చుట్నీ మహతో
ఛుట్నీ మహతో, (జననం 1959) ఈమెను ఛుట్నీ దేవి అని కూడా పిలుస్తారు. ఈమె జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త. ఒకప్పుడు మంత్రగత్తె అనే ముద్రతో వేధింపులకు గురైన ఈమె, ఇప్పుడు అటువంటి బాధితులకు అండగా నిలుస్తూ మూఢనమ్మకాలు, మంత్ర విద్యలపై అవగాహన కల్పిస్తున్నారు.[1] సామాజిక సేవలో ఈమె చేసిన కృషిని గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2021లో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో గౌరవించింది.[2]
జీవిత విశేషాలు
[మార్చు]మహతో 1959లో జార్ఖండ్‌లోని సెరైకెలా ఖర్సావాన్ జిల్లా భోలాడిహ్ గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే వివాహం జరిగిన ఈమెపై, 1995లో ఒక కుటుంబ సభ్యుడికి జబ్బు చేయడంతో మంత్రగత్తె అనే ముద్ర వేశారు. గ్రామస్థులు ఈమె ఆస్తిని లాక్కొని లైంగిక వేధింపులకు గురిచేశారు. మూత్రం తాగించడం, సగం నగ్నంగా ఊరేగించడం వంటి అమానుష చర్యలకు పాల్పడ్డారు. ప్రాణభయంతో పారిపోయిన ఈమె తన పుట్టింటికి చేరుకున్నారు.[1] న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేయడానికి వారు పెద్ద మొత్తంలో లంచం అడిగారు.[3] ఒక ఐఏఎస్ అధికారి సహాయంతో మంత్రగత్తె వేట నిర్మూలనపై పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలతో ఈమెకు పరిచయం ఏర్పడింది.[3] అప్పటి నుండి రెండు దశాబ్దాలుగా జార్ఖండ్‌లోని మూఢనమ్మకాలపై ఈమె పోరాటం సాగిస్తున్నారు.[4] తన కుమార్తెలను కూడా ఈ సామాజిక దురాచారానికి వ్యతిరేకంగా పోరాడేలా సిద్ధం చేశారు. 1996లో ఈమె జీవితం, సామాజిక సేవపై ఒక డాక్యుమెంటరీ నిర్మించారు.[3] 2014లో వచ్చిన "కాల సచ్ - ది డార్క్ ట్రూత్" అనే బాలీవుడ్ సినిమా ఈమె జీవిత ప్రేరణతో రూపొందిందని చెప్పబడింది. ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ నిర్మాణంలో ఉంది.
2019లో జార్ఖండ్ రాష్ట్రంలో మంత్రగత్తె ఆరోపణల కారణంగా 27 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు.[1] నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2016 నుండి 2019 మధ్య భారతదేశంలో ఇటువంటి ఘటనల్లో 372 మంది హత్యకు గురయ్యారు.[5]
మూలాలు
[మార్చు]- 1 2 3 Bisoee, Animesh (29 జనవరి 2021). "Branded 'Witch' Years Ago, Chutni Mahato from Jharkhand is Now a Padma Awardee". News18 (in ఇంగ్లీష్). Archived from the original on 29 జనవరి 2021. Retrieved 8 నవంబరు 2021.
- ↑ Ranjan, Mukesh (31 జనవరి 2021). "This Jharkhand woman leads war against social evil 'witchcraft', rescues over 120 women". The New Indian Express. Archived from the original on 31 జనవరి 2021. Retrieved 8 నవంబరు 2021.
- 1 2 3 Sarkar, Debashish (26 జనవరి 2021). "Jharkhand woman gets Padma Shri for saving women branded as witches". Hindustan Times (in ఇంగ్లీష్). Archived from the original on 26 జనవరి 2021. Retrieved 8 నవంబరు 2021.
- ↑ "Committed to root out superstition and evil practices: Padma Shri Chutni Mahato". The Avenue Mail (in అమెరికన్ ఇంగ్లీష్). 19 ఫిబ్రవరి 2021. Retrieved 8 నవంబరు 2021.
- ↑ Shukla, Ashwini (3 ఫిబ్రవరి 2021). "Exorcising Evil: Chutni Mahato from Birbans in Jharkhand awarded the Padma Shri for her fight against witch-hunting". GaonConnection. Archived from the original on 3 ఫిబ్రవరి 2021. Retrieved 8 నవంబరు 2021.