చీర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cheers
100
Bar sign for Cheers (2005)
ఫార్మాట్Sitcom
రూపకర్తJames Burrows
Glen Charles
Les Charles
తారాగణంTed Danson
Shelley Long
(seasons 1–5)
Kirstie Alley
(seasons 6–11)
Nicholas Colasanto
(seasons 1–3)
Rhea Perlman
John Ratzenberger
George Wendt
Woody Harrelson
(seasons 4–11)
Kelsey Grammer
(seasons 3–11)
Bebe Neuwirth
(seasons 4–11)
టైటిల్ సాంగ్ కంపోజర్Gary Portnoy
Judy Hart Angelo
ఓపెనింగ్ థీమ్"Where Everybody Knows Your Name"
Performed by Gary Portnoy
మూల కేంద్రమైన దేశంUnited States
వాస్తవ భాషలుEnglish
సీజన్(లు)11
ఎపిసోడ్ల సంఖ్య270 (includes 2 specials and triple length finale)
(List of episodes)
నిర్మాణం
మొత్తం కాల వ్యవధి24 minutes
ప్రొడక్షన్ సంస్థ(లు)Charles/Burrows/Charles Productions
In Association With Paramount Network Television
పంపిణీదారులుCBS Television Distribution
ప్రసారం
వాస్తవ ప్రసార ఛానల్NBC
వాస్తవ ప్రసార కాలంSeptember 30, 1982 –
May 20, 1993
క్రోనోలజీ
Followed byFrasier (1993–2004)
Related showsThe Tortellis (1987)

చీర్స్ అనేది ఒక అమెరికన్ సిచ్యువేషన్ కామెడి టెలివిజన్ సిరీస్. ఇది 1982 నుంచి 1993 వరకు పదకొండు సీజన్లు ప్రసారం అయింది. ఈ సీరీస్‌ను NBC కొరకు చార్లెస్/బురోస్/చార్లెస్ ప్రొడక్షన్స్ వారు, పారమౌంట్ నెట్వర్క్ టెలివిజన్ వారితో కలిసి తయారు చేశారు. దీనిని జేమ్స్ బరోస్, గ్లెన్ చార్లెస్, మరియు లెస్ చార్లెస్‌తో కూడిన బృందం రూపొందించింది. ఈ షో బాస్టన్, మసాచుసెట్స్ లోని చీర్స్ బార్‌లో ("చీర్స్" అనే టోస్ట్‌ను బట్టి ఈ పేరు పెట్టబడింది) జరుగుతుంది. ఇక్కడే కొందరు స్థానికులు కలిసి త్రాగుతూ, మాట్లాడుకుంటూ, ఉల్లాసంగా ఉండేవారు. ఈ షో యొక్క థీం పాటను జుడి హార్ట్ ఎంజేలో మరియు గారి పోర్ట్నోయ వ్రాశారు; పోర్ట్నోయ ప్రదర్శించాడు;[1] దీని ప్రసిద్ధ మాట అయిన "వేర్ ఎవ్రీబడీ నోస్ యువర్ నేమ్" అనేదే షో యొక్క టాగ్‌లైన్ అయింది.

1982 సెప్టెంబరు 30 నాడు మొదటి సారిగా ప్రసారం చేసినప్పుడు, మొదటి సీజన్లోనే దాదాపు రద్దు అయే స్థితి ఏర్పడింది. ఈ షో యొక్క ప్రిమియర్ ఆఖరి స్థానంలో నిలిచింది (77 షో లలో 77వ స్థానం) [2][3] అయితే, తరువాత చీర్స్ యునైటెడ్ స్టేట్స్ లో మంచి రేటింగ్ పొందిన టెలివిజన్ షోగా ప్రాబల్యం చెందింది. పదకొండు సీజన్లలో, ఎనిమిది సీజన్లలో టాప్-టెన్ లలో స్థానం సంపాదించింది. ఒక సీజన్లో #1 స్థానంలో నిలిచింది. ఇది ప్రసారమైన మొత్తం కాలములో చాలా కాలము NBC యొక్క "మస్ట్ సి తర్స్‌డే" జాబితాలో చోటు సంపాదించింది. విస్తృతంగా వీక్షించబడిన ఈ సీరీస్ యొక్క అంతిమ భాగము 1993 మే 20 నాడు ప్రసారం చేయబడింది. ఈ షో యొక్క 270 ఎపిసోడ్‌లు విజయవంతంగా ప్రపంచవ్యాప్తంగా సిండికేట్ చేయబడింది. అప్పటి రికార్డ్ అయిన 117 ప్రతిపాదనల నుండి ఈ షోకు 28 ఎమ్మి అవార్డులు గెలుచుకుంది. ఈ షోలో ఒక పాత్ర అయిన ఫ్రేసియర్ క్రేన్ (కేల్సీ గ్రామర్ పోషించారు) మీద రూపొందించిన ఫ్రేసియర్ అనే స్పిన్-ఆఫ్ కార్యక్రమం పదకొండు సీజన్లు విజయవంతంగా ప్రసారమయింది. చీర్స్ లోని అన్ని ప్రధాన పాత్రలు మరియు కొన్ని చిన్న పాత్రలు పోషించిన వారు ఈ కార్యక్రమంలో అతిథి పాత్రలో కనబడ్డారు ఒక్క కిర్స్టీ ఆల్లే మరియు చనిపోయిన నికొలాస్ కొలసాన్టో తప్ప.

తారాగణం[మార్చు]

ఎన్‌సెం‌బిల్ తారాగణంతో కూడిన చీర్స్‌లో దాదాపు షో పూర్తీ అయ్యే వరకు అదే పాత్రలే ఉన్నాయి. కథకు అనుగుణంగా అప్పుడప్పుడు అనేక రెండవ స్థాయి పాత్రలు మరియు ప్రేమ వ్యవహారాలు ఈ కథలో చోటు చేసుకుంటాయి. అవి అన్నీ కూడా ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతూ ఉంటాయి.

పాత్ర నటుడు/నటి చీర్స్‌లో పాత్ర వృత్తి (లు) సమయం
సామ్ మెలోన్ టెడ్ డాన్సన్ బార్టేండర్/స్వంతదారు పూర్వపు రిలీఫ్ పిచర్ బోస్టన్ రెడ్ సాక్స్ కొరకు 1982–1993
డయేన్ చాంబర్స్ షెల్లీ లాంగ్ వైట్రెస్ పట్టభద్ర విద్యార్థి 1982–1987
రేబెకా హొవె కిర్స్టీ ఆల్లీ మానేజర్; వైట్రేస్ స్త్రీ వ్యాపారవేత్త; సూపరింటెన్డెన్ట్ 1987–1993
కార్లా టర్టేల్లీ రియా పెర్ల్మాన్ వైట్రేస్ గృహిణి 1982–1993
ఎర్నీ "కోచ్" పాంటుస్సో నికొలాస్ కొలసామ్ టో బార్‌టెన్డెర్ మాజి బేస్‌బాల్ ఆతగాడు మరియు శిక్షకుడు 1982–1985
"ఉడి" బాయ్ద్ ఉడి హారేల్సన్ సహాయ బార్‌టెన్డెర్[4] నటుడు; రాజకీయవేత్త 1985–1993
నాం పీటర్సన్ జార్జ్ వెండ్ వినియోగదారుడు అకౌంటంట్; ఇంటీరియర్ డెకరేటర్; హౌస్ పెయింటర్ 1982–1993
క్లిఫ్ క్లావిన్ జాన్ రాట్‌జెన్బెర్జేర్ వినియోగదారుడు పోస్టుమాను 1982–1993
ఫ్రాసియర్ క్రేన్ కేల్సీ గ్రేమర్ వినియోగదారుడు మానసిక వైద్యనిపుణుడు 1984–1993
లిలిత్ స్టేర్నిన్ బెబే న్యూవిర్త్ వినియోగదారుడు మానసిక వైద్య నిపుణుడు 1986–1993
దస్త్రం:Cheers cast photo.jpg
సీజన్ 7 తరువాత చీర్స్ లో ప్రధాన నటులు (ఎడమ నుంచి కుడి) : (పైన) జాన్ రాట్జెన్బెర్జేర్, రోగేర్ రీస్, వుడి హరేల్సన్ (మధ్యలో) రీ పెర్ల్‌మాన్, టెడ్ డాన్సన్, కిర్స్టీ అల్లే, జార్జ్ వెండ్ (అడుగున) కేల్సీ గ్రామేర్, బెబే న్యూవిర్త్.

సామ్ మలోన్ పాత్రను మొదట్లో రిటైర్ అయిన ఒక ఫుట్‌బాల్ ఆటగాడుగా రూపొందించారు. దీనిని ఫ్రెడ్ డ్రయర్ పోషించవలసి ఉంది. కాని ఈ పాత్రకు టెడ్ డాన్సన్‌ను ఎన్నుకున్న తరువాత, ఆ పాత్రను ఒక మాజి బేస్‌బాల్ ఆటగాడుగా రూపొందిస్తే నమ్మశక్యంగా ఉంటుందని నిర్ణయించారు. దీనికి కారణము, డాన్సన్‌ యొక్క సన్నటి శరీరం.[5] క్లిఫ్ క్లావిన్ పాత్ర జాన్ రాట్‌జెన్బెర్జెర్ కొరకు శ్రుష్టించబడింది. అయితే, మొదట్లో, అతను నార్మ్ పీటర్సన్ పాత్ర కొరకే ఆడిషన్ చేయబడ్డాడు. తరువాత నిర్మాతలతో మాటామంతిలో, "బార్ గురించి అన్ని తెలిసిన వ్యక్తి" పాత్ర ఏమైనా కథలో చేర్చాలని అనుకుంటున్నారా అని అతను అడిగాడు.[6] నార్మ్ పాత్ర జార్జ్ వెండ్‌కు ఇవ్వబడింది. షెల్లీ లాంగ్ మానేసిన తరువాత ఆ పాత్రలో కిర్స్టీ అల్లే‌ను చేర్చుకున్నారు. నికోలస్ కొలసన్టో మరణానంతరం వుడి హరేల్సన్ తారాగణంలో చేరాడు. ఈ సెరీస్‌లో ప్రతి ఎపిసోడ్‌లోనూ నటించిన నటులు డాన్సన్, వెండ్ మరియు రీ పెర్ల్‌మాన్ మాత్రమే.[7]

అతిథి తారలు[మార్చు]

