చిలకం రామచంద్రా రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిలకం రామచంద్రా రెడ్డి
చిలకం రామచంద్రా రెడ్డి


ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994 - 2004
నియోజకవర్గం నగరి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 24 సెప్టెంబరు 1937
మంగళం గ్రామం
విజయపురం మండలం
చిత్తూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు చిలకం నర్సారెడ్డి, శంకరమ్మ
జీవిత భాగస్వామి లక్ష్మమ్మ
సంతానం ఈశ్వర్‌ప్రసాద్, దాక్షాయణి, మాధవి

చిలకం రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1999 నుండి 2004 వరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

చిలకం రామచంద్రా రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, విజయపురం మండలం, మంగళం గ్రామంలో చిలకం నర్సారెడ్డి, శంకరమ్మ దంపతులకి 24 సెప్టెంబరు 1937లో జన్మించాడు. ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

చిలకం రామచంద్రారెడ్డి 1950వ దశకంలో మంగళం గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా 1959 నుండి 64 వరకు తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, 1982 నుండి 1987 వరకు పిచ్చాటూరు సమితి అధ్యక్షుడిగా, 1984లో చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా, 1988 & 1998లో రెండు సార్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, 1999 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, రైతు కమిషన్‌ సభ్యుడిగా పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఎన్.డి.ఏ ప్రభుత్వ హయాంలో 2004 ఫిబ్రవరి 10న ఏర్పాటు చేసిన రైతులపై జాతీయ సంఘంలో సభ్యుడిగా నియమితుడయ్యాడు.

చిలకం రామచంద్రారెడ్డి నగరి నియోజకవర్గం నుండి 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ తరపున, 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు.

మరణం[మార్చు]

చిలకం రామచంద్రారెడ్డి కరోనా బారిన పడి తమిళనాడులోని చెన్నై కింగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 3 జులై 2021న మరణించాడు.[1][2][3]

మూలాలు[మార్చు]

  1. V6 Velugu (3 July 2021). "ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి(85) ఇకలేరు" (in ఇంగ్లీష్). Archived from the original on 1 December 2021. Retrieved 1 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (4 July 2021). "బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం మృతి". Archived from the original on 1 December 2021. Retrieved 1 December 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 4 జూలై 2021 suggested (help)
  3. Andhrajyothy (4 July 2021). "బీజేపీ నేత చిలకం రామచంద్రారెడ్డి మృతి". Archived from the original on 1 December 2021. Retrieved 1 December 2021.