చిన్నదాన నీ కోసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిన్నదాన నీ కోసం
(2014 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎ. కరుణాకరన్
నిర్మాణం ఎన్. సుధాకర్ రెడ్డి,
నికితా రెడ్డి
రచన ఎ. కరుణాకరన్, ఆన్లైన్ ముకుంద్ పాండే (స్క్రిప్ట్ డాక్టర్),
హర్ష వర్ధన్ (డైలాగ్స్)
తారాగణం నితిన్
మిస్తీ చక్రవర్తి
సంగీతం అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం ఐ. ఆండ్రూ
కూర్పు ప్రవీణ్ పూడి
పంపిణీ ఆసియా సినిమాలు & సినీ గెలాక్సీ ఇంక్, (విదేశీ)[1]
విడుదల తేదీ 2014 డిసెంబరు 25 (2014-12-25)
భాష తెలుగు
పెట్టుబడి 20 crore (US$2.5 million)[2]

చిన్నదాన నీ కోసం 2014 లో విడుదలైన తెలుగు సినిమా. ఇది ‘ఇష్క్’, ‘గుండెజారి గ‌ల్లంతయిందే’ సినిమాల కథానాయకుడైన నితిన్ తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై రూపొందించిన చిత్రం. తాత‌య్య కోసం మ‌న‌వ‌రాలు ఫారెన్ నుంచి ఇండియా వ‌చ్చి, ఇక్క‌డో నాట‌కం ఆడి, తాత‌య్య‌ని త‌న‌తో పాటు తీసుకెళ్లిపోవ‌డం ఈ క‌థ‌.

కథ[మార్చు]

నితిన్ (నితిన్‌) ప‌నీపాటా లేకుండా తిరుగుతుంటాడు. అత‌ని నాన్న (న‌రేష్‌), అమ్మ (సితార‌)ది ప్రేమ వివాహం. నితిన్‌కి ఒక అక్క‌. ఆమెకి పెళ్ల‌యి పోయి ఉంటుంది. త‌ను స‌ర‌దా ట్రిప్ వెళ్తూ ఐదేళ్ల కొడుకును త‌ల్లి ఇంట్లో వ‌దిలేస్తుంది. నితిన్‌కి ఓ చెల్లెలు కూడా ఉంటుంది. ఆనాటి సావిత్రి నుంచి నేటి దీపికా ప‌దుకొనే వ‌ర‌కు. సినిమా తార‌లు ఎలా ఉంటారో కూడా తెలియ‌ని ఇల్లాలు సితార‌. ఓ రోజు రోడ్డుమీద నితిన్ తెల్ల‌టి పరదా ఎగ‌రేసుకుని కారులో వెళ్తున్న అమ్మాయిని చూస్తాడు. తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. కానీ కొన్ని పర్సనల్ కారణాల వల్ల నందిని నితిన్ దూరం పెడుతుంది. ఆమె వెంట తిరుగుతుంటాడు. పేరు నందిని (మిస్తి) అని తెలుస్తుంది. త‌ను భ‌ర‌త‌నాట్యం, వీణ‌, ఏరోబిక్స్ త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హిస్తూ బిజీగా ఉంటుంద‌ని తెలుసుకుంటాడు. ఇన్ని క‌ళ‌లున్న ఆమె వెంట నిర్విరామంగా తిరిగి కొన్ని నిజాలు తెలుసుకుంటాడు. ఓ రోజు నందినికి నితిన్ కి రెడ్డి బాగా దగ్గర అనే విషయం తెలుసుకొని నితిన్ ద్వారా రెడ్డిని కలుసుకుంటుంది. అలా దగ్గరియి ఓ రోజు సడన్ గా నితిన్ కు చెప్పకుండా నందిని, రెడ్డిని తీసుకోని యూరోప్ వెళ్ళిపోతుంది. అది తెలుసుకొని నితిన్ కూడా యూరోప్ కు వెళ్ళిపోతాడు. అక్కడ నితిన్ కి నమ్మలేని ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

పాట రచయిత గాయకులు
ఆ బుగ్గగిల్లి బుగ్గగిల్లి - వెళ్ళిపోకె బుజ్జితల్లీ... కృష్ణచైతన్య రాజా హసన్
ఓ మేరీ పియా చేశావే ఏదో మాయ -మెరుపుతీగై నీవే రాగా... కృష్ణచైతన్య అనూప్ రూబెన్స్
నే మిల మిల కళ్ళే నను మాయ చేసిందా..గలగల గుండెల్లోగోలరేపిందా... కృష్ణచైతన్య రాహుల్ సిప్లిగుంజ్
ముందుగానే రాసి ఉందో..యేమయిందో ఏమో మరి... కృష్ణచైతన్య రమ్యా బెహరా
ఓ అల్బేలీ..ఓ అల్బేలీ..ఓ అల్బేలీ..ఓ అల్బేలీ.. కృష్ణచైతన్య సింహా, ఝవి నారంగ్
ఎవిరిబడీ చలో ఆల్ ఐ వన్నా సే... కృష్ణచైతన్య జస్‌ప్రీత్ జష్,ధనుంజయ్,అనుదీఫ్,హైమత్

మూలాలు[మార్చు]

  1. ""Chinnadaana Nee Kosam" Overseas Release by Asian Movies & CineGalaxy". IndiaGlitz. 17 November 2014. Archived from the original on 23 డిసెంబరు 2014. Retrieved 23 December 2014.
  2. "Chinnadana Neekosam - Yet another romantic entertainer from Nithin". IndiaGlitz. 25 October 2014. Archived from the original on 23 డిసెంబరు 2014. Retrieved 23 December 2014.
  3. "Mishti Chakraborty happy to be part of India's second largest film industry". 26 December 2014.
  4. "Nithin- Karunakaran's movie heroine is Mishti - Telugu Movie News - IndiaGlitz.com".

ఇతర లింకులు[మార్చు]