చీతా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చీతా[1]
Temporal range: Late Pliocene to Recent
TheCheethcat.jpg
పరిరక్షణ స్థితి
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: Chordata
తరగతి: Mammalia
క్రమం: Carnivora
కుటుంబం: ఫెలిడే
ఉప కుటుంబం: Felinae
జాతి: Acinonyx
ప్రజాతి: A. jubatus
ద్వినామీకరణం
Acinonyx jubatus
(Schreber, 1775)
జాతుల రకాలు
Acinonyx venator
Brookes, 1828 (= Felis jubata, Schreber, 1775) by monotypy
Subspecies

See text.

The range of the cheetah

చీతా ను (ఏసినోనైక్స్ జుబాటస్ ) పిల్లి కుటుంబంలో (ఫెలిడే) ఒక విలక్షణమైన వర్గంగా పరిగణిస్తారు, వేగంతో తనకంటూ ఒక ప్రత్యేకత కలిగివున్న ఈ జాతికి, చెట్లు ఎక్కే సామర్థ్యం ఉండదు. ఏసినోనైక్స్ ప్రజాతిలో ఇప్పటికీ ఉనికిపట్టు కలిగివున్న జీవజాతి ఇదొక్కటే కావడం గమనార్హం. భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువుగా చీతా గుర్తింపు పొందింది, దీని యొక్క గరిష్ఠ వేగాలు 112 and 120 km/h (70 and 75 mph)[3][4] మధ్య ఉంటాయి, అయితే ఇది 460 మీటర్ల దూరం మాత్రమే గరిష్ఠ వేగంతో పరిగెత్తగలదు, ఇదిలా ఉంటే మూడు సెకెన్లలోనే గంటకు 0 నుంచి 103 కి.మీ వేగాన్ని అందుకునే సామర్థ్యం దీని సొంతం, అనేక సూపర్‌కార్లు కంటే ఎక్కువ వేగంతో పరిగెత్తగలదు.[5] ఇటీవలి అధ్యయనాలు చీతాను భూమ్మీద అత్యంత వేగంగా పరిగెత్తే జంతువుగా ధ్రువీకరించాయి.[6]

"చీతా" (చిరుత) అనే పదాన్ని హిందీలో चीता cītā పదం మీదగా, citrakāyaḥ అనే సంస్కృత పదం నుంచి సేకరించారు, దీనికి "రంగురంగుల శరీరం" అనే అర్థం వస్తుంది.[7]

జన్యుశాస్త్రం మరియు వర్గీకరణ[మార్చు]

ఏసినోనైక్స్ అనే ప్రజాతి పేరుకు గ్రీకు భాషలో "వెనక్కుతీసుకోలేని పంజా" అనే అర్థం ఉంది, జాతి పేరు జుబాటస్‌కు లాటిన్‌లో "జూలు కలిగిన" అనే అర్థం వస్తుంది, చీతా పిల్లలకు కనిపించే జూలుకు ఇది ఒక సూచన.

బిడ్డతో తల్లి చీతా

చీతాలు అసాధారణ స్థాయిలో తక్కువ జన్యు వైవిధ్యాన్ని, అతి తక్కువ వీర్య కణ సంఖ్యను కలిగివున్నాయి, అంతేకాకుండా వీర్య కణాలకు తక్కువ చలనశీలత మరియు వికృతాకార కశాభం ఉండటం వలన చీతాలు మనుగడకు సంబంధించిన ముప్పు ఎదుర్కొంటున్నాయి.[8] సంబంధంలేని చీతాల మధ్య చర్మపు అతుకుల సారూప్యత ఈ అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది, దీనిలో దాత చర్మానికి ఎటువంటి తిరస్కృతి ఎదురుకాదు. చివరి మంచు యుగం సందర్భంగా సుదీర్ఘకాలంపాటు అంతః ప్రజననం (రక్త సంబంధీకుల కలయిక వలన సంతానోత్పత్తి) జరిగిన తరువాత ఏర్పడిన జన్యు ప్రతిబంధకం కారణంగా ఈ పరిస్థితి ఉత్పన్నమయినట్లు భావిస్తున్నారు. మియోసెన్ శకం సందర్భంగా (26 మిలియన్ల నుంచి 7.5 మిలియన్ల సంవత్సరాల క్రితం) ఆఫ్రికాలో ఈ పరిణామం ఏర్పడింది, తరువాత ఇది ఆసియా ప్రాంతానికి విస్తరించింది. ఇప్పుడున్న అన్ని చీతా జీవజాతులకు సంబంధించిన చివరి ఉమ్మడి పూర్విక జాతి ఆసియాలో 11 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించినట్లు ఇటీవల జీనోమిక్ డైవర్శిటీ (నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, ఫ్రెడెరిక్, మేరీల్యాండ్, యునైటెడ్ స్టేట్స్)కి చెందిన వారెన్ జాన్సన్ మరియు స్టీఫెన్ ఓ'బ్రియెన్ నేతృత్వంలోని బృందం జరిపిన కొత్త అధ్యయనం వెల్లడించింది, దీని వలన చీతాల పరిణామక్రమానికి సంబంధించిన ప్రస్తుత భావనలను సవరించాల్సిన మరియు సంస్కరించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఇప్పుడు-అంతరించిపోయిన జీవజాతులు: ఏసినోనైక్స్ పార్డినెన్సిస్ (ప్లియోసెన్ శకం), ఆధునిక కాలంలోని చీతాల కంటే బాగా పెద్దవిగా ఉంటాయి, ఇవి యూరప్, భారతదేశం, మరియు చైనాల్లో సంచరించేవి; ఏసినోనైక్స్ ఇంటెర్మిడియస్ (మధ్య-ప్లెయిస్టోసెన్ శకం), ఇవి కూడా ఇదే ప్రాంతంలో ఉండేవి. అంతరించిపోయిన ప్రజాతి మిరాసినోనైక్స్‌కి మరియు చీతాకు మధ్య బాగా దగ్గరి పోలికలు ఉంటాయి, అయితే ఇటీవల DNA విశ్లేషణలో, "ఉత్తర అమెరికా చీతా"లుగా పిలిచే, ఉత్తర అమెరికా ప్రాంతంలో సంచరించినట్లు పరిగణిస్తున్న మిరాసినోనైక్స్ ఇన్‌ఎక్స్‌పెక్టాటస్, మిరాసినోనైక్స్ స్టుడెరీ, మరియు మిరాసినోనైక్స్ ట్రూమానీ (ప్లెయిస్టోసెన్ శకానికి ముందు) నిజమైన చీతాలు కావని వెల్లడైంది, అంతేకాకుండా కౌగర్ (ఒక తరహా చీతా పులి)లతో బాగా దగ్గరి సంబంధం కలిగివుంటాయని ఈ విశ్లేషణ సూచించింది.

ఉపజాతులు[మార్చు]

చీతాల్లో ఆరు లేదా అంతకంటే ఎక్కువ ఉపజాతులు ఉన్నట్లు అనేక మూలాలు తెలియజేస్తున్నప్పటికీ, అనేక ఉపజాతుల వర్గీకరణ హోదా అపరిష్కృతంగా ఉంది. ఒక్క అంతర్గత జన్యువు మాత్రమే వైవిధ్యభరితంగా ఉన్నట్లు గుర్తించబడటంతో, ఏసినోనైక్స్ రెక్స్ — కింగ్ చీతా (కిందివాటిని చూడండి)— ఉపజాతి హోదా త్యజించబడింది. ఏసినోనైక్స్ జుబాటస్ గుట్టాటస్ ఉపజాతులు, అంటే దట్టమైన ఉన్ని కలిగిన చీతాలు, కూడా ఒక అంతర్గత జన్యువు కారణంగా వైవిధ్యాన్ని కలిగివుండవచ్చు. గుర్తించబడిన కొన్ని అతి సాధారణ ఉపజాతులు:[9]

వివరణ[మార్చు]

చీతా యొక్క ఛాతీ బాగా లోతుగా, నడుము సన్నగా ఉంటుంది. చీతాకు ముతక, కురచ బొచ్చుగల చర్మంపై గుండ్రని ఆకారంలో నల్లటి చుక్కలు ఉంటాయి, ఈ చుక్కలు సెంటీమీటర్ కు 2 నుంచి మూడు చొప్పున శరీరవ్యాప్తంగా ఉంటాయి, ఇవి వేటాడే సమయంలో చీతా ఉనికి తెలియకుండా కొంతవరకు కప్పివుంచేందుకు ఉపయోగపడతాయి. చీతా కిందవైపు తెలుపు వర్ణంలో ఉండే శరీర భాగంలో ఎటువంటి చుక్కలు ఉండవు, తోకపై మాత్రం చుక్కలు ఉంటాయి, చివరిలో నాలుగు నుంచి ఆరు నల్లటి వలయాలు ఏర్పడేలా ఈ చుక్కలు కలిసిపోయి ఉంటాయి. సాధారణంగా గుబురుగా ఉండే తెల్లటి జుట్టుతో చీతా తోక ముగుస్తుంది. చీతా కళ్లుబాగా కనిపించే విధంగా చిన్న తలను కలిగివుంటుంది. నల్లటి "కంటి చారలు" రెండు కళ్ల మూల నుంచి ముక్కు పక్కవైపుగా నోటిలోకి వ్యాపించివుంటాయి, సూర్యరశ్మి కళ్లపై పడకుండా ఉండేందుకు మరియు వేటలో సాయపడేందుకు మరియు సుదూర దృష్టి కోసం ఇవి ఉపయోగపడతాయి. అధిక వేగాలు అందుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ, దాని శరీరం బాగా ఎక్కువ దూరం పరిగెత్తేందుకు అనుకూలించదు. దీనిని ఒక స్ప్రింటర్ (తక్కువ దూరాన్ని ఎక్కువ వేగంతో పరిగెత్తే పరుగు పందెగాడు)గా చెప్పవచ్చు.