చీర్స్ ప్రధానంగా ముఖ్య పాత్రల చుట్టే నడిచినా, అప్పుడప్పుడు అతిథి తారలు కథలో వచ్చేవారు. పలుమార్లు నటించిన అతిథి తారలలో ప్రముఖులు: ఎడ్డీ లేబెక్ గా జే థామస్, నిక్ టోర్టేల్లిగా డాన్ హేడయ, లోరెట్ట టోర్టేల్లిగా జీన్ కాసెం, రాబిన్ కొల్కార్డ్ గా రోజేర్ రీస్, ఇవాన్ డ్రేక్ గా టాం స్కేరిట్ మరియు హారి 'ది హ్యాట్' గిట్టేస్ గా హారి ఆండర్సన్. ఇతర ప్రముఖలు ఒక్క ఎపిసోడ్‌లో మాత్రమే అతిథి పాత్రలో వారిలాగే సిరీస్ అంతటా నటించారు. కొందరు బోస్టన్ లేక సామ్ యొక్క పూర్వపు సభ్యులయిన, థ రెడ్ సాక్స్ తో అనుబంధంగా లూయిస్ టియాన్ట్, వేడ్ బోగ్స్ మరియు కెవిన్ మెక్ హేల్ (బోస్టన్ సెల్టిక్స్ లో స్టార్ ఆటగాడు) వంటి క్రీడా ముఖ్యులు ఈ షోలో కనిపించారు.[8] ఎలెక్స్ ట్రెబెక్, ఆర్సీనియో హాల్, డిక్ కావెట్, రాబర్ట్ యూరిక్, మరియు జానీ కార్సన్ వంటి కొందరు టెలివిజన్ నటులు కూడా వారు వారిగానే అతిథి పాత్రలలో కనిపించారు. చీర్స్లో అప్పటిజాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయిన ఎడ్మిరల్ విలియం జే. క్రో, పూర్వపు కోలోరాడో సెనేటర్ గారీ హార్ట్, అప్పటి-స్పీకర్ ఆఫ్ థ హౌస్ టిప్ ఓ'నీల్, సెనేటర్ జాన్ కెర్రీ, అప్పటి-గవర్నర్ మైకేల్ డుకాకిస్, మరియు అప్పటి-మేయర్ ఆఫ్ బోస్టన్ రేమండ్ ఫ్లిన్ (ఇందులో ఆఖరి నలుగురూ చీర్స్ యొక్క స్వంత రాష్ట్రం మరియు నగరానికి ప్రతినిధులుగా వచ్చినవారు). సంగీతకారుడు హ్యారీ కొన్నిక్, జూనియర్ వూడీ యొక్క కసిన్ గా ఒక భాగంలో కనిపించి [9] అతని గ్రామీ అవార్డు పొందిన ఆల్బం అయిన వీ ఆర్ ఇన్ లవ్లో నుండి ఒక పాట పాడాడు. (c. 1991). జాన్ క్లీస్ ఒక ఎమ్మీని తన అతిథి పాత్ర అయిన "డా. సైమన్ ఫించ్-రాయిస్"కు ఐదవ సీజన్ భాగం అయిన, "సైమన్ సేస్"లో గెలుచుకున్నాడు.[10] ఎమ్మా థామ్సన్ అతిథి పాత్రలో నానీ జి/నానేట్ గుజ్మాన్, అనే ఒక ప్రసిద్ధ గాయని నానీ మరియు ప్రీమియర్ యొక్క పూర్వపు భార్యగా కూడా నటించింది. క్రిస్టోఫర్ లాయిడ్ డియేన్ ని చిత్రీకరించాలనే కోరిక కలిగిన, వేదనను అనుభవించిన ఒక కళాకారుడిగా అతిథి పాత్రను పోషించాడు. జాన్ మహొనీ ఒకసారి నైపుణ్యం లేని ఒక జింగిల్ పాత్రలో కనిపించి, అందులో ఒక క్లుప్తమైన సంభాషణ ఫ్రేసియర్ క్రేన్ తో జరిపినట్లుగా ఉంది. అతని తండ్రి పాత్రను తరువాత దశలో ఫ్రేసియర్ స్పిన్ ఆఫ్ లో చిత్రీకరించారు. పెరీ గిల్ పిన్ తరువాత రోజ్ డోయల్గా ఫ్రేసియర్ లో నటించి, చీర్స్ యొక్క మరొక భాగంలో కూడా కనిపించి, దాని పదకొండవ సీజన్ లో హొలీ మేత్సన్, అను రిపోర్టరు వూడీతో ముఖాముఖీ సంభాషణలో కనిపిస్తాడు. రైటియస్ బ్రదర్స్ అయిన, బాబీ హాట్ఫీల్డ్ మరియు బిల్ మెడ్లీ, కూడా వివిధ భాగాలలో అతిథి పాత్ర పోషించగా, మరియు కేట్ మల్గ్రూ ఆఖరి మూడు భాగాలలో, సీజన్ 4 భాగమైన స్త్రెంజ్ బెడ్ ఫెల్లోస్ అనే ధారావాహిక నామంతో ఉండి (3 భాగాలు) కలిగిన ధారావాహికలో నటించాడు. ఆఖరి భాగంలో, కిర్స్టీ ఆలీ రేబెకా పాత్రను, సాక్షాత్తు చీర్స్ నుండి రప్పించటానికి బీర్ కెగ్ టాప్ లను సరిచేసే ఒక వ్యక్తి ప్రయత్నం చేసినప్పటికీ – "ఉన్నత-స్థాయి" స్త్రీకి ఇది ఆశ్చర్యకరమైనప్పటికీ – అతను టాం బెరెంజర్ కావడంతో అలా జరిగింది.

పునరావృత పాత్రలు[మార్చు]

పాల్ విల్సన్, మరలమరల వచ్చే బార్ఫ్లై "పాల్" పాత్రను పోషించాక, అతను "గ్లెన్"గా తొలి ప్రదర్శనలు మొదటి సీసన్లోనే ఇచ్చి, "గ్రెగ్"గా పేరుపొంది, ఒక షోలో "టాం" అను పాత్రలో కూడా దర్శనమిచ్చాడు.[11] థామస్ బాబ్సన్ "టాం" పాత్ర పోషిస్తాడు. ఇది ఒక చట్ట విద్యార్థి పాత్ర. మసాచుసెట్స్ బార్ పరీక్షలో వరుసగా తప్పుతున్నాడని ఇతనిని "క్లిఫ్ క్లావిన్" తరచూ వెక్కిరిస్తూ ఉంటాడు. అల్ రోసేన్ పోషించిన "అల్" పాత్ర 38 ఎపిసోడ్‌లలో కనిపిస్తాడు. ఇతను కఠినమైన విమర్శలు చేస్తూ ఉంటాడు. రీ పెర్ల్‌మాన్ యొక్క తండ్రి అయిన ఫిలిప్ పెర్ల్మన్ "ఫిల్" పాత్ర పోషించాడు.

నిర్మాణం[మార్చు]

దీర్ఘ కాల ఆలోచన తరువాత చీర్స్ రూపొందించబడింది. ఒక కుటంబం లాగ వ్యవహరించే కొందరు కార్మికుల జీవితమే దీనికి కథ లాగా మొదట్లో అనుకున్నారు. ది మేరీ టైలెర్ మూర్ షో మాదిరిగా దీనిని రూపొందించాలని అనుకున్నారు. ఒక హోటల్ లో జరిగే బ్రిటిష్ ఫాల్టీ టవర్స్ ప్రోగ్రాం యొక్క అమెరికన్ వెర్షన్ ను రూపొందించాలని ఆలోచించారు. చివరకు ఒక బార్ లో జరిగుతున్నట్లు ఈ షోను రూపొందించినప్పుడు, ఇది డఫ్ఫీస్ టావెర్న్‌ అనే రేడియో షోను పోలినట్లు ఉండింది. బార్‌లో జరుతుగున్నట్లు చూపించడం వారికి నచ్చింది ఎందుకంటే, అక్కడ ఎప్పుడూ క్రొత్త వారు వస్తూ ఉంటారు, క్రొత్త పాత్రలు శ్రుష్టించుకోవచ్చు.[3]

బాస్టన్ lO బుల్ & ఫించ్ పబ్ యొక్క 2005 నాటి చిత్రం. ఈ దృశ్యం షో యొక్క ప్రారంభ సన్నివేశాన్ని పోలి ఉంటుంది.

ఈ బార్ సెట్టింగును ఎన్నుకొన్న తరువాత, ఆ ముగ్గురూ ఒక ప్రదేశాన్ని ఎన్నుకోవలసి వచ్చింది. ముందు బార్స్టో, కాలిఫోర్నియాను అనుకున్నారు తరువాత కన్సాస్ సిటీ, మిస్సౌరీను అనుకున్నారు.

చివరగా ఈస్ట్ కోస్ట్ మరియు బాస్టన్ వైపు మళ్ళారు. చీర్స్ వేదికగా ఉన్న బాస్టన్‌లో ఉన్న బుల్ & ఫించ్ పబ్‌ను ఒక ఫోన్ బుక్ నుంచి ఎన్నుకున్నారు.
ఆ బార్ యొక్క లోపలి మరియు బయట ద్రుశ్యాలను చిత్రీకరించి పంపమని గ్లెన్ చార్ల్స్ అడిగినప్పుడు, ఆ బార్ యజమాని ఒప్పుకొని $1 రుసుం తీసుకున్నాడు. ఆ తరువాత అతను పబ్‌ యొక్క ఇమేజ్‌ను లైసెన్స్ చేసి, చీర్స్‌కు సంబంధించిన వస్తువలను అమ్మడం ద్వారా మిలియన్లు సంపాదించాడు. 1997లో బుల్ & ఫించ్ పబ్ అమెరికా ఆహార మరియు పానీయాల పరిశ్రమలో 42వ స్థానానికి చేరింది. షెల్లీ లాంగ్‌ను (ఎ స్మాల్ సర్కిల్ అఫ్ ఫ్రెండ్స్ చిత్రీకరణ సమయములో బోస్టన్‌లో ఉన్నారు) నటవర్గంలో చేర్చుకునే సమయములో, కథలో వస్తున్న బార్ తాను బాస్టన్‌లో చూసిన ఒక బార్ మాదిరిగానే ఉందని లాంగ్ చెప్పారు. అది బుల్ & ఫించ్ బారే.[3]

పలు చీర్స్ ఎపిసోడ్‌లు సాధారణంగా మంగళవారము రాత్రులు పారమౌంట్ స్టేజ్ 25లో లైవ్ స్టూడియో ప్రేక్షకుల ముందు చిత్రీకరించబడ్డాయి. మరుసటి ఎపిసోడ్‌కు కావలసిన స్క్రిప్ట్‌లు ముందు బుధవారము చదవటం కొరకు ఇవ్వబడతాయి. శుక్రవారం రిహెర్సల్ రోజు. తుది స్క్రిప్ట్‌లు సోమవారం ఇవ్వబడతాయి. ప్రతి ఎపిసోడ్ చిత్రీకరణములో సుమారు 100 మంది పాల్గొంటారు. పలు ఎపిసోడ్‌లకు దర్శకత్వం వహించిన బర్రోస్, వీడియోటేప్‌లో కాకుండా ఫిల్మ్‌లోనే చిత్రీకరించాలని పట్టు పట్టుపడతాడు. అతను దర్శకత్వ శైలిలో ఎక్కువ కదిలికలను వాడుతూ ఉంటాడు. పాత్రలు ఒకే చోట నిలబడకుండా, ఎప్పుడూ కదులుతూ ఉంటారు.[3]

సిబ్బంది[మార్చు]

చీర్స్లో వందలాది సిబ్బంది పనిచేశారు. ఈ షోకు సంబంధించిన పలువురు సిబ్బంది యొక్క సంగ్రహము ఇక్కడ ఇవ్వబడింది. ఈ షో యొక్క ముగ్గురు సృష్టికర్తలు - జేమ్స్ బర్రోస్, గ్లెన్ చార్లెస్, మరియు లెస్ చార్లెస్[12] - వీరి కార్యాలయాలు చీర్స్ నడిచినంత కాలము పారమౌంట్ లోనే ఉండేవి. అయితే, ఆఖరి సీజన్‌లలో వారు షో యొక్క బాధ్యతలను చాలా వరకు బర్రోస్‌కు అప్పచెప్పేశారు. ఈ షో ఇంత దీర్ఘకాలము నడవడానికి బర్రోస్ ఒక కారణము. ఈయిన 243 ఎపిసోడ్‌లకు దర్శకత్వం వహించి, షో యొక్క నిర్మాణాన్ని పర్యవేక్షించాడు.[3] డేవిడ్ ఏంజెల్, పలు చీర్స్ ఎపిసోడ్‌లను వ్రాసి, ముందునుండే ఈ షోలో భాగంగా ఉన్నాడు. ఈ షో కథ వ్రాయబడిన విధానానికి పేరొందింది.[3][13] నిర్మాణం, ఎన్సెంబిల్ తారాగణం వంటి అంశాలతో పాటు ఇది కూడా షో యొక్క విజయానికి కారణమని పలువురి అభిప్రాయం.

పురస్కారాలు[మార్చు]

ఈ షో ప్రసారం అయిన పదకొండు సీజన్లలో, చీర్స్, దానిలో నటించిన తారాగణం మరియు సిబ్బంది పలు పురస్కారాలు అందుకున్నారు. చీర్స్ రికార్డ్ స్థాయిలో 111 ఎమ్మి అవార్డు ప్రతిపాదనలు అందుకొని, 26 అవార్డులు గెలుచుకుంది.[14] అంతే కాక, 31 గోల్డెన్ గ్లోబ్ ప్రతిపాదనలు అందుకొని, వాటిలో 6 అవార్డులు గెలుచుకుంది.{2/} డాన్సన్, లాంగ్, అల్లే, పేర్ల్మాన్, వెండ్, రాట్జెన్బెర్జేర్, హర్రెల్సన్, గ్రామెర్, న్యూవిర్త్ మరియు కోలోసంటో, తమ పాత్రలకు ఎమ్మి ప్రతిపాదనలు అందుకున్నారు. "ఉత్తమ TV సిరీస్ - హాస్యం/సంగీతం"కు గోల్డన్ గ్లోబ్ పురస్కారాన్ని 1991లో చీర్స్ గెలుచుకుంది. 1983, 1984, 1989 మరియు 1991 లలో "అత్యుత్తమ కామెడీ సిరీస్"గా ఎమ్మి పురస్కారాన్ని గెలుచుకుంది. 2006 TV ల్యాండ్ అవార్డ్స్‌లో చీర్స్‌కు "లెజెండ్ అవార్డ్" బహుకరించబడింది. ఆ షోలో నటించిన పలు నటులలో ఆ సమయములో జీవించి ఉన్నవారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.[15]

చీర్స్‌ నటీగణం మరియు సిబ్బంది గెలుచుకున్న అవార్డులు క్రింద ఇవ్వబడింది.[10]

