చిరు మంచుయుగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిరు మంచుయుగపు గాఢత వివిధ అధ్యయనాల్లో వివిధ రకాలుగా ఉంది

మధ్యయుగ వెచ్చని కాలం తరువాత ఏర్పడిన చల్లని కాలాన్ని చిరు మంచుయుగం అంటారు.[1] అది అచ్చమైన మంచుయుగం కానప్పటికీ ఆ పదాన్ని 1939 లో ఫ్రాంకోయిస్ ఇ. మాథెస్ శాస్త్ర పరిభాషలోకి చేర్చాడు.[2] 16 19 శతాబ్దాల మధ్య కాలాన్ని స్వల్పకాలిక మంచుయుగంగా నిర్వచిస్తున్నారు..[3][4][5] అయితే, ఇది 1300[6] నుండి 1850[7][8][9] వరకూ ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఈ చిరు మంచుయుగపు ఆది అంతాలు విభిన్న ప్రాంతాల్లో విభిన్నంగా ఉండడంతో ఈ విషయమై వాతావరణజ్ఞులు, చారిత్రికులు అంగీకరించే అవకాశం లేదు.

నాసా వారి ఎర్త్ అబ్సర్వేటరీ మూడు అతిశీతల కాలాలను నమోదు చేసింది: మొదటిది 1650 లో మొదలు కాగా, రెండవది 1770 లోను, చివరిది 1850 లోనూ మొదలయ్యాయి. ప్రతీ రెండింటి మధ్యా, కాస్త వెచ్చగా ఉండే కాలం ఉంది. వాతావరణ మార్పుల అధ్యయనం కోసం వివిధ దేశాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్యానెల్, చిరు మంచుయుగం ప్రభావం వలన ప్రాంతీయంగా వాతావరణ మార్పులు ఏర్పడ్డాయి తప్ప, ప్రపంచవ్యాప్తంగా ఏకోన్ముఖంగా గ్లేసియేషను[నోట్స్ 1] ఏర్పడలేదని  చెప్పింది. ఎక్కువలో ఎక్కువగా ఉత్తరార్థగోళం కొంతవరకు చల్లబడింది.[10]

నార్స్ గ్రీన్‌ల్యాండర్ల చివరి రికార్డు 1408 లో హ్వాల్సీ చర్చిలో జరిగిన పెళ్ళి. ఈ చర్చిని ప్రస్తుతం సరక్షించారు.

13 వ శతాబ్దంలో, ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ప్యాక్ ఐస్ (సముద్రాల్లో చిన్న చిన్న మంచు ముక్కలు కలవగా ఏర్పడిన పెద్ద మంచు పలక) దక్షిణంగా విస్తరించడం మొదలైంది. గ్రీన్‌ల్యాండ్ లోని గ్లేసియర్లు కూడా విస్తరించాయి. ప్రజలు చెప్పేదాన్ని బట్టి, గ్లేసియర్ల విస్తరణ ప్రపంచ వ్యాప్తంగా జరిగింది. బాఫిన్ ఐలండ్, ఐస్‌ల్యాండుల్లోని మంచుదుప్పటి కింద నుండి సేకరించిన మొక్కల అవశేషాల రేడియో కార్బన్ డేటింగ్ ఆధారంగా మిల్లర్ తదితరులు (2012) చల్లటి వేసవి కాలాలు, మంచు విస్తరణలతో 1275, 1300 ల మధ్య అకస్మాత్తుగా మొదలైన చిరుమంచుయుగం, 1430, 1455 ల మధ్య తీవ్ర రూపం దాల్చిందని చెప్పారు.

దీనికి విరుద్ధంగా గ్లేసియల్ పొడవు ఆధారంగా అంచనా ప్రకారం [11][12] 1600, 1850 ల మధ్య వాతావరణంలో పెద్ద తేడా ఏమీ లేదు. ఆ తరువాత మాత్రం గ్లేసియర్ల తగ్గుదల బలంగా కనిపించింది.

కాల నిర్ణయం

[మార్చు]

కాబట్టి, 400 ఏళ్ళ కాలంలో ఏ తేదీ నయినా చిరు మంచుయుగపు ప్రారంభంగా చెప్పుకోవచ్చు. 

