చెంచులు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితా లో 3వ కులం. హరిదాసులు , బుడబుక్కల , కాటికాపరులు , బోయ , కోయ , ఎరుకల , యానాది , లంబాడి మొదలైన ఆదిమ జాతుల్లో చెంచు కూడా ఒకటి. వీరు పూర్తిగా ఆదివాసీలు. ఆంధ్రప్రదేశ్‌లోని చెంచు తెగ ప్రాచీన సంచార తెగలలో ఒకటి. నల్లమల ప్రాంతంలోని కొండలు, గుట్టలే చెంచుల ప్రస్తుత నివాస స్థలం. అంటే కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో చెంచులు విస్తరించి, అటు నిజాం రాజ్యానికీ, యిటు బ్రిటిషు పరిపాలనలోని మద్రాస్ ప్రెసిడెన్సీ‌కి సరిహద్దుగా ఉన్నకృష్ణానదికి ఇరువైపులా వున్న ప్రాంతాల్లో కనిపించేవారు. చెంచులు తెలుగు కూడా మాట్లాడతారు. శ్రీలంకలోని ప్రాచీన తెగ అయిన వెద్దా (vedda) ల మాదిరిగానే చెంచులు కూడా రింగుల జుత్తు, విశాల వదనం, చప్పిడి ముక్కు, పొడవాటి దవడతో పొట్టిగా, నల్లగా ఉంటారు. శరీరాన్ని తమ పూర్వీకులలాగా ఆకులతో చుట్టుకోవడం ఇప్పుడు లేకపోయినా, మగవాళ్ళు గోచీ మాత్రమే పెట్టుకుంటారు. ఆడవాళ్ళు నూలు రవిక, చీర కట్టుకుంటారు.అడవి చెంచుల కన్నా నిరుపేదలు మొత్తం భారతదేశంలోనే ఉండరు. విల్లంబులు, వొక కత్తి, గొడ్డలి, గుంతలు తవ్వే కర్ర, కొన్ని కుండలు, బుట్టలు, మరికొన్ని చింకిపాతలు - యివే చెంచుల సమస్త ఆస్తిపాస్తులు. చెంచుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ,స్వాతంత్రం అన్న భావనలు బలంగా కనిపిస్తాయి. చెంచులు వేటనూ, అడవి పండ్లనూ ప్రసాదిస్తుందని విశ్వసించే ఒక దేవతను పూజిస్తారు. హిందువులు పరమాత్మగా పూజించే భగవంతుడిలో కొన్ని లక్షణాలతో సారూప్యం ఉన్న ఒక "ఆకాశదేవుణ్ణి" కూడా చెంచులు పూజిస్తారు. జీవితం దేవుడి వరప్రసాదమేననీ, మరణించిన జీవుడు దేవుడిలో కలిసిపోతాడనీ, చెంచులు బలంగా నమ్ముతారు. హిందూ సమాజ సంపర్కం వల్లే యీ విశ్వాసాలన్నీ చెంచుల ఆలోచనా విధానాల్లోకి ప్రవేశించాయి. అప్పటికప్పుడే ఆశువుగా పాటలు పాడుతూ స్త్రీ పురుషులు నృత్యం చేస్తారు. వీరి ఆటల్లో సింగి సింగడు ప్రధాన పాత్రధారులు, నాయికా నాయకులు. డప్పుకు తగినట్టుగా గంతులేస్తారు. ఇప్పపువ్వు సారా తాగితే మైమరచి కుప్పిగంతులేస్తారు. నెమలి నృత్యం, కోతి నృత్యం వీరి నృత్యాల్లో ముఖ్యమైనవి. చెంచుల కథలు కూడా పూర్వం ప్రసిద్ధి చెందిన జానపద కళల్లో ఒకటి.