పురస్కారం
కిర్స్టీ అల్లే ఎమ్మి, కామెడీ సిరీస్‌లో అత్యుత్తమ ప్రధాన నటీమణి (1991)
గోల్డెన్ గ్లోబ్, కామెడీ -సంగీతప్రధాన TV-సిరీస్‌లో ఉత్తమ ప్రదర్శన చూపిన నటీమణి (1991)
టెడ్ డాన్సన్ ఎమ్మి, కామెడీ సీరీస్‌లో అత్యుత్తమ ప్రధాన నటుడు (1990, 1993)
గోల్డెన్ గ్లోబ్, కామెడీ -సంగీతప్రధాన TV-సిరీస్‌లో ఉత్తమ ప్రదర్శన చూపిన నటుడు (1990, 1991)
వుడి హరేల్సన్ ఎమ్మి, కామెడీ సీరీస్‌లో అత్యుత్తమ సహాయ నటుడు (1990, 1989)
షెల్లీ లాంగ్ ఎమ్మి, కామెడీ సీరీస్‌లో అత్యుత్తమ ప్రధాన నతీమణి (1983)
గోల్డెన్ గ్లోబ్, కామెడీ -సంగీతప్రధాన TV-సిరీస్‌లో ఉత్తమ ప్రదర్శన చూపిన నటీమణి (1985)
గోల్డెన్ గ్లోబ్, సిరీస్, మీని సిరీస్ లేదా TV కొరకు తీయబడిన చలనచిత్రంలో సహాయ పాత్రలో ఉత్తమ ప్రదర్శన చూపిన నటీమణి (1983)
బెబ్ న్యూవిర్త్ ఎమ్మి, కామెడీ సీరీస్‌లో అత్యుత్తమ సహాయ నటీమణి (1990, 1991)
రీ పెర్ల్‌మాన్ ఎమ్మి, కామెడీ సీరీస్‌లో అత్యుత్తమ సహాయ నటీమణి (1984, 1985, 1986, 1989)
జాన్ క్లీస్ ఎమ్మి, కామడీ సిరీస్‌లో అత్యుత్తమ అతిథి నటుడు (1987)
నిర్మాణం కొరకు అవార్డులు ఎమ్మి, కామడీ సిరీస్‌లో అత్యుత్తమ దర్శకత్వం (1983, 1991)
ఎమ్మి, కామడీ సిరీస్‌లో అత్యుత్తమ రచన (1983, 1984)
ఎమ్మి, గ్రాఫిక్ డిజైన్ మరియు టైటిల్ సీక్వన్స్‌లలో అత్యుత్తమ వ్కక్తిగత సాధన (1983)
ఎమ్మి, సెరీస్‌లో అత్యుత్తమ ఫిలిం ఎడిటింగ్ (1984)
ఎమ్మి, సీరీస్‌లో అత్యుత్తమ ఎడిటింగ్ – మల్టీ-కెమెరా నిర్మాణం (1988, 1993)
ఎమ్మి, సీరీస్‌లో అత్యుత్తమ లైవ్ మరియు టేప్ సౌండ్ మిక్సింగ్ మరియ సౌండ్ ఎఫెక్ట్స్ (1985)
ఎమ్మి, కామడీ సిరీస్‌లో లేదా విశేష కార్యక్రమంలో అత్యుత్తమ సౌండ్ మిక్సింగ్ (1986, 1987, 1990)

కథాంశం[మార్చు]

చీర్స్‌లో దాదాపు మొత్తం సంఘటనలు బార్ యొక్క ముందు గదిలో జరిగాయి. అయితే, వారు తరచూ, చివరిలో ఉన్న పూల్ గదికి లేదా బార్ కార్యాలయంలోకి వెళ్తూ ఉన్నారు. చీర్స్‌లో రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్ వరకు కూడా బార్‌కు బయట సంఘటనలు జరిగేవి కావు. ఆ ఎపిసోడ్‌లో సంఘటనలు డయన్ అపార్ట్‌మెంట్‌లో జరుగుతాయి. చీర్స్‌లో కొన్ని గాగ్‌లు వస్తునూనే ఉంటాయి. నార్మ్ బార్‌లోకి రాగానే, "నార్మ్!" అని బిగ్గరగా ఆహ్వానిస్తారు. సామ్ కు వివిధ స్త్రీలతో ఉన్న సంబంధాలు, అతని వ్యవహారాలు, చేష్టలు గురించే ముందరి ఎపిసోడ్లలలో ఎక్కువగా ఉండేవి. ప్రతి ఎపిసోడ్‌లో రొమాంటిక్ కామెడీ క్లీషేలను అనుసరించి ఇబ్బందులనుంచి బయటపడుతూ ఉంటాడు. తరువాత ఎపిసోడ్‌లలో, సామ్ ముఖ్యమైన సంబంధాలు పెట్టుకోవడంతో, కథ కామెడీ వైపు తిరిగి, సామ్ ఒకరిని వివాహం చేసుకొని స్థిరపడే విధంగా మారింది. సిరీస్ అంతటా, పెద్ద కథాంశాలు కలిగిన పలు ఎపిసోడ్‌లు వచ్చే విధంగా అలాగే మధ్య మధ్య హాస్య కథాంశాలతో ఒకే ఎపిసోడ్‌లో అయిపోయే విధంగా ఉండేది.[ఉల్లేఖన అవసరం]

ప్రేమ వ్యవహారం[మార్చు]

దస్త్రం:Cheers sam diane kiss.jpg
సామ్, డయాన్ ముద్దు

ముందరి సీజన్లలో ఈ షో యొక్క ప్రధాన కథాంశం ఏమంటే, వివేచనాత్మక వైట్రెస్ డయన్ చాంబెర్స్ కు బార్ యజమాని సామ్ మలోన్ కు మధ్య సాగే ప్రేమ వ్యవహారమే. సామ్ బోస్టన్ రెడ్ సాక్స్‌లో ఒక మాజీ లీగ్ బేస్‌బాల్ పిచర్. ఇతను కోలుకుంటున్న ఒక త్రాగుబోతు కూడా.[16] షో నుంచి లాంగ్ వైదొలిగిన తరువాత, సామ్ మరియు న్యూరోటిక్ అయిన రెబెకా మధ్య ఏర్పడిన క్రొత్త సంబంధం గురించి కథ మళ్ళింది. ఈ రెండు ప్రేమ వ్యవహరాలు పలు-ఎపిసోడ్‌లు సాగింది. "వారు చేస్తారా, చేయరా" అనేది ప్రశ్నార్ధకంగా మారి శృంగార ఒత్తిడి ఏర్పడి, ఎక్కువ ప్రేక్షకులను ఆకర్షించింది.[ఉల్లేఖన అవసరం]

సామ్ ఘిక వివాదాలు[మార్చు]

పలు చీర్స్ కథాంశాలు వివిధ వివాదాస్పదమైన సాంఘిక అంశాలు చుట్టూ కథ తిరుగుతూ ఉండేది. అయితే, వాటిలో హాస్యమే ప్రధానంగా ఉండేది. టోస్టింగ్ చీర్స్‌లో ఈ విధంగా వ్రాశారు: "త్రాగుబోతుతనం, స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధం వంటి వివాదాస్పద అంశాలాను విజయవంతంగా ఎదుర్కొన్న రచయిత యొక్క ధైర్యం మూలాన కథ మరింత బలపడింది."[3]

సాంఘిక వర్గం, ఈ షో యొక్క ఉప అంశంగా ఉండేది. డయాన్ చాంబెర్స్, ఫ్రాసియర్ క్రేన్, లిలిత్ స్టేర్నిన్ మరియు (మొదట్లో) రెబెకా హొవే వంటి "ఉన్నత వర్గానికి" చెందిన వారు సామ్ మలోన్, కార్లా టోర్టెల్లి, నార్మ్ పీటర్సన్ మరియు క్లిఫ్ క్లావిన్ వంటి మధ్యతరగతి మరియు కార్మిక వర్గానికి చెందిన వారితో పరిచయం పెంచుకోవడమే ఈ కథ. దీనికి ఒక ఉదాహరణ - వూడి బాయ్డ్ మరియు మిలియనేర్ కూతురైన కెల్లి గైన్స్‌కు మధ్య ఎర్పడుతున్న సంబంధం. కథాగమనంతో పాటు పాత్రల అభివృద్ధి అంశం చీర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.[3][13]

ఈ షో అంతటా కనిపించిన మరో అంశం, ఫెమినిజం మరియ మహిళల పాత్ర. ప్రతి ప్రధాన స్త్రీ పాత్రను ఏవో కొన్ని లోపాలు ఉన్న ఫెమినిస్ట్ గా చిత్రీకరించబడింది.[17] డయాన్ తన అభిప్రాయాలని గట్టిగా బయటకు చెప్పుకుంటున్న ఒక ఫెమినిస్ట్ అయితే, ఆమె ద్వేషించేవి అన్ని కలిగి ఉన్న వ్యక్తి సామ్. అతను ఒక ఉమనైజర్ మరియు పురుష అహంకారి కూడా. వారి ఇరువురి మధ్య సంబంధాల వలన, సామ్ పలువురు ఆడవారితో సంబంధాలు పెట్టుకోవడం గురించి డయాన్ అతన్ని తిడుతూ ఉంటుంది. కార్లా ప్రజలను అవమానపరుస్తూ ఉండేది.[3] కార్లా యొక్క కఠిన వైఖరి మూలంగా, ఆమె మీద గౌరవం చూపేవారు. అయితే, డయాన్‌ను పట్టించుకొనేవారు కాదు. ఆమె మీద గౌరవం చూపేవారు కాదు. రెబెకా అత్యాశ కలిగిన ఒక వ్యాపారవేత్త మరియు ఒక గోల్డ్‌డిగ్గర్. లిలియన్ కార్పరేషన్‌లో తన పై అధికారులతో, ముఖ్యంగా, ఇవాన్ డ్రేక్‌తో, పదోన్నతి కొరకు, జీతం పెంచుకోవడం కొరకు సంబంధాలు పెట్టుకొనేది. అయితే, ఆమె ఒక గాజు కప్పును చూసి మోసపోయి, ఒక ధనవంత వ్యాపారవేత్తకు బదులుగా ఒక ప్లంబర్‌ను పెళ్ళి చేసుకుంటుంది. ఆమె భర్త తరువాత ధనవంతుడయి, ఆమెని వదిలేస్తే, రెబెకా చీర్స్‌కు పేట్రన్‌గా వస్తుందని ఫ్రేసియర్‌లో చెప్పబడింది. లిలిత్ ఒక ప్రముఖ మానసిక వైద్యురాలు. పలు డిగ్రీలు, అవార్డులు కలిగి ఉండి, గట్టిగా వ్యవహరించి అందరి మర్యాదను పొందిన మహిళ. రెబెకా మాదిరిగానే, ఆమె కూడా 1980లకు చెందిన ఒక అధికారి. ఆమె కూడా తన వృత్తి మీద ఎక్కువ శ్రద్ధ చూపేది. ఫ్రేసియర్‌‌తో సంబంధములో అమెదే పై చేయని చూపించేవారు. ఒక ఐస్ క్వీన్‌గా ఆమెను చూపించినా, ఎక్కువ లిబిడో కలిగిన, భావపూరితంగా ఒక తల్లి మనస్తత్వం కలిగి ఉన్న వ్యక్తి లాగా చూపించబడింది.[ఉల్లేఖన అవసరం]

మొట్ట మొదటి సీజన్ నుండే, స్వలింగ సంపర్గం గురించి చెప్పబడింది. 1980ల ప్రారంభములో అమెరికన్ నెట్వర్క్ టెలివిజన్‌‌కు ఇది అరుదు.[ఉల్లేఖన అవసరం] "ది బాయ్స్ ఇన్ ది బార్" అనే మొదటి సీజన్ ఎపిసోడ్‌లో, (ది బాయ్స్ ఇన్ ది బ్యాండ్ ) అనే 1970ల చిత్రం పేరును పోలి), సామ్ స్నేహితుడు మరియు మాజీ టీంమేట్ తన స్వీయచరిత్రలో బయటపడతాడు. చీర్స్ ఒక గే బార్ లాగా తయారుకాకుండా చూడమని బార్‌కు క్రమంగా వచ్చే కొందరు మగవాళ్ళు సామ్ ను ఒత్తిడి చేస్తారు. ఈ ఎపిసోడ్ GLAAD మీడియా అవార్డును గెలిచింది.[7] ఈ ఎపిసోడ్‌ రచయితలైన కెన్ లెవిన్ మరియు డేవిడ్ ఇసాక్స్ లు ఎమ్మి అవార్డ్ లు ప్రతిపాదించబడ్డారు.[10] తరువాత 1990లలో, హై స్కూల్‌లో రెబెకా ప్రెమించిన "మార్క్ న్యూబెర్జేర్" అనె పాత్రలో హర్వీ ఫియర్‌స్టీన్ కనిపిస్తాడు. అతను ఒక స్వలింగ సంపర్గి. చివరిలో, తుది ఎపిసోడ్‌లో ఒక స్వలింగ సంపర్గి పాత్ర ఉంటుంది. ఇతను డయాన్ భర్త లాగా నటించడానికి ఒప్పుకోవడంతో, ఇతనికి అతడి మగ స్నెహితుడుకు (అన్తోనీ హీల్ద్ పొషించిన పాత్ర), విభేదాలు వస్థాయి.[ఉల్లేఖన అవసరం]

చీర్స్‌లో చోటు చేసుకున్న మరొక అంశం, తాగుడు వ్యసనం. ఈ అంశం కేవలం సామ్ ద్వారానే చూపబడుతుంది. అయితే, ఈ అంశానికి పూర్తిగా న్యాయం చేయలేదని కొందరు విమర్శకులు భావిస్తున్నారు.[18] త్రాగుబోతైన సామ్ తన వ్యసనము నుండి కోలుకుంటున్న సమయములో, ఒక బార్‌ను కొంటాడు. తరువాత, పూర్తిగా కొలుకున్న తరువాత, "రసస్పూరిత కారణాల" వలన ఆ బార్‌ను నడపాలని నిర్ణయిస్తాడు. IMDb ప్లాట్ సమ్మరి అఫ్ చీర్స్</ref> "ది ట్రయాంగిల్" అనే నాల్గవ ఎపిసోడ్‌లో, ఫ్రేసియర్ కూడా త్రాగుతూ కనిపిస్తాడు. ఏడవ సీజన్లో "కాల్ మీ ఇర్రేస్పాన్సిబిల్" అనే ఎపిసోడ్‌లో ఉడి జూదమాడి సమస్యలో ఇరుక్కుంటాడు. సామ్ సాధారణంగా ఒక వ్యసనాలకు బానిసయ్యే వ్యక్తి అని, త్రాగుడు వ్యసనం నుండి బయట పడ్డాడు కాని అప్పటికీ కామ వ్యసనముకు లోనయ్యే ఉంటాడు. ఆడవాళ్ళతో అతను ఎక్కువ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటాడు. ఎట్టుకేలకు దీనికి అతను సహాయం తీసుకుంటాడు. నార్మ్ యొక్క త్రాగుడు అలవాటుకు (ఇతని బార్ టాబ్‌ను NASA తయారు చేసిందని చెప్పబడింది) షోలో పెద్ద ప్రాముఖ్యత ఇవ్వబడలేదు.[ఉల్లేఖన అవసరం]

చీర్స్ యజమానులు[మార్చు]

2005లో చీర్స్ సైన్.

