చిలుకమఱ్ఱి నటరాజ గోపాల మూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిలుకమఱ్ఱి నటరాజ గోపాల మూర్తి బాల్యం నుండి నటనలో అభినివేశం కలిగిన వ్యక్తి తన మూడవతరగతిలో మొదటిసారిగా అల్లూరి సీతారామ రాజు పాత్రలో రంగస్థలంపై తన ప్రయాణం ప్రారంభించారు నటరాజ రామకృష్ణ గారివద్ద ఆంధ్ర నాట్యంలో శిక్షణ తీసుకున్నారు.     తరువాత హైదరాబాద్ భక్త రామదాస సంగీత నృత్య కళాశాలలో కూచిపూడి నాట్యంలో డిప్లొమా చేసారు. దానితో పాటే

డా. అంబేద్కర్  ఓపెన్ యూనివర్సిటీ నుండి తెలుగు సాహిత్యంలో డిగ్రీ చేసారు. ఆతరువాత కేంద్రీయ విశ్వవిద్యాలయంలో  చేరి కూచిపూడి నాట్యంలో ఎం.పి.ఏ చేసారు. తరువాత అక్కడే నటనలో పి. జి. డిప్లొమా చేసి తరువాత రంగస్థల కళల్లో  ఎం.పి.ఏ చేసి బంగారుపతకం సాధించారు. దాదాపుగా 500 నాటకాల్లో నటించారు. 50 పైగా నాటకాలు రచించి దర్శకత్వం వహించారు. విశవిద్యాలయంలో చదివే సమయంలోనే జాతీయస్థాయిలో కేంద్రప్రభువం నిర్వహించే జాతీయ యువజనోత్సవాలకు రాష్త్రం తరపున పాతినిధ్యం వహించి అహమ్మదాబాదు, చెన్నై, లక్నో జైపూర్ మొదలైన ప్రదేశాలలో నాటకాలు ప్రదర్శించారు. రసరంజనికి స్టేజ్‌మేనేజర్‌గా పనిచేసారు.  ఇలాంటి తవ్వాయి వస్తే, చరమస్థలం, విజయం మనదే, అంబల్ల బండ, వ్రణం మొదలైన ప్రయోగాత్మక నాటకాలు రచించి దర్శకత్వం  వహించారు . తెలంగాణా నాటకంపై, నాటక చరిత్రపై, నాటక విభాగాలై పలు వ్యాసాలు రచించారు. తెలుగు సినీ రచయితల సంఘంలో నిర్వాహక కార్యదర్శిగా పలుమార్లు తన సేవలనందిచారు. పలువురు ప్రముఖ రచయితలలో దర్శకులతో కలిసి పలు మార్లు స్క్రీన్ ప్లే, సినిమా రచన దర్శకత్వం మొదలైన విశయాలపై వర్క్‌షాపులు నిర్వహించారు. తెలుగు విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వ విద్యాలయం రంగస్థల కళల విభాగాల్లో ఆతితేయోధ్యాపకునిగా బాధ్యతలు నిర్వహిచారు. 1995 నుండి 2012 వరకు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వైస్ ప్రిన్స్‌పాల్‌గా వ్యవహరించారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాలో మొదటి బ్యాచ్ విద్యార్థులకు దర్శకత్వ పాఠాలు బోధించారు. తరువాత రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో నటనా శాఖాధిపతిగా  కొనసాగారు రంగస్థల ఔత్సాహికులు ప్రయొక్తలు, రచయితలు దర్శకులు, నటులు మిత్రులందరితో కలిసి తెలంగాణా రంగస్థల సమాఖ్యను (తెర)  ప్రారంభించి వ్యవస్థపక అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. తెరను ప్రారంభించిన మొదటిసంవత్సరంలో తెలంగాణా రంగస్థల చరిత్ర స్థితిగతులపై జాతీయ స్థాయిలో సెమినార్ నిర్వహించారు. రెండవసంవత్సరం  తెలంగాణా యువనాటకోత్సవాలు నిర్వహించారు.

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]