Jump to content

చూడాలని వుంది

వికీపీడియా నుండి
చూడాలనివుంది
దర్శకత్వంగుణశేఖర్
రచనగుణశేఖర్, దివాకర్ బాబు (సంభాషణలు)
నిర్మాతసి. అశ్వనీదత్
తారాగణంచిరంజీవి,
సౌందర్య,
అంజలా జవేరి,
ప్రకాష్ రాజ్
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
సంగీతంమణి శర్మ
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
ఆగస్టు 27, 1998 (1998-08-27)
భాషతెలుగు

చూడాలని ఉంది 1998లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. చిరంజీవి, సౌందర్య, ప్రకాష్ రాజ్, అంజలా జవేరి ఇందులో ప్రధాన పాత్రధారులు.[1]ఈ చిత్రాన్ని సి. అశ్వనీదత్ వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మించాడు. దివాకర్ బాబు మాటలు రాశాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకత్వం వహించగా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత, హరిహరన్, ఉదిత్ నారాయణ్, స్వర్ణలత, శంకర్ మహదేవన్, చిత్ర పాటలు పాడారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు. ఈ చిత్ర సంగీతానికి గాను మణిశర్మకు నంది పురస్కారం, ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు.

రామకృష్ణ అనే వ్యక్తి కలకత్తాకు కొత్తగా రావడంతో కథ మొదలవుతుంది. బెంగాలీ భాష తెలియక ఇబ్బంది పెడుతూ ఒక చిన్న అపార్టుమెంటుకు చేరుకుంటాడు. అక్కడ ఇద్దరు తెలుగు వాళ్ళు ఆ అపార్టుమెంటును నిర్వహిస్తూ ఉంటారు. వారితో మాట్లాడి ఎప్పట్నుంచో అద్దె కట్టకుండా ఓ గదిలో ఉంటున్న పద్మావతి అనే తెలుగు అమ్మాయితో పాటు గదిలో దిగుతాడు. పద్మావతిని ప్రేమ పేరుతో మోసం చేసి పారిపోయి ఉంటాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గుణశేఖర్
  • మాటలు: దివాకర్ బాబు
  • కెమెరా: ఛోటా కె. నాయుడు
  • కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
  • కళ: తోట తరణి
  • నృత్యాలు: రాఘవ లారెన్స్, సరోజ్ ఖాన్
  • పోరాటాలు: ఎస్. విజయన్

విశేషాలు

[మార్చు]
  • సినిమాలో చాలాభాగం కలకత్తాలో చిత్రీకరించారు.
  • ఈ సినిమాలో " రామ్మా చిలకమ్మా " అనే పాట ఉదిత్ నారాయణ్ కు తెలుగులో మొదటి పాట. ఆ పాట చాలా హిట్ అయ్యింది.

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకత్వం వహించగా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత, హరిహరన్, ఉదిత్ నారాయణ్, స్వర్ణలత, శంకర్ మహదేవన్, చిత్ర పాటలు పాడారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు, చంద్రబోస్ పాటలు రాశారు.[2] మణి శర్మకు నంది పురస్కారంతో పాటు ఫిల్మ్ ఫేర్ పురస్కారం కూడా దక్కింది.

  • అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ముద్దు (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత)
  • యమహా నగరి (గాయకుడు: హరిహరన్)
  • రామ్మా చిలకమ్మా (గాయకులు: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత)
  • ఒ మారియ ఒ మారియ (గానం: శంకర్ మహదేవన్)
  • మనస్సా ఎప్పుడొచ్చావ్ (గాయకులు: బాలు, సుజాత)
  • సింబలే సింబలే (గాయకులు: బాలు, చిత్ర)

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Choodalani Vundi box office report Archives". Telugu360.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-11-24.
  2. "Megastar Chiranjeevi Choodalani Vundi Completes 21 Years". Thetelugufilmnagar (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-08-27. Retrieved 2020-11-24.