వ్యాపారులు ఉండేవారు. సామ్రాజ్యానికి పూణే, ఆర్థిక మహానగరంగా మారింది. వీరిలో చాలా మంది చిత్‌పవన్ లేదా దేశస్థ బ్రాహ్మణులే.[38]
సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ ఇన్ ఇండియా (CSDS) మాజీ డైరెక్టర్ అయిన డి.ఎల్.శేఠ్, 1947లో స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే సాంప్రదాయకంగా " పట్టణ, వృత్తి నిపుణులు " (డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు మొదలైన వృత్తులను అనుసరించేవారు) అయిన భారతీయ వర్గాలను జాబితా చేశాడు. ఈ జాబితాలో మహారాష్ట్రకు చెందిన చిత్‌పవన్‌లు, సి.కె.పి.లు (చంద్రసేనీయ కాయస్థ ప్రభువులు); దక్షిణ భారత బ్రాహ్మణులు; గుజరాత్‌కు చెందిన నాగర్ బ్రాహ్మణులు ; ఉత్తర భారతదేశానికి చెందిన పంజాబీ ఖత్రిలు, కాశ్మీరీ పండితులు, కాయస్థులు ; ప్రవాసీలు, భద్రలోక్ బెంగాలీలు ; పార్సీలు, ముస్లిం, క్రైస్తవ వర్గాల ఉన్నత వర్గాలు ఉన్నాయి. పి.కె.వర్మ ప్రకారం, "ఈ అఖిల భారత ఉన్నత వర్గాన్ని కలిపి ఉంచిన ఒక సాధారణ సూత్రం, విద్య". ఈ వర్గాలలోని పురుషులు దాదాపుగా అందరికీ ఇంగ్లీషు చదవడం, వ్రాయడం వచ్చు. వారు పాఠశాల విద్యకు మించి చదువుకున్నారు.[39][40]
భాష
[మార్చు]మహారాష్ట్రలోని చిత్‌పవన్ బ్రాహ్మణులు మరాఠీ మాట్లాడతారు. పూణేలోని చిత్‌పవన్‌లు మాట్లాడే మరాఠీ, నేడు మహారాష్ట్ర అంతటా ఉపయోగించే ప్రామాణిక భాషా రూపం.[4] ఈ రూపంలో సంస్కృతం నుండి ఉద్భవించిన అనేక పదాలు ఉన్నాయి. చాలా పదాలు సంస్కృత ఉచ్చారణను నిలుపుకుంటాయి. ప్రామాణికం కాని భాష మాట్లాడేవారు దీనిని "నాసికా ఉచ్చారణ" అని తప్పుగా అర్థం చేసుకుంటారు.[41]
సామాజిక హోదా
[మార్చు]గతంలో, దేశస్థ బ్రాహ్మణులు చిత్‌పవన్‌లను శరణు వేడుకున్నవారు (ఒక సామాజిక-ఆర్థిక వర్గానికి కొత్తగా వచ్చినవారు) అని బహిరంగంగా అవమానించేవారు. కుమార్ మాటల్లో చెప్పాలంటే "ద్విజులలో అత్యంత శ్రేష్ఠులతో సమానంగా మెలగడానికి కూడా వారు అర్హులు కారు". దేశస్థ బ్రాహ్మణులతో పాటు కర్హాడే బ్రాహ్మణులు కూడా చిత్‌పవన్‌ల పట్ల చులకన భావం చూపించారు. ఈ రెండు కులాల వారు, చిత్‌పవన్‌లతో కలిసి భోజనం చేయడానికి కూడా నిరాకరించారు. ఈ విధంగా వారు, చిత్‌పవన్‌లను సామాజికంగా సమానులుగా చూడలేదు. గోదావరి నదిపై నాసిక్‌లో దేశస్థ పూజారుల కోసం కేటాయించిన ఘాట్‌లలోకి పీష్వాలకు కూడా ప్రవేశం కల్పించలేదు.[1][42]
బాలాజీ విశ్వనాథ్ భట్ పీష్వాగా నియమితుడైన తరువాత, కొంకణ్ నుండి కోకనస్థ బ్రాహ్మణ వలసదారులు పెద్ద సంఖ్యలో పూణేకు రావడం ప్రారంభించారు.[8][43] అక్కడ పీష్వా, కోకనస్థ బ్రాహ్మణ కులానికి కొన్ని ముఖ్యమైన పదవులను కేటాయించాడు.[44] కోకనస్థ బ్రాహ్మణ బంధువులకు పన్ను మినహాయింపు, భూమి మంజూరులతో బహుమతులు లభించాయి. [45] ఈ సమయంలో బంధుప్రీతి[46][47][48][49][50][51] అవినీతి ఉండేవని చరిత్రకారులు ఎత్తి చూపుతున్నారు.