1889 లోనే బార్ స్థాపించబడింది కనుక, సామ్ కు ముందు చీర్స్‌కు వివిధ యజమానులు ఉండేవారు. (బార్‌ యొక్క సైన్‌లో కనబడే "Est. 1895" అనే పదాలను కార్లా ఎన్నుకుంది. దీనిని సంఖ్యాశాస్త్రమును బట్టి ఎన్నుకున్నట్లు 8వ సీజన్లో "ది స్టార్క్ బ్రింగ్స్ ఎ క్రేన్" అనే ఎపిసోడ్‌లో చెప్పబడింది.) మూడవ ఎపిసోడైన "సామ్ స్ విమెన్"లో, చీర్స్ యజమాని కోసం చూస్తున్న ఒక కస్టమర్‌కు నార్మ్ ఈ విధంగా చెపుతాడు. అతను యజమాని అని అనుకుంటున్న వ్యక్తి మారిపోయాడని, అలాగ మారిపోయిన వ్యక్తి స్థానములో, సామ్ ఉన్నాడని నార్మ్ చెపుతాడు. సామ్ కు బార్‌ను అమ్మిన గస్ ఓ"మాలి ఒక తరువాయి ఎపొసోడ్‌లో అరిజొనా నుంచి తిరిగి వచ్చి, ఒక రాత్రికి బార్‌ను నడపడానికి సహాయం చేస్తాడు.[ఉల్లేఖన అవసరం]

చీర్స్ యజమాన్యము గురిచిన కథాంశాలు "ఐ డూ, అడియూ" అనే ఐదవ సీజన్ ఆఖరి ఎపిసోడ్‌లో మొదలవుతుంది. సామ్, డయాన్ విడి పోతారు, షెల్లీ లాంగ్ షో నుంచి వెళ్లిపోతుంది, సామ్ భూమిని చుట్టూ తిరుగడానికి వెళ్లిపోతాడు. వెళ్లిపోయే ముందు, చీర్స్‌ను లిలియన్ కార్పరేషన్‌కు సామ్ అమ్ముతాడు. పడవ మునిగి పోవడంతో, "హోమ్ ఈస్ ది సైలర్" ఆరవ సీజన్ ప్రీమియర్‌లో సామ్ తిరిగి వస్తాడు. అప్పుడు రెబెకా హొవే యొక్క క్రొత్త యాజమాన్యం క్రింద బార్ ఉంటుంది. అతను తన ఉద్యోగం తిరిగి ఇవ్వమని బ్రతిమాలుతాడు. రెబెకా అతనికి బార్‌టెండెర్ ఉద్యోగం ఇస్తుంది. "హౌ టు రిసీడ్ ఇన్ బిసనస్" అనే ఏడవ సీజన్ ప్రీమియర్‌లో, రెబెకాను తొలగించి సామ్ కు మేనేజర్‌గా పదోన్నది లభిస్తుంది.

రెబెకాకు అంతకు ముందు ఆమె చేస్తున్న ఉద్యోగము వంటి ఒక ఉద్యోగము ఇవ్వబడుతుంది. అయితే, దానికి ముందు, సామ్ మరియు రెబెకా ఇరువురూ కార్పరేషన్ అడిగిన అనేక కోరికలకు "ఒప్పుకోవలసి" (ఇన్ అబ్సేన్షియా) వచ్చింది.[ఉల్లేఖన అవసరం]

అప్పటినుంచి, బార్‌ను తిరిగి కొనడానికి సామ్ కొన్నిసార్లు ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నాలలో, రాబిన్ కల్కర్డ్ అనే ఒక ధనవంత అధికారిని ఇరికిస్తాడు. ఎట్టకేలకు, ఎనిమిదో సీజన్ ఆఖరిలో ఆ బార్ సామ్ చేతికి తిరిగి వస్తుంది. కోల్కార్డ్ యొక్క ఇంసైడర్ ట్రేడింగ్ గురించి లిలియన్ కార్పరేషన్‌కు సామ్ ముందుగానే సమాహారం ఇవ్వడంతో, వారు ఎనభై-ఐదు సెంట్ లకు ఆ బార్‌ను తిరిగి సామ్ కే అమ్మేస్తారు. ఈ విషయం తెలిసి కూడా కంపెనీకి చెప్పకపోవడంతో, రెబెకాని ఉద్యోగమునుంచి తొలిగిస్తారు. తరువాత రెబెకా సామ్ దగ్గర అతిథి/కార్యాలయ మెనేజర్‌గా ఉద్యోగం సంపాదిస్తుంది.[ఉల్లేఖన అవసరం]

తరచూ చొటు చేసుకున్న ఇతర అంశాలు[మార్చు]

సీరీస్ మొత్తము వచ్చిన ముఖ్య కథాంశము కాకుండా, ఏ కథావస్తువు కూడా లేకుండానే అనేక కథాంశాలు సెరీస్ అంతట తిరిగి తిరిగి చీర్స్లో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. చీర్స్‌కు గారీ యొక్క ఒల్దె టౌనే టావెర్న్‌కు మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. ఈ అంశం నాల్గవ సీజన్ ఎపిసోడ్ అయిన "ఫ్రం బీర్ టు ఎటర్నిటీ" నుంచి చూపబడుతుంది. సామ్, గ్యారీలకు మధ్య ఏదో ఒక గొడవను ఆరవ సీజన్ నుంచి ఒక ఎపిసోడ్‌లో చూపుతూ వచ్చారు. ఇది ఒక క్రీడా పోటీ లేదా ఏదో ఒక పోటీ ఏర్పడి సంక్లిష్టమైన ప్రాక్టికల్ చతురోక్తులతో ముగిసేది. మొట్ట మొదటి మరియు ఆఖరి "బార్ వార్స్" ఎపిసోడ్‌లు తప్ప, చీర్స్ గ్యాంగ్ గారి యొక్క తెలివితేటల ముందు ఎప్పుడు ఓడిపోతూ ఉంటారు. ఒక ఎపిసోడ్‌లో మాత్రం వార్షిక బ్లడి మేరి పోటీలో పాల్గొనకుండా గ్యారిని తెలివిగా తప్పించగలిగారు. మరొక ఎపిసోడ్‌లో ఒక ప్రాక్టికల్ జోకులో, తన సహ-ఉద్యోగుల పై పగ తీర్చుకోవడానికోసం, సామ్ గ్యారితో చేతులు కలుపుతాడు. బార్‌కు పై అంతస్తులో ఉన్న మేల్విల్లెస్ ఫైన్ సీ ఫుడ్ అనే ఒక అధునిక రెస్టారంట్ యాజమాన్యంతో చాలా కాలంగా గొడవ ఉండెది. రెస్టారంట్ యాజమాన్యం బార్‌కు వచ్కే వారంటే అయిష్టంగా ఉండేవారు. ఆ రెస్టారంట్ ఒక గర్వము, అహంకారంతో కూడినదని సామ్ అభిప్రాయం. ప్రధాన మెట్ల ద్వారా కస్టమర్లు ఈ రెండు వ్యాపారాల మధ్య తిరిగేవారు. జాన్ అల్లెన్ హిల్ (కీన్ కర్టిస్) మేల్విల్లెస్ కు యజమాని అయిన తరువాత ఈ గొడవ ముదిరింది. వాస్తవానికి బార్ యొక్క పూల్‌రూంలు, బాత్‌రూంలు సామ్ స్వంతం కాదు. తరువాత సామ్ వాటికి అద్దె కట్టవలసి వచ్చింది. హిల్ దౌర్జన్యం చేస్తూ ఉంటే, సామ్ చాలా ఇబ్బందులు పడేవాడు. హిల్ నుంచి ఆ వెనుక భాగాన్ని కొనడానికి సామ్ కు రెబెకా సహాయం చేస్తుంది.[19]

నార్మ్ పీటర్సన్ అకౌంటంట్ ఉద్యోగం కొరకు అన్వేషిస్తూ ఉంటాడు. కాని సీరీస్‌లో చాలా భాగము నిరుద్యోగిగా గడుపుతాడు. దీని వలన, చీర్స్‌లో అదే స్టూల్ పైనే ఎప్పుడు కనిపిస్తూ ఉంటాడు. అతని భార్య వెరా ముఖం తెర పై ఎప్పుడు పూర్తిగా చూపబడలేదు. కొన్నిసార్లు కొన్ని క్షణాలు మాత్రమే కనిపించేది. రెండు సార్లు, స్వరం వినిపించింది. "థాంక్స్‌గివింగ్ ఆర్ఫన్స్" అనే ఐదవ సీజన్ ఎపిసోడ్‌లో మొదటి సారి ఆమె కొద్ది క్షణాలు కనిపిస్తుంది. అప్పుడు, ఆమె ముఖం కేక్‌ పూయబడి ఉంటుంది. క్లిఫ్ఫ్ క్లావిన్, తన తల్లి ఎస్తేర్ క్లావిన్ (ఫ్రాన్సిస్ స్టెర్న్‌హగెన్) నీడలోనే ఎప్పుడు ఉంటాడు. ఆమె ప్రతి ఎపిసోడ్‌లోనూ కనిపించకపోయినా, ఆమె గురించి తరచూ అతను మాట్లాడుతూ ఉంటాడు. ఆమెను ఒక భారమైన భావాలు కలిగిన మరియు స్వేచ్ఛకు అడ్డు వస్తున్న తల్లి గానూ వర్ణిస్తూ ఉంటాడు. ఐదవ సీజన్‌లోనే ఆమె మొదటి సారిగా కనిపిస్తుంది. కార్లా టోర్టెల్లి, ఎక్కువ సారముగల ఆడది గాను అదే సమయములో వివాహబంధానికి సరిపడని మహిళగానూ చిత్రీకరించబడింది. షోలో ఆమె చివరి భర్త, ఎడ్డీ లేబెక్ ఒక కాలం చెల్లిన ఐస్ హాకి గోల్‌టెన్‌డెర్. అతను జంబోనితో జరిగిన ఒక ఐస్ షో ప్రమాదంలో చనిపోతాడు. ఎడ్డీ తనను మోసం చేసినట్లు, మరొక మహిళను గర్భం ధరించేలాగా చేసి తరువాత ఆమెను పెళ్ళి చేసుకుంటాడని తరువాత కార్లాకు తెలుస్తుంది. కార్లా యొక్క నీతిలేని మొదటి భర్త నిక్ టోర్టేల్లి (డాన్ హెడయ) కూడా తరచూ తెరపై కనిపిస్తూ ఉంటాడు. వారి విడాకులు అయిన తరువాత కూడా, కస్టడి కొరకు కొత్త దావాలు, మోసాలు చేస్తూ కార్లాను రకరకాలుగా హింసిస్తూ ఉంటాడు. కార్లాకు పుట్టిన ఎనిమిది పిల్లలు (నలుగురు షో జరుగుతున్న కాలములో "పుట్టారు") కూడా, లుడ్ తప్ప, దుష్ప్రవర్తన కలిగిన వారు. లుడ్ ఒక ప్రముఖ విద్యావేత్తకు పెట్టిన బిడ్డ.[ఉల్లేఖన అవసరం]

విమర్శనాత్మక ప్రతిస్పందన[మార్చు]

మొదటి సీజన్లో చీర్స్ విమర్శకుల మెప్పు పొందినా, ఆ సంవత్సరపు రేటింగులలో మొత్తం 74 షోలకు గాను 74వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది.[20]