వేటాడుతున్న చెంచు
 • పావనంబైన తమిలేటి పరిసరమున

వేగి కురువాటికా దేశ విపినభూమి గోవులనుపేరి చెంచుల కులమునందు గడిమికత్తుల నా గలుగ గమ్మి యలదు - (వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామం)

 • విలు నమ్ముల్‌ ధరియించి చెంచులు తదాభీలాటవీ మధ్య భూ

ముల కన్పట్టిన నంజలింపుము మహాత్ముండైన భర్గుండు భ క్తుల కిష్టార్థము లీయగోరిన గణస్తోమంబుతో మాయ పం దుల వేటాడుచు భిల్లుడై నరుల కన్నుల్‌ గప్పి క్రీడించెడిన్‌ - ( గుర్రం జాషువా గబ్బిలం)

 • బోయలు, చెంచులు మొదలైన వాళ్ళకి పాలన్నం పెట్టినంత మాత్రాన విశ్వాసవంతులౌతారు. ఐతే వాళ్ళకి కోపం రావటం కూడ చాలా తేలికే. వాళ్ళ విషయంలో మంచితనంతో ఉండాలి.-యామునిడి రాజనీతి సూత్రాలు
 • వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు చెంచులను విందుకు పిలిచి వాళ్ళు భోజనం చేశాక 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి నరికించాడనీ అందుకే ఆ వధ జరిగిన ఊరి పేరు నరుకుళ్ళపాడు గా మారిందనీ తరువాత తాను చేసిన హత్యలకు పశ్చాత్తాపపడి గుళ్ళూ గోపురాలూ కట్టించాడనీ చరిత్ర..
 • ఆదిమ గిరిజన జాతి అయిన చెంచులు అంతరించిపోతున్నారు. నల్లమల అడవికి మాత్రమే పరిమితమైన ఈజాతి క్రమంగా కాల గర్భంలో కలిసిపోతోంది.(సాక్షి 21.10.2008)
 • అస్తిత్వ ప్రమాదంలో చెంచులు (ఆంధ్రజ్యోతి 28.12.2008)

క్షయ, మలేరియా వంటి వ్యాధుల మూలంగా చెంచులు మరణిస్తున్నారు. సంతాన లేమి కూడా ప్రధాన సమస్యగా మారింది. అతి ప్రాచీన ఆదివాసి తెగయైన చెంచు జాతి అస్తిత్వానికే ముప్పు ఏర్పడుతున్నది. మహబూబ్ నగర్, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, నల్గొండ జిల్లాల్లోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వేల సంవత్సరాలుగా జీవిస్తున్నారు చెంచులు.రాష్ట్రంలోని మిగతా జన సమూహాలతో కానీ, ఇతర గిరిజన తెగల తో కానీ, చెంచు తెగకు దగ్గరి పోలికలు లేవు. వీరి మనస్తత్వాలు, అలవాట్లు, మానసిక, శారీరక స్థితిగతులు, సంస్కృ తి భిన్నమైనవి.నల్లమ ల అటవీ ప్రాంతంలోని ఐదు జిల్లాలను పులుల అభయారణ్యంగా ప్రకటించి, శాశ్వత నిర్మాణాలు లేని 'నో మాన్ లాండ్'గా ప్రకటించారు. చెంచు పెంటలను పునరావాసం పేరి ట అడవి బయటకు పంపించవద్దని జి.సి.సి నిర్వహణను చెంచు యువతకు అప్పగించాలని వీరు కోరుతున్నారు.చెంచుల వ్యవసాయ భూములు అధికభాగం అన్యాక్రాంతమయ్యాయి. అంతేకాక వీరి విలువైన వనరులు గిరిజనేతరుల చేతికి పోయాయి.చెంచుల ఇలవేల్పులైన శ్రీశైలం మల్లికార్జున స్వామి, అహోబిళ లక్ష్మీనరసింహ్మ స్వామి దేవాలయాలు వందల సంవత్సరాలుగా చెంచుల సంరక్షణలోనే ఉండేవి. చెంచులు వీటిని వారసత్వ సంపదగా భావించుకుంటారు. చెంచుల గజ్జల కొండడు, మల్లయ్య తాత దొర వంటి వారు శ్రీశైలం మల్లన్న అర్చకులు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో జరిగే పూజాకార్య క్రమంలో చెంచులకు ప్రత్యేక స్థానం వున్నది. వీరు పార్వతీ దేవిని తమ ఆడపడుచుగా భావిస్తారు. శ్రీశైల మల్లన్న సన్నిధిలో చెంచులకు ఉద్యోగాలివ్వాలని కోరుతున్నారు.