దేశస్థ బ్రాహ్మణులతో పోలిస్తే చిత్‌పవన్‌ల ప్రాముఖ్యత పెరగడం వల్ల ఈ రెండు వర్గాల మధ్య తీవ్రమైన వైరం ఏర్పడింది.[52] చంద్రసేనీయ కాయస్థ ప్రభువులు, చిత్‌పవన్‌ల మధ్య, సరస్వత్ బ్రాహ్మణులు, చిత్‌పవన్‌ల మధ్య, పఠారే ప్రభువులు, చిత్‌పవన్‌ల మధ్య, శుక్ల యజుర్వేది దేశస్థ బ్రాహ్మణులు, చిత్‌పవన్‌ల మధ్య జరిగిన గ్రామన్యాలు లేదా గ్రామ స్థాయి చర్చలను కూడా 19వ శతాబ్దపు రికార్డులలో చూడవచ్చు. "బ్రాహ్మణ ఆచార ప్రవర్తనా నియమావళి" ఉల్లంఘన అని పిలవబడే దానికి సంబంధించిన ఈ వివాదాలు ఆ కాలంలో మహారాష్ట్రలో చాలా సాధారణం.[53]
దేశస్థులు, చిత్‌పవన్‌లు, కర్హాడేలు ఏకం కావాలని బాల గంగాధర్ తిలక్ కోరుకున్నాడు. 1881 లోనే ఈ మూడు మహారాష్ట్ర బ్రాహ్మణ ఉప కులాలు కుల వివక్షను విడిచిపెట్టి, పరస్పరం వివాహాలు చేసుకోవడం, కలిసి భోజనం చేయడం ద్వారా ఏకం కావాల్సిన ఆవశ్యకతపై విరివిగా రాసి దీనిని ప్రోత్సహించాడు.[54]
20వ శతాబ్దం నుండి, సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలలో రెండు వర్గాల వారు పెద్ద ఎత్తున కలవడం, అలాగే అంతర్వివాహాల ద్వారా దేశస్థ బ్రాహ్మణులు, చిత్‌పవన్ బ్రాహ్మణుల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి.[55][56][57]
ఆహారం
[మార్చు]సాంప్రదాయకంగా, చిత్‌పవన్ బ్రాహ్మణులు శాకాహారులు. వరి అన్నం వారి ప్రధాన ఆహారం.[58]
బోడాన్
[మార్చు]ఏజే అగార్కర్ బోడాన్‌ను ఈ విధంగా వర్ణిస్తూ, ఇందులో ఒక రకమైన నృత్యం కూడా ఉంటుందని తెలిపారు:
కొన్ని చిత్పవన్ కుటుంబాలలో, జననం లేదా వివాహం జరిగినపుడు బోదాన్ చేయడం తప్పనిసరి. నలుగురు వివాహిత స్త్రీలను, ఒక అవివాహిత అమ్మాయినీ భోజనానికి ఆహ్వానిస్తారు. భోజనంలోని అన్ని పదార్థాలను కొద్దికొద్దిగా ఉంచి, ఒక పళ్ళెంలో అన్నపూర్ణా దేవి లోహ విగ్రహాన్ని ఉంచుతారు. పళ్ళెంలోని విగ్రహంతో పాటు అన్ని పదార్థాలను ఆహ్వానించబడిన స్త్రీలు కలుపుతారు. వారిలో ఎవరికైనా అటువంటి సందర్భాలలో ఆవహించే అలవాటు ఉంటే, లేదా ఎవరికైనా మొదటిసారి ఆవహిస్తే, ఆమె సూచనల ప్రకారం ఆ మిశ్రమానికి నెయ్యి, పాలు, తేనె మొదలైనవి కలుపుతారు. తరువాత విగ్రహాన్ని తీసివేసి, ఆ మిశ్రమాన్ని ఆవుకు తినిపిస్తారు.[59]
వందనా భావే మేరుతంత్రోక్త బోదన్ విధి పేరుతో బోదాన్ పద్ధతిని వివరిస్తూ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. [60]
అక్షి శిలాలేఖ (స్తంభ శాసనం)లో బోదన్ ప్రస్తావన ఉంది. ఇది సా.శ. 1012 నాటిదని డా. ఎస్.జి. తుల్పులే చెప్పగా, సా.శ. 1209-1210 నాటిదని దీక్షిత్ చెప్పాడు. సా.శ. 1210 సరైన తేదీదని వి.వి. మిరాషి అంగీకరిస్తున్నాడు. దానిలోని విషయాన్ని బోదన్ కోసం మహాలక్ష్మి దేవికి 9 కువళీల ధాన్యాన్ని దానం అని తుల్పులే అర్థం చెప్పగా, దీక్షిత్ దానిని మహాలక్ష్మిని గౌరవించటానికి బావి తవ్వడం అని వ్యాఖ్యానించాడు.[61]
