చీకటి రాజ్యం
| చీకటి రాజ్యం | |
|---|---|
![]() | |
| దర్శకత్వం | రాజేష్ ఎం. సెల్వా |
| రచన | సుకు (సంభాషణలు) |
| స్క్రీన్ ప్లే | కమల్ హాసన్ |
| నిర్మాత | కమల్ హాసన్ ఎస్ చంద్రహాసన్ గొకులం గోపాలన్ వి.సి. ప్రవీణ్ బైజు గొపాలన్ |
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | సను జాన్ వర్గేస్ |
| కూర్పు | షాన్ మహమద్ |
| సంగీతం | ఎం గిబ్రాన్ |
నిర్మాణ సంస్థలు | రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్‌నేషనల్ గొకులం మూవీస్ |
విడుదల తేదీ | నవంబరు 10, 2015[1][2] |
సినిమా నిడివి | 127 నిముషాలు |
| దేశం | భారత దేశం |
| భాషలు | |
చీకటి రాజ్యం 2015 నవంబరు 10న విడుదలైన ద్విభాషా చిత్రం. ఈ చిత్ర తమిళ పేరు "తూంగా వనం" . ఇది స్లీప్‌లెస్ నైట్ (2011 సినిమా) అనే ఫ్రెంచి సినిమా ఆధారంగా తీయబడింది.
కథ
[మార్చు]నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోకు చెందిన పోలీస్ అధికారి సికె దివాకర్ (కమల్ హాసన్ ), మరో అధికారి మణి (యోగి సేతు)తో కలిసి భారీ మొత్తంలో మత్తు పదార్థాలు (డ్రగ్స్) పట్టుకుంటారు. అయితే ఇంత భారీ మొత్తంలో మత్తు పదార్ధాలను పట్టుకున్న ఆనందం, ఆ అధికార్లకు ఎక్కువ సేపు ఉండదు. ఈ ఇద్దరు అధికారులలో ఒకరైన దివాకర్ కొడుకును డ్రగ్ డీలర్ విఠల్ రావ్ (ప్రకాష్ రాజ్) కిడ్నాప్ చేస్తాడు. అప్పటికే వేరేవాళ్లకి ఆ మత్తు పదార్థాలు సరఫరా చేస్తానంటూ మాట ఇచ్చిన విఠల్ రావ్ ఆ మొత్తాన్ని పోలీసులు పట్టుకోవటంతో చేసేదేమి లేక దివాకర్ కొడుకు పట్టుకొని, మత్తు పదార్థాలు వెనక్కి ఇచ్చేయాలంటూ ఒత్తిడి చేస్తాడు. దివాకర్ మత్తు పదార్థాలు వెనక్కి ఇచ్చి, తన కొడుకును కాపాడుకోవాలని భావించినా, అప్పటికే అతని మీద నార్కొటిక్స్ బ్యూరో చెందిన మరో ఇద్దరు ఆఫీసర్లు మల్లిక (త్రిష), కిశోర్ ల నిఘా ఉంటుంది. ఇలా మంచి చెడు ఇద్దరితో ఒకేసారి యుద్ధం చేయాల్సి వచ్చిన దివాకర్ తన కొడుకును ఎలా కాపాడుకున్నాడు అన్నదే చీకటిరాజ్యం కథ.
నటవర్గం
[మార్చు]- కమల్ హాసన్
- ప్రకాష్ రాజ్
- త్రిష కృష్ణన్
- కిషోర్
- సంపత్ రాజ్
- యుగి సేతు
- ఆశా శరత్
- అమన్ అబ్దుల్లా
- మధు శాలిని
- గురు సోమసుందరం
- రామజోగయ్య శాస్త్రి
- ఉమా రియాజ్ ఖాన్
- జగన్
- చామ్స్
- సుక
- సందీప్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం : రాజేష్ ఎం సెల్వ
- నిర్మాత : రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్ నేషనల్
- సంగీతం : జిబ్రన్
మూలాలు
[మార్చు]- ↑ "Thoongavanam Movie Database". tamilcinemainfo.com. Archived from the original on 17 నవంబరు 2015. Retrieved 2 November 2015.
- ↑ [1][permanent dead link]
