చుట్టే కాగితం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చుట్టే కాగితాలు (రోలింగ్ కాగితాలు / Rolling papers) అనేవి చిన్న పత్రాలు, చుట్టలు లేదా కాగితపు ముక్కలుగా చెప్పబడుతాయి. వీటిని చేతితో లేదా తిరుగుడు యంత్రం (రోలింగ్ మెషీన్) సాయంతో ఒకరు సొంతంగా తయారు చేసుకునే సిగరెట్‌లపై చుట్టడానికి విక్రయిస్తుంటారు. సిగరెట్టును చుట్టేటప్పుడు రోలింగ్ కాగితంలో పొగాకు, గంజాయి, లవంగాలు, దమియానా (ఒక చిన్న పొద) లేదా ఇతర ఔషధాలను నింపుతారు.

సిగరెట్టు రేఖాచిత్రం1.95% సెల్యులోజ్ అసిటేట్‌తో చేసిన ఫిల్టర్.2.ఫిల్టర్‌ను కప్పే టిప్పింగ్ కాగితం.3ఫిల్టర్‌ను కప్పే రోలింగ్ కాగితం.4పూరకం

వాడకం[మార్చు]

యంత్రాల సాయంతో తయారు చేసిన సిగరెట్టులపై పన్నుల విధింపు అనేది కొంతమంది ధూమపాన ప్రియులకు ఆర్థికపరమైన ఇబ్బందులను తెచ్చి పెట్టే యూరప్ మరియు ఉత్తర అమెరికాలలో రోలింగ్ కాగితాలు పొగాకు వాడకానికి ఒక అతి ముఖ్యమైన ప్రత్యామ్నాయాలుగా మారాయి. దానికి తోడు, తమ సొంత సిగరెట్టులను చుట్టుకునే వారు వాటిని తమకు అనువైన రీతిలో కోరిన ఆకారం, పరిమాణం మరియు రూపంలో తయారు చేసుకోగలరు. రోలింగ్ కాగితాలు 70 మి.మీ - 110 మి.మీ పొడవులు మరియు దానికి తగిన వెడల్పులతో విక్రయించబడుతాయి.

రూపకల్పన[మార్చు]

రోలింగ్ కాగితాలకు సంబంధించిన వివిధ గుర్తులు

రోలింగ్ కాగితాల తయారీకి సర్వసాధారణంగా కలప గుజ్జు, జనపనార, అవిసె చెట్టు లేదా ధాన్యాన్ని ముఖ్యమైన పదార్థాలుగా ఉపయోగిస్తుంటారు. కొన్ని కంపెనీలు ఎస్‌పార్టో (ఎస్‌పార్టో పచ్చిక)ను ఉపయోగిస్తాయి. మండినప్పుడు ఇది కొంత వరకు క్యాన్సర్‌ను కలుగజేసే స్థాయికి చేరుకుంటుంది. ఏక కాగితం యొక్క ప్రధాన రూపకల్పన అనేది ఒక పొడవాటి దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది. ఒకానొక పొడవాటి అంచుల వెంబడి జిగురు లేదా బంకతో కూడిన ఒక పొడవాటి భాగం ఉంటుంది. పొడవైన, ధాన్యం ఆధారిత రోలింగ్ కాగితాలు కూడా తరచూ గంజాయి సిగరెట్‌‍లను తయారు చేయడానికి లేదా అత్యధిక నాణ్యత ఉన్న సిగరెట్టుల కోసం వ్యసనపరులు ఉపయోగిస్తారు. రోలింగ్ కాగితాలను చర్మాలు లేదా చుట్టలు (ఈ పదం చేతితో చుట్టిన సిగరెట్‌లను సూచించడానికి కూడా వాడబడుతుంది)గా కూడా పిలవబడుతాయి. అయితే స్కిన్నింగ్ అప్ (జాయింట్) అనే పదం సాధారణంగా ఒక గంజాయి సిగరెట్‌ను చుట్టే విధానాన్ని మాత్రమే తెలుపుతుంది.[1] కొత్తరకం రోలింగ్ కాగితాలు వివిధ సువాసనల్లో లభిస్తున్నాయి. ఇది ధూమపాన అనుభూతిని మరింత విస్తరించగలదని చెబుతుంటారు.