వంశావళి
[మార్చు]ఈ సమాజం, కులవృత్తాంతాలు అనే పేరుతో అనేక కుటుంబ చరిత్రలు, వంశావళి పంచాంగాలను ప్రచురించింది. ఈ పుస్తకాలు సాధారణంగా ఒక వంశపు చరిత్ర, పేరు వ్యుత్పత్తి, పూర్వీకుల భూమి యాజమాన్యాలు, వలస పటాలు, మతపరమైన సంప్రదాయాలు, వంశావళి పట్టికలు, జీవిత చరిత్రలు, వంశంలోని జనన, మరణ, వివాహాల రికార్డుల వంటి వివిధ అంశాలను నమోదు చేస్తాయి. [62] [63]
ఇవి కూడా చూడండి
[మార్చు]గమనికలు
[మార్చు]మూలాలు
[మార్చు]- 1 2 Ravinder Kumar (28 October 2013). Western India in the Nineteenth Century: A study in the social history of Maharashtra. Taylor & Francis. pp. 41–. ISBN 978-1-135-03145-9.
పీష్వాల ఎదుగుదల తర్వాత ప్రాముఖ్యతలోకి వచ్చిన చిత్‌పవన్‌లను దేశస్థులు, ద్విజులలో శ్రేష్ఠులతో సమానంగా మెలగడానికి కూడా అర్హత లేనివారిగా చూసేవారు. తమలో ఉన్న ఈ ఏవగింపును వారు దాచుకోలేదు కూడా. ఒక దేశస్థుని ఇంటికి ఆహ్వానించబడిన చిత్‌పవన్ ఒక ప్రత్యేక హక్కు గల వ్యక్తిగా పరిగణించబడేవాడు. నాసిక్‌లో గోదావరి నదిపై దేశస్థ పూజారుల కోసం కేటాయించిన ఘాట్‌లను ఉపయోగించుకునే హక్కు పేష్వాకు కూడా ఉండేది కాదు.
- ↑ Guy Delury. India, the Rebel Continent. p. 183.
The name Chitpavan had been given to them by the other local jatis of Brahmins a little mockingly, since they tended to look down on the Chitpavans
- ↑ Percival Griffiths (23 April 2019). The British Impact on India. Taylor & Francis. pp. 329–. ISBN 978-0-429-61424-8.
They were not highly regarded by other Brahmans in ancient days and appeared to have been employed principally as spies and messengers
- 1 2 Singh, R.; Lele, J.K. (1989). Language and society: steps towards an integrated theory. Leiden: E.J. Brill. p. 34. ISBN 978-9-00408-789-7.
ఈ కాలంలో మహారాష్ట్ర సామాజిక-రాజకీయంలో చిత్‌పవన్‌ల నిజమైన ప్రభావాన్ని చాలా ఎక్కువ చేసి చెప్పారు. అత్యంత ఆశావహులు, సమర్థులైన పేష్వాల హయాంలో కూడా, ప్రధాన మరాఠా నాయకుల నుండి గ్రామ పెద్దల వరకు ఉన్న స్థానిక అధికార వ్యవస్థ, పీష్వాల రాజకీయ ఉద్దేశాలను విశ్వసించలేదు. వారి చట్టబద్ధతను సందేహించింది. ముఖ్యంగా శివాజీ వారసుల హయాంలో ఇది మరింత స్పష్టంగా కనిపించింది.
- 1 2 Cohn, Bernard S; Singer, Milton, eds. (2007). Structure and Change in Indian Society. AldineTransaction (Transaction Publishers). pp. 399–400. ISBN 978-0-202-36138-3.
