Jump to content

చీమకుర్తి నాగేశ్వరరావు

వికీపీడియా నుండి
చీమకుర్తి నాగేశ్వర రావు
జననం
తొట్టెంపూడి నాగేశ్వర రావు

వృత్తిరంగస్థల కళాకారుడు, హార్మోనియం విద్వాంసుడు

చీమకుర్తి నాగేశ్వరరావు ప్రముఖ రంగస్థల కళాకారుడు.[1][2] హార్మోనియం విద్వాంసుడు.ఇతను పౌరాణిక నాటకాలలో హరిశ్చంద్ర పాత్రలకు పేరు గాంచాడు.ఇతనికంటే ముందు ఈ పాత్రకు పేరు పొందిన బండారు రామారావును అభినవ హరిశ్చంద్రుడుగా అభివర్ణిస్తే, చీమకుర్తిని అభినవ బండారుగా అభిమానులు ప్రశంసించారు. సత్యహరిశ్చంద్ర నాటకంలో భాగంగా జాషువా కలం నుంచి జాలువారిన "కాటి సీను" పద్యాలు ఇతను బాగా ఆలపించేవాడు.[3] విజయ రామరాజు నక్షత్రకుడిగా ఇతను హరిశ్చంద్రుడిగా మంచి జోడిగా పేరు గాంచారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

నాగేశ్వరరావు చీమకుర్తి మండలం కందూరివారి అగ్రహారం లో ఓ దళిత కుటుంబంలో జన్మించాడు. ఆయన గురువు అద్దంకి మాణిక్యరావు. తాత, తండ్రులు వీధినాటక కళాకారులు. తొట్టెంపూడి అనే తన యింటిపేరును చీమకుర్తిగా మార్చుకున్నాడు. తొలుత ట్రాక్టరు డ్రైవరుగా వున్న నాగేశ్వరరావు ప్రోగ్రాములు లేనపుడు పచ్చాకు కూలీగా పనులకు వెళ్ళేవాడు. చీమకుర్తి గాత్రంలో సంగీతాలు ప్రత్యేకంగా పలికేవి. ఒకే రాగం అయినా సరే ఒకసారి పాడినట్టు యింకొకసారి పాడేవాడు కాదు. హరిశ్చంద్ర నాటకాన్ని సామాన్య ప్రజలకు చేరువచేసిన బండారు,డి.వి.సుబ్బారావు లతోపాటు తనకంటూ ఒక ప్రత్యేక బాణీని ఏర్పరుచుకున్నాడు.

మద్యపానం అలవాటు ఉండటంతో మూత్రపిండాల వ్యాధితో బాధ పడ్డాడు. 2006 లో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. https://web.archive.org/web/20170118195453/http://www.andhrajyothy.com:80/artical?SID=357715|ఒకానొక హరిశ్చంద్ర చక్రవర్తి చీమకుర్తి|
  2. "మహానటుడు నాగేశ్వరరావు". prajasakti.com. ప్రజాశక్తి. Retrieved 25 January 2018.
  3. "సమాజం కోసం జీవించిన జాషువా". sakshi.com. సాక్షి. Retrieved 25 January 2018.