పెద్ద చీతాలు 36 నుంచి 65 కేజీలు బరువు కలిగివుంటాయి. దీని యొక్క మొత్తం శరీరం పొడవు 115 నుంచి 135 సెం.మీ మధ్యలో ఉంటుంది, ఇదిలా ఉంటే ఇందులో తోక భాగం మాత్రమే 84 సెం.మీ పొడవు ఉంటుంది. భుజం వద్ద చీతాలు 67 నుంచి 94 సెం.మీ ఎత్తు ఉంటాయి. ఆడ చీతాల కంటే మగ చీతాలు కొంచెం పెద్ద ఆకారం మరియు కొంచెం పెద్ద తలలు కలిగివుంటాయి, అయితే చీతాల పరిమాణంలో పెద్ద తేడా ఏమీ ఉండదు, కనిపించే ఆకారం ఆధారంగా మగ మరియు ఆడ చీతాల మధ్య వ్యత్యాసం కనిపెట్టడం కష్టం. ఇదే పరిమాణంలో ఉండే చీతా పులితో పోలిస్తే, చీతాలు (ఆఫ్రికా చీతా పులులు-చీతాలు) సాధారణంగా చిన్న-శరీరం కలిగివుంటుంది, అయితే చీతా పులి కంటే వీటికి పొడవైన తోక ఉండటంతోపాటు, ఎత్తు ఎక్కువగా ఉంటాయి (వీటి సగటున సుమారు 90 సెం.మీ ఎత్తు కలిగివుంటాయి), అందువలన ఇవి క్రమబద్ధమైన రూపంతో కనిపిస్తాయి.

కొన్ని చీతాలు అరుదైన బొచ్చుగల చర్మ ఉత్పరివర్తనను కలిగివుంటాయి: పెద్ద పరిమాణంలో, మచ్చలుగల, విలీనమైన చుక్కలు ఉండే చీతాలను "కింగ్ చీతాలు"గా గుర్తిస్తారు. ఈ విధంగా కనిపించే చీతాలను ఒకప్పుడు ప్రత్యేక ఉపజాతిగా భావించేవారు, అయితే ఇప్పుడు వీటిని ఆఫ్రికా చీతాల ఉత్పరివర్తనగా మాత్రమే పరిగణిస్తున్నారు. "కింగ్ చీతా"లు వన్య ప్రాంతంలో వాటి జాతి సమృద్ధిగా ఉన్న రోజుల్లో కనిపించేవి, అయితే ఇప్పుడు మానవ పర్యవేక్షణలో వీటి సంతతి వృద్ధి చేయబడుతుంది.

చీతా.

చీతా తన పాదంలో పాక్షికంగా-ముడుచుకొని ఉండే గోళ్లు కలిగివుంటుంది[8] (వీటిని మరో మూడు పిల్లి జాతుల్లో మాత్రమే చూడవచ్చు: అవి ఫిషింగ్ క్యాట్ (చేపలను వేటాడే పిల్లి), చదునైన తల కలిగిన పిల్లి మరియు ఐరియోమోట్ క్యాట్ (జపాన్‌లోని ఐరియోమోట్ ద్వీపంలో కనిపించే పిల్లి)) అధిక-వేగంతో పరిగెత్తేందుకు ఈ గోళ్లు చీతాలకు అదనపుపట్టు ఇస్తాయి. చీతా పంజాలోని గోళ్ల స్నాయువు నిర్మాణం ఇతర పిల్లుల మాదిరిగానే ఉంటుంది; అయితే వీటికి చర్మ కోశం ఉండదు మరియు ఇక్కడ ఇతర రూపాల్లోని వెండ్రుకలు ఉంటాయి, దీని వలన వెనుకవైపు గోరు మినహా మిగిలిన గోళ్లు ఎప్పుడూ బయటకు కనిపిస్తుంటాయి. ఇతర పిల్లులతో పోలిస్తే చీతా కాళ్లకు వెనుకవైపు ఉండే గోరు బాగా చిన్నదిగా మరియు సూటిగా ఉంటుంది.

ఆక్సిజన్ (ప్రాణ వాయువు)ను ఎక్కువగా శ్వాసరూపంలో తీసుకునేందుకు ఉపయోగపడే పెద్ద ముక్కు రంధ్రాలు, ఆక్సిజన్‌ను శరీరమంతా ప్రసరింపజేసేందుకు కలిసి పనిచేసే పెద్ద గుండె మరియు ఊపరితిత్తుల వంటి ఉపయోజనాలు చీతా సాధ్యమైనంత ఎక్కువ వేగంతో పరిగెత్తేందుకు దోహదపడతాయి. కఠోరమైన వేట సందర్భంగా చీతా నిమిషానికి 60 నుంచి 150సార్లు శ్వాసతీసుకుంటుంది.[8] పరిగెత్తే సమయంలో, పాక్షికంగా-ముడుచుకొని ఉండే గోర్ల కారణంగా మంచి కర్షణ కలిగివుండటంతోపాటు, చీతా తన తోకను ఒక చుక్కానిలాగా-అంటే స్టీరింగ్ మాదిరిగా ఉపయోగిస్తుంది[ఆధారం కోరబడింది], దీని ద్వారా చీతా కఠినమైన మలుపులు తిరగగలదు, తప్పించుకునేందుకు తరుచుగా మలుపులు తిరిగే జంతువులను వేటాడేందుకు ఈ సామర్థ్యం దానికి ఉపయోగపడుతుంది.

"నిజమైన" పెద్ద పులుల మాదిరిగా కాకుండా, చీతాలు శ్వాసలోనికి తీసుకునే క్రమంలో పిల్లి అరుపులు మాత్రమే చేయగలవు, పెద్ద పులుల మాదిరిగా ఇవి గాండ్రించలేవు. దీనికి విరుద్ధంగా, పెద్ద పులులు గాండ్రించగలవు, పిల్లి మాదిరిగా ఇవి అరవలేవు, శ్వాస బయటకు వదిలి సందర్భం దీనికి మినహాయింపు. అయితే, ఇప్పటికీ చీతాలను కొందరు పెద్ద పులుల్లో అతిచిన్నవాటిగా పరిగణిస్తున్నారు. ఈ ఆఫ్రికా చీతాను (చీతా) తరచుగా చీతా పులి అని తప్పుగా పరిగణిస్తుంటారు, అయితే చీతాకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి, ముందుగా చెప్పినవిధంగా, కళ్ల మూల నుంచి ముక్కుపక్కగా నోటిలోకి ఉండే నల్లటి చారలు ఈ లక్షణాలకు ఉదాహరణల్లో ఒకదానిగా చెప్పవచ్చు. చీతా పులితో పోల్చిచూస్తే ఆఫ్రికా చీతా (చీతా) యొక్క శరీర నిర్మాణంలో స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి, ముఖ్యంగా చీతా పులుల్లో కనిపించని సన్నని మరియు పొడవైన తోక చీతాకు ఉంటుంది మరియు చీతా పిలులపై కనిపించే పువ్వుల మాదిరి క్రమబద్ధమైన మచ్చలు చీతాపై కనిపించవు.