బొంబాయి నుండి దక్షిణాన కార్వార్ వరకు వరసగా ఉన్న ఓడరేవులు రోమన్, గ్రీకు, అరబ్, అబిసీనియన్, పోర్చుగీస్, డచ్చి, ఆంగ్లేయులైన వ్యాపారులు, ఆక్రమణదారులు, సందర్శకులు లేదా స్థిరపడినవారిని చూసాయి. ఒకానొక సమయంలో ఈ తీరప్రాంతం, బెనె ఇస్రాయెల్, పార్సీలు, కుడల్ దేశ్‌కర్ బ్రాహ్మణులు, గౌడ్ సరస్వత్ బ్రాహ్మణులు, చిత్‌పవన్ బ్రాహ్మణుల వంటి వలస సమూహాలను కూడా స్వీకరించింది. ఈ సమూహాలలో ఎవరి మూల స్థానం ఎక్కడో, వారి వలసలకు కారణాలు ఏమిటో చర్చించడం ప్రస్తుత చర్చకు సందర్భోచితం కాదు. సందర్భోచితమైన విషయం ఏమిటంటే, ఈ సమూహాలలో ప్రతి ఒక్కటీ చొరబాటుదారులే అనేది; వారు ఇతరుల కంటే, అలాగే స్థానిక జనాభా కంటే భౌతికంగా, సాంస్కృతికంగా విభిన్నంగా ఉన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సమూహాలలో ప్రతి ఒక్కటీ తీరప్రాంతంలోని వేర్వేరు విభాగాలలో స్థిరపడినట్లు కనిపిస్తుంది; వారు ఇతరుల నివాసాలతో కలసిపోకుండా, వాటికి ఆనుకొని ఉండేవారు. ఈ విధంగా, బెనె ఇస్రాయెల్ వారికి కొలాబా జిల్లా ఉత్తర భాగంతో సంబంధం ఉంది; చిత్‌పవన్‌లు, రత్నగిరి దక్షిణ భాగాన్ని (పూర్వం చిన్న సావంత్‌వాడి రాచరిక రాష్ట్రంతో సహా); గౌడ సరస్వత్ బ్రాహ్మణులు, గోవా, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కనరా జిల్లా తీరప్రాంతాన్ని దక్కించుకున్నారు. ఈ సమూహాలన్నింటిలో, చిత్‌పవన్ బ్రాహ్మణులు అందరికన్నా చివరగా వచ్చినట్లు తెలుస్తోంది, అందువల్ల వారు అతి తక్కువ సారవంతమైన, అతి తక్కువ మంచి రేవులు ఉన్న తీరప్రాంతాన్ని దక్కించుకున్నారు. ఈ విధంగా, రత్నగిరి జిల్లా అంతగా ఆకర్షణీయం కాకపోవడంతో, అది ఒక సరిహద్దు ప్రాంతంలా వారికి సులభంగా అందుబాటులోకి వచ్చింది. అందువల్ల, చిత్‌పవన్‌లు అక్కడ స్థిరపడే క్రమంలో వారికి పెద్దగా పోటీ గానీ, అడ్డంకులు గానీ ఎదురుకాలేదని తెలుస్తోంది.
- ↑ Stewart Gordon (16 September 1993). The Marathas 1600–1818. Cambridge University Press. p. 109. ISBN 978-0-521-26883-7.
- ↑ Sandhya Gokhale (2008). The Chitpavans: social ascendancy of a creative minority in Maharashtra, 1818–1918. Shubhi Publications. p. 113. ISBN 978-81-8290-132-2.
- 1 2 3 Richard Maxwell Eaton. A social history of the Deccan, 1300–1761: eight Indian lives, Volume 1. p. 192.
- 1 2 Edmund Leach, S. N. Mukherjee (1970). Elites in South Asia. Cambridge University Press. pp. 101, 104, 105. ISBN 978-0-521-10765-5.
- ↑ J.S. Grewal (2005). The State and Society in Medieval India. Oxford University Press. p. 151. ISBN 0195667204.
- ↑ Christophe Jaffrelot (2006). Dr Ambedkar and Untouchability: Analysing and Fighting Caste. Permanent Black. pp. 21–. ISBN 978-81-7824-156-2.