పరిమాణం[మార్చు]

USAలో విక్రయించే పలువురు తయారీదారులు విశిష్టతలుగా చెప్పబడే 1 (ఏకవ్యాప్త), 1¼ పరిమాణం, 1½ పరిమాణం మరియు “ద్వివ్యాప్త” (2 లేదా 2.0)లను సిగరెట్టు రోలింగ్ కాగితాలను బట్టి ఉపయోగిస్తున్నాయి. ఏదేమైనా, పరిశ్రమలో, ఈ విశిష్టతలు కొంతవరకు భిన్నమైన అర్థాలను కలిగి ఉన్నాయి. అంటే కరోనా వంటి పదం ఒక కచ్చితమైన పరిమాణాన్ని సూచించదు. అయితే దాని కంటే ఒక సాధారణ పరిమాణాన్ని తెలుపుతుంది. సిగరెట్టు కాగితాలకు సంబంధించి, వివిధ బ్రాండ్ల వారీగా పరిశీలిస్తే, ఈ విశిష్టతలను ఉపయోగించే కాగితాల వాస్తవిక వెడల్పులు అత్యధికంగా మారుతున్నాయి. ఉదాహరణకు, 1¼ విశిష్టతను సుమారు 1.7 అంగుళాల నుంచి 2 అంగుళాల వెడల్పు కలిగిన కాగితాలకు ఉపయోగిస్తారు. ఇక 1½ విశిష్టతను సుమారు 2.4 నుంచి 3 అంగుళాల వెడల్పున్న కాగితాలకు ఉపయోగిస్తారు. ఏదేమైనా, ఈ కాగితాల పొడవు మాత్రం ఎప్పుడూ 78మి.మీ (+/- 1మి.మీ)గా ఉంటుంది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో 1 1/4 కూడా "స్పానిష్ పరిమాణం" లేదా "ఫ్రెంచ్"గా సుపరిచితం.

మరోవైపు ఒక 1 1/4 పరిమాణం గల కాగితం ఒక 1 (ఏకవ్యాప్త) కాగితం కంటే కచ్చితంగా 25% పెద్దదిగా ఉండదు. ఈ పరిమాణ నామాలకు అర్థం ఉంది. వీటిని కచ్చితంగా వివరించడానికి ఒక ఉత్తమ మార్గంగా ఒక 1 1/4 అనేది ఒక ఏకవ్యాప్త కాగితం కంటే సుమారు 25% అధికంగా పొగాకును కలిగిన సిగరెట్టును చుట్టడానికి రూపొందించబడటాన్ని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఒక 1 1/2 పరిమాణం గల కాగితం ఒక ఏకవ్యాప్త కాగితం కంటే సుమారు 50% అదనపు పొగాకు కలిగిన సిగరెట్టును చుట్టడానికి రూపొందించబడుతుంది. ఒక 1 1/4 పరిమాణపు కాగితం అనేది 1 (ఏకవ్యాప్త) కాగితం కంటే పెద్దదిగా ఉంటుంది మరియు సహజంగా ఒక 1 1/2 పరిమాణం గల కాగితం 1 1/4 పరిమాణపు కాగితం కంటే పెద్దదిగానూ మరియు ద్వివ్యాప్త కాగితం ఒక 1 1/2 పరిమాణం గల కాగితం కంటే పెద్దదిగానూ ఉంటాయి.

కింగ్ సైజ్ అనేది మరొక బహుళార్థ పదం. ఒక కింగ్ సైజ్ సిగరెట్టు అనేది సాధారణంగా 84మి.మీ పొడవును కలిగి ఉంటుంది. కింగ్ సైజ్ రోలింగ్ కాగితం 100మి.మీ లేదా 110మి.మీ పొడవును కలిగి ఉంటుంది.

