చిర్రికూరపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


చిర్రికూరపాడు
రెవిన్యూ గ్రామం
చిర్రికూరపాడు is located in Andhra Pradesh
చిర్రికూరపాడు
చిర్రికూరపాడు
నిర్దేశాంకాలు: 15°20′13″N 80°01′08″E / 15.337°N 80.019°E / 15.337; 80.019Coordinates: 15°20′13″N 80°01′08″E / 15.337°N 80.019°E / 15.337; 80.019 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంజరుగుమల్లి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం979 హె. (2,419 ఎ.)
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08599 Edit this at Wikidata)
పిన్(PIN)523271 Edit this at Wikidata

చిర్రికూరపాడు, ప్రకాశం జిల్లా, జరుగుమిల్లి మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్: 523 271. ఎస్.టి.డి కోడ్:08598.

  • ఇది ఒంగోలు పట్టణానికి 30 కి.మీ. దూరంలో మండలంలో వున్న ఒక చక్కని గ్రామం. టంగుటూరు నుంచి 11 కి.మీ దూరంలో జరుగుమల్లి మీదుగా వెళ్ళవలెను. చిర్రికూరపాడు ఒక ఆదర్శ గ్రామం. చిర్రికూరపాడు మీదుగా కందుకూరు పట్టణానికి సులభమైన మార్గం ఉంది. ఈ వూరిలో మొత్తం 2000 మంది ఓటర్లు కలరు.

ఈ వూరిలో ఒక ప్రాథమిక పాఠశాల ఉన్నత, పాఠశాల ఉన్నాయి. మూడు గుళ్ళు ఉన్నాయి వాటి పేర్లు రామాలయము, పోతురాజు స్వామి గుడి, బ్రహ్మం గారి గుడి ఉన్నాయి.సిండికేట్ బ్యాంక్ కలదు, క్రొత్తగా సాయి బాబా గుడి కూడా ఉంది. ఛిర్రికురపాడు గ్రామం వ్యవసాయ ఆధారిత గ్రామం ఇక్కడి ప్రధాన పంటలు పొగాకు, శనగ, ప్రధాన పండుగ సంక్రాంతి, ప్రధాన నీటి వనరు పాలేరు ఏరు. పాలేటి ఏరు నుంచి ఈ ఊరికి మంచి నీటి సరఫారా ఉంది. పశువలుకు, ఇతర అవసరములకు నీటిని చిర్రికూరపాడు చెరువు నుంచి నీటిని వాడుతారు ఈ ఊరిలో ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం.

  • బస్సు రూటు: టంగుటూరు నుండి కామేపల్లి వెళ్ళు బస్సు లేద టంగుటూరు నుండి కొండేపి (వయా కామేపల్లి ), కందుకూరు నుండి కొండేపి లేదా కామేపల్లి వెళ్ళు బస్సులు

బ్యాంకులు[మార్చు]

సిండికేటు బ్యాంక్.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,225 - పురుషుల సంఖ్య 1,102 - స్త్రీల సంఖ్య 1,123 - గృహాల సంఖ్య 520

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,216.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,132, మహిళల సంఖ్య 1,084, గ్రామంలో నివాస గృహాలు 512 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 979 హెక్టారులు.

సమీప గ్రామాలు[మార్చు]

జి.మేకపాడు 2.1 కి.మీ, నరిసింగోలు 3.1 కిమీ, దవగూడూరు 3.8 కి.మీ, జిల్లెల్లమూడి 4.1 కి.మీ, పలుకూరు 5.1 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

జరుగుమిల్లి 7.9 కి.మీ, కందుకూరు 10.8 కి.మీ, కొండపి 12.7 కి.మీ, సింగరాయకొండ 13.1 కి.మీ.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూస:జరుగుమిల్లి మండలంలోని గ్రామాలు