చెంపిల్ అరయన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చెంపిల్ తైలంపరంబిల్ అనంత పద్మనాభన్ వలియ అరయన్ కన్‌కుమారన్, ట్రావెన్కోర్ రాజైన అవిట్టం తిరునాళ్ బలరామ వర్మ నావికా దళంలో అడ్మిరల్. చెంపిల్ అరయన్ గా సుపరిచితుడు. అతను కేరళ రాష్ట్రం, కొట్టాయంలో వైకోమ్ సమీపంలోని చెంపూలో పుట్టాడు.

చెంపిల్ అరయన్ 1809 లో వేలు తంపి దలావా నాయకత్వంలో ట్రావెన్‌కోర్ యుద్ధంలో పాల్గొన్నాడు. ఇతర విషయాలతోపాటు అతను అప్పటి కంపెనీ రెసిడెంటు కోలిన్ మెకాలే నివాసమైన బోల్‌ఘాటీ ప్యాలెస్‌పై జరిగిన దాడికి నేతృత్వం వహించాడు. రెసిడెంటు ఒక సొరంగం గుండా తప్పించుకుని చిన్న పడవలో పారిపోయి, తృటిలో ప్రాణాలతో తప్పించుకున్నాడు. తరువాత అరయన్ పట్టుబడ్డాడు. విమోచన కోసం డబ్బు చెల్లించిన తర్వాత విడుదలయ్యాడు; అతను కంపెనీ దళాలకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మరణించాడు.

చెంపిల్ అరయన్ "ఓడి వల్లం" అనే పేరున్న సాంప్రదాయిక కేరళ పడవను ఉపయోగించి చేసిన నౌకాదళ దాడులకు ప్రసిద్ధి చెందాడు. తైలంపరంపిల్ హౌస్ అనే పేరున్న చెంపిల్ అరయన్ పూర్వీకుల ఇల్లు (నాలుకెట్టు అని మలయాళంలో అంటారు) చెంచులో ఉంది. నాలుకెట్టు, అరయన్‌ ఉపయోగించిన పాత కళాకృతులన్నింటినీ అతని ఖడ్గం, రాతి విగ్రహంతో సహా కుటుంబ సభ్యులు భద్రపరిచారు. చెంపిల్ అరయన్ పూర్వీకుల ఇంటి పక్కనే అతని సమాధి ఉంది.