చెట్టు ఎక్కుట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెట్టు ఎక్కుట
చెట్టు ఎక్కుట

ఎత్తుగా ఉన్న చెట్ల పైకి వివిధ ఉపయోగముల కొరకు కాళ్ళు, చేతుల సహాయంతో చెట్టు పైకి చేరడాన్ని చెట్టు ఎక్కుట అంటారు. చెట్టు ఎక్కే వ్యక్తి అవసరాన్ని బట్టి వివిధ పరికరాలను ఉపయోగిస్తాడు. తాడు, బంధనం, శిరస్త్రాణం వంటి సాధనముల ద్వారా ప్రమాదముల నుంచి రక్షణ కల్పించుకోవచ్చు. చెట్టు ఎక్కగలిగె సామర్థ్యం చెట్టు ఎక్కె వ్యక్తి యొక్క అనుభవము, నైపుణ్యము, నేర్పుపై ఆధారపడి ఉంటుంది. పరికరాలను ఉపయోగించి ఎక్కడం సాధన ద్వారా సులభమవుతుంది, ఉదాహరణకు గీత కార్మికుడు ఉపయోగించే బంధనం అనే పరికరం ఉపయోగించి కొత్తగా ఎక్కే వారికి చాలా కష్టంగా ఉంటుంది, క్రమ క్రమంగా సాధన చేయటం ద్వారా దానిలోని మెలకువలు తెలుసుకొని సులభంగా ఎక్కగలుగుతారు.

అవసరం

[మార్చు]

చెట్ల ఆకులు, కాయలు మానవుడు బ్రతకడానికి ఎంతో ఉపకరిస్తాయి, అందువలన వాటిని ప్రతినిత్యం ఉపయోగిస్తాడు. ఎత్తుగా ఉన్న చెట్ల నుంచి వాటిని సేకరించడానికి మానవుడు ఉపయోగించే ప్రధానమైన పద్ధతులలో చెట్టు ఎక్కడం ఒక పద్ధతి.

ఆటలు

[మార్చు]

పిల్లలు సాధారణంగా సరదాగా చెట్లు ఎక్కుతారు, ఇంకా కోతి కొమ్మంచి ఆట ఆడుకోవడానికి చెట్లు ఎక్కుతారు, అయితే పిల్లలు పరికరాలు ఉపయోగించరు, భద్రత కోసం కొమ్మలు నేలపైకి వాలి ఉన్న చెట్లను ఎన్నుకొని ఆడుతారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.