ఈ విధమైన విమర్శకుల ఆదరణ, ఎమ్మి పురస్కారాలలో ప్రారంభ విజయాలు, NBC వినోదాల విభాగం అధ్యక్షుడు బ్రాండన్ టార్టికోఫ యొక్క ఆదరణం వంటి అంశాలే ఈ షో యొక్క తరువాయి విజయానికి ముఖ్య కారణాలు.[14][21] షో మొదటి సీజన్ అనంతరం, సిరీస్ ప్రచారం కొరకు షోలో నటించిన తారాగణం, వివిధ టాక్ షోలలో పాల్గొనడానికి దేశమంతట పర్యటనలు చేశారు. జనవరి 1984 నుంచి 1987 వరకు చీర్స్ ప్రసారం అయ్యే సమయానికి ముందు ప్రసారం అయిన ఫ్యామిలీ టైస్ బాగా ఆదరణ పొందింది. తరువాత ఫ్యామిలీ టైస్ ఆదివారానికి మార్చబడి, దాని స్థానే, ది కస్బి షో ప్రసారం చేయబడింది. ఆ తరువాత నుంచి ఈ షో అధ్బుత విజయం సాధించిన అత్యుత్తమ రేటింగ్ పొందడంతో, NBC ఈ షోను "మస్ట్ సీ తర్స్డే"గా పెర్కుంది. మరుసటి సీజన్‌లో ఉడి బాయ్ద్ కూడా తారాగణంలో చేరిన తరువాత, చీర్స్ రేటింగ్ గణనీయంగా పెరిగింది. చీర్స్ ఆఖరి సీజన్‌కు చేరుకునే సమయానికి, నీల్సెన్ రేటింగులలో టాప్ టెన్ లో వరుసగా ఎనిమిది సార్లు చోటు సంపాదించింది.[3] కొందరు విమర్శకులు ఫ్రాసియర్ మరియు చీర్స్ లను, అప్పటికే వియవంతమైన ఒక సిరీస్ నుంచి విజయవంతంగా స్పిన్-ఆఫ్ చేయబడిన ఒక పాత్రకు మంచి ఉదాహరణ లాగా చెపుతారు.

చీర్స్ ప్రారంభమయినప్పుడు టెడ్ డాన్సన్, షెల్లీ లాంగ్, రీ పెర్ల్‌మాన్, నికోలస్ కొలసన్టో మరియు జార్జ్ వెండ్ అనే ఐదుగురుతో కూడిన ఒక ఎన్సేమ్బిల్ తారాగణం మాత్రమే ఉండేది.

10వ సీజన్ మొదలయే సరికి, చీర్స్ లో 8 ప్రధాన పాత్రలు ఉన్నాయి. చీర్స్‌లో చెప్పుకోదగిన విషయం ఏమనగా, క్లిఫ్, ఫ్రాసియర్, లిలిత్, రెబెకా, ఉడి వంటి పాత్రలను క్రమంగా కథలో ప్రవేశపెట్టడమే. 1వ సీజన్‌లో, ఒకే ఒక సెట్ అంటే బార్ లోనే మాత్రమే అన్ని ఎపిసోడ్‌లు జరిగేవి. తరువాత సీజన్లలో, ఇతర సెట్‌లు ప్రవేశపెట్టపబడినా, ముఖ్య కథాంశాలు అన్ని బార్లోనే జరిగే విధంగా షో ఉండడం గమనార్గం.

చీర్స్ ఆఖరి ఎపిసోడ్‌ను ఒక పూర్తి రాత్రి కేటాయించబడింది. ఒక-గంట సేపు వ్యవది కలిగిన సీంఫెల్డ్ (అప్పట్లో ప్రధాన సీరీస్) యొక్క సీజన్ ఆఖరి ఎపిసోడ్‌ను పోలి ఇది ఉంది. బాబ్ కోస్టాస్ నిర్వహించిన ఒక "ప్రీగేమ్" షోతొ ఈ షో మొదలయి, తరువాత 98-నిమిషాల పాటు ఆఖరి ఎపొసోడ్ జరిగింది. ఆ సమయములో, NBC వారు తమ స్థానిక వార్తాప్రసరాలలో, చీర్స్ గురించి వార్త ప్రసారం చేశారు . ఆ రాత్రి, టునైట్ షో అనే ఒక విశేష కార్యక్రమాన్ని బుల్ & ఫించ్ పబ్. నుంచి లైవ్ గా ప్రసారం చేశారు. అత్యధిక మంది వీక్షించిన టెలివిజన్ ఎపిసోడ్ గా ఈ ఎపిసోడ్ రేటింగ్ సాధించక పోయినా, అది ఆ సంవత్సరములో అత్యదిక మంది వీక్షించిన టెలివిజన్ షోగా నిలిచింది. 80.4 మిలియను మంది ఈ షోను వీక్షించారు.[22] (అ రాత్రి టెలివిజన్ చూసిన మొత్తం జనములో 64% మంది). అన్ని కాలానికి వినోద కార్యక్రమాలలో 11వ స్థానంలో ఉంది. ఈ ఎపిసోడ్ చీర్స్ ఎప్పుడు ప్రసారం అయే గురువారం రాత్రి ప్రసారం అయింది. తరువాత ఆదివారం పునఃప్రసారం చేయబడింది. ముదట ప్ర్తసారం అయిన ఎపొసోడ్ M*A*S*H ఆఖరి ఎపిసోడ్‌ను మించలేదని కొందరు అంచనా వేసినా, గురువారం మరియు ఆదివారం ప్రసారణలు కలిపితే దాటి పోయింది. M*A*S*H మరియు చీర్స్ ఆఖరి ఎపిసోడ్‌లు ప్రసారం చేయబడిన సమయాలలో టెలివిజన్‌లో భారీ మార్పులు వచ్చాయని, అందువలన చీర్స్ కు పోటి ఎక్కువగా ఉందని టోస్టింగ్ చీర్స్ పేర్కుంది.[3]

రేటింగులు[మార్చు]

సీజన్ రేటింగు రాంక్ ప్రెక్షకులు (అంచనా)
(మిలియన్లలో)
1982–1983 #71[3] వర్తించదు
1983–1984 #34 [23] 16.64
1984–1985 #13[3] 16.72
(1985–1986) === #5[3][24] 20.35[24]
1986–1987 #3[3][25] 23.77[25]
1987–1988 #3[26] 20.73[26]
1988–1989 #4[27] 20.15[27]
1989–1990 #3[28] 20.90[28]
1990–1991 #1[3][29] 19.83[29]
1991–1992 #4[3][30] 16.11[30]
1992/199 #8[3][31] 14.89[31]

స్పిన్ ఆఫ్‌లు, క్రాస్ ఓవర్‌లు మరియు సామ్ స్క్రుతిక రెఫెరెన్సులు[మార్చు]

మూస:Ref improve section చీర్స్‌లో నటీంచిన కొందరు నటులు, నటీమణులు, వారి పాత్రను ఇతర టెలివిజన్ షోలలో అతిథి పాత్రలోనో, ఒక క్రొత్త స్పిన్-ఆఫ్ లోనో నటించారు. చీర్స్ నుంచి స్పిన్-ఆఫ్ చేయబడిన విజయవంతమైన షో, ఫ్రాసియర్ . ఫ్రేసియర్ క్రేన్ సియాటిల్, వాషింగ్టన్‌కు (ఇంటర్‌స్టేట్ 90కు అవతల మూలలోఉన్న), ఇటీవలే వికలాంగులైన తన తండ్రితో నివసిసించడానికోసం వెళ్లిపొతాడు. అక్కడ ఒక కాల్-ఇన్ రేడియో షోను నడపాలని వెళ్లాడు. ముందు ఫ్రేసియర్‌ను ఎవరికి నచ్చని ఒక చిన్న పాత్ర లాగా రూపొందించబడింది. డయాన్ మరియు సామ్ మధ్య సంబంధాన్ని మెరుగుపరచడానికే ఈ పాత్రను రూపొందించారు. అయితే, ఈ పాత్రకోసం వ్రాసిన హాస్యం లేని వచనాలను ఇతను మాట్లాడిన పద్ధతి ప్రేక్షలకు బాగా నచ్చింది.[32] సామ్, డయాన్ మరియు ఉడి అందరు ఫ్రేసియర్‌ ను, అతని మాజీ భార్య లిలిత్‌లను కలవడానికి వచ్చినప్పుడు ఫ్రేసియర్ షోలో కనిపిస్తారు. క్లిఫ్, నార్మ్, కార్లా మరియు చీర్స్‌లో రెగ్యులర్‌గా వచ్చే పాల్, ఫిల్ అనే బార్‌ఫ్లైస్ ఇద్దరు, వీరందరు కలిసి ఒకే సారి "చీర్‌ఫుల్ గుడ్‌బైస్" అనే ఒక ఫ్రేసియర్ ఎపిసోడ్‌లో కనిపిస్తారు. ఆ ఎపిసోడ్‌లో, బాస్టన్లో పర్యటిస్తున్న ఫ్రేసియర్, చీర్స్ గ్యాంగ్‌ను (చీర్స్‌లో కాదు) కలుస్తాడు. ఫ్రెసియర్ తన (క్లిఫ్ యొక్క) పదవీ విరమణ పార్టీ కోసమే ఫ్రేసియర్ వచ్చాడని అనుకుంటాడు. ఆ పార్టీకి ఫ్రేసియర్ హాజరవుతాడు. చీర్స్ ‌లో రెగ్యులర్‌గా నటించిన వారిలో రెబెకా హొవే మాత్రమే ఫ్రేసియర్‌లో నటించలేడు. ఎందుకంటే, కిర్స్టీ అలేకు సైంటాలజిని మీద ఉన్న నమ్మకమే. ఈ సిద్ధాంతం మానసిక శాస్త్రాన్ని తిరస్కరిస్తుంది.[ఉల్లేఖన అవసరం] చీర్స్ ప్రసారం చేయబడిన కాలమంతా, ఫ్రేసియర్ కూడా, అన్నే ఎపిసోడ్‌లు ప్రసారం చేయబడింది. పదకొండు-సీజన్లు ప్రసారం అయిన తరువాత 2004లో ముగిసింది. ఫ్రేసియర్ చీర్స్ యొక్క విజయవంతమైన స్పిన్-ఆఫ్ అయినప్పటికి, చీర్స్ నుంచి స్పిన్ ఆఫ్ చేయబడిన మొదటి షో, 1987లో ప్రీమియర్ చేయబడిన ది టోర్టిల్లిస్ . కార్లా యొక్క మాజీ భర్త నిక్ టోర్టేల్లి మరియు అతని భార్య లోరెట్ట ఈ షోలో ఉన్నారు. అయితే, 13 ఎపిసోడ్‌ల తరువాత, ఇది రద్దు చేయబడింది. ఇటాలియన్-అమెరికన్‌లను ఒకే రకంగా చూపించడం వలన బాగా వ్యతిరేకత వచ్చింది.

చీర్స్ నుంచి నేరుగా రూపొందించబడిన స్పిన్‌-ఆఫ్‌లే కాకుండా, పలువురు చీర్స్ పాత్రలు ఇతర షోలలో క్రాస్-ఓవర్‌లలో కనిపించారు.

