చిదిమి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

చిదిమి, శ్రీకాకుళం జిల్లా, వీరఘట్టం మండలానికి చెందిన గ్రామము.[1].నాగావళినది ఒడ్డునగల ఒక గ్రామముఈ ఊరిలో ఈమధ్యనే ఏప్రిల్ నెల 1వ తేదీన 2012న మండలంలోనే అతిపెద్ద రామాలయముని నిర్మించి సీతారామాలక్ష్మణుల విగ్రహ్రతిష్ట చేయడం జరిగింది. ఈ ఊరికి భౌగోళిక సౌకర్యాలు అన్ని ఉన్నాయు. నాగావళి ఉపనది ఒట్టిగెడ్డ మళ్ళీ ఈ చిదిమి దగ్గరనే కలవడంతో ఈ ఊరికి నీళ్ళుకరువంటూ ప్రజలు ఎరుగరు. కానీ వర్షాకాలంలో ఎక్కువగా వర్షంపడితే ఊళ్ళోకి నీరు వస్తుంది.2సంవత్సరాలకితం నాగావళినది ఈ ఊరినంతా ముంచడంతో ఊరి ప్రజలంతా భయభ్రాంతులయు ప్రక్కూరికి వెళ్ళి రెండురోజులు తలదాచుకున్నారు.ఈ సమస్య తీరాలంటే నాగావళినది ఒడ్డున పెద్ద అడ్డుకట్ట వేయాలి. ఈ నాగావళినదిపై చిదిమికి దగ్గరలో తోటపల్లివద్ద తోటపల్లిడ్యామ్ కడుతున్నారు. ఈ డ్యామ్ వల్ల ఈ ఊరి పొలాలకి సంవత్సరానికి మూడుపంటలకి నీరు అందుతుంది. ఈ ఊరిలో ప్రధాన రాజకీయపార్టీలు తెలుగుదేశం మరియు కాంగ్రేస్ పాలన సాగిస్తున్నాయు. ప్రస్తుతం కాంగ్రేస్ అధికారంలో ఉంది.

2010-01-23వ తేదీన కొణిజేటి రోశయ్య చిదిమి గ్రామానికి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చారు

ఈ ఊరిలో వైద్యసౌకర్యం,త్రాగునీటిసౌకర్యం,బస్సుసౌకర్యాలు లేవు

ఈ ఊరికి సిఎం రోసయ్య రావడంతో ఊరంతా కొంచెం శుభ్రతచేసి ఉంచారు.

ఈ ఊరిచుట్టూ నీరున్నా ఊళ్ళో మాత్రం వాటరుటాంకీమాత్రం ఇంతవరకు ఈ ఊరి పెద్దమనుషులవల్ల నోచుకోలేదు.ఈ ఊరిలో సత్య సాయిరాం మందిరం కూడా ఉంది.20ఏళ్ళ క్రిందట పురిపాకగా అనగా గుడెసెగా ఉన్న ఈ మందిరం ఇప్పుడు ఒక పెద్దభవనరూపంలో 5ఏళ్ళ క్రితం రూపుదిద్దుకుంది.ఈ ఊరికీ 13.11.2009న ఈ జిల్లా కలెక్టర్ నాగులపల్లి శ్రీకాంత్ వచ్చారు.ఇందిరాక్రంతి పథకం ద్వారా నిర్వహిస్తున్న గ్రామఐక్యసంఘాల పనితీరుని పరిశీలించారు.ఈ ఊరికి గ్రామపంచాయితీభవనం 3ఏళ్ళక్రిందట నిర్మించారు.ఊరికి అనుబంధంగా ఇంకా వెంకమ్మపేక,జోగింపేట అనే ఊళ్ళు కలిపి ఒక పంచాయితిగా ఉన్నాయి.ఈ మూడు ఊళ్ళలో 51 గ్రామైక్యసంఘాలలో 516 మంది సభ్యులుకలిపి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.జనశ్రీ,వై.యస్.ఆర్ అభయహస్తం,ఆరోగ్యశ్రీ పథకాలు ఈ ఊరి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.అయితే ఈ ఊరి ప్రజలు విద్యా,ఉద్యోగపరంగా బాగా వెనుకబడి ఉన్నందువల్ల సరిగా అక్షరముక్కరాని నాయకులు ఈ పథకాల గురించి సరిగా తెలియక,తెలిసినా దోపిడీరాజ్యంగా ప్రవర్తించడంతో ప్రజలు ఈ పథకాలప్రయోజనాలను అంతంతమాత్రంగా అందుకుంటున్నారు.ఆవు చేళ్ళోమేస్తే దూడ గట్టున మేయదా! అన్నట్టు నాయకులు ప్రవర్తనాలను చూసి నాయకులకోడుకులు కూతుళ్ళు కూడా అలానే తయారవుతున్నారు.ఈ గ్రామ పంచాయితి సర్పంచి ఒక దళితుడు.కానీ రాజ్యమేలేది కాపులు.ఈ ఊరికి సిఎం రోశయ్య వచ్చినప్పుడు సభావేదికపైకి ఈ ఊరికి సర్పంచి అయిన బులకయ్యని మాలవాడు అనగా దళితకులానికి చెందినవాడని రానివ్వలేదు.అంటే ఈ గ్రామం కులవ్యవస్థకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతుంది.

చిదిమి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం వీరఘట్టం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,584
 - పురుషుల సంఖ్య 784
 - స్త్రీల సంఖ్య 800
 - గృహాల సంఖ్య 367
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్


VARI,CHERUKU,MINUMULU,PESARA,JANUMU,MAMIDI

గ్రామములో జన్మించిన ప్రముఖులు[మార్చు]

(BOWROTHU.ASIRINAIDU S/O PAPINAIDU) (BOWROTHU.SURYANARAYANA) yalagada joginaidu,

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,584 - పురుషుల సంఖ్య 784 - స్త్రీల సంఖ్య 800 - గృహాల సంఖ్య 367

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11

"https://te.wikipedia.org/w/index.php?title=చిదిమి&oldid=2047724" నుండి వెలికితీశారు