చీతా దాడిచేయదగిన జీవజాతుల్లో ఒకటి. అన్ని పెద్ద పులులతో పోలిస్తే, కొత్త పర్యావరణాలను స్వీకరించే సామర్థ్యం దీనికి అతి తక్కువగా ఉంటుంది. మానవ పర్యవేక్షణలో వీటి సంతానోత్పత్తి జరిపించడం ఎప్పుడూ కష్టసాధ్యంగానే ఉంది, అయితే ఇటీవల కొన్ని జంతు సంరక్షణ కేంద్రాలు ఈ విషయంలో విజయవంతమయ్యాయి. ఉన్ని కోసం చీతాలను ఒకప్పుడు ఎక్కువగా వేటాడేవారు, దీంతో చీతా జాతి ఇప్పుడు సహజావరణం మరియు ఆహారం రెండు విషయాల్లోనూ ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

ఇంతకుముందు చీతాను ముఖ్యంగా పిల్లుల్లో ప్రాచీనమైన జాతిగా పరిగణించేవారు మరియు సుమారుగా 18 మిలియన్ సంవత్సరాల పూర్వం వీటి పరిణామ క్రమం ప్రారంభమైనట్లు భావించారు. అయితే పిల్లి జాతికి చెందిన, ఇప్పటికీ ఉనికి కలిగివున్న అన్ని 40 జీవజాతుల చివరి ఉమ్మడి పూర్వగామి సుమారుగా 11 మిలియన్ సంవత్సరాల పూర్వం జీవించినట్లు ఒక కొత్త పరిశోధన సూచించింది. ఇదే పరిశోధన, స్వరూప శాస్త్రం ప్రకారం బాగా నిర్వచిస్తూ, చీతా పిల్లి జాతిలో పురాతన సంతతికి చెందినది కాదని, సుమారుగా ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన (పూమా కాన్‌కోలర్, కౌగర్, మరియు పూమా యాగ్వారాండీ, జాగ్వరాండి) సమీప బంధువులతో ఇది వేరుచేయబడిందని సూచించింది.[10][11] శిలాజ రికార్డులో తొలిసారి కనిపించినప్పటి నుంచి ఈ విభాగాల్లో కనిపించే పెద్ద మార్పులేమీ చోటుచేసుకోలేదు.

మార్పులు మరియు వైవిద్యాలు[మార్చు]

కింగ్ చీతా[మార్చు]

విలక్షణ వర్ణ వరుసతో ఒక కింగ్ చీతా.

ఒక విలక్షణమైన చర్మపు నమూనాతో వర్ణించే విధంగా, చీతా ఒక అరుదైన ఉత్పరివర్తన చెందితే, అప్పుడు దానిని కింగ్ చీతా అని పిలుస్తారు. దీనిని తొలిసారి 1926లో జింబాబ్వేలో గుర్తించారు. 1927లో, ప్రకృతి శాస్త్రవేత్త రెజినాల్డ్ ఇన్నెస్ పోకాక్ దీనిని ఒక ప్రత్యేక జీవజాతిగా ప్రకటించాడు, అయితే 1939లో ఆధారం లేని కారణంగా ఈ నిర్ణయం ఉపసంహరించబడింది, 1928లో మాత్రం వాల్టెర్ రోత్‌షీల్డ్ కొనుగోలు చేసిన చర్మంపై చారల క్రమం కింగ్ చీతా మరియు చుక్కలు ఉన్న చీతాకు మధ్యస్థంగా కనిపించింది, అబెల్ చాప్‌మాన్ దీనిని చుక్కల చీతాపై ఒక వర్ణ ఆకృతిగా పరిగణించాడు. 1926 మంరియు 1974 మధ్యకాలంలో ఇటువంటి ఇరవై రెండు చర్మాలను గుర్తించారు. 1927 నుంచి, వన్యప్రాంతాల్లో కింగ్ చీతాలు ఐదురెట్లు ఎక్కువగా ఉన్నట్లు నివేదించబడింది. చాలా అరుదైన చుక్కల చర్మాలు ఆఫ్రికా ఖండం నుంచి సేకరించినప్పటికీ, బతికున్న కింగ్ చీతా యొక్క ఛాయాచిత్రం తొలిసారి 1974లో దక్షిణాఫ్రికాలోని క్రూజెర్ నేషనల్ పార్కులో తీయబడింది. రహస్య జంతువులపై అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు పాల్ మరియు లెనా బోట్రియెల్ 1975లో ఒక ప్రయాణం సందర్భంగా ఒక కింగ్ చీతా ఛాయాచిత్రం తీశారు. బాగా ఆహారం తీసుకున్న చీతాల ఛాయాచిత్రాలను కూడా వారు తీయగలిగారు. చుక్కలతో ఉండే చీతా కంటే ఇది పెద్దదిగా మరియు దీని యొక్క ఉన్ని వైవిధ్యమైన ఆకృతిలో కనిపించింది. 1986లో దీనిని మరోసారి అరణ్యప్రాంతంలో చూశారు-అప్పటికి గడిచిన ఏడేళ్ల కాలంలో కింగ్ చీతా కనిపించడంలో అదే తొలిసారి. 1987నాటికి, ముప్పై ఎనిమిది ఉదాహరణలు నమోదు చేయబడ్డాయి, వీటిలో ఎక్కువ కింగ్ చీతాలు చర్మంపై ఉన్ని కలిగివున్నాయి.

1981లో దక్షిణాఫ్రికాలోని డి వైల్డ్ చీతా అండ్ వైల్డ్‌లైఫ్ సెంటర్‌లో కింగ్ చీతాలు జన్మించినప్పుడు వీటి జాతి హోదా పరిష్కరించబడింది. మే 1981లో, రెండు చుక్కలు గల చీతాలు ఇక్కడ పిల్లలకు జన్మనిచ్చాయి, ఒక్కోక్క చీతా ఒక్కో కింగ్ చీతాకు జన్మనిచ్చాయి. (కింగ్ చీతాలు సంచరిస్తున్నట్లు గుర్తించిన) ట్రాన్స్‌వాల్ అనే ప్రదేశం నుంచి బంధించి తీసుకొచ్చిన మగ చీతాను ఇక్కడి రెండు ఆడ చీతాలతో కలిసేలా చేశారు. ఈ కేంద్రంలో తరువాత కింగ్ చీతాలు జన్మించాయి. కింగ్ చీతాలు జింబాబ్వే, బోట్స్‌వానా మరియు దక్షిణాఫ్రికా యొక్క ట్రాన్స్‌వాల్ ప్రావీన్స్ ఉత్తర భాగంలో సంచరిస్తుంటాయని గుర్తించబడింది. కింగ్ చీతాల్లో కనిపించే విలక్షణైన వర్ణ క్రమం కనిపించాలంటే తల్లిదండ్రుల నుంచి ఒక అంతర్గత జన్యువు పిల్లలకు సంక్రమించాల్సి ఉంటుంది- కింగ్ చీతాలు చాలా అరుదుగా కనిపించడానికి ఇది కూడా ఒక కారణం.

ఇతర వర్ణ వైవిద్యాలు[మార్చు]

పొడతో, మెలనిజం (చర్మంలో మెలనిన్ అనే పదార్థం అసాధారణ స్థాయిలో నిల్వ ఉండటం), అల్బినిజం (మెలనిన్ లోపించడం వలన అతితెల్లగా ఉన్న పరిస్థితి) మరియు బూడిద వర్ణంలో కనిపించడం తదితర లక్షణాలను ఈ జీవుల్లో కనిపించే ఇతర అరుదైన వర్ణ మార్పులుగా చెప్పవచ్చు. ఎక్కువ లక్షణాలు భారతదేశపు చిరుతల్లో గుర్తించబడ్డాయి, ముఖ్యంగా వేట కోసం ఉంచిన మానవ పర్యవేక్షణలోని చిరుతల్లో గుర్తించారు.

భారతదేశపు మొఘల్ చక్రవర్తి, జహంగీర్‌కు, 1608లో ఒక తెల్ల చిరుత బహూకరించబడినట్లు నమోదయి ఉంది. తజక్-ఎ-జహంగీరిలో వివరించిన జ్ఞాపకాల్లో, చక్రవర్తి తన మూడో పాలనా సంవత్సరం గురించి చెప్పాడు: రాజా బీర్ సింగ్ డియో నాకు చూపించేందుకు ఒక తెల్ల చిరుతను తీసుకొచ్చాడు. ఇతర ప్రాణాల్లో, పక్షులు మరియు జంతువులు తెలుపు వర్ణాన్ని కలిగివున్నప్పటికీ .... నేనెప్పుడూ తెల్ల చిరుతను చూడలేదు. సాధారణంగా చిరుతకు నలుపు రంగులో మచ్చలు ఉంటాయి, అయితే దీనిని నీలి రంగులో మచ్చలు ఉన్నాయి, శరీరం యొక్క శ్వేతవర్ణం నీలి రంగులో కలిసిపోయివుంది. ఇది చిన్‌చిల్లా మ్యుటేషన్‌ను (పులులకు, సింహాలకు శ్వేత వర్ణాన్ని ఇచ్చే ఒక అంతర్గత జన్యువు) సూచిస్తుంది, ఇది జుట్టుపై వర్ణద్రవ్య పరిమాణాన్ని నిరోధిస్తుంది. మచ్చలు నలుపు వర్ణాన్ని సృష్టించినప్పటికీ, తక్కువ సాంద్రత కలిగిన వర్ణకవిధానం మసకమసక, బూడిక రంగు ప్రభావాన్ని ఇస్తుంది. ఆగ్రాలో జంహంగీర్ తెల్ల చిరుతతోపాటు, "తొలి అల్బినిజం" (మెలనిన్ అనే వర్ణ పదార్థం లోపంతో తెల్లబడిన చిరుత) బ్యూఫోర్ట్ పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చినట్లు గుగిస్‌బెర్గ్ ఒక నివేదికలో సూచించాడు.

