చెన్నూరు (పెడన మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెన్నూరు
—  రెవిన్యూ గ్రామం  —
చెన్నూరు is located in Andhra Pradesh
చెన్నూరు
చెన్నూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°22′00″N 81°09′02″E / 16.366663°N 81.150565°E / 16.366663; 81.150565
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెడన
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,326
 - పురుషులు 1,677
 - స్త్రీలు 1,649
 - గృహాల సంఖ్య 950
పిన్ కోడ్ 521366
ఎస్.టి.డి కోడ్ 08672.

చెన్నూరు, కృష్ణా జిల్లా, పెడన మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 366., ఎస్.టి.డి.కోడ్ = 08672.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు[మార్చు]

మండవల్లి, గూడూరు, గుడ్లవల్లేరు, బంటుమిల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

శింగరాయకొండ, ముదినేపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 64 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

శ్రీ సూరిశెట్టి ఆంజనేయులు[మార్చు]

ఈ పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయులు (Drawing Teacher) అయిన శ్రీ సూరిశెట్టి ఆంజనేయులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం రూపకర్త. ఒకే వలయంలో పూర్ణకుంభం, ధర్మచక్రం, అశోకసింహాలుగల రాష్ట్రరాజముద్ర. 1953లో ప్రభుత్వ పిలుపు మేరకు, అప్పటి చెన్నూరు గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయులు అయిన శ్రీ సూరిశెట్టి ఆంజనేయులు, రాష్ట్రప్రభుత్వ చిహ్నాన్ని రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. అమరావతిలోని అశోకస్థూపాన్ని ప్రాతిపదికగా తీసికొని ఈ చిహ్నాన్ని రూపొందించినట్లుచిత్రకారుడు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది చిత్రకారులు వివిధ చిహ్నాలను పంపగా, అందులో వీరు పంపిన చిహ్నాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ చిత్రం, 1956, నవంబరు-1వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నుండి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రగా అమలులోనికి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణా విడిపోయినప్పటికీ, ఈ చిహ్నం, ఆంధ్ర ప్రభుత్వ రాష్ట్ర రాజముద్రగానే కొనసాగటం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలు, చెన్నూరు గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పదిలంగా ఉన్నాయి. ఈ విధంగా చెన్నూరు గ్రామానికి రాష్ట్రస్థాయి ఖ్యాతి తెచ్చిపెట్టిన ఈ చిత్రకారులు, మచిలీపట్నం పట్టణంలోని చింతగుంటపాలెం వాస్తవ్యులు. [2]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఇది ఒక మేజర్ పంచాయతీ.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గామ విశేషాలు[మార్చు]

శ్రీ చెన్నూరు సుబ్బారావు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ చెన్నూరు సుబ్బారావు, అమెరికాలో స్థిరపడినారు. వారు అక్కడ "తెలుగు టైంస్" అను పత్రికకు ఎడిటరుగా గూడా పనిచేస్తున్నారు. వీరు తన స్వగ్రామాన్ని దత్తత తీసికొని ఆకర్ష్ణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయడాననికి నిర్ణయించుకున్నారు. [3]

సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్[మార్చు]

వేరువేరు ప్రభుత్వ విభాగాలు అందించే 16 లక్షల రూపాయల వ్యయంతో, గ్రామంలోని 33 సెంట్ల బి.ఎం.డి.కాలువ పోరంబోకు స్థలంలో, ఈ కర్మాగారం నిర్మాణం పూర్తి అయినది. 2015,నవంబరు-1వ తేదీనాడు ప్రారంభించెదరు. చెత్తను ప్రోగుచేసుకొనడానికి ప్రతి ఇంటికీ రెండు బుట్టలను అందజేసెదరు. ప్రతి వేయిమంది జనాభాకు ఒక ట్రైసికిల్ రిక్షాను గానీ ఒక ఆటో రిక్షాను గానీ అందజేసెదరు. [4]

శ్రీమతి మత్తి అరుణ[మార్చు]

పెడన మండలం చెన్నూరు గ్రామానికి చెందిన శ్రీమతి మత్తి అరుణ ప్రస్తుతం, ఘంటసాల (కృష్ణా జిల్లా) లోని ఎం.జి. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పి.యి.టి.గా పనిచేస్తున్నారు. ఈమె పాఠశాలలో విద్యనేర్చుకుంటున్నప్పటి నుండియే కబడ్డీ, పరుగు పందేలలో శిక్షణ తీసికొన్నారు. అప్పటి నుండి ఈమె పలు రాష్ట్ర, జాతీయస్థాయి పరుగుపందేలలో రాణించుచూ అనేక పతకాలు సాధించారు. ఒక ప్రక్కన ఆమె చిన్నారులకు కబడ్డీ, అథ్లెటిక్స్‌లో నైపుణ్యాలను పెంపొందించుటకు విశేషకృషి చేయుచునే, మరియొక ప్రక్కన తన వ్యక్తిగత పతకాల సాధన దిశగా కృషిచేస్తున్నారు. ఈమె శిక్షణలో విద్యార్థులు, పలు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం. ఈమె క్రీడలలో ప్రదర్శించిన ప్రతిభకుగాను, మన రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ చేతుల మీదుగా ప్రసంసాపత్రాలను పొందినారు. ఇంకా మన రాష్ట్రమంత్రులు, జిల్లా కలెక్టర్లూ, డి.యి.ఓ ల చేతులమీదుగా గూడా ప్రశంసాపత్రాలూ, గౌరవ సత్కారాలూ పొందినారు. [5]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,826 - పురుషుల సంఖ్య 1,677 - స్త్రీల సంఖ్య 1,649 - గృహాల సంఖ్య 950

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3881.[2] ఇందులో పురుషుల సంఖ్య 1961, స్త్రీల సంఖ్య 1920, గ్రామంలో నివాసగృహాలు 923 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Chennuru". Retrieved 2 July 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2014,అక్టోబరు-17; 9వపేజీ. [3] ఈనాడు మెయిన్; 2015,మే-10; 3వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015,అక్టోబరు-28; 5వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2017,మే-31; 4వపేజీ.