చిరంజీవి (1969 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిరంజీవి (1969 సినిమా)
(1969 తెలుగు సినిమా)

చిరంజీవి సినిమా పోస్టర్
దర్శకత్వం సావిత్రి
తారాగణం సావిత్రి,
చలం
సంగీతం తాతినేని చలపతిరావు
నిర్మాణ సంస్థ అరుణాచలం స్టూడియోస్
భాష తెలుగు

చిరంజీవి 1969, ఏప్రిల్ 5న విడుదలైన ప్రయోగాత్మక తెలుగు చలనచిత్రం. అరుణాచలం స్టూడియోస్ బ్యానర్‌పై ఎ.కె.వేలన్ నిర్మించిన ఈ సినిమాకు సినీనటి సావిత్రి దర్శకత్వం వహించింది.[1] సినిమా మొత్తం ఒకే సెట్టింగు (ఆసుపత్రి సెట్టింగు)లో చిత్రీకరించడం ఈ సినిమా ప్రత్యేకత. కె.బాలచందర్ తొలిసారిగా దర్శకత్వం వహించిన నీర్‌కుమిళి (నీటిబుడగ) అనే తమిళ సినిమాను తెలుగులో చిరంజీవిగా పునర్మించారు.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

కథాసంగ్రహం[మార్చు]

ఊపిరితిత్తులలో కాన్సర్ ఏర్పడిన సత్యం అనే రోగి కొన్నిరోజులలో మృత్యువు కబళించనున్న విషయం ఎరుగనంతవరకూ తాను నవ్వుచూ - ఇతరుల్ని నవ్విస్తూ వుంటాడు. ఆస్పత్రి నుండి విడుదల చేస్తానని డాక్టరు చెప్పిన గడువే తన జీవితకాలంగా తెలుసుకున్న తర్వాత కూడా తాను నవ్వలేక పోయినా-ఇతరుల్ని నవ్వించి లేక సహాయం చేసి జీవితం సార్థకం చేసుకోవాలనుకుంటాడు.

ఆస్పత్రి డాక్టరు కూతురు ఇందిర కూడా డాక్టరే. ఫుట్‌బాల్ ఆటలో కాలు దెబ్బతిని ఆ ఆస్పత్రి చేరిన ఒక యువకునికి మనసు ఇస్తుంది. ఇద్దరూ పరస్పరం ప్రేమించుకుంటారు. ఆయితే కాన్సర్ పరిశోధనకు అమెరికాకు ఇందిర వెళ్ళాల్సివచ్చినా ఇందిర ఆ వ్రయాణాన్ని విరమించుకుంటుంది ఆ యువకుని మోజులో.

కాస్త కాలు నెమ్మదిస్తున్న సమయంలో ఆ యువకుడు పుట్‌బాల్ ఆడపోయి మరల కాలు చెరుపుకుంటాడు. శాశ్వతంగా కాలు తీసేయాల్సి వస్తుంది. ఇందిరతో తన పెళ్ళి ఇష్టంలేని డాక్టర్ తన్ను శాశ్వతంగా అవిటివాణ్నిగా చేశాడని ఆ యువకుని ఆరోపణ. కాని ఇందిర ఆ ఆరోపణను తిరస్కరిస్తుంది. ఆ యువకుణ్ణి హత్యచేసి అతని ఆస్తి కాజేయాలని అతని స్నేహితుడు పన్నిన కుట్రను అదే ఆస్సృతిలోవున్న కాన్సర్ పేషెంటు సత్యం నివారిస్తాడు. తాను నవ్వలేకపోయినా - సుఖపడలేక పోయినా ఇతరుల్ని నవ్విస్తూ - సుఖపెడ్తూ సత్యం కళ్ళుమూసి చిరంజీవి అవుతాడు. ఆస్తులు అంతస్తులు మనసుల్ని వేరుచేయలేవని, మమతలు- మమకారాలు - ఆత్మీయత ముఖ్యమని సత్యం ద్వారా ఎరిగిన డాక్టరు ఆ యువకునితో ఇందిర పెళ్ళికి అంగీకరిస్తాడు. కాని ఇందిర పెండ్లికి అంగీకరించదు. డాక్టర్లు స్వార్థంవలన రోగులను రక్షించడం కొరవడుతూ వుందని తాను అమెరికా వెళ్ళి కాన్సర్ వైద్యం గురించి శిక్షణ పొందాలని నిశ్చయించుకున్నట్లు చెబుతుంది. ఆమె నిర్ణయాన్ని ఆ యువకునితోసహా అందరూ అంగీకస్తారు.[2]

పాటలు[మార్చు]

పాటల వివరాలు
క్ర.సం. పాట రచన గాయకులు
1 జీవితమెంతో తియ్యనిది అందుకనే అతి స్వల్పమది గోపి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
2 నడుము ఉందో లేదో తెలవదు నాభి చూస్తే మనసు నిలవదు ఆరుద్ర టి.ఆర్.జయదేవ్, ఎస్.జానకి
3 చల్లని గాలి అల్లరి అలలు కన్నులలో ఏవేవో బంగారు కలలు సి.నారాయణరెడ్డి పి.సుశీల
4 అరరెరె బూరి బుగ్గల పిల్లి మొగ్గల చిన్నోడా అరె బుల్లోడా కొసరాజు టి.ఆర్.జయదేవ్

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Chiranjeevi (Savithri Ganesan) 1969". ఇండియన్ సినిమా. Retrieved 11 January 2023.
  2. విజయ (13 April 1969). "చిత్ర సమీక్ష: చిరంజీవి" (PDF). విశాలాంధ్ర దినపత్రిక. Archived from the original (PDF) on 12 జనవరి 2023. Retrieved 12 January 2023.