దస్త్రం:Cheers on the simpsons.jpg
ది సింసన్స్ లో వూడీ, క్లిఫ్ మరియు నార్మ్
 • "ఫియర్ ఆఫ్ ఫ్లయింగ్" అనే ది సింసన్స్ ఎపిసోడ్‌లో హొమర్‌ను మోస్ నుంచి తరిమికొట్టడంతో, చీర్స్ వంటి ఒక బార్‌లోకి వస్తాడు. అనేక కేంద్ర పాత్రలు ఈ ఎపిసోడ్‌లో కనిపిస్తారు. ఫ్రేసియర్ కూడా ఉంటాడు కాని మాట్లాడడు. గ్రామర్‌కు అప్పటికే ది సింసన్స్లో సైడ్‌షో బాబ్ పాత్రలో నటిస్తున్నాడు కనుక). మో యొక్క టావెర్న్ యొక్క టాగ్‌లైన్ "వేర్ నోబడి నోస్ యువర్ నేం" కూడా చీర్స్ ప్రధాన పాటను సూచిస్తుంది.
 • వింగ్స్ మరియు St. ఎల్స్‌వేర్ లలో కూడా పాత్రలు ఒక అరుదైన కామెడీ -నాటక క్రాస్‌ఓవర్ లో పాత్రలు కనిపించారు. వింగ్స్‌ను వ్రాసి నిర్మాణం చేసింది కూడా చీర్స్ నిర్మాతలే.[33]
 • ఫ్యూచరమ ఎపిసోడ్ అయిన "ది రూట్ అఫ్ అల్ ఈవిల్"లో ఒక సారి నార్మ్ ఒక చిన్న పాత్రలొ, ఒక స్టోర్‌లో బీర్ కొంటున్న వ్యక్తి లాగా కనిపించాడు.
అతను ఒకే ఒక మాట మాట్లాడుతాడు. గుమాస్తా అతనిని "మీకు ఇంకేమైన కావాలా?" అని అడిగినప్పుడు, "జీవించి ఉండడానికి ఒక కారణము. మరొక బీర్‌ను ఇవ్వు." అని చెపుతాడు.
 • మార్న్ పాత్ర Star Trek: Deep Space Nine, ఎక్కువగా క్వార్క్స్ బార్‌లోనే ఉంటాడు. ఈ పేరు నార్మ్ పీటర్సన్ పేరుకు అనాగ్రం.[34]
 • బార్ మరియు బార్‌కు వచ్చేవారు రెండు డిస్నీ ప్రత్యేక కార్యక్రమాలలో కనిపిస్తుంది. ది వండర్‌ఫుల్ వరల్డ్ అఫ్ డిస్నే TV స్పెషల్ మికీస్ 60వ బర్త్‌డే, మరియు ది మేజికల్ వరల్డ్ అఫ్ డిస్నీ యొక్క డిస్నీల్యాండ్ 35వ వార్షికోత్సవ స్పెషల్. హాంటెడ్ మాన్షన్లో తన సాహసాల గురించి దీనిలో వూడీ వివరిస్తాడు.
 • ఈ సీరీస్‌లో ప్రారంభ సన్నివేశం మరియు ప్రధాన పాట రెండు చాలా ప్రాచుర్యం చెంది, పారోడీకు దారి తీశాయి. "ఫ్లమింగ్ మోస్" అనే ది సింసన్స్ ధారావాహిక ఎపిసోడ్‌లో ఒక పారోడి ఉంటుంది. ది సింసన్స్ సిరీస్‌లో కూడా చీర్స్ యొక్క ప్రారంభ సన్నివేశంతొ పాటు ఇతర ప్రబల సిట్‌కాంలను 20వ సీజన్లో పదకొండో ఎపిసోడ్ యొక్క కోచ్ గాగ్‌లో వాడబడింది.

 • స్క్రబ్స్ ఎపిసోడ్ అయిన "మై లైఫ్ ఇన్ ఫోర్ కెమరాస్‌"లో చీర్స్ మరియు ఇతర సిట్‌కాంల గురించి పలు- మరా సెట్‌అప్ నవ్వు-ట్రాక్‌లు ఉంటాయి. స్క్రబ్స్‌ లో ఒకే-కేమరా సెట్‌అప్ వాడబడుతుంది. నవ్వు-ట్రాక్ ఉండదు మరియు లైవ్ ప్రేక్షకుల ముందు తీయబడవు. చీర్స్‌ లో నాలుగు కేమరాలు, ఒక నవ్వు-ట్రాక్ ఉండి, లైవ్ ప్రేక్షకుల ముందు చిత్రీకరణ జరుగుతుంది. "మై లైఫ్ ఇన్ ఫోర్ కామరాస్"లో ఒక స్వప్న సన్నివేశం మూడు కేమరాలతో తీయబడింది. అంతే కాక, చికిత్స తీసుకున్న ముఖ్యమైన రోగి చీర్స్ రచయిత అయిన "చార్లెస్ జేమ్స్" అనే ఒక కల్పనా పాత్ర. ఆ పేరు చీర్స్ సృష్టికర్తలైన జేమ్స్ బురోస్, గ్లెన్ చార్లెస్, మరియు లెస్ చార్లెస్ ల పేర్లనుంచి సృష్టించబడింది. ఆ ఎపిసోడ్‌లో, ఈ "సామ్ ప్రధాయక" సిట్కాంల గురించి పలు విమర్శలు చేయబడ్డాయి. "దురద్రుష్టవశాత్తు, సిట్‌కాంలలో మాదిరిగా కాకుండా ఇక్కడ విషయాలు ఎప్పుడు చక్కగా ముగియవు" అని జే.డి. చెప్పడంతో ఆ ఎపిసోడ్ ముగిస్తుంది. అప్పుడు చీర్స్ థీం యొక్క ప్రారంభ సంగీతం వాయిస్తూ ఉంది.[35]
 • "ది టికట్" అనే సీన్‌ఫెల్డ్ ఎపిసోడ్‌లో, ఒక్కో చీర్స్ ఎపిసోడ్‌కు టెడ్ డాన్సన్ యొక్క జీతం గురించి జెర్రి, జార్జ్‌ల మధ్య చర్చ జరుగుతుంది. "ది ట్రిప్" ఎపిసోడ్‌లో ఒక టాక్ షోలో జార్జ్ వెండ్ తన లగే వస్తాడు.
చీర్స్ను ఎలాగ మెరుగు పరచాలని అతనికి జార్జ్ కోస్టాన్జా సలహా ఇస్తాడు. బార్ సెట్‌ను మార్చాలని సలహా ఇస్తాడు. కాని జార్జ్ వెండ్ ప్రసారం సమయములో ఎగతాళి చేపడతాడు.
 • "ది వొన్ విత్ రోసస్ వెడ్డింగ్" అనే ఒక ఫ్రెండ్స్ ఎపిసోడ్‌లో, జో చీర్స్ ప్రారంభ సన్నివేశాన్ని చూసి ఇంటి మీద బెంగ పెట్టుకుంటాదు. తరువాత, అతను బెస్ట్ మాన్ నంబర్ టూగా ప్రసంగం చేస్తూ చీర్స్ కోరస్‌ను చెపుతాడు.
 • హౌ ఐ మెట్ యువర్ మదర్ ఎపిసోడ్ అయిన "స్వార్లే"లో ఆ షో లోని బార్‌లో ఉన్న అందరు "స్వార్లే" అని గట్టిగా అరుస్తారు. అది నీల్ పాట్రిక్ హారిస్ వేసిన పాత్ర అయిన బార్నే స్టిన్సన్ యొక్క నిక్‌నేం. తరువాత బార్‌టెండర్ చీర్స్ థీం పాటను వేస్తాడు. చీర్స్ లాగే అక్షరాలు, రంగుతో క్రెడిట్‌లు వేయబడ్డాయి.
 • టోనీ హాక్స్ అండర్‌గ్రౌండ్ 2 అనే వీడియో గేమ్‌లో బాస్టన్‌లో ఆటను మొదలుపెడితే, "జీర్స్" అనే పేరుతో ఒక బార్ ఉంటుంది. ఈ బార్ లోపల, బయట "చీర్స్" లాగానే ఉంటుంది. ఇక్కడే, గేమ్‌లోని విశేష అతిథి అయిన జేస్సే జేమ్స్‌ను కనిపెట్టాలి.
 • ది ఆఫీస్ యొక్క సీజన్ 3 ఎపిసోడ్ 6 అయిన "దివాళి"లో అండి బెర్నార్డ్ తనకూ కరేన్ ఫిలిపెల్లికు ఉన్న సంబంధాన్ని "రోలర్ కోస్టర్ స్నేహం. వేడిగా, చల్లగా, మరల ఉండి, మరల లేని, కామము నిండిన వ్యవహారం. అది సామ్, డయాన్‌ల సంబంధం మాదిరిగా." అని జిం హాల్‌పెర్ట్ కు చెపుతాడు.
 • "ది లీగని అఫ్ గార్వుడ్ హడిల్," అనే మాగ్నం, పి.ఐ. ఎపిసోడ్‌లో జాన్ రాట్‌జెన్‌బెర్జెర్ ఒక కిడ్‌నాపర్ మాదిరిగా అథిది పాత్రలో నటిస్తాడు. అతని సహచరడు పేరు నార్మ్.
 • ఫ్యామిలీ గయ్ ఎపిసోడ్‌లో "త్రీ కింగ్స్," నార్మ్ పీటర్సన్ అనిమేషన్ రూపములో చూపించబడుతాడు. జార్జ్ వెండ్ స్వరం అందిస్తాడు.
లండన్ లోని పికాఢిల్లీ సర్కస్ లో పూర్తి స్థాయి చీర్స్ సెట్
 • "మాడర్న్ వార్ఫేర్" అనే కమ్యూనిటీ ఎపిసోడ్‌లో, మొత్తం విద్యార్థుల బృందం, ఎపుడు గొడవ పడుతూ ఉంటున్న బ్రిట్టా మరియు జెఫ్‌లను విమర్శిస్తుంది. షిర్లీ ఈ విదంగా చెపుతాడు. ఇది ఎవరికి పనిచేస్తుందంటే, "సామ్, డయాన్ కు మాత్రమే. నేను సామ్, డయాన్‌లను ద్వేషించాను."

లైసెన్సింగ్[మార్చు]

ఐ లవ్ లూసి తరువాత ప్రధానమైన లైసెన్సింగ్ ప్రచారం చేపట్టిన వైజ్ఞానిక లేదా చిన్న పిల్లల టెలివిజన్ కాని మొదటి ప్రధాన టీవీ సిరీస్ బహుసా చీర్స్ అయిఉంటుంది. సహజంగానే, ఈ షో "చీర్స్" సంబంధించిన వస్తువుల తయారికి దారి తీసింది. "చీర్స్" థీం కలిగిన పబ్‌లు వరుసగా చాలా ఎర్పాటయ్యాయి. టాం మెక్‌గ్రాత్ నేతృత్వంలోని పారమమౌంట్ వారి లైసెన్సింగ్ బృందం, మొదట్లో హొస్ట్ మేరియోట్ తో కలిసి, ఈ "చీర్స్" పబ్ భావాన్ని రూపొందించింది. వీరు ప్రపంచవ్యాప్తంగా 24+ విమానాశ్రయాలలో "చీర్స్" థీం పబ్‌లను స్థాపించారు. అసలు చీర్స్ బార్ బోస్టన్‌లో ఉంది. చారిత్రాత్మకంగా ఇది బుల్ అండ్ ఫించ్గా పలు తరాల వారికి సుపరిచయం. ఇక్కడే, ఫన్యూయిల్ హాల్ మార్కెట్‌లో చీర్స్ రెస్టారంట్ కూడా ఉంది. మరియు సామ్ స్ ప్లేస్ అనె ఒక స్పిన్-ఆఫ్ క్రీడా బార్ కూడా ఫన్యూయిల్ హాల్ లోనే ఉంది. షో యొక్క థీం పాట కేల్సేస్ నైబర్‌హూడ్ బార్ & గ్రిల్ అనే కెనేడియన్ రెస్టారంట్‌కు లైసెన్స్ చేయబడింది.[36]

సిండికేషన్ మరియు హొం వీడియో[మార్చు]

అమెరికన్ టెలివిజన్‌లో ప్రసారం చేయబడడం మొదలయి, సిండికేషన్‌లో ప్రవేశించడంతో, చీర్స్ ప్రాబల్యం పెరిగింది. షో 1993లో ముగిసినప్పుడు, చీర్స్ 38 దేశాలలో సిండికేట్ చేయబడి, 179 అమెరికన్ టెలివిజన్ మార్కెట్లలో ప్రవేశించి 83 మిలియను వీక్షకులను సంపాదించింది.[3] షో ముగిసిన తరువాత, [37] చీర్స్ నిక్ అత నైట్‌లో విజయవంతంగా సిండికేట్ చేయబడి అనంతరం, 2004లో TV ల్యాండ్‌లో ప్రారంబమయింది. తరువాత TV ల్యాండ్ పున:ప్రసారం ఆపేసింది. తరువాత 2008లో ఈ సీరీస్ యునైటెడ్ స్టేట్స్‌లో హాల్‌మార్క్ చానెల్‌లోను తరువాత 2009లో WGN అమెరికా లోనూ ప్రసారం కొనసాగుతూ ఉంది. ఆరంభములో తీసిన కొన్ని చీర్స్ ఎపిసోడ్‌ల నాణ్యత క్షీణించడంతో, ఈ సీరీస్ యొక్క విజయం వలన 2001లో జాగ్రత్తగా అవి పునస్థాపితం చేయబడ్డాయి.[38] ముఖ్యంగా, ఆస్ట్రేలియా యొక్క నైన్ నెట్వర్క్‌లో ఆస్ట్రేలియస్ నాటియస్ట్ హోమ్ వీడియోస్ స్థానే చీర్స్ పున:ప్రసారం చేయబడింది. కెర్రీ పేకర్ ఆస్ట్రేలియస్ నాటియస్ట్ హొమ్ వీడియోస్‌ను ప్రసారం చేసినప్పుడు, ఎపిసోడ్ మధ్యలోనే, ఒక ఫోన్ కాల్ రావడంతో ఆపివేయబడింది. నెదర్ లాండ్స్లో NCRV చీర్స్ ప్రసారం చేసింది. ఆఖరి ఎపిసోడ్ తరువాత, NCRV మరల పూర్తి సీరీస్‌ను పున:ప్రసారం చేసింది. అలాగే, మరల వరుసగా మూడు సార్లు పున:ప్రసారం చేసింది. పతి రోజు రాత్రి ఈ ఎపిసోడ్‌ను ప్రసారం చేసింది. 2010 వేసవిలో చీర్స్‌ను పున:ప్రసారం చేయబోతున్నట్లుగా 2009 జూలై 4 నాడు నిక్ అట్ నైట్ ప్రకటించింది.

