చిల్లర భవానీదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిల్లర భవానీదేవి తెలుగు రచయిత్రి, విమర్శకురాలు[1][2]

జీవిత విశేషాలు[మార్చు]

ఈమె 1954, అక్టోబర్ 5న సికిందరాబాదులో జన్మించింది.[3] ఈమె తండ్రి కోటంరాజు సత్యనారాయణశర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె పినమామ చిల్లర భావనారాయణరావు కూడా ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి.[4] ఈమె ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి హిందీలో ఎం.ఎ., ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ, ఎల్.ఎల్.బి., పి.హెచ్.డి. పట్టాలు పొందింది.[5] ఈమె కవిత్వం, కథలు, సాహితీ విమర్శ, నాటకం, బాలసాహిత్యం, జీవితచరిత్ర, లలితగీతాలు మొదలైన ప్రక్రియలలో రచనలు చేసింది. ఈమె సచివాలయంలో ఉన్నత పదవిలో పనిచేసి పదవీవిరమణ గావించి ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నది.[6] తెలుగులో ఇప్పటికీ 12 కవితా సంపుటులు వెలువరించిన ఆమె వివిధ ప్రక్రియల్లో 46 గ్రంథాలు వెలువరించింది. వీరి పలు కవితలు, కథలు అనేక ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి.[7]

రచనలు[మార్చు]

ఆమె తెలుగు భాషా సాహిత్య రంగాలలోని అనేక ప్రక్రియల్లో గణనీయ రచనలు చేసిన రచయిత్రి.ఆమెకు తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా పరిజ్ఞానముంది. "స్వాతంత్య్రానంతరం తెలుగు హిందీ కవిత" లపై తులనాత్మక అధ్యయనం చేసి పి.హెచ్‌.డి. పట్టా పొందింది. అంతేకాక ఆమె న్యాయశాస్త్రంలో కూడా పట్టభద్రులు.[8] ఆమె ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి విశ్రాంత ప్రభుత్వ ఉప కార్యదర్శిగా ఉన్నారు. ఆమె ఆకాశవాణి, ప్రసారభారతి జాతీయ స్థాయిలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రసారం చేసే జాతీయ కవి సమ్మేళనంలో భాగంగా 2019 సంవత్సరానికి తెలుగు కవిగా ఎంపికయ్యింది. "అమ్మ నిజం చెప్పదు" కవిత ద్వారా ఈ కార్యక్రమానికి ఎంపికయ్యిందామె.[7]

కవిత్వం[మార్చు]

  1. నాలోని నాదాలు (1986)
  2. గవేషణ (1993)
  3. శబ్దస్పర్శ (1996)
  4. వర్ణనిశి (2001)
  5. భవానీ నానీలు (2004)
  6. అక్షరం నా అస్తిత్వం (2006)
  7. హైదరాబాద్‌ నానీలు (2007)
  8. కెరటం నా కిరీటం (2009)
  9. రగిలిన క్షణాలు (2012)
  10. ఇంత దూరం గడిచాక (2014)
  11. నది అంచున నడుస్తూ (2017)
  12. వేళ్ళని వెతికే చెట్లు (2021)

కథా సంపుటాలు[మార్చు]

  1. అంతరంగ చిత్రాలు[9] (1993)
  2. అమ్మా నన్ను క్షమించొద్దు (2008)
  3. తప్తశిల (2014)

వ్యాస సంపుటాలు[మార్చు]

  1. అధ్యయనం (2007)
  2. కవయిత్రుల నానీలు (2007)

సాహిత్య విమర్శ[మార్చు]

  1. స్వాతంత్ర్యానంతర తెలుగు, హిందీ కవిత- తులనాత్మక పరిశీలన (సిద్ధాంత గ్రంథం)[10]

నాటకం[మార్చు]

  1. బొబ్బిలి యుద్ధం

జీవితచరిత్రలు[మార్చు]

  1. కొర్రపాటి గంగాధరరావు జీవితం-సాహిత్యం

సత్కారాలు, పురస్కారాలు[మార్చు]

  1. శబ్దస్పర్శ కావ్యానికి ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు -1996లో
  2. "ఇంత దూరం గడిచాక" పుస్తకానికి 2016 సంవత్సర ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది[11]  

మూలాలు[మార్చు]

  1. "కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో డా|| సి. భవానీదేవితో 'కవిసంధ్య' కార్యక్రమం | ప్రస్థానం". prasthanam.com. Retrieved 2019-07-13.
  2. "మానవత్వాన్ని నిద్రలేపే సాహిత్యం కావాలి". lit.andhrajyothy.com. Retrieved 2021-12-16.
  3. కథానిలయం వెబ్‌సైట్‌లో రచయిత్రి వివరాలు
  4. విశాలాంధ్ర దినపత్రికలో[permanent dead link] కాటూరి రవీంద్ర త్రివిక్రం వ్యాసం
  5. Who's who of Indian Writers, 1999లో చిల్లర భవానీదేవి వివరాలు
  6. భూమికలో[permanent dead link] శిలాలోలిత వ్యాసం
  7. 7.0 7.1 "జాతీయ కవి సమ్మేళనానికి భవానీదేవి". www.ntnews.com. Retrieved 2019-07-13.
  8. భావన - డా. సి. భవానీదేవి అభినందన సంచిక(Bhavana Dr C Bhavani Devi Abhinandana Sanchika) By Dr. C.S.R. Murthy - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2019-07-13. Retrieved 2019-07-14.
  9. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో అంతరంగ చిత్రాలు పుస్తక ప్రతి
  10. "20న కవిత్వంలో స్త్రీ పుస్తకావిష్కరణ | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Retrieved 2019-07-13.
  11. "ఫ్రీవెర్స్‌ ఫ్రంట్‌ బహుమతులు". www.andhrajyothy.com. 2017-12-04. Archived from the original on 2017-12-05. Retrieved 2019-07-13.

బయటి లంకెలు[మార్చు]