 • 1250: అట్లాంటిక్ ఐస్ ప్యాక్ పెరగడం మొదలైనపుడు, 1257 లో సమాలస్ అగ్నిపర్వతం మహ విస్ఫోటనం చెందగా అది తీవ్రతరమైంది. [13]
 • 1275 నుండి 1300: గ్లేసియేషను కారణంగా చచ్చిపోయిన వృక్షాల రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం
 • 1300: ఉత్తరా ఐరోపాలో వేడిగా ఉండే వేసవి కాలాలు మృగ్యమౌతున్నపుడు
 • 1315: 1315-17 ల నాటి పెద్ద కరువు
 • 1550: ప్రపంచవ్యాప్తంగా గ్లేసియేషను విస్తరించడం మొదలైనపుడు
 • 1650 మొట్టమొదటి క్లైమాటిక్ మినిమమ్

19 వ శతాబ్దం అంతంలో లేదా 20 వ శతాబ్దపు తొలినాళ్ళలో చిరు మంచుయుగం ముగిసింది.[14][15][16]

గడ్డకట్టిన థేమ్స్, 1677

ప్రాంతాల వారీగా భూభౌతిక, సామాజిక ప్రభావం

[మార్చు]

ఐరోపా

[మార్చు]

శీతాకాలాల్లో చల్లదనం పెరగడంతో ఐరోపా, ఉత్తర అమెరికాలో చిరు మంచుయుగం మొదలైంది.17 వ శతాబ్దం మధ్యలో గ్లేసియర్ల కారణంగా స్విస్ ఆల్ప్స్‌లో పొలాలు, గ్రామాలు ధ్వంసమయ్యాయి.[17] ఇంగ్లాఅండు, నెదర్లాండ్సులలోని కాలువలు, నదులు గడ్దకట్టుకుపోయేవి. వీటిపై ఐస్ స్కేటింగు, ఉత్సవాలు వగైరాలు జరిగేవి. మొదటి థేమ్స్ ఉత్సవం 1607 లో జరిగింది. చివరిది 1814 లో జరిగింది. గోల్డెన్ హార్న్, బాస్ఫోరస్ దక్షిణ భాగం 1622 లో గడ్డకట్టాయి. 1658 లో స్వీడిష్ సైన్యం కోపెన్‌హాజెన్‌పై దాడి చేసేందుకు, గ్రేట్ బెల్ట్‌ను నడిచి దాటింది. 1794–1795 శీతాకాలం మరీ తీవ్రంగా ఉంది. పిచెగ్రు నేతృత్వంలోని ఫ్రెంచి సైన్యం నెదర్లాండ్స్ లోని గడ్దకట్టిన నదులను నడిచి దాటింది. 

ఐస్‌ల్యాండ్ చుట్టూ ఉన్న సముద్రపు మంచు మైళ్ళ తరబడి అన్నివైపులా విస్తరించి ఓడరేవులు మూతబడ్డాయి. ఐస్‌ల్యాండు జనాభా సగానికి పడిపోయింది. అయితే 1783 లో లాకీ అగ్నిపర్వతం పేలుడు కారణంగా ఏర్పడిన స్కెలెటల్ ఫ్లోరోసిస్ ఇందుకు కారణం అయి ఉండవచ్చు.[18] ఐస్‌ల్యాండులో కూడా పంటలు దెబ్బతిన్నాయి. ప్రజలు ధాన్యాహారం తినడం మానివేసారు.[19] గ్రీన్‌ల్యాండ్ లోని నార్స్ కాలనీలు 15 వ శతాబ్దం తొలినాళ్ళ కల్లా అంతరించిపోయాయి. పంటలు పండకపోవడం, మాంసాహారం కోసం పెంచే పశువుల పెంపకం కష్టం కావడం ఇందుకు కారణం. అయితే వాళ్ళు అప్పటికే వ్యవసాయ సామర్థ్యాన్ని మించి పోయారని జారెడ్ డయమండ్ చెప్పాడు. మంచు కారణంగా 1410, 1720 మధ్య కాలంలో గ్రీన్‌ల్యాండ్‌కు మిగతా ప్రపంచంతో సంబంధం తెగిపోయింది.[20]

