చిరుత (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిరుత
(2007 తెలుగు సినిమా)
TeluguFIlmPoster Chirutha 2007-1.JPG
దర్శకత్వం పూరీ జగన్నాధ్
నిర్మాణం సి.అశ్వనీదత్
కథ పూరీ జగన్నాధ్
చిత్రానువాదం పూరీ జగన్నాధ్
తారాగణం రామ్ చరణ్ తేజ
ఆలీ
నేహా శర్మ[1]
ఆసీష్ విద్యార్ధి
ప్రకాష్ రాజ్
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
బ్రహ్మానందం
ఎమ్.ఎస్.నారాయణ
సూర్య
సాయాజీ షిండే
సంగీతం మణిశర్మ
ఛాయాగ్రహణం శ్యామ్ కె.నాయుడు
కూర్పు వర్మ
నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ తొలి చిత్రంగా చిరుత పెద్దయెత్తున అంచనాలతో, పబ్లిసిటీతో, అభిమానుల ఆర్భాటాల మధ్య విడుదలయ్యింది.

కథ[మార్చు]

చిన్నతనంలోనే తన కళ్ళముందే తన తండ్రి హత్య కావడం చూచి చరణ్ (ram చరణ్ తేజ)బాల్యం కష్టాల మధ్య గడుస్తుంది. అతడు తన తల్లిని కాపాడడానికి మరొకరి నేరం తన నెత్తిపై వేసుకొని జైలుకు వెళతాడు. తిరిగి వచ్చేసరికి తల్లి గతించింది. బ్యాంకాక్‌లో ఒక టూర్ గైడ్‌గా పనిచేస్తున్నపుడు అతనికి సంజన (నేహాశర్మ) అనే ధనికుని కూతురితో పరిచయమౌతుంది. వారి ప్రేమ వర్ధిల్లడం, ఆ యువకుడు తన తండ్రి హంతకులపై ప్రతీకారం తీర్చుకోవడం ఈ చిత్రం కథాంశాలు.

విశేషాలు[మార్చు]

TeluguFIlmPoster Chirutha 2007-2.JPG
  • ఈ చిత్రంలో కథానాయకునికి ఉత్తమ తొలిచిత్రం కథానాయకునిగా (సిని"మా") అవార్డు లభించింది.
  • చిరుత సినిమా విడుదలకు తెలుగు సినిమా రంగంలో అంతకు ముందెన్నడూ లేనంత పబ్లిసిటీ జరిగింది. చిరంజీవి అభిమానులు ఊరూరా పెద్దపెద్ద పోస్టర్లు పెట్టారు. అన్నదానాలు, రక్తదానాలు చేశారు.

బయటి లింకులు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

  1. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.