Jump to content

చెకుముకి

వికీపీడియా నుండి

చెకుముకి, 1990 నుండి జన విజ్ఞాన వేదిక ప్రచురిస్తున్న మాసపత్రిక.[1] ఈ పత్రిక పాఠశాల విద్యార్థులలో జ్ఞానాన్వేషణను, సామాజిక-శాస్త్రీయ, సాంకేతిక అవగాహన పట్ల ఆసక్తిని పెంపొందించడానికి ప్రచురించబడుతున్నది.[2] ఈ పత్రిక ద్వారా సైన్స్ విద్యార్థులకు సులువుగా చెప్పే విధానాలు ఉంటాయి. విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథం కలిగించే అనేక శిర్షికలు కూడా ఉంటాయి. పత్రిక చదువరులకు ఆశక్తిని కలిగిస్తుంది. పాతికేళ్ళ ప్రయాణంలో "చెకుముకి" అనేది "విద్యార్థి చెకుముకి" గా మారించి. మొదట 1/8 డెమి గా ప్రారంభమై ప్రస్తుతం 1/4 డెమి సైజుకు మారింది. ప్రకటనలు లేకుండా ఉంటుంది. చెకుముకి టాలెంటు టెస్టులు, చెకుముకి సంబరాలు అమితంగా ఆకర్షించి, చరిత్ర సృష్టించాయి. ఎంతోమంది సైన్స్‌ రచయితలు తయారయ్యారు.

ప్రతిభా పరీక్షలు

[మార్చు]

జన విజ్ఞాన వేదిక అధ్యర్యంలో ప్రతి సంవత్సరం ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌ ను పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో నిర్వహిస్తుంది. ఈ  పరీక్షా పత్రంలో 8,9, 10 తరగతికి సంబంధించిన విజ్ఞాన శాస్త్ర అంశాలలో  బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి.

మూలాలు

[మార్చు]
  1. "'Chekumuki' completes 25 years of existence". The Hindu (in Indian English). 2015-11-22. ISSN 0971-751X. Retrieved 2025-12-25.
  2. "Chekumuki – Jana Vignana Vedika-Andhra Pradesh" (in ఇంగ్లీష్). Retrieved 2025-12-30.
"https://te.wikipedia.org/w/index.php?title=చెకుముకి&oldid=4837844" నుండి వెలికితీశారు