వినియోగం[మార్చు]

అమెరికా సంయుక్తరాష్ట్రాలలో టుబాకోనిస్ట్ మేగజైన్ పొగాకు రోల్ యువర్ ఓన్ (RYO)ను సూచించింది. ఇది పొగాకు పరిశ్రమ యొక్క శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న విభాగం. 2-4% మంది US సిగరెట్టు కాల్చేవారు లేదా సుమారుగా 2.6 మిలియన్ల మంది సొంతంగా సిగరెట్టులను తయారు చేసుకుంటున్నట్లు ఇది అంచనా వేసింది. తయారీ సిగరెట్టులపై అధిక పన్నుల కారణంగా వీరిలో అనేక మంది సొంతంగా తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టారు.[2]

2000లో ఒక కెనడా ప్రభుత్వ సర్వే కెనడా యొక్క 6 మిలియన్ల ధూమపానపరుల్లో 9% మంది చేతితో తయారు చేసిన సిగరెట్టులను కాల్చుతున్నట్లు వెల్లడయింది. "కొన్నిసార్లు లేదా అనేక మార్లు" 7% మంది రోల్ యువర్ ఓన్స్‌ను ప్రత్యేకంగా వాడుతున్నారు మరియు కెనడాలో విక్రయించబడుతున్న 90% పైగా రోలింగ్ కాగితాలు పొగాకు వినియోగానికి ఉద్దేశించినవి కావడం గమనార్హం. తాజాగా 2009లో నిర్వహించిన ఒక అధ్యయనం సుమారుగా 925,000 మంది కెనడియన్లు వారి సిగరెట్లను వారే సొంతంగా చుట్టుకుంటున్నట్లు వెల్లడించింది.[3]

ది పబ్లికన్ ప్రకారం, "తక్కువ ధర RYO అనేది ఆశ్చర్యకరమైన రీతిలో [2007]లో 175 శాతం అభివృద్ధి చెందింది. అందుకు కారణం సిగరెట్టు కాల్చేవారు చౌకగా లభించే ప్రత్యామ్నాయాల వైపు చూడటం మరియు వారి ధూమపాన పరిమాణాన్ని నియంత్రించుకోవడం".[4] బ్రిటన్‌కి చెందిన నేషనల్ హెల్త్ సర్వీసు (జాతీయ ఆరోగ్య సేవ) రోల్ యువర్ ఓన్ వినియోగం 1990లో రెండింతల కంటే అంటే 11% నుంచి 24%కి మించిపోయిందని వెల్లడించింది. వీరిలో అనేక మంది ధూమపానపరులు చేతితో చుట్టిన సిగరెట్టులు (యంత్రాల సాయంతో) కంపెనీలు తయారు చేసిన వాటి కంటే ఆరోగ్యవంతమైనవని కచ్చితంగా విశ్వసించారు.[5]

థాయ్‌లాండ్‌లో రోల్ యువర్ ఓన్ ధూమపానపరులు తయారీ బ్రాండ్ల,[6] కంటే అధికంగా మించిపోయారు. ధూమపానం చేసేటప్పుడు బంక లేని చౌకైన కాగితాలను వేళ్ల మధ్య స్థిరంగా ఉంచవచ్చు. 2005లో న్యూజిలాండ్ ఈ విధంగా వెల్లడించింది: న్యూజిలాండ్ వాసులు వాడే రోల్ యువర్ ఓన్‌కు తయారీ లేదా పక్కా పరిమాణాలతో తయారు చేసిన సిగరెట్లకు మధ్య నిష్పత్తి (కనీస) గత దశాబ్దంలో పెరిగింది. ఈ ఉత్పత్తుల మధ్య ధర తేడాలు బహుశా ప్రతిబింబించి ఉంటాయి. అంతేకాక ప్రస్తుతం మొత్తమ్మీద 50 శాతానికి చేరుకుంటోంది. [7]

పన్నుల విధింపు[మార్చు]

వినియోగదారులు రోల్ యువర్ ఓన్‌కు మారడం అనేది కొన్ని పన్ను విధింపు సంస్థల ఫలితమే. అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో, ఇండియానా మరియు కెంటక్కీ రోలింగ్ కాగితాలపై పన్ను విధిస్తున్నాయి. తయారీ సంస్థల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పటికీ, కెంటక్కీ 2006లో తన పన్నును ఒక్క ప్యాక్‌పై (అంటే సుమారు 32 సిగరెట్లకు, పెద్ద ప్యాక్‌లపై ఒక్కో సిగరెట్టుపై $0.0078) $0.25గా విధించింది.