మెలనిన్ ఎక్కువగా స్రవించడం వలన నలుపు వర్ణంతో, దెయ్యపు మచ్చలు కలిగిన చీతాలు సృష్టించబడతాయి, "నేచర్ ఇన్ ఈస్ట్ ఆఫ్రికా"కు రాసిన లేఖలో, H. F. స్టోనెహాం ఇటువంటి చీతాను తాను 1925లో కెన్యాలోని ట్రాన్స్-జోయా జిల్లాలో చూసినట్లు వెల్లడించాడు. వెసీ ఫిట్జ్‌గెరాల్డ్ ఇటువంటి మరో చీతాను జాంబియాలో చూశాడు, ఇతను చూసినప్పుడు ఈ నలుపు చీతా మాములు మచ్చులుగల చీతాతో కలిసి తిరుగుతుంది. ఎరుపు (ఎరైథ్రిస్టిక్) చీతాలు బంగారు వర్ణంలోని శరీరంపై ముదురు గోరోచన వర్ణపు మచ్చలు కలిగివుంటుంది. మీగడ రంగు (ఐసాబెలిన్) చీతాలు పాలిపోయిన రంగు శరీరంపై తెల్లబారిన ఎరుపు రంగు మచ్చలు కలిగివుంటాయి. కొన్ని ఎడారి ప్రాంతాల్లో చీతాలు సాధారణంగా పాలిపోయిన రంగులో ఉంటాయి; బహుశా ఈ వర్ణం వాటిని ఉనికిని కప్పిపుచ్చేందుకు సాయపడుతుంది, దీని ద్వారా ఇవి మెరుగ్గా వేటాడగలుగుతాయి, అంతేకాకుండా వాటి రంగులోనే పిల్లలకు జన్మనిచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది. నీలి రంగు (మాల్టెజ్ లేదా బూడిద రంగు) చీతాలను వివిధ రకాలుగా, అంటే బూడిద-నీలి రంగు మచ్చలు (చిన్‌చిల్లా) గల తెల్ల చీతాలుగా లేదా ముదురు బుడిద రంగు మచ్చలు గల (మాల్టెజ్ మ్యుటేషన్) పాలిపోయిన బూడిద రంగు చీతాలుగా వర్ణిస్తుంటారు. దాదుపుగా ఎటువంటి మచ్చులు లేని ఒక చీతాను టాంజానియాలో 1921లో (పీకాక్) గుర్తించారు, మెడ మరియు వీపు భాగంపై దీనికి కొన్ని మచ్చలు మాత్రమే ఉన్నాయి, అవి కూడా చిన్నవిగా ఉన్నాయి.

పరిధి మరియు సహజావరణం[మార్చు]

టాంజానియాలోని సెరెంగెటి నేషనల్ పార్కులో ఒక చీతా.

చీతాల్లో భౌగోళికంగా వియుక్తమైన అనేక జాతులు ఉన్నాయి, అయితే వీటన్నింటినీ ఆఫ్రికా లేదా నైరుతీ ఆసియా ఖండంలో గుర్తించవచ్చు. కొద్ది సంఖ్యలో చీతాలు (సుమారుగా 50 ఉంటాయని అంచనా) ఇరాన్‌లోని ఖోరసాన్ ప్రావీన్స్‌లో ఉన్నాయి, పరిరక్షణ కర్తలు వీటిని రక్షించేందుకు ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు.[12] కొన్ని చీతాలు ఇప్పటికీ భారతదేశంలో కూడా ఉండేందుకు అవకాశం ఉంది, అయితే ఇది అనుమానాస్పదంగా ఉంది. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావీన్స్‌లో ఆసియా చీతాలు ఉన్నట్లు పలు ధ్రువీకరించని నివేదికలు వెల్లడిస్తున్నాయి, ఇక్కడ ఇటీవల మరణించిన చీతాను గుర్తించినట్లు తెలుస్తోంది.[13]

ఆహారం సమృద్ధిగా దొరికే విశాలమైన భూభాగాల్లో చీతాలు బాగా పెరుగుతాయి. వివిధ రకాల సహజావరణాల్లో కనిపిస్తున్నప్పటికీ, పాక్షిక-ఎడారి, ప్రయరీ (విశాలమైన గడ్డి మైదానాలు) మరియు దట్టమైన పొదలతో నిండిన ప్రదేశాల వంటి బహిరంగ సహజావరణంలో పెరిగేందుకు చీతాలు ఇష్టపడతాయి. ఉదాహరణకు, నమీబియాలో, చీతాలు గడ్డిభూముల్లో, సవన్నాల్లో (ఆఫ్రికా గడ్డి మైదానాలు), దట్టమైన అరణ్య ప్రాంతాల్లో మరియు పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్నాయి.

పూర్వకాలంలో ఎక్కువ భాగం, చీతాలను ప్రభు వర్గీయులు పెంపుడు జంతువులుగా మార్చేవారు మరియు ఈ పెంపుడు చీతాలను జింకలను వేటాడేందుకు ఉపయోగించేవారు, ఇప్పుడు గ్రేహౌండ్ వర్గానికి చెందిన శునకాలను ఇందుకు ఉపయోగిస్తున్నారు.

పునరుత్పత్తి మరియు ప్రవర్తన[మార్చు]

చీతా పిల్ల.

ఆడ చీతాలు ఇరవై నుంచి ఇరవై నాలుగు నెలల వయస్సులో ప్రౌఢ దశకు చేరుకుంటాయి, మగ చీతాలు (కనీసం మూడేళ్ల వయస్సు వచ్చే వరకు అవి ఆడ చీతాలతో కలవనప్పటికీ) పన్నెండు నెలల వయస్సులోనే ప్రౌఢ దశకు చేరుకుంటాయి, ఆడ, మగ చీతాల కలయిక ఏడాది మొత్తం జరుగుతుంది. సెరెంగెటిలో చీతాలపై జరిపిన ఒక అధ్యయనంలో, ఆడ చీతాలు అనేక మగ చీతాలతో శృంగారంలో పాల్గొంటాయని వెల్లడైంది, ఇవి తరచుగా అనేక మగ చీతాల చేత పిల్లలకు జన్మనిస్తాయి.[14]

తొంబై నుంచి తొంబై-ఎనిమిది రోజుల గర్భధారణ సమయం ఆడ చీతాలు తొమ్మిది వరకు పిల్లలకు జన్మనిస్తాయి, అయితే సగటున వీటికి జన్మించే పిల్లల సంఖ్య మూడు నుంచి ఐదు వరకు ఉంటుంది. జన్మించినప్పుడు పిల్లలు 150 to 300 g (5.3 to 10.6 oz) బరువు కలిగివుంటాయి. మిగిలిన పిల్లి జాతుల మాదిరిగా కాకుండా, చీతాలు పుట్టుకతోనే వాటి శరీరంపై మచ్చలు కలిగివుంటాయి. చీతా పిల్లలు మెడపై కిందువైపుకు అంతర్లీనంగా ఉండే ఉన్నిని మాంటిల్ అని పిలుస్తారు, ఈ పిల్లలు వైపు మధ్యభాగానికి విస్తరించిన మాంటిల్‌తో జన్మిస్తాయి. ఇది వాటికి జూలు లేదా మోహాక్-రకం ఆకృతిని ఇస్తుంది; జూలు మాదిరిగా కనిపించే ఉన్నిబొచ్చు చీతా పెరిగేకొద్ది కనిపించకుండా పోతుంది. దాడి చేసే జంతువులు భయపడే విధంగా చీతా పిల్లలకు ఈ జూలు హనీ బాడ్జెర్ (నీటి కుక్క) ఆకృతిని ఇస్తుందని ప్రచారంలో ఉంది.[15] పుట్టిన తరువాత పదమూడు నుంచి ఇరవై నెలల మధ్య పిల్లలు తల్లి చీతాను విడిచిపెట్టి వెళతాయి. అటవీ ప్రాంతంలో ఇవి 12 ఏళ్ల వరకు జీవిస్తాయి, అయితే మానవులు పర్యవేక్షణలో వీటి జీవితకాలం ఇరవై ఏళ్ల వరకు ఉంటుంది.