మహార్లు అనుభవించిన అంటరానితనం అనే మచ్చ ఎంత తీవ్రంగా ఉండేదంటే, కొన్ని తీవ్రమైన సందర్భాల్లో, బ్రాహ్మణులు నడిచే నేలపై తమ ఉమ్మి పడకుండా ఉండేందుకు, వారు మెడలో మట్టిపాత్రలను ధరించవలసి వచ్చేది. అంతేకాకుండా, తమ అడుగుజాడలను చెరిపివేయడానికి వెనుక ఉన్న మట్టిని ఊడ్చవలసి వచ్చేది, లేదా కనీసం బ్రాహ్మణుల నీడ వారిపై పడకుండా ఉండేందుకు వారికి తగినంత దూరం పాటించవలసి వచ్చేది. పిళ్ళై-వెశ్చెరా ప్రకారం, పీష్వాల కాలంలో మహార్లపై ఇలాంటి ఆంక్షలను విధించారు.
- ↑ Tryambaka Śaṅkara Śejavalakara (1946). Panipat: 1761. pp. 24, 25.
- ↑ Anil Seal (2 September 1971). The Emergence of Indian Nationalism: Competition and Collaboration in the Later Nineteenth Century (Political change in modern South Asia). CUP Archive. pp. 74, 78. ISBN 978-0-521-09652-2.
- 1 2 Govind Sakharam Sardesai (1986) [1946]. New history of the Marathas: Sunset over Maharashtra (1772–1848). Phoenix Publications. p. 254.
- ↑ J. R. Śinde (1985). Dynamics of cultural revolution: 19th century Maharashtra. p. 16.
- 1 2 Michael, S. M. (3 May 2007). Dalits in Modern India: Vision and Values (in ఇంగ్లీష్). SAGE Publishing India. p. 95. ISBN 978-93-5280-287-6.
- ↑ Cashman, Richard I (1975). The myth of the Lokamanya: Tilak and mass politics in Maharashtra. University of California. p. 19, 20,21. ISBN 978-0-520-02407-6. Retrieved 2 April 2018.
- ↑ Karve, Dinakar D. (1963). The New Brahmans: Five Maharashtrian Families (1st ed.). Berkeley, CA: University of California Press. p. 13.[ISBN missing]
- ↑ Wolpert, Stanley A. (April 1991). Tilak and Gokhale: Revolution and Reform in the Making of Modern India. Oxford: Oxford University Press. p. 32. ISBN 978-0195623925.
- ↑ Wolf, Siegfried O. "Vinayak Damodar Savarkar: Public Enemy or national Hero?" (PDF). Retrieved 3 May 2016.
- ↑ Wolf, Siegfried, ed. (2009). Heidelberg Student papers, Vinayak Damodar Savarkar: Public Enemy or national Hero (PDF). Dresden: Heidelberg University. p. 10. ISBN 978-3-86801-076-3.
- ↑ Wolpert, Stanley A. (April 1991). Tilak and Gokhale: Revolution and Reform in the Making of Modern India. Oxford: Oxford University Press. p. 19. ISBN 978-0195623925.
- ↑ Mariam Dossal and Ruby Maloni, ed. (1999). State intervention and popular response : western India in the nineteenth century. Mumbai: Popular Prakashan. p. 87. ISBN 978-81715-4855-2.
- ↑ Wolpert, Stanley A. (April 1991). Tilak and Gokhale: Revolution and Reform in the Making of Modern India. Oxford: Oxford University Press. p. 32. ISBN 978-0195623925.
- ↑ Cashman, Richard I. (1975). The myth of the Lokamanya : Tilak and mass politics in Maharashtra. Berkeley: University of California Press. p. 54. ISBN 9780520024076.
- ↑ Jörn Rüsen, ed. (19 June 2013). Approaching Humankind: Towards an Intercultural Humanism. Vandenhoeck & Ruprecht. pp. 157–. ISBN 978-3-8470-0058-7.
Pune's Chitpawan Brahmins would not allow any Dalit and backward to join schools
- ↑ Arnold P. Goldstein, Marshall H. Segall (1983). Aggression in global perspective. p. 245.
- ↑ Thomas Blom Hansen (18 November 2001). Wages of Violence: Naming and Identity in Postcolonial Bombay. Princeton University Press. pp. 28–35. ISBN 0-691-08840-3.
- ↑ Ullekh N P (2018). The Untold Vajpayee: Politician and Paradox. Random House India. p. 39. ISBN 9789385990816.
- ↑ V.M.Sirsikar (1999). Mariam Dossal; Ruby Malon (eds.). State Intervention and Popular Response: Western India in the Nineteenth Century. Popular Prakashan. p. 11. ISBN 9788171548552.