నియంత్రణ[మార్చు]

USAలో సిగరెట్టు రోలింగ్ కాగితాలను విక్రయిస్తున్న ప్రతి ఒక్క బ్రాండ్ (ప్రైవేటు లేబుళ్లు సహా) తమ మిశ్రమ పదార్థాల వివరాలను సత్వరమే సమర్పించడం మరియు మార్చి, 2011 కల్లా మార్కెట్ నుంచి ఏజెన్సీ అనుమతి లేదా ఉపసంహరణను తీసుకోవాలి. అలా కాకుండా అవి (రోలింగ్ కాగితాలు) గనుక USAలో విక్రయించకుంటే, అప్పుడు ఫిబ్రవరి 15, 2007లోగా అనుమతి తీసుకోవాలని FDA తాజాగా స్పష్టం చేసింది.[8]

అభివృద్ధులు[మార్చు]

ఖర్చులు తగ్గించుకునేందుకు స్పానిష్ బ్రాండ్, స్మోకింగ్ ఎస్‌పార్టో వంటి చట్టవిరుద్ధమైన క్యాన్సర్ కారక పదార్థాలను తమ సిగరెట్టు కాగితాల్లో ఉపయోగిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంది. అయితే ఎప్పుడూ దోషిగా తేలకపోవడం గమనార్హం.[9]

అగ్ని నిరోధక ప్రయోజనాలు[మార్చు]

విస్మరించబడిన సిగరెట్ల నుంచి అగ్ని ప్రమాదాన్ని తగ్గించే అగ్ని నిరోధక సిగరెట్లు ప్లాస్టిక్ సమ్మేళనం, ఎథిలీన్ వినైల్ అసిటేట్ కలిగిన ఒక ప్రత్యేక కాగితంతో తయారు చేయబడుతాయి. ఈ రకమైన కాగితంతో తయారు చేయబడిన ఏదైనా ఒక సిగరెట్టు విస్మరించబడితే, ఆ కాగితంలోని ప్లాస్టిక్ పదార్థం సిగరెట్టు స్వయంకృతంగా ఆరిపోయేందుకు దోహదపడుతుంది.

ఇతర ఉపయోగాలు[మార్చు]

రోలింగ్ కాగితాన్ని సిగరెట్లను చుట్టడానికి మాత్రమే కాక మరిన్ని వాటికి కూడా ఉపయోగిస్తారు:

 • పొటాషియం నైట్రేట్‌లో ముంచిన తర్వాత దహనశీల ఒక తరహా ముతక కాగితంను తయారు చేసే దిశగా రోలింగ్ కాగితాన్ని ప్రధాన గుండు (పడిగల్లు)కు అమర్చుతారు.[10]
 • ఇదొక చౌకైన కట్టు (పట్టీ)గా కారడాన్ని ఆపుతుంది.[11]
 • వుడ్‌విండ్ పరికరాల వాద్యకారులు రోలింగ్ కాగితాన్ని కీప్యాడ్‌లు లేదా అతుకుల వద్ద చేరే తేమను తొలగించే దిశగా ఒక అద్దుడుగా ఉపయోగిస్తారు.[12] కొందరు సన్నాయి వాద్యకారులు మడతపెట్టిన రోలింగ్ కాగితపు ముక్కను పెదవిపై సన్నాయి భారం నుంచి వచ్చే ఒత్తిడి వల్ల దిగువ ఆధారం దెబ్బతినకుండా రక్షించడానికి వాటికి ముందు భాగంలో దిగువన ఉండే రెండు పళ్లపై ఉపయోగిస్తారు.
 • కంప్యూటర్ సహాయక తయారీలో రంధ్రాలకు కుడి స్థాయిని ఏర్పరచడానికి. యంత్రం పనిచేసే విధంగా వస్తువుపై కాగితాన్ని ఉంచడం మరియు కాగితాన్ని తాకేంత వరకు రంధ్రం దిగువకు వేయబడుతుంది. ఎందుకంటే, కాగితం చాలా పలచగా ఉంటుంది. అందువల్ల రంధ్రానికి ఒక కచ్చితమైన ప్రారంభ స్థానం పొందడానికి ఇదే సులువైన మార్గం.
 • పలకలు (పెంకులు) వేసిన గోడలో అంతర్గత పగులు కాలక్రమంలో మరింత పెద్దది కాకుండా ఆపుతుందా అనే విషయాన్ని దానికి పక్కనే అనుకుని ఉన్న పలక(ల)ను కొద్దిగా తడపడం మరియు ఖాళీపై బంకతో కూడిన రోలింగ్ కాగితాన్ని ఉంచడం ద్వారా గమనించవచ్చు. పగులు గనుక అప్పటికీ పూర్తిగా స్థిరం కాకపోతే అనార్థ్రక జిగురు ముక్క కొద్ది నెలల్లోనే పగిలిపోతుంది.
 • DJలు రికార్డు యొక్క ఒక వదులైన మధ్య రంధ్రాన్ని బిగించడానికి కాగితాన్ని కదురు (స్పిండిల్)పై ఉంచడం మరియు రికార్డు పై నుంచి దిగువకు వచ్చే విధంగా చేయబడుతుంది. పెద్దదిగా ఉండే మధ్య రంధ్రం వల్ల పార్శ్విక కదలిక నుంచి ముళ్లు జారిపోకుండా ఇది నివారిస్తుంది.
 • అవి స్వయంకృతంగా ఒక పరికరంగా కూడా ఉపయోగపడుతాయి. దానిని మడవటం ద్వారా మరియు దానిని పిళ్లనగ్రోవి మాదిరిగా ఉపయోగించడం ద్వారా. అంటే ఎవరైనా ఒక వ్యక్తి పచ్చిగడ్డి, పల్చని కలకండ చుట్టలు లేదా ఇతర పల్చని ప్లాస్టిక్ మరియు అదే వాటితో చేయగలిగే విధంగా.
 • అనేక మంది ఫోటోగ్రాఫర్లు వాటిని వాడిపారేసే కటకాలను శుభ్రపరిచేవిగా ఉపయోగిస్తున్నారు. కటకాలపై వేసిన పూత దెబ్బతినే సాధ్యత వల్ల అలా చేయడానికి కొంతమంది అనాసక్తి చూపిస్తారు. ఏదేమైనా, ఇతర పదార్థాలను ఉపయోగించినా కూడా ఇది జరుగుతుంది. ఛాయాచిత్రసంబంధ కఠకాలను శుభ్రపరచడానికి సిగరెట్ కాగితాన్ని వాడటం వల్లే కలిగే ప్రభావాలు

విపరీతంగా తరచూ సుదీర్ఘకాలంలో వాడితే తప్ప తగ్గిన చిత్ర నాణ్యతా రూపంలో గుర్తించబడవు.[ఉల్లేఖన అవసరం]