మగ చీతాల మాదిరిగా కాకుండా, ఆడ చీతాలు ఏకాంతంగా తిరుగుతాయి, కలిసి తిరగడానికి ఇష్టపడవు, అయితే కొన్ని తల్లి చీతాలు/తన ఆడ పిల్లలతో కొంతకాలం కలిసి తిరుగుతాయి. చీతాలు ఒక ప్రత్యేకమైన, బాగా-క్రమబద్ధమైన సామాజిక క్రమాన్ని కలిగివున్నాయి. బిడ్డలను పెంచే సమయంలో మినహా, మిగిలిన కాలంలో ఆడ చీతాలు ఒంటిరిగా ఉంటాయి, ఆడ చీతాలు సొంతంగా తన బిడ్డలను పెంచుతాయి. పిల్ల చీతాల తొలి పద్దెనిమిది నెలల సమయం చాలా కీలకమైంది; పిల్లలు ఈ కాలంలో ఆహారం కోసం జంతువులను ఎలా వేటాడాలి మరియు ప్రమాదకరమైన జంతువుల నుంచి ఎలా తప్పించుకోవాలోసహా, అనేక పాఠాలు నేర్చుకుంటాయి. పద్దెనిమిది నెలల వయస్సులో, తల్లి పిల్లలను విడిచిపెడుతుంది, ఇవి తరువాత తోబుట్టువుల లేదా "రక్తసంబంధీకుల" సమూహాన్ని ఏర్పాటు చేస్తాయి, ఈ సమూహంలో చీతా పిల్లలు మరో ఆరు నెలలు ఉంటాయి. రెండేళ్ల వయస్సులో, ఆడ చీతాలు ఈ సమూహాన్ని విడిచిపెట్టి వెళతాయి, యువ మగ చీతాలు మిగిలిన జీవితం కూడా కలిసి ఉంటాయి.

భూభాగాలు[మార్చు]

మగ చీతాలు[మార్చు]

మగ చీతాలు బాగా సహవాసయోగ్యత కలిగివుంటాయి, జీవితం మొత్తం సమూహ జీవితంలో ఉంటాయి, సాధాణంగా ఈ సమూహాలు వాటితోపాటు జన్మించిన మగ చీతాలతో ఏర్పాటయి ఉంటాయి; ఒక మగ చీతా మాత్రమే జన్మించిన సందర్భంలో, ఆ మగ చీతా రెండు లేదా మూడు ఒంటరి మగ చీతాలతో కలిసి సమూహాన్ని ఏర్పాటు చేస్తుంది లేదా ఈ ఒంటరి చీతా అప్పటికే ఏర్పాటయి ఉన్న సమూహంలోకి చేరుతుంది. ఈ సమూహాలను సంకీర్ణాలుగా పిలుస్తారు. కారో మరియు కొల్లిన్స్ (1987) నేతృత్వంలో జరిగిన ఒక సెరెంగెటి అధ్యయనంలో, 41% యవ్వన దశలో ఉన్న మగ చీతాలు సమూహ జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు, ఇదిలా ఉంటే 40% మగ చీతాలు జంటలుగా, 19% శాతం త్రైపాక్షిక సమూహంలో నివసిస్తున్నట్లు కనిపెట్టారు.[16]

ఒక ఒంటరి మగ చీతాతో పోలిస్తే, ఒక సంకీర్ణం ఒక జంతు భూభాగాన్ని కలిగివుండేందుకు ఆరు రెట్లు ఎక్కువగా అవకాశం ఉంది, అయితే ఒంటరి మగ చీతా మాదిరిగానే సంకీర్ణాలు కూడా ఒక భూభాగాలను తమ పరిధిలో సుమారుగా నాలుగు నుంచి నాలుగున్నరేళ్లపాటు ఉంచుకుంటాయని అధ్యయనాలు సూచించాయి.

మగ చీతాలు బాగా ఎక్కువగా ఒకే ప్రాంతానికి కట్టుబడి సంచరిస్తాయి. ఆడ చీతా సంచరించే ప్రదేశ పరిధి బాగా ఎక్కువగా ఉంటుంది, అనేక ఆడ చీతాల పరిధుల చుట్టూ తమ పరిధిని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి, అయితే వీటిని కాపాడుకోవడం వాటికి చాలా కష్టం. అనేక ఆడ చీతాలు సంచరించే ప్రదేశాలు కలిసి ఉండే ప్రాంతంలో మగ చీతాలు తక్కువ ప్రదేశంలో తమ భూభాగాన్ని ఏర్పాటు చేసుకుంటాయి, దీని వలన తమ భూభాగాన్ని రక్షించుకోవడం మగ చీతాలకు సులభం కావడంతోపాటు, పునరుత్పత్తి అవకాశాలు మెరుగుపడతాయి. తాము కలయిక జరిపే ఆడ చీతాలను గుర్తించేందుకు మగ చీతాల సంకీర్ణాలు తమ భూభాగాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తాయి. ఇవి సంచరించే భూభాగ పరిమాణం వనరుల లభ్యతపై కూడా ఆధారపడి ఉంటుంది; ఆఫ్రికా ఖండంలో పరిస్థితుల ఆధారంగా చూస్తే, మగ చీతాలు 37 to 160 kమీ2 (14 to 62 sq mi) సంచార పరిధి కలిగివుంటాయి.

చెట్లు, దుంగలు లేదా చెదపురుగుల పుట్టలు, వంటి నిలబడి ఉండే వస్తువులపై మూత్రం విసర్జించడం ద్వారా మగ చీతాలు తమ భూభాగ హద్దులను గుర్తిస్తాయి. ఈ హద్దులను నిర్ణయించే ప్రక్రియలో సంకీర్ణంలోని అన్ని చీతాలు పాల్గొంటాయి. తమ పరిధిలోకి చొరబడే జంతువులను చంపేందుకు మగ చీతాలు ప్రయత్నిస్తాయి, ఈ సందర్భంగా జరిగే పోరాటాల్లో వాటికి తీవ్రమైన గాయాల కావడం లేదా మరణం సంభవించడం జరుగుతుంది.

ఆడ చీతాలు[మార్చు]

గోరోన్‌గోరో కన్జర్వేషన్ ఏరియాలో ఆడ చీతా మరియు పిల్లలు.

ఆడ చీతాలు మగ చీతాల మాదిరిగా సంచరించే భూభాగాలు ఏర్పాటు చేసుకోవు. దీనికి బదులుగా, అవి తిరిగే ప్రదేశాన్ని వాటి సంచార పరిధిగా పిలుస్తారు. ఇవి ఇతర ఆడ చీతాల సంచార పరిధితో కలిసి ఉంటాయి, తరచుగా ఒక ఆడ చీతా సంచార పరిధి దాని ఆడ బిడ్డలు, తల్లులు లేదా తోబుట్టువుల పరిధిలతో కలిసి ఉంటుంది. ఆడ చీతాలు ఎప్పుడూ ఒంటరిగా వేటాడతాయి, అయితే పిల్ల చీతాలు ఉంటే, అవి వేటాడే సమయంలో తల్లితోపాటే ఉంటాయి, దీనిని చూడటం ద్వారా ఐదు నుంచి ఆరు వారాల వయస్సుకు వచ్చే సరికి పిల్ల చీతాలు కూడా వేటాడటం నేర్చుకుంటాయి.

ఆడ చీతాల యొక్క సంచార పరిధి పూర్తిగా ఆహార లభ్యతపై ఆధారపడి ఉంటుంది. దక్షిణ ఆఫ్రికా అడవిసీమల్లోని చీతాలకు 34 చ.కి.మీవైశాల్యంలో ఉండే అతిచిన్న సంచార ప్రదేశాలు ఉంటాయి, నమీబియాలోని కొన్ని భాగాల్లో తిరిగే చీతాలకు 150 చ.కి.మీ వైశాల్యంలో ఉండే సంచార ప్రదేశాలు ఉంటాయి.

శబ్దాలు[మార్చు]

చీతాలు గాండ్రించలేవు, అయితే ఇవి ఈ కింది శబ్దాలు చేస్తాయి:

 • కిచకిచలు - చీతాలు ఒకదానినొకటి గుర్తించేందుకు ప్రయత్నించే సందర్భంలో, లేదా ఒక తల్లి చీతా దాని బిడ్డలు ఎక్కడున్నాయో గుర్తించేందుకు కిచకిచలుగా పిలిచే అధిక ధ్వనితోకూడిన అరుపులు చేస్తాయి. ఒక చీతా పిల్ల చేసి కిచకిచలు పక్షి చేసే కిచకిచలు మాదిరిగానే ఉంటాయి, అందువలనే ఈ రకమైన చీతా అరుపులను కిచకిచలు అని పిలుస్తున్నారు.
 • కీచుమనే శబ్దం లేదా అస్పష్టమైన శబ్దాలు చేయడం - కొన్ని చీతాలు ఒక చోట కలిసినప్పుడు ఇటువంటి శబ్దాలు వినిపిస్తాయి. కీచుమని పక్షిమాదిరిగా చేసే శబ్దాన్ని ఇతర చీతాలకు ఆహ్వానంగా పరిగణించవచ్చు, ఆసక్తి, అనిశ్చితి లేదా శాంతింపజేయడం లేదా వ్యతిరేక లింగానికి చెందిన చీతాలను కలిసినప్పుడు ఇటువంటి శబ్దాలు చేస్తాయి (అయితే ప్రతి లైంగికాసక్తికి సంబంధించిన కీచు శబ్దం వివిధ కారణాలతో ముడిపడి ఉంటుంది).
 • గుర్రుమనడం - చికాకు వచ్చినప్పుడు లేదా ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నప్పుడు చీతాలు ఈ శబ్దం చేస్తాయి, తరచుగా బుసలు మరియు ఉమ్మితో కలిసి ఈ శబ్దం చేయడం గుర్తించవచ్చు.
 • తీవ్రమైన గుర్రు శబ్దం - సాధారణంగా ప్రమాదం తీవ్రరూపం దాల్చినప్పుడు చీతాలు నోరు బాగా తెరిచి తీవ్రస్థాయిలో గుర్రు శబ్దం చేస్తాయి.
 • ఉల్లాసకర మూలుగులు - చీతా సంతృప్తికరంగా ఉన్నప్పుడు, సాధారణంగా మిగిలిన చీతాలతో కలిసి ఉన్నప్పుడు (ఎక్కువగా పిల్లలలతో మరియు వాటి తల్లులతో కలిసి ఉన్నప్పుడు) మూలిగే శబ్దం చేస్తుంటాయి. బయటకుపోయే మరియు లోనికివచ్చే శ్వాసదారుల గుండా ఈ రకమైన శబ్దాన్ని చేస్తాయి. చీతా యొక్క ఉల్లాసకరమైన మూలిగే శబ్దాలను రాబర్ట్ ఎక్లుండ్ యొక్క ఇన్‌గ్రెసివ్ స్పీచ్ వెబ్‌సైట్ [1] లేదా రాబర్ట్ ఎక్లుండ్ యొక్క వైల్డ్‌లైఫ్ పేజి [2]లో వినవచ్చు.

