చెన్నై ఎగ్మోర్-తంజావూరు ప్రధాన రైలు మార్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెన్నై ఎగ్మోర్-తంజావూరు ప్రధాన రైలు మార్గం
తిరుచిరాపల్లి-చెన్నై చోళన్ ఎక్స్‌ప్రెస్
అవలోకనం
స్థితిపనిచేస్తోంది
లొకేల్తమిళనాడు
చివరిస్థానంచెన్నై ఎగ్మోర్
తంజావూరు జంక్షన్
ఆపరేషన్
ప్రారంభోత్సవం1880; 144 సంవత్సరాల క్రితం (1880)
యజమానిభారతీయ రైఒల్వేలు
నిర్వాహకులుదక్షిణ రైల్వే
సాంకేతికం
ట్రాక్ పొడవుప్రధాన మార్గం: 351 km (218 mi)
శాఖా మార్గాలు:
CGLAJJ (63 kilometres (39 mi))
VMPDY (38 kilometres (24 mi))
CUPJVRI (61 kilometres (38 mi))
MVTVR (39 kilometres (24 mi))
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in)
అత్యధిక ఎత్తుచెన్నై ఎగ్మోర్ 8 metres (26 ft)
తంజావూరు60 metres (200 ft)
మార్గ పటం
మూస:Chennai Egmore–Thanjavur main line

చెన్నై ఎగ్మోర్-తంజావూరు ప్రధాన మార్గం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై ఎగ్మోర్ తంజావూరు జంక్షన్ లను కలుపుతుంది. చెన్నై - విలుప్పురం - చిదంబరం - మైలదుత్తురై - కుంభకోణం - తంజావూరు - తిరుచిరాపల్లి లైన్‌లో చెన్నై ఎగ్మోర్-తంజావూరు ప్రధాన భాగం. ఇతర శాఖలు: చెంగల్పట్టు - అరక్కోణం చెన్నై సెంట్రల్-బెంగళూరు సిటీ లైన్, గుంతకల్-చెన్నై ఎగ్మోర్ సెక్షన్, విలుప్పురం- పుదుచ్చేరి, కడలూరు - విరుధాచలం, మైలాడుతురై- తిరువారూర్,, పెరళం - నాగపట్నం. ఈ లైన్ కావేరీ డెల్టాను చెన్నైకి కలుపుతుంది.

చరిత్ర[మార్చు]

కోరమాండల్ కోస్ట్‌లోని మీటర్-గేజ్ రైల్వే వ్యవస్థ యొక్క "ప్రధాన లైన్" చెన్నైని తిరుచ్చిరాపల్లితో విలుప్పురం, కడలూరు, చిదంబరం, మైలదుత్తురై, కుంభకోణం, తంజావూరు జంక్షన్ల మీదుగా అనుసంధానించింది. [1] చెన్నై-మైలాడుతురై-తంజావూరు-తిరుచిరాపల్లి లైన్ను "ప్రధాన లైన్"గా భావిస్తారు. [2] [3]

1861లో గ్రేట్ సదరన్ ఆఫ్ ఇండియా రైల్వే (GSIR) నాగపట్నం, తిరుచిరాపల్లి మధ్య 125 km (78 mi) బ్రాడ్ గేజ్ లైన్ నిర్మించింది. ఈ లైన్ ఆ తరువాతి ఏడాది ట్రాఫిక్ కోసం తెరిచారు. [4] 1874లో GSIR నుండి స్వాధీనం చేసుకున్న తర్వాత దక్షిణ భారత రైల్వే కంపెనీ, నాగపట్నం-తిరుచిరాపల్లి లైన్ను మీటర్ గేజ్‌గా మార్చింది.

దక్షిణ భారత రైల్వే కంపెనీ, 1880లో చెన్నై నుండి విలుప్పురం, కడలూర్ పోర్ట్, మైలదుత్తురై, తంజావూరు, తిరుచిరాపల్లి, మధురై, విరుదునగర్ మీదుగా తూత్తుకుడి వరకు 715 km (444 mi) పొడవైన మీటర్-గేజ్ ట్రంక్ లైన్ వేసింది. [5] 84 km (52 mi) -పొడవున్న తిండివనం-కడలూర్ పోర్ట్ సెక్టార్, 27.60 km (17 mi) పొడవైన కడలూర్ పోర్ట్-పోర్టో నోవో సెక్టార్, 19.71 km (12 mi)పొడవైన శ్యాలీ-మయిలదుత్తురై సెక్టార్లను 1877లో మొదలుపెట్టారు. తద్వారా తిండివనాన్ని ఇప్పటికే తెరిచిన తిరుచిరాపల్లి-నాగపట్టినం లైన్‌కు కలిపారు. [6] కానీ 1995-2000 సంవత్సరాలలో గేజ్ మార్పిడి సమయంలో 84 km (52 mi) -దీర్ఘమైన తిండివనం-కడలూర్ పోర్ట్ సెక్టార్, 27.60 km (17 mi) -పొడవైన కడలూర్ పోర్ట్-పోర్టో నోవో సెక్టార్ & 19.71 km (12 mi) -పొడవున్న శ్యాలి-మయిలాడుతురై సెక్టార్‌ను బ్రాడ్ గేజ్ లైనుగా మార్చలేదు.