1300 1850 ల మధ్య ఐరోపా రైతులు పడిన అవస్థల గురించి బ్రయాన్ ఫాగన్ రాసిన లిటిల్ ఐస్ ఏజ్ పుస్తకంలో వర్ణించాడు. కరువులు, హైపోథెర్మియా, రొట్టె అల్లర్లు, నియంతల అరాచకత్వం మొదలైనవి ఈ అవస్థల్లో ఉన్నాయి. 17 వ శతాబ్దంలో వ్యవసాయం నాటకీయంగా పడిపోయింది. "ఆల్ప్స్ గ్రామాల్లోని ప్రజలు వేరుశనక తొక్కు, బార్లీ, ఓట్ పిండిలతో కలిపి చేసిన బ్రెడ్ తినేవాళ్ళు." [21] ఐరోపాలో పెచ్చరిల్లిన మంత్రగాళ్ళ (గత్తెల) వేటలకు కారణం చిరుమంచుయుగంలోని పంటల వైఫల్యమే కారణమని వుల్ఫ్‌గ్యాంగ్ బెహ్రింగర్ అనే చరిత్రకారుడు చెప్పాడు.

"February" from the calendar of Les Très Riches Heures du duc de Berry, 1412–1416

ఉత్తర అమెరికా

[మార్చు]

ఉత్తర అమెరికాలో స్థిరపడ్డ తొలితరం ఐరోపా వలసదారులు దారుణ శీతాకాలం గురించి చెప్పారు. ఉదాహరణకు, 1608 జూన్‌లో లేక్ సుపీరియర్ చుట్టూ మంచు పేరుకుందని శామ్యూల్ చాంప్లేన్ చెప్పాడని ల్యాంబ్ అన్నాడు.

మధ్య అమెరికా

[మార్చు]

మెక్సికోలోని యుకాటాన్ ద్వీపకల్పంలో సేకరించిన నమూనాలను విశ్లేషించగా అవి మాయా, అజ్టెక్‌ల నాటి శీతల, కరువు పరిస్థితుల నాటివని తేలింది. ఈ ప్రాంతంలో చిరు మంచుయుగం ఏర్పడిందనే వాదనను ఇది బలపరుస్తోంది.[22]

అట్లాంటిక్ సముద్రం

[మార్చు]

ఉత్తర అట్లాంటిక్‌లో 12,000 ఏళ్ళ నాటి గత మంచుయుగం తరువాత పేరుకున్న సెడిమెంట్ల విశ్లేషణలో సుమారు ప్రతీ 1,500 ఏళ్ళకొకసారి ఉష్ణోగ్రతలు 1–2 °C (2–4 °F) తగ్గి శీతల పరిస్థితులు ఏర్పడ్డాయి.[23] చిట్తచివరిసారిగ అలా శీతల పరిస్థితులు ఏర్పడింది చిరు మంచుయుగం కాలంలోనే. ఆఫ్రికా తీరం దగ్గరలో పేరుకున్న సెడిమెంట్లలో కూడా ఇలాంటి ఇలాంటి శీతల ఘటనలే కనిపించాయి. అయితే ఈ ఘటనలు మిగతా ఘటనలకంటే పెద్దవి. వీటి రేంజి: 3–8 °C (6–14 °F).[24]

ఆసియా

[మార్చు]

చిరు మంచుయుగం శీతల వాతావరణం ఐరోపా, ఉత్తర అమెరికాలకు పరిమితమైనప్పటికీ, ఇతర ప్రాంతాల్లో కూడా శీతల పరిస్థితులు ఏర్పడినట్లుగా ఆధారాలున్నాయి. అయితే, ఈ రెండూ ఒకదానికొకటి సంబంధమున్న ఘటనలా, వేరువేరు ఘటనలా అనే విషయంలో స్పష్టత లేదు. మాన్ ఇలా అంటాడు:[25]

ఐరోపా బయట కూడా శీతల పరిస్థితులు, గ్లేసియేషన్లు ఏర్పడ్డాయని, శీతోష్ణస్థితులు మారిపోయాయని ఆధారాలున్నప్పటికీ, ఇవి వివిధ ప్రాంతాల్లో వేరువేరు కాలాల్లో సంభవించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒకే సమయంలో ఏర్పడిన చిరు మంచుయుగం అనే భావనను తిరస్కరానికి గురైంది.