అభివృద్ధి అంతా పైపైనే - గుడిసెల్లోనే నివాసం .. పక్కా ఇళ్లకు తాళం[మార్చు]

 • గిరిజనుల్లో ప్రత్యేకత కలిగిన ఒక వర్గం. వారిలో ఎక్కువ మంది బంధువులే. అయినా ఒకటిగా కలిసుండేందుకు ప్రయత్నించరు. ఇతర గిరిజనుల మాదిరిగానే వారు కూడా అభివృద్ధికి దూరంగా ఉండేందుకే మొగ్గు చూపిస్తారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గూడేల్లో నివసిస్తున్నప్పటికీ ఆ అభివృద్ధిని అందుకోవడంలో వారు వెనుకబడే ఉంటున్నారు. ఇక మారుమూల దట్టమైన కీకారణ్యంలో ఉన్న చెంచుల మాట చెప్పనక్కర్లేదు. అటు పౌష్టికాహారం, ఇటు వైద్యంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. అంతా కలిసి ఒకటిగా ఉండేందుకు చొరవ చూపించకపోవడం, ప్రభుత్వం కట్టించిన పక్కా ఇళ్లలో నివసించేందుకు ఇష్టపడకపోవడం, స్వచ్ఛమైన నీరు లభించకపోవడం వంటి అంశాలు చెంచులను వేధిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం నుండి కూడా అవసరమైన ప్రణాళిక లేకపోవడంతో అరణ్యంలో సమస్యల మధ్యనే చెంచులు కాలం వెళ్లదీస్తున్నారు. ఒకరిద్దరు చెంచులు కూడా ఒక గూడేన్ని ఏర్పాటుచేసుకుని ముందుకు సాగడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.
 • చెంచులు ప్రధానంగా నల్లమలలోనే కనిపిస్తారు. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో కొంతమంది చెంచులు నివశిస్తున్నప్పటికీ 80 శాతానికిపైగా నల్లమలలోని నాలుగు జిల్లాల అటవీ ప్రాంతంలోనే కనిపిస్తున్నారు. మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 42 వేల మంది చెంచులు నివశిస్తుండగా, వారు తమ కోసం 340 చిన్న చిన్న గూడేలు, పెంటలు ఏర్పాటుచేస్తున్నారు.46 mandals lo 10768 families unnayi.total state population lo 0.055%. ఉన్నది తక్కువ మంది అయినప్పటికీ ఎక్కువ గూడేలు ఏర్పాటుచేసుకోవడం వల్ల ఒక ప్రాంతంలో తక్కువ మంది నివసించే పరిస్థితి నెలకొంది. నలుగురు చొప్పున ఒక పెంటలో నివసిస్తున్న వారు కూడా నల్లమలలో కనిపిస్తున్నారు. పది మంది కన్నా తక్కువగా చెంచులు నివసిస్తున్న పెంటలు 13 ఉన్నాయి. 25 మంది కన్నా తక్కువ చెంచులు నివశిస్తున్న పెంటలు 26 వరకు ఉన్నాయి. ఇంత తక్కువ సంఖ్యలో చెంచులు ఒక పెంటలో నివసిస్తుండడంతో వారికి సంక్షేమ పథకాలు అమలు పరచడం కష్టంగా ఉన్నట్లు అధికారులు చెబున్నారు. బయటకు రమ్మన్నా రావడం లేదని, దీంతో వారికి అభివృద్ధి ఫలాలు అందడం లేదని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు చెబున్నారు. రెండు వందల మంది కన్నా చెంచులు ఒక చోట నివసించే గూడేలు కేవలం 60 మాత్రమే ఉండటం పరిస్థితి దయనీయతకు అద్దం పడుతోంది. పర్యాటకంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చెందిన పెద్ద పెద్ద పల్లెలకు సమీపంలోని అటవీ పెంటలు, గూడేల్లో కొంతవరకు అభివృద్ధి ఉన్నట్లు బయటకు కనిపిస్తున్నప్పటికీ సామాజిక అభివృద్ధి మాత్రం లేదనే చెప్పవచ్చు.