- ↑ Maureen Patterson (October 1988). Donald W. Attwood; Milton Israel; Narendra K. Wagle (eds.). City, countryside and society in Maharashtra. University of Toronto, Centre for South Asian Studies. pp. 35–58. ISBN 978-0-9692907-2-8.
అటువంటి ప్రతిఘటన నిష్ప్రయోజనమైంది. 1948 ఫిబ్రవరిలో హంతకుడు గోడ్సే కాల్పుల ద్వారా లభించిన అవకాశాన్ని, అప్పుడప్పుడే రాజకీయ చైతన్యం పొందిన మరాఠాలు, అలాగే జైనులు, లింగాయతులు ఏమాత్రం సంకోచం లేకుండా సద్వినియోగం చేసుకుని బ్రాహ్మణులపై దాడి చేసారు...[page 50]
- ↑ Bhatt, Chetan (2001). Hindu Nationalism: Origins, Ideologies and Modern Myths. Berg. p. 32. ISBN 9781859733486.
- ↑ Sandhya Gokhale (2008). The Chitpavans: social ascendancy of a creative minority in Maharashtra, 1818–1918. Shubhi. p. 82. ISBN 978-81-8290-132-2.
- ↑ Hansen, Thomas Blom (2001). Wages of Violence: Naming and Identity in Postcolonial Bombay. Princeton University Press. p. 29. ISBN 978-0-69108-840-2.
- ↑ Paul Hockings, ed. (1992). Encyclopedia of world cultures: South Asia – Volume 2. Macmillan Reference USA. p. 69.
The occupation of the Chitpavans in their original territory of the Konkan was farming, with some income from performing rituals among their own caste.
- ↑ Donald V. Kurtz (31 December 1993). Contradictions and Conflict: A Dialectical Political Anthropology of a University in Western India. BRILL. p. 64-. ISBN 90-04-09828-3.
స్థానిక చిత్పవన్-యేతర బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు చెప్పేదేమిటంటే, చిత్పవన్ బ్రాహ్మణులు అత్యంత పొదుపుపరులు. పిసినారులు అని కూడా అంటారు. ఒక బ్రాహ్మణేతర ఉపాధ్యాయుడు వర్ణించినట్లుగా, ఒక సామాజిక కార్యక్రమంలో మరొకరు ధృవీకరించినట్లుగా, 40 డిగ్రీల సెల్సియస్ ఎండలో, ఒక సందేశాన్ని అందించడానికి పట్టణం మొత్తం నడిచి వచ్చిన సందర్శకుడికి ఒక గ్లాసు నీరు కూడా ఇవ్వకపోవడం ఒక చిత్పవన్ యొక్క లక్షణం. అంతేకాకుండా, చిత్పవన్‌లు కుట్రపూరితమైన వారని, నమ్మదగని వారని, ఉద్వేగభావాలు లేనివారని, రక్తసంబంధీకుల మధ్య వివాహాలు చేసుకునే వారని భావిస్తారు.
- ↑ M. V. Kamath (1991). The Makings of a Millionaire: A Tribute to a Living Legend, Raosaheb B.M. Gogte, Industrialist, Philanthropist & Educationist. Jaico Publishing House. p. 8.
స్వయంగా చిత్పవనుడైన లోకమాన్య తిలక్ ఒకప్పుడు ఇలా రాసాడు: తమ సమాజం పరిశుభ్రత, పరిశ్రమ, చొరవ, పొదుపులకు ప్రసిద్ధి చెందినప్పటికీ, వారు దయ, ఉదారత, దాతృత్వం వంటి సద్గుణాలను దేశస్థుల నుండి నేర్చుకోవాలి.
- ↑ H. Damodaran (25 June 2008). India's New Capitalists: Caste, Business, and Industry in a Modern Nation. Palgrave Macmillan UK. pp. 50–51. ISBN 978-0-230-59412-8.
- ↑ Pavan K. Varma (2007). The Great Indian Middle class. Penguin Books. p. 28. ISBN 9780143103257.
