చిరంజీవి సర్జా
చిరంజీవి సర్జా | |
---|---|
జననం | చిరంజీవి సర్జా 1980 అక్టోబరు 17 |
మరణం | 2020 జూన్ 7 బెంగళూరు, కర్ణాటక, భారతదేశం | (వయసు 39)
ఇతర పేర్లు | చిరు[1] |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2009–2020 |
జీవిత భాగస్వామి | |
బంధువులు | శక్తి ప్రసాద్ (తాత) అర్జున్ సర్జా (మామ) ధృవ సర్జా (సోదరుడు) |
చిరంజీవి సర్జా (అక్టోబరు 17, 1980 - జూన్ 7, 2020)[2] కన్నడ సినిమా నటుడు.[3] అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా 2009లో సినిమారంగంలోకి ప్రవేశించి 22 కన్నడ సినిమాల్లో నటించాడు.[4]
జీవిత విషయాలు
[మార్చు]చిరంజీవి సర్జా 1980, అక్టోబరు 17న విజయ్ కుమార్, అమ్మాజీ దంపతులకు కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో జన్మించాడు.[2] ఇతని తాత శక్తి ప్రసాద్, సోదరుడు ధ్రువ సర్జా కూడా సినిమా నటులే. బెంగళూరులోని బాల్డవిన్ బాయ్స్ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను, విజయ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు.
వివాహం
[మార్చు]2017, అక్టోబరులో సినీనటి మేఘనారాజ్ తో చిరంజీవి సర్జా నిశ్చితార్థం జరిగింది.[5] 2018 ఏప్రిల్ 30న క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం,[6] 2018 మే 2న హిందూ సాంప్రదాయం ప్రకారం ప్యాలెస్ గ్రౌండ్‌లో వివాహం జరిగింది.[7][8]
సినిమారంగం
[మార్చు]అర్జున్ సర్జాతో కలిసి నాలుగేళ్ళపాటు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 2009లో మామ కిషోర్ సర్జా[9] దర్శకత్వం వహించిన వాయుపుత్ర సినిమాతో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన చిరంజీవి సర్జాకు ఉత్తమ తొలిచిత్ర నటుడిగా ఇన్నోవేటివ్ ఫిల్మ్ అవార్డు లభించింది.[1] ఇతర భాషా చిత్రాల రీమేక్‌లైన[10] వరదనాయక (2013), విజిల్ (2013), చంద్రలేఖ (2014), రుద్ర తాండవ (2015), అమ్మా ఐ లవ్ యు (2018) మొదలైన చిత్రాలలో నటించాడు.[11]
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | ఇతర లంకెలు |
---|---|---|---|
2009 | వాయుపుత్ర | బాలు | ఇన్నోవేటీవ్ ఫిల్మ్ అవార్డు (తొలిచిత్రం)[12] |
2010 | గండదే | కృష్ణ | |
చిరు | చిరు | ||
2011 | దండం దశగుణం | సూర్య ఐపిఎస్ | |
కెంపెగౌడ | రామ్ | అతిథి పాత్ర | |
2013 | వరదనాయక | హరి | |
విజిల్ | రామ్ | ||
2014 | చంద్రలేఖ | చందు | |
అజిత్ | అజిత్ | ||
2015 | రుద్ర తాండవ | శివరాజ్ | |
ఆటగర | మృత్యుంజయ్ | ||
రామ్ లీలా | రామ్ | ||
2017 | ఆకే | అర్జున్/శివ | |
భర్జారి | సైనికుడు | అతిథి పాత్ర | |
2018 | ప్రేమ బహర | చిరంజీవి సర్జా | జై హనుమంత పాటలో అతిథి పాత్ర |
సంహార | శ్రీశైల | [13][14] | |
సీజర్ | సీజర్ | ||
అమ్మా ఐ లవ్ యూ | సిద్ధార్ధ్ | ||
2019 | సింగా | సింగా | [15] |
2020 | ఖాకీ | చిరు | [16] |
ఆద్య | ఆదిత్య శంకర్ | [17] | |
శివార్జున | శివ | [18] | |
రాజమార్తాండా† | రాజా | పోస్టు ప్రొడక్షన్[19][20] | |
ఏప్రిల్† | TBA | చిత్రీకరణలో ఉంది[21][22] | |
రణం† | TBA | చిత్రీకరణలో ఉంది[23][24] | |
క్షత్రియ† | TBA | చిత్రీకరణలో ఉంది[25] |
మరణం
[మార్చు]2020, జూన్ 6న సర్జా మూర్ఛ రావడంతో ఉపిరి తీసుకోలేని స్థితిలో బాధపడ్డాడు. మరుసటి రోజు (జూన్ 7న) మధ్యాహ్నం 1:10 గంటలకు ఛాతీ నొప్పి అధికంగా రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే జయనగర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, మధ్యాహ్నం 3:48 గంటలకు గుండెపోటుతో చిరంజీవి సర్జా చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.[2][26] జూన్ 8న కనకపుర రోడ్‌లోని ధ్రువ సర్జా ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు జరిగాయి.[27]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "The bona fide actor". The Hindu. Retrieved 8 June 2020.