 • ఆధునిక ప్రపంచంలో మహిళలు ధరించే చుడీదార్, చీరలు వంటి వస్త్రాలు కొంతమంది ధరిస్తున్నప్పటికీ అక్కడ ఇతర విద్య, ఆరోగ్యం వంటి అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. వైద్యం కోసం వచ్చే వైద్యులు, సిబ్బందికి కూడా సహకరించని వారు కోకొల్లలుగా కనిపిస్తారు. రాకపోతే వైద్యుల నిర్లక్ష్యం అంటూ, వస్తే ఎందుకు వచ్చారని ప్రశ్నించే వారు చెంచుల్లో అధికంగా ఉన్నారు. వైద్యులు వచ్చే సమయంలో ఇళ్లలోకి వెళ్లిపోయి తాళాలు వేసుకోవడం కూడా కద్దు.
 • ఇక ఎన్ని పక్కా ఇళ్లు నిర్మించినా వాటికి దూరంగా ఉండడం చెంచుల్లో దర్శనమిస్తుంది. పక్కా ఇళ్లలో ఉంటే శుభం జరగదన్న భావం కారణంగా వారంతా ఇప్పటికే గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తుంటారు. ఐటిడిఎ అధ్వర్యంలో నిర్మించిన ఇళ్లు దశాబ్దాల తరబడి తాళాలు వేసే కనిపిస్తున్నాయి. అప్పాపూర్ అనే ప్రధాన గూడెంలో ఐటిడిఎ అధ్వర్యంలో చుట్టుపక్కల చిన్న చిన్న గూడేలన్నింటికీ కలిపి కొన్ని పక్కా ఇళ్లను నిర్మించారు. అయితే నిర్మాణం పూర్తయిన తరువాత ఆ ఇళ్లకు తాళాలు వేసి మళ్లీ తమతమ పెంటలకు వెళ్లిపోయిన చెంచుల సంఖ్య అధికంగా ఉంది. ఇదే పరిస్థితి దాదాపు నల్లమలలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక అనేక గూడేల్లోని పిల్లల కోసం ఏర్పాటుచేసిన పాఠశాలలు కూడా దీనావస్థలోనే ఉంటున్నాయి. పశువుల పాకలుగా కొన్ని మారిపోతుండగా, మరికొన్ని ఎప్పుడూ తాళాలు వేసే దర్శనమిస్తున్నాయి. ఐదో తరగతి చదివితే గొప్ప అన్న పరిస్థితి చెంచుల్లో ఉండడం గమనార్హం. పదో తరగతి, ఇంటర్ చదివితే వారు అత్యంత విద్యావంతులుగా గుర్తించబడుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో అటవీశాఖ, గిరిజన సంక్షేమం, ఐటిడిఎ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు పుష్కలంగా ఉన్నాయి. తాగునీటికి కూడా చర్యలు లేవని చెంచుల నుండి ఆరోపణలు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో స్థానికంగా లభించే ఊటలు, బావుల్లో నీటినే తాగాల్సి వస్తుండడంతో డయేరియా వంటి సమస్యలు తరచూ తలెత్తుతున్నట్లు చెంచులు అంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులు కూడా వీరికి స్వచ్ఛమైన నీరు అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. (చిత్రం) మూఢనమ్మకాలతో ప్రభుత్వం నిర్మించిన పక్కా ఇళ్ళలో ఉండటానికి భయపడి...చెంచులు గుడిసెల్లోనే ఉండటానికిష్టపడుతున్నారు (ఆంధ్ర భూమి 6 జూన్ 2011). ITDA Srisailam paridhi lo 37 PHC lu , 146 upakendralu erpatu chesinatlu lekkalu cheputhunnaru officers.
 • చెంచులు నివశించే గ్రామాలను 'పెంట' అంటారు. 'పాచిపెంట', 'సున్నిపెంట' వంటి పేర్లు వినగానే అవి 'చెంచుల' నివాసాలుగా గుర్తించవచ్చును. 'తాటిపాక', 'కొలనుపాక' గ్రామ నామాలలోని 'పాక' జైనుల నివాసాలుగా గుర్తించవచ్చును.