ఆహారం మరియు వేట[మార్చు]

చంపిన ఇంపాలా (ఒక రకమైన ఆఫ్రికా లేడి)వద్ద ఉన్న చీతా.

చీతా మాంసాహారి, ఇది ఎక్కువగా 40 కిలోల కంటే తక్కువ బరువుండే క్షీరదాలను తింటుంది, థామ్సన్స్ గాజెల్, గ్రాంట్స్ గాజెల్, స్పింగ్‌బోక్ మరియు ఇంపాలా వంటి వివిధ రకాల దుప్పిలను ఇది ఆహారంగా తీసుకుంటుంది. అడవిపశువులు మరియు జీబ్రాల వంటి పెద్ద క్షీరదాలు చిన్నవిగా ఉన్నప్పుడు వాటిని వేటాడి తింటాయి, చీతా మందలుగా కలిసి పెద్ద పశువులను కూడా వేటాడతాయి. గిన్నెకోళ్లు మరియు కుందేళ్లు కూడా వీటికి ఆహారంగా ఉన్నాయి. ఇతర పెద్ద పిల్లులు ప్రధానంగా రాత్రిపూట వేటాడతాయి, అయితే చీతా మాత్రం పగటిపూట వేటాడే జంతువు. సూర్ముడి వేడి తాపం ఎక్కువగా లేనప్పుడు, అంటే బాగా ఉదయం పూట లేదా సాయంత్రం పూట చీతా సాధారణంగా వేటాడుతుంది, అయితే వేటాడేందుకు కావాల్సినంత వెలుతురు ఉంటుంది.

వాసన ద్వారా కాకుండా చీతా చూపు ద్వారా వేటాడుతుంది. ఆహారానికి 10 మీటర్ల దూరంలోకి వెళ్లిన తరువాత, వెంబడించడం మొదలుపెడుతుంది. ఈ వెంబడింపు సాధారణంగా నిమిషం కంటే తక్కువగా ఉంటుంది, చీతా ఆహారాన్ని ఎంచుకున్న జంతువును అందుకోవడంలో విఫలం అయితే, దానిని వదిలిపెడుతుంది. చీతా వేటల్లో విజయాలకు సగటు రేటు 50% ఉంటుంది - అంటే దీని వేటల్లో సగం ప్రయత్నాలు విఫలమవుతుంటాయి.[8]

గంటకు 112 నుంచి 120 కి.మీ మధ్య వేగాలతో పరిగెత్తడం వలన చీతా శరీరం తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. పరిగెత్తేటప్పుడు, చీతా శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది, దీని వలన అది పరిగెత్తడం కొనసాగిస్తే ప్రాణాలకు అపాయం ఏర్పడవచ్చు; ఆహారాన్ని సంపాదించిన తరువాత చీతా తరచుగా విశ్రాంతి తీసుకోవడానికి ఇదే కారణం. తీవ్రమైన వేట అయితే, కొన్నిసార్లు చీతాకు అరగంట లేదా అంతకంటే ఎక్కువ విశ్రాంతి అవసరమవుతుంది. వేంబడించే సమయంలో ఆహారంగా ఎంచుకున్న జంతువును వడిగా లాగడం ద్వారా చీతా దానిని చంపుతుంది, తరువాత దానికి ఊపిరి ఆడకుండా చేసేందుకు మెడను కొరికేస్తుంది, సాధారణంగా ఇవి వేటాడే నాలుగు కాళ్ల జంతువుల మెడలను వేరు చేసేంత బలం చీతాలకు ఉండదు. చీతాలు కొరికినప్పుడు మెడలో ఒక కీలకమైన నాళానికి రంధ్రం పడుతుంది. తన కంటే బలమైన జంతువులు తన ఆహారాన్ని లాక్కెళ్లక ముందే, సాధ్యమైనంత త్వరగా చీతా ఈ ఆహారాన్ని భక్షిస్తుంది.

చీతా ఆహారం అది నివసించే ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, తూర్పు ఆఫ్రికా భూభాగాల్లో, చీతా మొగ్గు చూపే ఆహారం థామ్సన్స్ గాజెల్ (ఒకరకమైన లేడి). ఈ చిన్న లేడి జాతి జంతువు చీతా కంటే (సుమారుగా 53 సెం.మీ ఎత్తు మరియు 70 సెం.మీ పొడవు) చిన్నదిగా ఉంటుంది, ఇది చీతా కంటే వేగంగా పరిగెత్తలేదు (ఇది కేవలం గంటకు 80 కి.మీ వేగంతోనే పరిగెత్తగలదు), దీని వలన ఇది చీతాకు ప్రధాన ఆహారంగా ఉంది. జంతు సమూహానికి దూరంగా వచ్చిన జంతువును ఆహారంగా ఎంచుకునేందుకు చీతాలు ప్రయత్నిస్తాయి, ఇవి కావాల ముసలి లేదా బలహీనమైన జంతువులను ఆహారంగా ఎంచుకోవు.

థామ్సన్స్ గాజెల్ (ఒకరకమైన లేడి) వేటలో చీతా.గోరోన్‌గోరో క్రాటెర్, టాంజానియా.

ప్రత్యేక అంతర్గత మాంసాహార సంబంధాలు[మార్చు]

వేగం మరియు వేటకు సంబంధించిన నైపుణ్యాలు కలిగివున్నప్పటికీ, చీతాలపై వాటి పరిధిలో ఎక్కువగా ఇతర పెద్ద మాంసాహారులు ఆధిపత్యం చెలాయిస్తుంటాయి. శక్తి మరియు చెట్లు ఎక్కే సామర్థ్యాలు లేకుండా, ఎక్కువ వేగంతో పరిగెత్తే సామర్థ్యం మాత్రమే ఉన్న కారణంగా, ఇతర ఆఫ్రికా మాసాంహార జాతుల నుంచి చీతాలు తమనితాము కాపాడుకోలేవు. ఇవి ఎక్కువగా పోరాటాలకు దూరంగా ఉంటాయి, గాయాలు కాకుండా తప్పించుకునేందుకు, చీతాలు తాము వేటాడిన ఆహారాన్ని ఒక్క దుమ్ములగొండి ఉన్నా కూడా దానికి అప్పగించేస్తాయి. ఆహారాన్ని సంపాదించుకునేందుకు అవి వేగంపై ఆధారపడతాయి, వేగాన్ని తగ్గించే ఎటువంటి గాయమైనా సరై, వాటికి ప్రాణాంతకం కాగలదు.