స్టేషన్లు[మార్చు]

 • WPIX / ఛానల్ 11• న్యూ యార్క్, న్యూ యార్క్
 • KPTV / ఛానల్ 12• పోర్ట్‌లాండ్, ఒరెగాన్
 • KCOP-TV / ఛానల్ 13• లాస్ యేన్జలస్, కాలిఫోర్నియా
 • WXXA-TV / ఛానల్ 23• అల్బానీ, న్యూ యార్క్
 • WTXF-TV / ఛానల్ 29• ఫిలడెల్ఫియా, పెనిసిల్వేనియా
 • KTXL / ఛానల్ 40• సక్రామేన్టో, కాలిఫోర్నియా
 • WPMT / ఛానల్ 43• హర్రిస్బర్గ్, పెనిసిల్వేనియా
 • WBDC / ఛానల్ 50• వాషింగ్టన్, డి.సి.

DVD విడుదలలు[మార్చు]

పారమౌంట్ హోమ్ ఎంటర్‌టైన్మెంట్ మరియు CBS DVD వారు చీర్స్ యొక్క మొత్తం 11 సీజన్లను DVDలో రీజియన్ 1 మరియు రీజియన్ 4 లో విడుదల చేశారు .

రీజియన్ 2 లో మొదటి 7 సీజన్లను DVD లో విడుదల చేశారు .

రీజియన్ 1 రీజియన్ 2 * రీజియన్ 4
మొత్తం 1st సీజన్ 22 2003 మే 20 2003 నవంబరు 24 2004 జనవరి 15
మొత్తం 2nd సీజన్ 22 2004 జనవరి 6 2004 జూన్ 7 2004 మే 6
మొత్తం 3rd సీజన్ 25 2004 మే 25 2004 సెప్టెంబరు 6 2004 సెప్టెంబరు 9
మొత్తం 4th సీజన్ 26 2005 ఫిబ్రవరి 1 2005 జూలై 18 2005 జూలై 21
మొత్తం 5th సీజన్ 26 2005 మే 17 2006 నవంబరు 27 2007 జనవరి 11
మొత్తం 6th సీజన్ 25 2005 సెప్టెంబరు 13 2007 మే 14 2007 మే 3
మొత్తం 7th సీజన్ 22 2005 నవంబరు 15 2009 మే 18[39] 2009 ఏప్రిల్ 27
మొత్తం 8th సీజన్ 26 2006 జూన్ 13 N/A 2009 ఏప్రిల్ 27
The 9th సీజన్ 26 2008 ఏప్రిల్ 29 N/A 2009 ఏప్రిల్ 27
10th సీజన్ 25 2008 సెప్టెంబరు 2 N/A 2009 ఏప్రిల్ 27
11th & ఆఖరి సీజన్ 26 2009 జనవరి 27[40] N/A 2009 ఏప్రిల్ 27
 • రీజియన్ 2 విడుదల తేదీలు యునైటెడ్ కింగ్డం మార్కెట్ ను మాత్రమే సూచిస్తుంది.
 • రీజియన్ 4 సీజన్ 7–11 విడుదలలు JB HI-Fi స్టోర్లో మాత్రమే విడుదల చేయబడ్డాయి.
 • సీజన్s 9-11 విడుదల చేయబడలేదు, కంప్లీట్ అని పేరు పెట్టడం వలన. అందువలన ఈ విడుదలలో, సన్నివేశాలు, సంగీతం మార్చబడింది.

చీర్స్ -అనంతరం[మార్చు]

ఫ్రేసియర్ అనే స్పిన్-ఆఫ్‌తో కేల్సీ గ్రామర్ మంచి విజయం సాధించాడు. ఇది చీర్స్ ప్రసారం అయిన అదే 11 సీజన్లు ప్రసారం అయింది. అంతే కాక, ది సింసన్స్‌లో సైడ్‌షో బాబ్ పాత్రగా పదే పదే కనిపించే ఒక అతిథి పాత్రలోనూ నటించాడు. ఫ్రేసియర్ ఆఖరి సీజన్ సమయానికి టెలివిజన్‌లో అత్యధిక పారతోషికం తీసుకుంటున్న నటుడుగా గ్రామర్ నిలిచాడు. ఒక్కొక ఎపిసోడ్‌కు $1.6 మిలియను సంపాదించాడు.

వూడి హరేల్సన్ కూడా చీర్స్ అనంతరం విజయవంతంగా వృత్తిలో కొనసాగాడు. పలు విజయవంతమైన చలన చిత్రాలలో నటించి, బాక్స్-ఆఫీస్ ఆకర్షణగా ఉన్నాడు. అతను నటించిన కొన్ని చిత్రాలు: వైట్ మెన్ కాంట్ జంప్, నాచురల్ బార్న్ కిల్లర్స్, ఇండీసంట్ ప్రొపొసల్, కింగ్పిన్, నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ . ది పీపుల్ vs. లారి ఫ్లింట్కు గాను 1997 లోనూ, ది మెసెంజర్కు గాను 2010లో అతనికి అకాడమి అవార్డుకు ప్రతిపాదించబడ్డాడు.

ఆఖరి సీజన్‌లో టెడ్ డాన్సన్ ఒక్కొక ఎపిసోడ్‌కు $450,000 పారతోషికం తీసుకుంటూ, చీర్స్‌లో అత్యదిక పారతోషికం తీసుకుంటున్న నటుడుగా ఉన్నాడు. తరువత ఇతను బెకర్ వంటి విజయవంతమైన సిట్‌కాంలలోనూ ఇంక్ మరియు హెల్ప్ మే హెల్ప్ యు వంటి విజయం సాధించని సిట్‌కాంలలోనూ నటించాడు. ప్రస్తుతం డేమేజస్ అనే విజయవంతమైన నాటక సీరీస్‌లో నటిస్తున్నాడు. కసిన్స్, త్రీ మెన్ అండ్ ఎ బెబి , మేడ్ ఇన్ అమెరికా వంటి అనేక చలనచిత్రాలలోనూ ఇతను నటించాడు.

కర్బ్ యువర్ ఎంతూసియాసంలో లారి డేవిడ్ స్నేహితులుగా టెడ్, అతని భార్య (నటీమణి మేరీ స్టీన్‌బర్జెన్) వారిలాగానే కనిపిస్తారు. 2009లో, బోర్డ్ టు డెత్ అనే HBO సీరీస్‌లో ఒక బలవంతుడైన పత్రికా సంపాదకుడు మరియు జోనాథన్ అమెస్ పై అధికారి పాత్రలో డాన్సన్ నటించాడు.

జాన్ రాట్జెన్బెర్గేర్, పిక్సర్ యొక్క అన్ని కంప్యూటర్-ఆనిమేటడ్ చిత్రాలకు తన స్వరాన్ని అందించాడు. ప్రస్తుతం మేడ్ ఇన్ అమెరికా అనే ట్రావెల్ ఛానల్ షోను నిర్వహిస్తున్నాడు.[41] మేడ్ ఇన్ అమెరికాలో అతను U.S.ను చుట్టుతూ, చిన్న నగరాలను చూపిస్తూ, అక్కడ తయారయ్యే వస్తువులను చూపిస్తూ ఉంటాడు. టెడ్ డాన్సన్ మేడ్ ఇన్ అమెరికా అనే ఒక చలనచిత్రములో కూడా నటించాడు. రాట్జెన్బెర్గేర్, నట్స్, బోల్ట్స్ అండ్ తింగమజిగ్స్ ఫౌండేషన్[42] అనే స్వచ్ఛంద సేవా సంస్థలో తీవ్రంగా పాల్గొంటున్నాడు. ఈ సంస్థలో పిల్లలకు టింకరింగ్టి మరియు మెకానికల్ పనులు నేర్పిస్తారు. అంతే కాక, పాఠశాలలు పారిశ్రామిక కళలను ప్రోత్సాహించడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. ఇతను 2008లో ది విల్లెజ్ బార్బర్‌షాప్ అనే ఒక ఇండీ చిత్రములో నటించాడు. మరియు డాన్సింగ్ విత్ ది స్టార్స్ లోనూ కనిపించాడు.

బెబే న్యూవిర్త్ అనేక బ్రాడ్వే మ్యూసికల్స్‌లో నటించింది. వాటిలో 90ల మధ్య కాలములో వచ్చిన చికాగో రివైవల్ ప్రసిద్ధి. దీనికి ఆమె రెండు టోనీ అవార్డులు గెలుచుకున్నాడు. తరువాత జుమాంజి వంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది. ఆల్ డాగ్స్ గో టు హెవన్ 2 మరియు All Dogs Go to Heaven: The Series చిత్రాలకు ఆమె తన స్వరాన్ని అందించింది.

కిర్స్టీ అల్లే వేరోనికాస్ క్లోసేట్ అనే టీవీ సిరీస్‌లో, పలు మినీసీరీస్ లలో మరియు చిత్రాలలో నటించింది.

చీర్స్ నుంచి వైదొలగిన సమయములో, షెల్లీ లాంగ్ విమర్శకు గురయింది. షోను వదిలి వెళ్ళడం వలన వృత్తిపరంగా పొరపాటు చేసిందని పలువురు అభిప్రాయపడ్డారు.[43] సిరీస్‌ను వదిలే ముందు లాంగ్ పలు విజయవంతమైన చలనచిత్రాలలో నటించింది. బెట్టె మిడ్లేర్‌తో పాటు అవుట్రేజియస్ ఫార్చూన్ మరియు టాం హాంక్స్‌తో పాటు ది మనీ పిట్లో నటించింది. ఈ సిరీస్ నుంచి వైతొలగిన తరువాత, ది బర్డి బంచ్ మోవీ మరియు దాని తరువాయి భాగాలలో నటించింది.

చీర్స్ ముగిసిన తరువాత, ఆ సిరీస్‌లో నటించిన నటీనటులు విజయవంతంగా తమ వృత్తిని కొనసాగించినా, కొందరు వ్యక్తిగత సమస్యలు ఎదుర్కున్నారు. 2004లో, షెల్లీ లాంగ్, తన 23 సంవత్సరాల భర్తతో విడాకులు తీసుకున్న తరువాత మానసిక ఆవేదనకు లోనయి, ఒక సారి మితిమీరి మందులు తీసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిందని వార్త.[44][45]

చీర్స్ ముగిసిన తరువాత కిర్స్టీ అల్లే గణనీయంగా బరువు పెరగడంతో, అది ఆమె వృత్తికి కొంతమేరకు ఆటంకం కలిగించింది. తరువాత ఆమె, తన నిజ జీవితం మరియు బరువు పెరుగుదల మీద పాక్షికంగా ఆధారపడిన ఫాట్ యాక్ట్రెస్ అనే సిట్‌కాంను వ్రాసి నటించింది. ఆమె గతములో జెన్నీ క్రైగ్ అనే ఒక బరువు తగ్గింపు మరియు పోషణాహార కంపెనీకి ప్రతినిధిగా ఉంది.

హొస్ట్ మారియాట్ కార్పరేషన్ వారి హోటల్ మరియు ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో చీర్స్ మాడల్‌లో 46 బార్‌లను నెలకొల్పింది.[3] షోలో పాత్రను, వివరాలను పారమౌంట్ పిక్చర్స్ లైసెన్స్ చేసింది. సామ్ మలోన్ రెడ్ సాక్స్ కోసం ఆడుతున్నప్పుడు వాడినట్లుగా చెప్పబడిన జెర్సీ వంటి నకిలీ జ్ఞాపకాల వస్తువులను బార్లలో పెట్టడానికి అనుమతి ఇవ్వబడింది. మేరియోట్ చేర్చిన వస్తువలలో "బాబ్", "హాంక్" అనే రెండు రోబోలు ఉన్నాయి. ఒకటి, చాలా లావుగాను (నార్మ్ పీటర్సన్ మాదిరిగా), మరొకటి పోస్టల్ యునిఫారం (క్లిఫ్ క్లావిన్) వేసుకుని ఉంటుంది.[46]