చైనాలోని జియాంగ్‌షీ ప్రాంతంలో శతాబ్దాలుగా పండిస్తూ ఉన్న వేసవి కాలపు పంటలను వెయ్యడం మానేసారు.[26] గ్వాంగ్‌డాంగ్ లో వెంటవెంటనే రెండు టైఫూన్లు వచ్చిన రెండు సమయాల్లోనూ (1660–1680, 1850–1880) మధ్య చైనాలో పొడి వాతావరణంతో కూడిన అతిశీతల సమయం ఏర్పడింది.[27] చైనాఅలో మింగ్ వంశ పాలన అంతరించడానికి ఈ చిరు మంచుయుగంలో సంభవించిన కరువు కాటకాలు ఒక కారణం అని పరిశోధకులు భావిస్తారు.[28]

పాకిస్తాన్లోని బలూచిస్తాన్‌ బాగా చల్లబడిపోవడంతో అక్కడి ప్రజలు సింధు నదీతీరంలోకి, పంజాబ్ ప్రాంతంలోకీ వలస పోయారు.[29]

ఆఫ్రికా

[మార్చు]

ఇథియోపియా, ఉత్తరాఫ్రికాల్లో పర్వత శిఖరాగ్రాలపై మంచు పడింది. ఆరోజుల్లో మంచు పడిన ఆ ప్రదేశాల్లో ఈనాడు మంచు పడదు.[30] సహారా బిడారు మార్గంలొ ఉన్న టింబక్టూను నైగర్ నది 13 సార్లు వరదలతో ముంచెత్తింది. అలాంటి వరదకు అంతకుముందుగాని, ఆ తరువాత గానీ వచ్చిన దాఖలాలు లేవు.[30]

ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని మలావీ సరస్సు నుండి సేకరించిన కోర్‌ల పరిశీలనలో 1570, 1820 ల మధ్య శీతల పరిస్థితులు ఉండేవని తేలింది. మలావీ సరస్సు రికార్డుల ప్రకారం "చిరు మంచుయుగం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందనే సిద్ధాంతాన్ని బలపరుస్తోంది."[31] దక్షిణాఫ్రికా లోని శీతల గుహలోని స్టాలగ్మైట్ల పెరుగుదల రేటును బట్టి నిర్మించిన ఒక వినూత్నమైన 3000 ఏళ్ళ ఉష్ణోగ్రతల పునఃసృష్టి పద్ధతి కూడా 1500, 1800 ల మధ్య శీతల స్థితి "దక్షిణాఫ్రికా చిరు మంచుయుగం." ఉండేదని తేల్చింది.[32]

నోట్స్

[మార్చు]
 1. హిమనదాలు విస్తరించడాన్ని ఒక ప్రధాన హిమనదీయ సంఘటనగా, "గ్లేసియల్" అని పిలుస్తారు. రెండు గ్లేసియల్‌ల మధ్య ఉండే వెచ్చటి కాలాన్ని "ఇంటర్‌గ్లేసియల్" అంటారు.