 • రోలింగ్ కాగితాన్ని ముఖంపై ఉండే చమురును తొలగించేందుకు వాడే అద్దుడు కాగితానికి చౌకైనా ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగిస్తారు.[13]
 • ఒక పుస్తకంలో చిరిగిన పేజీని అతికించడానికి రోలింగ్ కాగితాలను అద్భుతమైన మార్గంగా చెబుతారు. చీలికను బాగుచేసే ముక్కను చింపేసి, దానిని పూర్తిగా తడిపి, పేజీపై అథోముఖంగా నొక్కాలి. అది ఎండగానే, అది ఇంచుమించు పారదర్శకంగానూ మరియు ఒక కాగితపు మార్పిడిగా పనిచేస్తుంది.
 • అల్ప ఉష్ణోగ్రత భౌతికశాస్త్రవేత్తలు కొన్నిసార్లు రోలింగ్ కాగితాన్ని ఒక హీట్-సింక్ (వాహకం)‌గా వాడుతారు. ఇది GE వార్నీషును పీల్చుకుని, అల్ప ఉష్ణోగ్రత లోహ శలాకానికి అంటుకుంటుంది. తద్వారా వైరు లేదా శాంపిల్ మరియు శలాకానికి మధ్య ఒక విద్యుత్ అవాహకంగా పనిచేస్తుంది. ఏదేమైనా, ఇది చాలా పలచగా ఉండటం వల్ల, ఇదొక ఉష్ణ వాహకంగా పనిచేస్తుంది. అందువల్ల వైరు లేదా శాంపిల్‌ తక్కువ ఉష్ణోగ్రత వద్ద కొనసాగేలా చేస్తుంది.
 • పరికరంతో పాటు వచ్చినది కన్పించకుండా పోతే, రోలింగ్ కాగితాలను ENT ఆపరేషన్లలో 'వాత (కాటీరీ)' కోసం ఉపయోగిస్తారు.

ప్రముఖ బ్రాండ్‌లు[మార్చు]

 • అబాడై - (ఫ్రాన్స్ 1840) పింక్ ప్యాక్
 • బాంబు రోలింగ్ పేపర్స్ - (స్పెయిన్ 1764)
 • అమెరికా సంయుక్తరాష్ట్రాలలోని బగ్లర్ - (ఫ్రాన్స్), ఒక విలువైన బ్రాండ్, ఒక్కో ప్యాక్‌కు 115 సిగరెట్లు (చుట్టినవి), రోలిట్ మరియు TOPలతో పోటీ పడుతోంది. ఇది ఒకప్పుడు అంటే ధూమపానం అనుమతిస్తున్నప్పుడు, U.S. కారాగాలలో ప్రసిద్ధి.
 • ఎలిమెంట్స్ (స్పెయిన్ 1996) మొట్టమొదటి అత్యంత పలచని ధాన్యపు కాగితం ఇది తన అయస్కాంత ముగింపు వ్యవస్థ పరంగా ప్రసిద్థి.
 • JOB (ఫ్రాన్స్ 1834), పుస్తక రూపంలో విడుదలైన మొట్టమొదటి రోలింగ్ కాగితం సరూప ఆర్ట్ నోవియా ప్రచార ప్రకటనల పరంగా ప్రసిద్ధి.
 • జ్యూసీ జయ్స్ - సువాసనతో కూడిన కాగితపు బ్రాండ్. ఇది గ్రాండ్మాస్ బాయ్ చలనచిత్రంలోని కథాంశంలో భాగంగా ఇది ప్రసిద్ధి.
 • OCB - (ఫ్రాన్స్ 1918) తెలుపు రంగు ప్యాక్
 • RAW - (స్పెయిన్ 2005) వర్ణరహిత శాకాహార రోలింగ్ కాగితాలు. లక్షణాలను అనుసరించి కపిలవర్ణంలో అగుపించేవిగా ఇవి ప్రసిద్ధి.
 • RizLa+ - 1532, ఫ్రాన్స్‌లో బేగన్, ఇప్పుడు ఇంపెరియల్ టుబాకో, UK కోసం బెల్జియంలో తయారు చేయబడింది మరియు ఇది UK రోలింగ్ కాగితపు మార్కెట్‌లో 75% ఆక్రమించింది.
 • పే-పే - అల్కాయ్ స్పెయిన్‌కి చెందిన పాత బ్రాండ్
 • రోలిట్ - RBA కోసం బెల్జియంలో తయారు చేయబడింది. ఇది ఇంపెరియల్ టుబాకో, UK యొక్క U.S. అనుబంధ సంస్థ. ఇదొక విలువైన బ్రాండ్‌గా ఒక ప్యాక్‌కు 100 సిగరెట్లు (చుట్టినవి) కలిగి ఉంటుంది. బగ్లర్ మరియు TOP కంపెనీలతో ఇది పోటీపడుతోంది.
 • స్మోకింగ్ - (స్పెయిన్), యూరప్‌లోని కొన్ని ప్రాంతాలు మరియు మధ్యప్రాశ్చ్యలో ప్రసిద్ధి.
 • ట్యాలీ-Ho - బెల్జియంలో తయారు చేయబడింది. ఆస్ట్రేలియాలో, దేశభక్తి ద్వారా ఇది సుపరిచితం.
 • TOP - (ఫ్రాన్స్). ఇది అమెరికా సంయుక్తరాష్ట్రాలో ఉన్న ఇది ఒక విలువైన బ్రాండ్‌గా