రాట్జెన్బెర్గేర్ మరియ వెండ్ పారమౌంట్ పై ఒక నూతనమైన దావా వేశారు (దాదాపు పారమౌంట్‌ను వయాకాం కొన్న సమయములో). తమ అనుమతి లేకుండా, తమ రూపాలను, బిమ్బాలను అక్రమంగా లైసెన్స్ చేసి పారమౌంట్ సంపాదిస్తుంది అని వారు ఆరోపించారు.[47] వారికి హక్కు ఉన్న పాత్రల మాదిరిగా రోబోలకు దుస్తులు తొడగడం కారణంగా తమ రూపాలను పారామౌంట్ వాడడానికి వీలు లేదని, రాట్జెన్బెర్గేర్ మరియ వెండ్ పెర్కున్నారు. 1996లో ఈ దావాను లోస్ ఏంజెలెస్ సుపీరియర్ కోర్ట్ న్యాయమూర్తి కొట్టి వేశారు. తరువాత ఒక ఫెడరల్ న్యాయమూర్తి మరల లాస్ ఏంజెలెస్ న్యాయస్థానంలో ఈ దావాను మరల అనుమతించారు. ఈ దావాను యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్ ముందు తీసుకురావాలని పారమౌంట్ ప్రయత్నించింది. కాని న్యాయస్థానం దావాను విచారించడానికి నిరాకరించి, సుపీరియర్ కోర్ట్‌లో ఈ కేసును విచారించాలనే నిర్ణయాన్ని సమర్దించింది.[46] ఈ దావా పరిష్కారం అయి ఉంటే హాలీవుడ్‌ మీద పెద్ద ప్రభావం చూపేది. ఒక పాత్ర మీద హక్కు ఉంటే, ఆ పాత్ర పోషించిన నటుడు రూపాన్ని ఆ హక్కుదారుడు వాడవచ్చా అనే విషయం తేలిపోయేది. కానీ, ఆ దావాలో తీర్పు వెలువడే ముందే, పారామౌంట్ ఇద్దరితో విషయాన్ని పరిష్కరించుకుంది.[48]

బార్ బయట[మార్చు]

మొదటి సంవత్సరం షో పూర్తిగా బార్ లోపలే జరిగింది. (బార్ బయట చూపించిన మొదటి స్థలం, డయాన్ యొక్క అపార్ట్మెంట్.) సిరీస్ విజయవంతమైన తరువాత, పాత్రలు బయటకు వెళ్ళడం మొదలుపెట్టాయి. ముందు ఇతర సెట్లకు, తరువాత అప్పుడప్పుడు బయట లొకేషన్‌కు కూడా వెళ్ళారు. బోస్టన్ పబ్లిక్ గార్డెన్ కు ఉత్తర దిశలో ఉన్న బుల్ & ఫించ్ పబ్ లో షో జరిగింది. ఈ సీరీస్‌తో ముడిపెట్టడంతో ఈ స్థలం ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ స్థలముగా మారింది. ఇక్కడ ఏడాదికి దాదాపు ఒక మిలియనుకు పైగా పర్యాటకులు సందర్శిస్తారు.[3][37] అప్పటినుంచి దీని పేరు చీర్స్ బీకాన్ హిల్[49]గా మార్చబడింది. అయితే, లోపల మాత్రం టీవీ బార్ కంటే భిన్నంగా ఉంటుంది. షో యొక్క ప్రజాదరణను సొమ్ము చేసుకోవడాని కోసం, చీర్స్ ఫాన్యూయిల్ హాల్[50] అనే మరొక బార్ స్థాపించబడింది. ఇది చూడడానికి షో యొక్క సెట్ మాదిరిగానే నిర్మించబడింది. పర్యాటకులకు వారు టీవీలో చూస్తున్నది మాదిరిగానే కనపడాలని ఇలాగ నిర్మించబడింది. ఇది ఫాన్యూయిల్ హాల్ కు సమీపంలో బుల్ & ఫించ్ పబ్ కు క మైలు దూరములో ఉంది. 1997లో ఐరోపా లోని మొట్ట మొదటి అధికారికంగా లైసెన్స్ పొందిన బార్ లండన్‌లో రీజెంట్స్ స్ట్రీట్ W1లో తెరవబడింది.[51] చీర్స్ ఫాన్యూయిల్ హాల్ మాదిరిగా చీర్స్ లండన్ సెట్ లాగానే ఉంటుంది. ఘనంగా జరిగిన ఈ బార్ యొక్క ప్రారంభోత్సవం, జేమ్స్ బరోస్ మరియు నటులు జార్జ్ వెండ్, జాన్ రాట్జెన్బెర్గేర్ హాజరయ్యారు.[52] షోలో వాడబడిన నిజమైన సెట్టును హాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ మ్యూజియంలో ప్రదర్శించబడింది. మ్యూజియం 2006లో మూసే వరకు ఇది ప్రదర్శనలో ఉంది.[53]

మూలాలు[మార్చు]

 1. గారి పోర్ట్‌నోయ (2006). పోర్ట్‌నోయ యోక్క వ్యక్తిగత జీవితం
 2. బ్లాగ్‌క్రిటిక్స్.ఆర్గ్ (జనవరి 22, 2004) (2006). చీర్స్ చరిత్ర గురించిన బ్లాగ్
 3. 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 3.11 3.12 3.13 3.14 3.15 3.16 3.17 3.18 3.19 3.20 Bjorklund, Dennis A. (1997). Toasting Cheers: An Episode Guide to the 1982–1993 Comedy Series, with cast biographies and character profiles. McFarland & Company, Inc., Jefferson, North Carolina. ISBN 978-0899509624.
 4. "Don't Shoot...I'm Only the Psychiatrist". Cheers. episode 13. season 10. January 2, 1992. 14:55 minutes in. NBC. "It's your assistant bartender, good old Woody" 
 5. TV1 (2006). TV1 – చీర్స్
 6. న్యూపోర్ట్ ఉందెర్ ది స్టార్స్ (2005)(2006). http://web.archive.org/web/20071114112730/http://newportunderthestars.com/newport/johnsbio.html జాన్ రాట్జెన్బెర్గేర్ యొక్క న్యూపోర్ట్ ఉందెర్ ది స్టార్స్]
 7. 7.0 7.1 IMDb (2006). చీర్స్ గురించిన IMDb ట్రివియా
 8. "Kevin McHale Bio". NBA.com. Retrieved 2009-12-20.
 9. IMDb (2006) (ఏప్రిల్ 10, 2006). పూర్తి ఎపిసోడ్ నటులు బృందం
 10. 10.0 10.1 10.2 IMDb (2006). చీర్స్ కు అవార్డులు
 11. IMDb (2006). పుల్ విల్సన్ గురించిన ట్రివియా
 12. IMDb (2006). పూర్తి నటుల బృందం మరియు సిబ్బంది
 13. 13.0 13.1 ది మ్యూజియం అఫ్ బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్స్ (2006).
 14. 14.0 14.1 BBC (జూలై 4, 2003) (2006). చీర్స్ – టీవీ ధారావాహిక
 15. "చీర్స్, డల్లాస్, గుడ్ టైమ్స్ మరియు బాట్మాన్ ను TV ల్యాండ్ గౌరవిస్తుంది" సిట్‌కాంస్‌‌ఆన్‌లైన్ లో ఫిబ్రవరి 22, 2006 నాడు. మార్చి 28, 2008న తిరిగి పొందబడింది.
 16. తెలివిజన్ హెవన్ (2002)(2006). చీర్స్ – ఒక టెలివిజన్ హెవన్ సమీక్ష
 17. డా. కెరన్ డెమింగ్. "టాక్: జెండేర్ డిస్కోర్స్ ఇన్ చీర్స్ !" ఇన్ టెలివిజన్ క్రిటిసిసం: అప్రోచస్ అండ్ అప్లికేషన్స్ - లీ ఆర్. వండే బెర్గ్ మరియు లారెన్స్ ఏ వేన్నేర్ చే. వైట్ ప్లెయిన్స్, NY: లాంగ్‌మాన్, 1991. 47–57. ఈ వ్యాసాన్ని సాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యునివర్సిటీలో అధ్యాపకులుగా ఉన్న మెర్సిలీ ఎం. జెంకిన్స్ తో కలిసి వ్రాశారు.
 18. ది బెమ్యూస్మేంట్ పార్క్ (మే 7, 2004) (2006). http://web.archive.org/web/20061101100759/http://markhasty.com/archives/2004/05/07/the-situation-of-comedy/ ది సిచువేషన్ అఫ్ కామడి]
 19. "Crash of the Titans". Cheers. episode 19. season 9. February 21, 1991. 21:44 minutes in. NBC. 
 20. TVParty (2006). న్బ్క్ ఎలాగా తమ పట్టును తిరిగి పొందింది
 21. వెరైటీ (మే 20, 2003) (2006). రివ్యూ – చీర్స్
 22. "May Sweeps: Season Finales and TV Specials". Retrieved 2009-12-22. Cite web requires |website= (help)
 23. "TV Ratings: 1983–1984". ClassicTVHits.com. Retrieved 2010-01-09.
 24. 24.0 24.1 "TV Ratings: 1985–1986". ClassicTVHits.com. Retrieved 2010-01-09.
 25. 25.0 25.1 "TV Ratings: 1986–1987". ClassicTVHits.com. Retrieved 2010-01-09.
 26. 26.0 26.1 "TV Ratings: 1987–1988". ClassicTVHits.com. Retrieved 2010-01-09.
 27. 27.0 27.1 "TV Ratings: 1988–1989". ClassicTVHits.com. Retrieved 2010-01-09.
 28. 28.0 28.1 "TV Ratings: 1989–1990". ClassicTVHits.com. Retrieved 2010-01-09.
 29. 29.0 29.1 "TV Ratings: 1990–1991". ClassicTVHits.com. Retrieved 2010-01-09.
 30. 30.0 30.1 "TV Ratings: 1991–1992". ClassicTVHits.com. Retrieved 2010-01-09.
 31. 31.0 31.1 "TV Ratings: 1992–1993". ClassicTVHits.com. Retrieved 2010-01-09.
 32. పూబాల (2006). చీర్స్ / ఫ్రేసియర్ క్రాస్ ఓవర్ల గురించి సూచనలు
 33. పూబల (2006). చీర్స్ / St. ఎల్స్ వేర్ క్రస్స్ ఓవర్ గురించి సూచనలు
 34. టీవీ ఎకర్స్ (జనవరి 24, ????) (2006). Nor-r-rm!
 35. (మార్చ్ 10, 2005) (2006) చికాగో ట్రిబ్యూన్. చీర్స్ టు "స్క్రబ్స్"
 36. చీర్స్ TV థీమ్ పాటతో కేల్సీస్ ప్రచారాన్ని ప్రారంభించింది: ఫైనాన్షియల్ న్యూస్ – యాహూ! ఫైనాన్స్[dead link]
 37. 37.0 37.1 ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ డైజెస్ట్ (ఆగష్టు 20, 2001) (2006). బోస్టన్లో ఒక హాలీవుడ్ చీర్స్ పబ్
 38. "Cheers restored for a new generation of laughs". Retrieved 2006-00-00. Cite web requires |website= (help); Check date values in: |accessdate= (help)[dead link]
 39. "Product Information at". Play.com. 2009-02-21. Retrieved 2009-03-11. Cite web requires |website= (help)
 40. "Season 11 DVD release announcement". Tvshowsondvd.com. 2007-05-25. Retrieved 2009-03-11. Cite web requires |website= (help)
 41. ట్రావల్ ఛానల్ (2006). మేడ్ ఇన్ అమెరికా – ట్రావెల్ ఛానల్
 42. "A Word from John". Nuts, Bolts and Thingamajigs Foundation. మూలం నుండి 2008-01-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-01-22. Cite web requires |website= (help)
 43. McKissic, Rodney (1999-03-05). "At least XU's gaffe didn't blow a career". The Cincinnati Post. E. W. Scripps Company. మూలం నుండి 2004-08-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2006. More than one of |author= and |last= specified (help); Check date values in: |accessdate= (help)
 44. ఫెమేల్‌ఫస్ట్ (నవంబర్ 25, 2004) (2006). షెల్లీ లాంగ్ యొక్క ఓవర్డోస్
 45. ఆత్మహత్యను ఇప్పుడు ఆపండి (నవంబర్ 26, 2004) (2006). నటి షెల్లీ లాంగ్ ఆత్మహత్యా ప్రయత్నం
 46. 46.0 46.1 ఈ న్యూస్ ఆన్‌లైన్ (అక్టోబర్ 2, 2000) (2006). వెండ్/రాట్జెన్బెర్గేర్ ల దావా సుప్రీం కోర్ట్ లో మరల తీసుకోబడింది[dead link]
 47. ఈ న్యూస్ (సెప్టెంబర్ 25, 2000) (2006). వెండ్ మరియు రాట్జెన్బెర్జేర్ తమ దావాను సుప్రీం కోర్ట్ కు తీసుకువచ్చారు[dead link]
 48. మార్క్‌రోస్లేర్.కాం (2006). http://web.archive.org/web/20080205235619/http://www.markroesler.com/ipresources/rightofpublicity.htm పలు ఇంటెలెక్చువల్ ప్రాపెర్టి దావాలు, చీర్స్ దావా తొ సహా ]
 49. చీర్స్ బోస్టన్ (2006). చీర్స్ బీకన్ హిల్
 50. చీర్స్ బోస్టన్ (2006). చీర్స్ ఫాన్యూయిల్ హాల్
 51. చీర్స్ లండన్ (2003). చీర్స్ లండన్
 52. USA టుడే (సెప్టెంబర్ 23, 1997).
 53. హాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ మ్యూజియం (2006). హాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ మ్యూజియం

బాహ్య లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూస:Cheers మూస:EmmyAward ComedySeries 1976-2000 మూస:GoldenGlobeTVComedy 1990-2009

"https://te.wikipedia.org/w/index.php?title=చీర్స్&oldid=2614640" నుండి వెలికితీశారు