dtwo department kuda chenchu community ni ST lu gane gurthisthunnaru kani Primitive Tribal Group (PTG)ga poorthi sthailo artham chesukoleka pothunnaru inka. Integrated Tribal Development Agency(ITDA) kevalam chenchus kosame sundipenta , kurnool district lo vundi.

Mahabubnagar lo Achampet costituency loni kondanagula, mannanoor chenchulu mariyu Prakasam loni Dornala village loni chenchulu migatha varitho polisthe konchem education ku interest chupisthunnaru. veeriki thagina sahayam andatamledu. Educational ga chenchulu inthavaraku teacher post dati vachina varu dadapuga leru. Govt post la koraku konthamandi ithara caste la varu chenchu commumity certificate tho jobs cheshunna varukuda unnaru. but samajikanga porata patima thakkuvaga unna chenchulu deenipai emicheyaleka pothunnaru. and ITDA SRISAILAM PROJECT SUNDIPENTA , Commissioner of Tribal Welfare , Hyderabad handover lo pani chesthunna , ITDA PTG CHENCHU SRISAILAM ani perulone vunna , andali jobs chenchu vallathone nimpandi sir ante STs lo ABCD lu levu kada andaroo samaname ani ST lambada vallake posts poyevindhanga paripalisthunnaru. ITDA ptg Srisailam loni 34 Ashrama schools anni April 2012 nundi DTWO control ki marinappati nundi aa ITDA thana unikine kolpovadam prarambhamaidi. Gatham loni SRISAILAM Project Officers unnappudu nidhulu, development activities baga vundevi. but 2010 nundi elanti samajika development activities levu. CHENCHU laku loans ippudu klistatharam ayindi. so evaru theesukovadam ledu .

ITDA Srisailam thana Unikine kolpothundi.

Chenchulaku health paranga chudataniki Achampeta , Mahabubnagar district yandu Govt Hospital pakkane pedda Hospital katti 6 years avuthunna adi evidanga upayogisthunnaro evariki theliyadu. sibbandi evaru kuda akkada vundaru. Chenchu lu kondaru ANM, MPHW lanti courses chadivina variki jobs chuinche margalevi Officers cheyadamledu.


lands chenchula ku kontha unna chala mandiki levu. Veeri pakka lambada caste cheri , veeri avakasalanu, vanarulanu kollagoduthune unnaru. Forest officers saitham chenchulanu atavee phalalu pondaneeyadam ledu. ST llo PTG laina chenchus nu Govt eppudo gurthinchindi kani ippati palakulaku theliyaka interest leka vaari jeevithalani galiki , adavi devathaku vadilesinatluga thosthundi. PESA Chattam, Atavee Hakkula Chattam unna, pani cheyadam ledu. nirupayoganga unnayi.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చెంచులు&oldid=1181532" నుండి వెలికితీశారు