ఒక్కో ప్యాక్‌కు 100 సిగరెట్లు (చుట్టనివి). బగ్లర్ మరియు రోలిట్ కంపెనీలతో దీనికి పోటీ.

 • జిగ్-జాగ్ - (ఫ్రాన్స్) మొట్టమొదటి ఇంటర్‌లీవ్డ్ (మధ్య మధ్య వట్టి కాగితాలు తగిలించబడ్డ) బ్రాండ్ (అందువల్లే దీనికి ఈ పేరు వచ్చింది). ప్యారిస్‌‌లోని 1900 యూనివర్శల్ ఎక్స్‌పొజిషన్ వద్ద గాడ్ మెడల్.
 • మాస్కోటి - (జర్మనీ). నెదర్లాండ్స్‌లోని అత్యంత ప్రసిద్ధిగాంచిన ఏకవ్యాప్త రోలింగ్ కాగితం.

సూచనలు[మార్చు]

 1. నిక్ జోన్స్, "స్కిన్నింగ్ అప్" ఇన్ "స్పిల్ఫ్స్: ఎ సెలబ్రేషన్ ఆఫ్ కన్నాబిస్ కల్చర్ ", కొలిన్స్ & బ్రౌన్, 2003: పేజీలు. 94-133.
 2. ఐవర్ పీటర్సన్, "రోల్-యువర్-ఓన్స్ కట్స్ టాక్సెస్ ", న్యూయార్క్ టైమ్స్, అక్టోబరు 14, 2002.TTB స్టాట్స్.
 3. [1]
 4. ది పబ్లికన్ - హోమ్ - టుబాకో సేల్స్ డ్రాప్స్ ఇన్ స్కాట్లాండ్.
 5. BBC, "స్మోకర్ పోల్ రివీల్స్ రోల్-అప్స్ మిత్ ", మే 30, 2006 ఆన్‌లైన్ కాపీ.
 6. "సిగరెట్ కన్జంప్షన్" , థాయ్‌లాండ్ హెల్త్ ప్రమోషన్ ఇన్‌స్టిట్యూట్ PDF డాక్యుమెంట్.
 7. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, "సీయింగ్ త్రూ ది స్మోక్: టుబాకో మానిటరింగ్ ఇన్ న్యూజిలాండ్ " , పబ్లిక్ హెల్త్ ఇంటలిజెన్స్: అకేషనల్ బుల్లెటిన్ (26), 2005 PDF పత్రం.
 8. http://www.fda.gov/downloads/TobaccoProducts/GuidanceComplianceRegulatoryInformation/UCM239021.pdf
 9. (Spanish లో) "El fabricante de 'Smoking' niega que su papel de fumar lleve productos cancerígenos". 20 minutos. 2006-07-19. Retrieved 2007-06-16. Cite web requires |website= (help)
 10. జానీ బేట్స్ మరియు మైక్ కంప్స్‌టన్, "పెర్క్యూజన్ పిస్తోల్స్ అండ్ రివాల్వర్స్: హిస్టరీ, పెర్ఫార్మెన్స్ అండ్ ప్రాక్టికల్ యూజ్", iUniverse, 2005: పేజీ. 75.
 11. ఆంథోనీ కావెండర్, "ఫోక్ మెడిసిన్ ఇన్ సదరన్ అప్పలాచియా", యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా ప్రెస్, చాపెల్ హిల్: 2003, పేజీ. 98.
 12. మేఘన్ డామ్, "మ్యూజిక్ ఈజ్ మై బ్యాగ్", హార్పర్స్ మేగజైన్, మార్చి, 2000.
 13. [2]

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.