...దీని ప్రధాన అనుచరులు ప్రభుత్వ సేవలో ఉన్నవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్ల వంటి అర్హతగల 'వృత్తి నిపుణులు', వ్యాపారవేత్తలు, పెద్ద నగరాల్లోని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలలోని ఉపాధ్యాయులు, పాత్రికేయులు[మొదలైనవారు]... భారత మధ్యతరగతిలో అగ్ర కులాలు ఆధిపత్యం చెలాయించాయి. ఇందులో పంజాబీ ఖత్రిలు, కాశ్మీరీ పండితులు, దక్షిణ భారత బ్రాహ్మణులు ప్రముఖులు. ఆ తర్వాత గుజరాత్‌లోని నాగార్లు, మహారాష్ట్రలోని చిత్‌పవన్‌లు, సి.కె.పి.లు (చంద్రసేనీయ కాయస్థ ప్రభువులు), ఉత్తర భారతదేశంలోని కాయస్థుల వంటి 'సాంప్రదాయిక పట్టణ-ఆధారిత వృత్తి కులాలు' ఉన్నాయి. వలస పాలనలో ఉద్భవించిన పాత ఉన్నత వర్గాలైన ప్రవాసీయులు, భద్రలోక్ బెంగాలీలు, పార్సీలు, ముస్లిం, క్రైస్తవ వర్గాల ఉన్నత శ్రేణులు కూడా ఇందులో భాగమే. ఈ అఖిల భారత ఉన్నత వర్గాన్ని కలిపి ఉంచిన ఒక సాధారణ సూత్రం - విద్య. ఈ తరగతిలో దాదాపు అందరూ ఇంగ్లీష్ మాట్లాడటం, రాయడం నేర్చుకుని, పాఠశాల విద్యకు మించి కొంత విద్యను అభ్యసించారు.
- ↑ "D.L. Sheth". www.csds.in.
- ↑ Deo, Shripad D. (1996). Nalini Natarajan (ed.). Handbook of twentieth century literatures of India. Westport: Greenwood Press. p. 212. ISBN 978-0-31328-778-7.
- ↑ Shahu Chhatrapati (Maharaja of Kolhapur); Vilas Adinath Sangave; B. D. Khane (1985). Rajarshi Shahu Chhatrapati Papers: 1900–1905 A.D.: Vedokta controversy. Shahu Research Institute. p. 4.
- ↑ Gokhale 2008, p. 113.
- ↑ Patterson 2007, p. 398.
- ↑ Leach & Mukherjee 1970, pp. 101, 104–5.
- ↑ Śejavalakara 1946, pp. 24–5.
- ↑ Seal 1971, pp. 74, 78.
- ↑ Deccan College Post-graduate and Research Institute 1947, p. 182.
- ↑ Śinde 1985, p. 16.
- ↑ Michael 2007, p. 95.
- ↑ Anil Seal (1971). The Emergence of Indian Nationalism: Competition and Collaboration in the Later Nineteenth Century. CUP Archive. p. 78. ISBN 9780521096522.
Between Brahmins and these non-Brahmins there was a long history of rancour which the nepotism of the Peshwas had only exacerbated.
- ↑ Gordon, Stewart (16 September 1993). The Marathas 1600–1818. Cambridge University Press. pp. 132–134. ISBN 978-0-521-26883-7.
- ↑ Gokhale, Sandhya (2008). The Chitpwans. Shubhi Publications. p. 204.
మహారాష్ట్రలో కుల తగాదాలు అరుదైనవేమీ కావు. చంద్రసేనీయ కాయస్థ ప్రభువులు, చిత్‌పవన్‌ల మధ్య, పఠారే ప్రభువులు, చిత్‌పవన్‌ల మధ్య, సరస్వత్ బ్రాహ్మణులు, చిత్‌పవన్‌ల మధ్య, శుక్ల యజుర్వేది, చిత్‌పవన్‌ల మధ్య వంటి కుల తగాదాలు నమోదయ్యాయి. బ్రాహ్మణ ఆచార ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణతో కూడిన ఈ కులాంతర వివాదాలను మరాఠీలో 'గ్రామణ్య' అని పిలిచేవారు.
- ↑ Sandhya Gokhale (2008). The Chitpavans: social ascendancy of a creative minority. p. 147.
1881 లోనే, దృఢ సంకల్పం గల ఆలోచనాపరుడు, భారత రాజకీయాల్లో విప్లవకారుడూ ఐన బాల గంగాధర్ తిలక్, కొన్ని వ్యాసాలలో చిత్‌పవన్‌లు, దేశస్థులు, కర్హాడేల ఐక్యత ఆవశ్యకతపై సమగ్రమైన ప్రసంగాలు రాశాడు. ఈ అద్భుతమైన బ్రాహ్మణ కలయిక ఆవశ్యకతను ప్రస్తావిస్తూ, ఈ మూడు బ్రాహ్మణ సమూహాలు కులాంతర వివాహాలనూ సామూహిక భోజనాలనూ ప్రోత్సహించడం ద్వారా కుల వివక్షను విడనాడాలని తిలక్ మనస్ఫూర్తిగా కోరాడు.