- ↑ 2.0 2.1 2.2 "Kannada actor Chiranjeevi Sarja passes away". Deccan Herald. Retrieved 8 June 2020.
- ↑ "Arjun nephew in 'Vaayuputra' - Kannada Movie News". IndiaGlitz. Archived from the original on 13 June 2011. Retrieved 8 June 2020.
- ↑ ఈనాడు, సినిమా వార్తలు (8 June 2020). "గుండెపోటుతో ప్రముఖ హీరో మృతి". www.eenadu.net. Archived from the original on 8 June 2020. Retrieved 8 June 2020.
- ↑ "Chiranjeevi and Meghana Raj got engaged". Deccan Chronicle. Retrieved 8 June 2020.
- ↑ "Actress Meghna Raj weds Chiranjeevi Sarja". The Week. Retrieved 8 June 2020.
- ↑ "Kannada Actors Meghana Raj And Chiranjeevi Sarja Get Married". NDTV. 3 May 2018. Retrieved 8 June 2020.
- ↑ https://english.manoramaonline.com/entertainment/entertainment-news/2020/06/07/chiranjeevi-sarja-and-meghana-raj-were-eagerly-awaiting-an-addit.html
- ↑ "Kannada Actor Chiranjeevi Sarja Passes Away at 39". News 18. Retrieved 8 June 2020.
- ↑ "Chiranjeevi on a Remake Roll". New Indian Express. Archived from the original on 11 అక్టోబరు 2020. Retrieved 8 June 2020.
- ↑ "Remembering Chiranjeevi Sarja: 5 popular movies that prove he was a solid performer". Deccan Herald. Retrieved 8 June 2020.
- ↑ "Innovative Film Awards, star studded, star oriented". chitratara.com. 3 మే 2010. Archived from the original on 20 డిసెంబరు 2013. Retrieved 8 జూన్ 2020.
- ↑ "Chiranjeevi Sarja plays a blind action hero in Samhaara". The Indian Express (in Indian English). 2017-11-20. Archived from the original on 6 October 2019. Retrieved 8 June 2020.
- ↑ "Hariprriya, Chiranjeevi Sarja talk about 'Yenachariyu' song from their film 'Samhaara' | Kannada Movie News - Times of India". timesofindia.indiatimes.com. Archived from the original on 9 September 2019. Retrieved 8 June 2020.
- ↑ "Archived copy". Archived from the original on 21 జూలై 2019. Retrieved 8 June 2020.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Chiranjeevi Sarja to play the lead role in 'Khaki' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2019. Retrieved 8 June 2020.
- ↑ "Sruthi Hariharan, Chiranjeevi Sarja to resume work on the Kannada remake of Kshanam - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 8 June 2020.
- ↑ Shivaarjun Movie Review: The story line and comic scenes fail to impress, retrieved 8 June 2020
- ↑ "Deepti Sati to play lead in Chiranjeevi Sarja's Raja Marthanda". The New Indian Express. Archived from the original on 2019-10-06. Retrieved 2019-10-06.
- ↑ "Chiranjeevi Sarja's next is Raaja Marthanda - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 25 October 2019. Retrieved 8 June 2020.
- ↑ "Chiranjeevi Sarja on board for Rachita Ram's April". The New Indian Express. Archived from the original on 6 October 2019. Retrieved 8 June 2020.
- ↑ "ರಚಿತಾ ರಾಮ್ 'ಏಪ್ರಿಲ್'ಗೆ ಬೆಂಬಲ ಕೊಟ್ಟ ಚಿರಂಜೀವಿ ಸರ್ಜಾ". Vijaya Karnataka (in కన్నడ). 2019-10-03. Archived from the original on 6 అక్టోబరు 2019. Retrieved 8 June 2020.
- ↑ "Chiranjeevi Sarja turns encounter specialist in Ranam". The New Indian Express. Archived from the original on 6 October 2019. Retrieved 8 June 2020.
- ↑ "Varalaxmi Sarathkumar returns to Kannada cinema with Chiranjeevi Sarja-Chetan-starrer Ranam". The New Indian Express. Archived from the original on 6 October 2019. Retrieved 8 June 2020.
- ↑ May 30, Bangalore Mirror Bureau | Updated; 2019; Ist, 10:28. "Chiranjeevi Sarja is in Anil Mandya's directorial debut Kshatriya". Bangalore Mirror (in ఇంగ్లీష్). Archived from the original on 6 అక్టోబరు 2019. Retrieved 8 June 2020.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Kannada actor Chiranjeevi Sarja passes away at 39". The Hindu. Retrieved 8 June 2020.
- ↑ "Chiranjeevi Sarja's funeral: Kannada actor laid to rest at brother Dhruva's farmhouse". Republic World. Retrieved 8 June 2020.