చుట్టూ చెంగావి చీర

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

చుట్టూ చెంగావి చీరా కట్టాలే చిలకమ్మ.. అను ఈ పాట తూర్పు వెళ్ళే రైలు (1979) అను సినిమా లోనిది. ఈ సినిమాకు ఎస్.పి.బాలసుబ్రమణ్యం గారు సంగీతాన్ని అందించారు. ఈ పాటకు ఆరుద్ర గారు సాహిత్యాన్ని అందించగా ఎస్.పి.బాలసుబ్రమణ్యం గారు ఆలపించారు.

పాట[మార్చు]

పల్లవి:

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ..........

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ..........

బొట్టు కాటుక పెట్టి..నే కట్టే పాటను చుట్టి..

ఆశపడే కళ్ళళ్ళో..ఊసులాడు.. వెన్నెల బొమ్మ...

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ..........

చరణం1:

తెల్లచీరకందం ..నువ్వే తేవాలే చిట్టెమ్మా...

నల్లచీర కట్టుకున్నా.. నవ్వాలె చిన్నమ్మా...

ఎర్రచీర కట్టుకుంటే... సందెపొద్దు నీవమ్మా..

పచ్చచీర కట్టుకుంటే ...పంటచేల సిరివమ్మా...

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ..........

చరణం2:

నేరేడుపళ్ళ రంగు ..జీరాడే కుచ్చిళ్లు...

ఊరించే ఊహల్లో ...దోరాడే పరవళ్ళు....

వంగపండు రంగులోన ..పొంగుతాయి సొగసుల్లు...

వన్నె వన్నె చీరల్లోనా.... నీ ఒళ్ళే హరివిల్లు....

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ..........

బొట్టు కాటుక పెట్టి..నే కట్టే పాటను చుట్టి..

ఆశపడే కళ్ళళ్ళో..ఊసులాడు.. వెన్నెల బొమ్మ...

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ..........

బయటి లింకులు[మార్చు]