Coordinates: 16°22′00″N 81°09′02″E / 16.366663°N 81.150565°E / 16.366663; 81.150565

చెన్నూరు (పెడన మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెన్నూరు
—  రెవెన్యూ గ్రామం  —
చెన్నూరు is located in Andhra Pradesh
చెన్నూరు
చెన్నూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°22′00″N 81°09′02″E / 16.366663°N 81.150565°E / 16.366663; 81.150565
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెడన
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,826
 - పురుషులు 1,677
 - స్త్రీలు 1,649
 - గృహాల సంఖ్య 950
పిన్ కోడ్ 521366
ఎస్.టి.డి కోడ్ 08672.

చెన్నూరు, కృష్ణా జిల్లా, పెడన మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పెడన నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 950 ఇళ్లతో, 3326 జనాభాతో 1686 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1677, ఆడవారి సంఖ్య 1649. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 788 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 78. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589623.[1]

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి పెడనలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల పెడనలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మచిలీపట్నంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల పెడనలోను, అనియత విద్యా కేంద్రం మచిలీపట్నంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.

సూరిశెట్టి ఆంజనేయులు[మార్చు]

ఈ పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయుడు (Drawing Teacher) సూరిశెట్టి ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం రూపకర్త. ఒకే వలయంలో పూర్ణకుంభం, ధర్మచక్రం, అశోకసింహాలుగల రాష్ట్రరాజముద్ర. 1953లో ప్రభుత్వ పిలుపు మేరకు, అప్పటి చెన్నూరు గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయుడు సూరిశెట్టి ఆంజనేయులు, రాష్ట్రప్రభుత్వ చిహ్నాన్ని రూపొందించి ప్రభుత్వానికి పంపించాడు. అమరావతిలోని అశోకస్థూపాన్ని ప్రాతిపదికగా తీసికొని ఈ చిహ్నాన్ని రూపొందించినట్లు పేర్కొన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది చిత్రకారులు వివిధ చిహ్నాలను పంపగా, అందులో ఇతను పంపిన చిహ్నాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ చిత్రం, 1956, నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నుండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రగా అమలులోనికి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణా విడిపోయినప్పటికీ, ఈ చిహ్నం, ఆంధ్రప్రభుత్వ రాష్ట్ర రాజముద్రగానే కొనసాగటం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలు, చెన్నూరు గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పదిలంగా ఉన్నాయి. ఈ విధంగా చెన్నూరు గ్రామానికి రాష్ట్రస్థాయి ఖ్యాతి తెచ్చిపెట్టిన ఈ చిత్రకారుడు, మచిలీపట్నం పట్టణంలోని చింతగుంటపాలెం గ్రామ వాస్తవ్యుడు.[2]

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

చెన్నూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురుఒక నాటు వైద్యుడు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

చెన్నూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి.

ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

చెన్నూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 218 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 4 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 8 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 5 హెక్టార్లు
  • బంజరు భూమి: 12 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1436 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 18 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1436 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

చెన్నూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1436 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

చెన్నూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి

గ్రామ పంచాయతీ[మార్చు]

ఇది ఒక మేజర్ పంచాయతీ.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గామ విశేషాలు[మార్చు]

చెన్నూరు సుబ్బారావు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన చెన్నూరు సుబ్బారావు, అమెరికాలో స్థిరపడినారు. అతను అక్కడ "తెలుగు టైంస్" అను పత్రికకు ఎడిటరుగా గూడా పనిచేస్తున్నారు. ఇతను తన స్వగ్రామాన్ని దత్తత తీసికొని ఆకర్ష్ణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయడాననికి నిర్ణయించుకున్నారు. [3]

సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్[మార్చు]

వేరువేరు ప్రభుత్వ విభాగాలు అందించే 16 లక్షల రూపాయల వ్యయంతో, గ్రామంలోని 33 సెంట్ల బి.ఎం.డి.కాలువ పోరంబోకు స్థలంలో, ఈ కర్మాగారం నిర్మాణం పూర్తి అయినది. 2015,నవంబరు-1వ తేదీనాడు ప్రారంభించెదరు. చెత్తను ప్రోగుచేసుకొనడానికి ప్రతి ఇంటికీ రెండు బుట్టలను అందజేసెదరు. ప్రతి వేయిమంది జనాభాకు ఒక ట్రైసికిల్ రిక్షాను గానీ ఒక ఆటో రిక్షాను గానీ అందజేసెదరు. [4]

మత్తి అరుణ[మార్చు]

పెడన మండలం చెన్నూరు గ్రామానికి చెందిన మత్తి అరుణ ప్రస్తుతం, ఘంటసాల (కృష్ణా జిల్లా) లోని ఎం.జి. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పి.యి.టి.గా పనిచేస్తున్నారు. ఈమె పాఠశాలలో విద్యనేర్చుకుంటున్నప్పటి నుండియే కబడ్డీ, పరుగు పందేలలో శిక్షణ తీసికొన్నారు. అప్పటి నుండి ఈమె పలు రాష్ట్ర, జాతీయస్థాయి పరుగుపందేలలో రాణించుచూ అనేక పతకాలు సాధించారు. ఒక ప్రక్కన ఆమె చిన్నారులకు కబడ్డీ, అథ్లెటిక్స్‌లో నైపుణ్యాలను పెంపొందించుటకు విశేషకృషి చేయుచూనే, మరియొక ప్రక్కన తన వ్యక్తిగత పతకాల సాధన దిశగా కృషిచేస్తున్నారు. ఈమె శిక్షణలో విద్యార్థులు, పలు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం. ఈమె క్రీడలలో ప్రదర్శించిన ప్రతిభకుగాను, అప్పటి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ప్రసంసాపత్రాలను పొందారు. ఇంకా మన రాష్ట్రమంత్రులు, జిల్లా కలెక్టర్లూ, డి.యి.ఓ ల చేతులమీదుగా గూడా ప్రశంసాపత్రాలూ, గౌరవ సత్కారాలూ పొందారు. [5]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3881. ఇందులో పురుషుల సంఖ్య 1961, స్త్రీల సంఖ్య 1920, గ్రామంలో నివాసగృహాలు 923 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2014, అక్టోబరు-17; 9వపేజీ.[3] ఈనాడు మెయిన్; 2015,మే-10; 3వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015,అక్టోబరు-28; 5వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2017,మే-31; 4వపేజీ.