- ↑ A. C. Paranjpe (1970). Caste, Prejudice, and the Individual. Lalvani Publishing House. p. 117.
It may also be pointed out that marriages between the Deshastha and Kokanastha Brahmins have been very common
- ↑ C. J. Fuller; Haripriya Narasimhan (11 November 2014). Tamil Brahmans: The Making of a Middle-Class Caste. University of Chicago Press. p. 62. ISBN 9780226152882. Retrieved 11 November 2014.
- ↑ Gordon Johnson (1970). Edmund leach; S. N. Mukherjee (eds.). Elites in South Asia. Cambridge University Press. p. 105.
- ↑ India's Communities, Volume 5. Oxford University Press. 1998. p. 1804,2079. ISBN 9780195633542.
(quote on page 1804):The Chitpavan are vegetarian and rice is their staple cereal. (quote on page 2079): Among them the Chitpavan, Desastha, Karhade and Devdny Brahman are pure vegetarian though nowadays, they occasionally take non-vegetarian food.
- ↑ A. J. Agarkar (1950). Folk-dance of Maharashtra. R. Joshi. pp. 41, 159.
- ↑ "Bodan Vidhi (बोडण विधी)- Book". thechitpavana.org (in ఇంగ్లీష్). 12 March 2024. Archived from the original on 12 మార్చి 2024. Retrieved 12 March 2024.
- ↑ Mirashi, Vasudev Vishnu (1977). Corpus Inscriptionum Indicarum Vol VI Inscriptions of Silaharas (in English). Calcutta: Archeological Survey of India. pp. 167–168.
{{cite book}}: CS1 maint: unrecognized language (link) - ↑ . "Chitpavan Brahmins, a history".
- ↑ Milton B. Singer; Bernard S. Cohn, eds. (2007). Structure and change in Indian society. New Brunswick, N.J.: AldineTransaction. ISBN 978-0-202-36138-3. OCLC 155122029.
వనరులు
[మార్చు]- S. M. Edwardes (31 July 2009). "Chapter XIV – A Konkan Legend". By Ways of Bombay. Echo Library. ISBN 978-1-4068-5154-0. Retrieved 3 July 2010.
- Ravinder Kumar (1968). Western India in the Nineteenth Century. Routledge & Kegan Paul.
- Chitpavans under the British Raj-Singh, R.; Lele, J.K. (1989). Language and society : steps towards an integrated theory. Leiden: E.J. Brill. pp. 32–42. ISBN 9789004087897.
- O'Hanlon, Rosalind (2002), Caste, Conflict and Ideology: Mahatma Jotirao Phule and Low Caste Protest in Nineteenth-Century Western India, Cambridge South Asian Studies, Cambridge University Press, ISBN 978-0-521-52308-0
- Naravane, M.S (2006), Battles of the honourable East India Company: making of the Raj, APH Publishing, pp. 78–105, ISBN 978-81-313-0034-3
- Śinde, J. R (1985), Dynamics of cultural revolution: 19th century Maharashtra, ISBN 9780836415247
- Śejavalakara, Tryambaka Śaṅkara (1946), Panipat: 1761, Volume 1 of Deccan College monograph series, Poona Deccan College of Post-graduate and Research Institute (India) Volume 1 of Deccan College dissertation series
- Seal, Anil (1971), The Emergence of Indian Nationalism: Competition and Collaboration in the Later Nineteenth Century (Political change in modern South Asia), CUP Archive, ISBN 978-0-521-09652-2
- Patterson, Maureen (2007), Bernard S. Cohn, Milton Singer (ed.), Structure and Change in Indian Society, AldineTransaction, ISBN 978-0-202-36138-3
- Leach, Edmund; Mukherjee, S. N (1970), Elites in South Asia, Cambridge University Press, ISBN 978-0-521-10765-5
- Deccan College Post-graduate and Research Institute (1947), "Bulletin of the Deccan College Research Institute", Bulletin of the Deccan College Research Institute, 8, Dr. A. M. Ghatage, director, Deccan College Postgraduate and Research Institute, LCCN 47021378