చీతాలు తమ ఆహారాన్ని ఇతర మాంసాహారులకు కోల్పోయే అవకాశం 50% వరకు ఉంటుంది.[8] రోజులో వివిధ సమయాల్లో వేటాడటం ద్వారా మరియు వేటాడిన ఆహారాన్ని వెంటనే తినడం ద్వారా చీతాలు పోటీకి దూరంగా ఉంటాయి. ఆఫ్రికాలో సహజావరణం తగ్గిపోయిన కారణంగా, ఆహారం లభ్యత పరిధి తగ్గిపోయే కొద్ది ఇటీవల సంవత్సరాల్లో చీతాలు ఇతర స్థానిక ఆఫ్రికా మాంసాహారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.[ఆధారం కోరబడింది]

జీవితం ప్రారంభ వారాల్లో చీతాల్లో మరణాల సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది; ఈ సమయంలో 90% చీతా పిల్లలు సింహాలు, చీతా పులులు, దుమ్ములగొండులు, అడవి కుక్కలు, లేదా గద్దల చేత కూడా చంపబడుతుంటాయి. చీతా పిల్లలు తరచుగా రక్షణ కోసం దట్టమైన పొదల్లో దాగివుంటాయి. తల్లి చీతాలు వాటి పిల్లలను కాపాడుకుంటాయి, కొన్నిసార్లు పిల్లల వద్ద నుంచి మాంసాహార జంతువులను తరిమికొట్టడంలో ఇవి విజయవంతమవతాయి. మగ చీతాల యొక్క సంకీర్ణాలు ఇతర మాంసాహారులను తరిమికొట్టగలవు, అయితే ఇది సంకీర్ణ పరిమాణం మరియు లక్షిత జంతువు పరిమాణం మరియు సంఖ్యపై ఆధారపడివుంటుంది. దీని యొక్క వేగం కారణంగా, ఆరోగ్యకరమైన యువ చీతాకు దీటుగా అతికొద్ది మాంసాహారులు మాత్రమే ఉంటాయి.[17]

మానవులతో సంబంధం[మార్చు]

ఆర్థిక ప్రాముఖ్యత[మార్చు]

చీతాతో ఒక మంగోలియా యుద్ధ వీరుడు.

చీతా ఉన్నిని గతంలో ఒక హోదా గుర్తుగా పరిగణించేవారు. ప్రస్తుతం, ఎకోటూరిజం కారణంగా చీతాలకు ఆర్థిక ప్రాధాన్యత పెరుగుతోంది మరియు వీటిని జంతు ప్రదర్శనశాలల్లో కూడా చూడవచ్చు. చీతాలు మిగిలిన పిల్లిజాతి జంతువులతో పోలిస్తే తక్కువ దూకుడుతనం కలిగివుంటాయి, అందువలన చీతా పిల్లలను కొన్నిసార్లు అక్రమంగా పెంపుడు జంతువులుగా విక్రయిస్తున్నారు.

గతంలో, కొన్నిసార్లు ఇప్పటికీ, చీతాలు పెంపుడు జంతువులను తినేస్తాయని భావించి రైతులు వాటిని వేటాడుతుంటారు. ఈ జీవజాతి అంతరించిపోయే ముప్పు ఏర్పడినప్పుడు, చీతా జాతిని పరిరక్షించే చర్యలను ప్రోత్సహించేందుకు, రైతులకు వీటి గురించి అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. చీతాలు ఎక్కువగా అటవిలో దొరికే మాంసాహారాన్ని తీసుకునేందుకు ఇష్టపడతాయని, ఈ ఆహారం దొరికితే చీతాలు పెంపుడు జంతువులపై దాడి చేయవని మరియు వాటిని తినవని ఇటీవలి దొరికిన సాక్ష్యం చూపించింది. అయితే, ఇవి వ్యవసాయ భూమిని వాటి సంచార ప్రదేశంగా ఉంచుకోవడం వివాదానికి దారితీస్తుంది.

పురాతన ఈజిప్షియన్లు తరచుగా చీతాలను పెంపుడు జంతువులుగా ఉంచుకునేవారు, వీటిని అడవి నుంచి బయటకు తీసుకొచ్చి, వాటికి వేటాడటంలో శిక్షణ ఇచ్చేవారు. రథాల వెనుకవైపు లేదా గుర్రాల వెనుకవైపు ఉంచి చీతాలను వేటాడే ప్రదేశాలకు తీసుకెళ్లేవారు, చీతా కళ్లకు గంతలు కట్టి, రహస్యంగా ఉంచి, తోలుతో పటకాలో కట్టి తీసుకెళతారు, కుక్కలను మాత్రం విడిచిపెట్టేవారు. వేటాడాలనుకున్న జంతువుకు సమీపంలోకి వచ్చినప్పుడు, చీతా కళ్లకు గంతలను తొలగించి విడిచిపెట్టేవారు. ఈ సంప్రదాయాన్ని పురాతన పర్షియన్లు స్వీకరించారు, ఆపై ఇది భారతదేశానికి వ్యాపించింది, ఈ పద్ధతిని భారతీయ యువరాజులు ఇరవై శతాబ్దం వరకు కొనసాగించారు. చీతాలకు రాచరికం మరియు కళాపోషణతో అనుబంధం కొనసాగింది, వాటి వేటాడే నైపుణ్యాలు మాదిరిగానే పెంపుడు జంతువులుగా వాటిని ఉపయోగించడం విస్తరించింది. చీతాలను పెంపుడు జంతువులుగా ఉపయోగించిన ఇతర రాజుల్లో, జెన్‌ఘిస్ ఖాన్ మరియు ఛార్ల్‌మాగ్నే ఉన్నారు, రాజమందిర మైదానాల్లో చీతాలను ఉంచుకునే సంప్రదాయం వీరి ద్వారా ప్రోత్సహించబడింది. 1556 నుంచి 1605 వరకు మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన అక్బర్ చక్రవర్తి వద్ద సుమారు 1000 చీతాలు ఉండేవి.[8] 1930వ దశకంలో కూడా ఇథియోపియా చక్రవర్తి హైలే సెలాసీ ఒక చీతాను తోలు పటకాతో తీసుకొస్తున్న ఛాయాచిత్రాలు తరచుగా విడుదలయ్యాయి.

పరిరక్షణ స్థితి[మార్చు]

జన్యు కారణాలు మరియు చీతాలకు పోటీగా ఉండే సింహం మరియు దుమ్ములగొండి వంటి మాంసాహారుల వేట కారణంగా చీతా పిల్లలు అధిక మరణ రేటు కలిగివున్నాయి. ఇటీవలి అంతఃప్రజననం చీతాలు అతిసారూప్యమైన జన్యు ఆకృతులు కలిగివుండటానికి కారణమైంది. దీని కారణంగా పేలవమైన వీర్య కణాలు, పుట్టుకతో వచ్చే లోపాలు, పళ్ల పరిమాణం తగ్గిపోవడం, వంకలు తిరిగి తోకలు, వంగిపోయిన అవయవాలు వంటి దుష్ప్రభావాలు ఏర్పడ్డాయి. మనుగడ సాధించేందుకు చీతాలు తీవ్రస్థాయిలో అంతః ప్రజననంపై ఆధారపడ్డాయని కొందరు జీవశాస్త్రవేత్తలు భావిస్తున్నారు.[18]

ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) యొక్క అంతరించిపోతున్న జాతులు జాబితాతోపాటు (ఆఫ్రికా ఉపజాతులు అంతరించిపోయే ముప్పు ఎదుర్కొంటుండగా, ఆసియా ఉపజాతులు మనుగడకు సంబంధించి తీవ్ర పరిస్థితి ఎదుర్కొంటున్నాయి), US అంతరించినపోతున్న జాతుల చట్టం: అంతరించిపోతున్న జీవులు - CITES (కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్‌డేంజర్డ్ స్పెసిస్)కి అనుబంధంగా చేర్చిన భాగం Iలో చీతాలు చేర్చబడ్డాయి. ఇరువై-ఐదు ఆఫ్రికా దేశాల్లోని అరణ్య ప్రాంతంలో సుమారుగా 12,400 చీతాలు మాత్రమే మిగిలివున్నాయి; నమీబియాలో ఎక్కువ చీతాలు ఉన్నాయి, ఈ దేశంలో 2,500 చీతాలు ఉన్నట్లు భావిస్తున్నారు. మరో యాబై నుంచి అరవై తీవ్రమైన అంతరించిపోయే ముప్పు ఎదుర్కొంటున్న ఆసియా చీతాలు ఇరాన్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ వైట్రో ఫెర్టిలైజేషన్తో సహా పలు విజయవంతమైన సంతానోత్పత్తి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

నమీబియాలో 1990లో ప్రారంభించబడిన చీతా కన్జర్వేషన్ ఫండ్ మిషన్ చీతాలు మరియు వాటి పర్యావరణ వ్యవస్థలకు సంబంధించిన పరిశోధన మరియు విద్యకు సర్వోత్కృష్ట కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది, ప్రపంచంలో చీతాల పరిరక్షణ మరియు నిర్వహణకు ఉత్తమ మార్గాన్ని కనిపెట్టేందుకు దీనికి సంబంధించిన అందరు భాగస్వాములతో ఇది కలిసి పనిచేస్తుంది. పరిరక్షణ చర్యలు కొనసాగించేందుకు దక్షిణాఫ్రికా వ్యాప్తంగా CCF ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది. దక్షిణాఫ్రికా చెందిన చీతా కన్జర్వేషన్ ఫౌండేషన్ అనే సంస్థ చీతాల పరిరక్షణ కోసం 1993లో ఏర్పాటు చేయబడింది.