మూలాలు

[మార్చు]
 1. Ladurie, Emmanuel Le Roy (1971). Times of Feast, Times of Famine: a History of Climate Since the Year 1000. Barbara Bray. Garden City, NY: Doubleday. ISBN 0-374-52122-0. OCLC 164590.
 2. Matthes, F.E. (1939). "Report of the committee on glaciers". Transactions of the American Geophysical Union: 518–23. Matthes described glaciers in the Sierra Nevada of California that he believed could not have survived the hypsithermal; his usage of "Little Ice Age" has been superseded by "Neoglaciation".
 3. Mann, Michael (2003). "Little Ice Age". In Michael C MacCracken; John S Perry (eds.). Encyclopedia of Global Environmental Change, Volume 1, The Earth System: Physical and Chemical Dimensions of Global Environmental Change (PDF). John Wiley & Sons. Archived from the original (PDF) on 24 జనవరి 2013. Retrieved 17 November 2012.
 4. Lamb, HH (1972). "The cold Little Ice Age climate of about 1550 to 1800". Climate: present, past and future. London: Methuen. p. 107. ISBN 0-416-11530-6. (noted in Grove 2004:4).
 5. "Earth observatory Glossary L-N". NASA Goddard Space Flight Center, Green Belt MD: NASA. Retrieved 17 July 2015. {{cite journal}}: Cite journal requires |journal= (help)
 6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; miller2012 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 7. Grove, J.M., Little Ice Ages: Ancient and Modern, Routledge, London (2 volumes) 2004.
 8. Matthews, J.A. and Briffa, K.R., "The 'Little Ice Age': re-evaluation of an evolving concept", Geogr. Ann., 87, A (1), pp. 17–36 (2005). Retrieved 17 July 2015.
 9. "1.4.3 Solar Variability and the Total Solar Irradiance – AR4 WGI Chapter 1: Historical Overview of Climate Change Science". Ipcc.ch. Retrieved 24 June 2013.
 10. "Climate Change 2001: The Scientific Basis". UNEP/GRID-Arendal. Archived from the original on 29 మే 2006. Retrieved 25 ఆగస్టు 2018.
 11. "Worldwide glacier retreat". RealClimate. Retrieved 2 August 2007.
 12. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Oerlemans2005 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 13. Jonathan Amos (30 September 2013). "Mystery 13th Century eruption traced to Lombok, Indonesia".
 14. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Hendy2002 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 15. Ogilvie, A.E.J; Jónsson, T (2001), "Little Ice Age" Research: A Perspective from Iceland", Climatic Change, 48: 9–52, doi:10.1023/A:1005625729889
 16. "About INQUA:Quaternary Science (By S.C. Porter)". INQUA. Archived from the original on 15 ఏప్రిల్ 2010. Retrieved 6 May 2010.
 17. Jonathan Cowie (2007). Climate change: biological and human aspects. Cambridge University Press. p. 164. ISBN 978-0-521-69619-7.
 18. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Stone2004 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 19. "What Did They Eat? - Icelandic food from the Settlement through the Middle Ages". Archived from the original on 2005-10-31. Retrieved 2018-08-25.
 20. "SVS Science Story: Ice Age". NASA Scientific Visualization Studio. Archived from the original on 17 అక్టోబరు 2007. Retrieved 2 August 2007.
 21. Fagan 2001
 22. David A. Hodella; Mark Brennera; Jason H. Curtisa; Roger Medina-Gonzálezb; Enrique Ildefonso-Chan Canb; Alma Albornaz-Patb; Thomas P. Guilderson (March 2005). "Climate change on the Yucatan Peninsula during the Little Ice Age". Quaternary Research. 63 (2): 109. Bibcode:2005QuRes..63..109H. doi:10.1016/j.yqres.2004.11.004.
 23. Bond et al., 1997
 24. "Abrupt Climate Changes Revisited: How Serious and How Likely?". USGCRP Seminar. US Global Change Research Program. 23 February 1998. Archived from the original on 11 జూన్ 2007. Retrieved 25 ఆగస్టు 2018.
 25. Mann, Michael (2003). "Little Ice Age". In Michael C MacCracken; John S Perry (eds.). Encyclopedia of Global Environmental Change, Volume 1, The Earth System: Physical and Chemical Dimensions of Global Environmental Change (PDF). John Wiley & Sons. Archived from the original (PDF) on 24 జనవరి 2013. Retrieved 17 November 2012.
 26. Reiter P (2000). "From Shakespeare to Defoe: malaria in England in the Little Ice Age". Emerging Infect. Dis. 6 (1): 1–11. doi:10.3201/eid0601.000101. PMC 2627969. PMID 10653562.
 27. Kam-biu Liu; Caiming Shen; Kin-sheun Louie (2001). "A 1,000-Year History of Typhoon Landfalls in Guangdong, Southern China, Reconstructed from Chinese Historical Documentary Records". Annals of the Association of American Geographers. 91 (3): 453–464. doi:10.1111/0004-5608.00253.
 28. https://link.springer.com/article/10.1007/s10584-009-9702-3
 29. From Zardaris to Makranis: How the Baloch came to Sindh
 30. 30.0 30.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; cdc అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 31. Johnson, T.C.; Barry, S.; Chan, Y.; Wilkinson, P. (2001). "Decadal record of climate variability spanning the past 700 yr in the Southern Tropics of East Africa". Geology. 29 (1): 83–6. Bibcode:2001Geo....29...83J. doi:10.1130/0091-7613(2001)029<0083:DROCVS>2.0.CO;2. ISSN 0091-7613.
 32. Holmgren, K.; Tyson, P.D.; Moberg, A.; Svanered, O. (2001). "A preliminary 3000-year regional temperature reconstruction for South Africa". South African Journal of Science. 97: 49–51.