భారతదేశంలో పునర్నిర్మాణ కార్యక్రమం[మార్చు]

భారతదేశంలో చాలా కాలం నుంచి చీతాలు నివసిస్తున్నట్లు గుర్తించబడింది. అయితే వేట మరియు ఇతర కారణాల వలన, భారతదేశంలో చీతాలు ఇరవైయ్యొవ శతాబ్దం ముందు కనుమరుగయ్యాయి. అందువలన, భారత ప్రభుత్వం చీతాల కోసం ఒక పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రణాళికా రచన చేస్తోంది. TOI, పేజి 11, గురువారం, జూలై 9, 2009న ప్రచురించబడిన కథనం..చీతాలను భారతదేశానికి దిగుమతి చేసుకొని, ఇక్కడ మానవ పర్యవేక్షణలో వాటి సంతానోత్పత్తి జరిపించాలని ప్రణాళిక ఉన్నట్లు స్పష్టంగా వెల్లడించింది. 1940వ దశకం నుంచి చీతాలు భారతదేశంలో కనిపించకుండా పోయాయి, అందువలన ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం ప్రణాళికా రచన చేస్తోంది. పర్యావరణ మరియు అడవుల శాఖ మంత్రి జైరాం రమేష్ జూలై 7, 2009న రాజ్యసభలో మాట్లాడుతూ, గత 100 ఏళ్లలో భారత్‌లో కనుమరుగైన ఒకేఒక్క జంతువు చీతా అని తెలియజేశారు. ఇక్కడ తిరిగి ఈ జీవుల సంతానోత్పత్తి జరిపించేందుకు వీటిని విదేశాల నుంచి మనం తీసుకురావాలి. భారతీయ జనతా పార్టీ (BJP)కి చెందిన నేత రాజీవ్ ప్రతాప్ రూడీ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ స్పందన తెలియజేశారు. 'పులుల పరిరక్షణను చుట్టుముట్టిన సమస్యలను పరిగణలోకి తీసుకుంటే, విచక్షణారహిత వేట మరియు దుర్బలమైన సంతానోత్పత్తి క్రమం వంటి క్లిష్టమైన కారణాల వలన కనుమరుగైన చీతాలను తిరిగి వృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ప్రణాళిక సాహసోపేతమైందని చెప్పాలి.' దివ్యా భానుసిన్హా మరియు MK రంజిత్ సింగ్ అనే ఇద్దరు ప్రకృతి శాస్త్రవేత్తలు ఆఫ్రికా నుంచి చీతాలను దిగుమతి చేసుకోవాలనే ఆలోచనను తెరపైకి తీసుకొచ్చారు. వీటిని దిగుమతి చేసుకున్న తరువాత, వాటి చేత మానవ పర్యవేక్షణలో సంతానోత్పత్తి జరిపిస్తారు, ఒక నిర్దిష్ట కాలం తరువాత, వాటిని తిరిగి అడవుల్లోకి వదిలిపెడతారు.

వివిధ సంస్కృతులలో[మార్చు]

టైటియాన్ చిత్రీకరించిన బాచూస్, అరియాడ్నే, 1523.
ఫెర్నాండ్ క్నోఫ్ చిత్రీకరించిన ది కారెస్, 1887

సూచనలు[మార్చు]

గమనికలు[మార్చు]

 1. మూస:MSW3 Wozencraft
 2. Bauer, H., Belbachir, F., Durant, S., Hunter, L., Marker, L., Packer, K. & Purchase, N. (2008). Acinonyx jubatus. In: IUCN 2008. IUCN Red List of Threatened Species. Retrieved 9 October 2008.
 3. Sharp, N. C. (1994). "Timed running speed of a cheetah (Acinonyx jubatus)". Journal of Zoology, London. 241: 493–494.
 4. Milton Hildebrand (1959). "Motions of Cheetah and Horse". Journal of Mammalogy. Retrieved 2007-10-30. ఆల్‌థో అకార్డింగ్ టు చీతా, ల్యూక్ హంటెర్ మరియు డేవ్ హమ్మన్, (స్ట్రుయిక్ పబ్లిషర్స్, 2003), పేజీలు 37–38, ది చీతాస్ ఫాస్టెస్ట్ రికార్డెడ్ స్పీడ్ వాజ్ గంటకు 110 కి.మీ.
 5. Kruszelnicki, Karl S. (1999). "Fake Flies and Cheating Cheetahs". Australian Broadcasting Corporation. Retrieved 2007-12-07.
 6. Garland, T., Jr. (1983). "The relation between maximal running speed and body mass in terrestrial mammals" (PDF). Journal of Zoology, London. 199: 155–170.
 7. cheetah (n.d.). The American Heritage Dictionary of the English Language, Fourth Edition. Retrieved 2007-04-16.
 8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 O'Brien, S., D. Wildt, M. Bush (1986). "The Cheetah in Genetic Peril". Scientific American. 254: 68–76.CS1 maint: Multiple names: authors list (link)
 9. Wilson, D.E.; Reeder, D.M., eds. (2005). Mammal Species of the World: A Taxonomic and Geographic Reference (3rd ed.). Johns Hopkins University Press. ISBN 978-0-8018-8221-0. OCLC 62265494.
 10. Mattern, M. Y., D. A. McLennan (2000). "Phylogeny and Speciation of Felids". Cladistics. 16: 232–253. doi:10.1111/j.1096-0031.2000.tb00354.x.CS1 maint: Multiple names: authors list (link)
 11. Johnson, W. E., E. Eizirik, J. Pecon-Slattery, W. J. Murphy, A. Antunes, E. Teeling, S. J. O'Brien (2006). "The Late Miocene Radiation of Modern Felidae: A Genetic Assessment". Science. 311: 73–77. doi:10.1126/science.1122277. PMID 16400146.CS1 maint: Multiple names: authors list (link)
 12. "Asiatic Cheetah". Wild About Cats. Retrieved 2007-12-07.
 13. "Asiatic Cheetah". WWF-Pakistan. Retrieved 2007-12-07.
 14. "Scandal on the Serengeti: New light has been shed on the extent of female cheetahs' unfaithfulness to their male partners". inthenews.co.uk. May 30, 2007. Retrieved 2007-12-07.
 15. ఈటన్, రాండాల్ L. (1976) ఎ పాజిబుల్ కేస్ ఆఫ్ మిమిక్రీ ఇన్ లార్జర్ మమ్మల్స్ ఎవాల్యూషన్ 30(4):853-856 doi 10.2307/2407827
 16. రిచర్డ్ ఎస్ట్స్, ఎడ్వర్డ్ విల్సన్ ముందుమాట (1991) ది బిహేవియర్ గైడ్ టు ఆఫ్రికన్ మమ్మల్స్. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్. పేజి 371.
 17. M. W. Hayward, M. Hofmeyr, J. O'Brien & G. I. H. Kerley (2006). "Prey preferences of the cheetah (Acinonyx jubatus) (Felidae: Carnivora): morphological limitations or the need to capture rapidly consumable prey before kleptoparasites arrive?". Journal of Zoology. Retrieved 2008-10-05.CS1 maint: Multiple names: authors list (link)
 18. Gugliotta, Guy (2008-02). "Rare Breed". Smithsonian Magazine. Retrieved 2008-03-07. Check date values in: |date= (help)

ఉపయుక్త గ్రంథసూచి[మార్చు]

 • గ్రేట్ కాట్స్, మెజెస్టిక్ క్రియేచర్స్ ఆఫ్ ది వైల్డ్, సంపాదకులు జాన్ సీడెన్‌స్టికెర్, ఇల్లూస్. ఫ్రాంక్ నైట్, (రోడాల్ ప్రెస్, 1991), ISBN 0-87857-965-6
 • చీతా, కేథరీన్ (లేదా కేథ్రిన్) & కార్ల్ అమ్మన్, ఆర్కో పబ్, (1985), ISBN 0-668-06259-2.
 • చీతా (బిగ్ కాట్ డైరీ), జోనాథన్ స్కాట్, ఏంజెలా స్కాట్, (హార్పెర్‍‌కొల్లిన్స్, 2005), ISBN 0-00-714920-4
 • సైన్స్ (సంపుటి 311, పేజి 73)
 • చీతా, ల్యూక్ హంటెర్ మరియు డేవ్ హమ్మన్, (స్ట్రుయిక్ పబ్లిషర్స్, 2003), ISBN 1-86872-719-X
 • ఆల్సెన్, థామస్ T. (2006). "నాచురల్ హిస్టరీ అండ్ కల్చరల్ హిస్టరీ: ది సర్క్యులేషన్ ఆఫ్ హంటింగ్ లెపోర్డ్ ఇన్ యురేషియా, సెవెన్త్-సెవెన్టీన్త్ సెంచురీస్." ఇన్: కాంటాక్ట్ అండ్ ఎక్స్ఛేంజ్ ఇన్ ఏన్షియంట్ వరల్డ్ . సంపాదకుడు విక్టర్ H. మేయర్. యూనివర్శిటీ ఆఫ్ హవాయ్ ప్రెస్. పేజీలు 116–135. ISBN ISBN 978-0-8248-2884-4; ISBN ISBN 0-8248-2884-4

మరింత చదవడానికి[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=చీతా&oldid=2502327" నుండి వెలికితీశారు