బ్రిటీష్, ఫ్రెంచి వారి మధ్య ఒక ఒప్పందాన్ని అనుసరించి, 1877-1879లో పుదుచ్చేరి విలుప్పురం మధ్య ఒక 38 km (24 mi) -పొడవైన మీటర్-గేజ్ లైన్ వేసారు. [7]

అరక్కోణం, కాంచీపురంల మధ్య 1865లో ఇండియన్ ట్రామ్‌వే కంపెనీ ఒక లైను వేసింది. [4] దీన్ని 1878లో మీటర్ గేజ్‌గా మార్చారు. చెంగల్పట్టు-వాలాజాబాద్ లైన్ 1880లో ప్రారంభించబడింది [6]

1927లో 55 km (34 mi) పొడవైన రైల్వే ట్రాకు ద్వారా విలుప్పురంను విరుద్ధాచలంకు కలిపారు. [6]

మైలాడుతురై - తరంగంబాడి లైన్‌ను 1926లో వేసారు. బ్రాడ్ గేజ్ మార్పిడి కోసం 1987లో మూసివేసారు. [8] కానీ 33 ఏళ్లుగా ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది


సబర్బన్ రైల్వే[మార్చు]

దక్షిణ రేఖలో ప్రధాన భాగం, చెన్నై సబర్బన్ మార్గం. చెన్నైకి దక్షిణంగా ఉన్న ప్రాంతానికి 1931 వరకు ప్యాసింజరు, గూడ్స్ రైళ్ల ద్వారా ఒకే లైను ద్వారా సేవలు అందించేది. ఈ రంగంలో ఎలక్ట్రిక్ రైళ్లను 1923లోనే ప్లాన్ చేశారు. నిర్మాణ పనులు 1926లో ప్రారంభమై 1931లో పూర్తయ్యాయి. చెన్నై బీచ్, ఎగ్మోర్ ల మధ్య ఎలక్ట్రిక్ రైళ్ల కోసం కొత్త లైన్ వేసారు. ఎగ్మోర్, తాంబరం మధ్య డబుల్ లైను వేసారు. [9] మొదటి MG EMU సేవలు 1193 మే 11 న మొదలయ్యాయి. [10] 1960లలో చెన్నై బీచ్-తాంబరం- విలుప్పురం సెక్టార్ 1.5 kV DC ట్రాక్షన్ నుండి 25 kV AC ట్రాక్షన్‌గా మార్చబడింది. EMU సేవలను చెంగల్‌పేట వరకు పరిమితంగా విస్తరించారు. 1969లో తాంబరం-చెంగల్‌పేట మధ్య అదనపు మీటర్‌గేజ్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. 1995 నుండి మొత్తం ప్రాంతాన్ని బ్రాడ్ గేజ్‌గా మార్చారు. [10]

గేజ్ మార్పిడులు[మార్చు]

మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్‌కి మారడంతో మొత్తం 494 km (307 mi) -పొడవైన ఎగ్మోర్ - తాంబరం - తిరుచిరాపల్లి - దిండిగల్ - మధురై సెక్టార్ పూర్తయింది. ప్యాసింజర్ ట్రాఫిక్ 2001 మార్చిలో మొదలైంది. ఆ తరువాత మిగిలిన మార్పిడి పని పూర్తయింది చిట్ట చివరి మీటర్-గేజ్ EMU సేవ 2004 జూలై 1 న తాంబరం, ఎగ్మోర్ మధ్య నడిచింది [11]

విలుప్పురం - పుదుచ్చేరి బ్రాంచ్ లైన్ను మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్‌గా మార్చడం 2004లో పూర్తయింది. కడలూరు పోర్టు, వృద్ధాచలం సెక్టారు గేజిమార్పిడిని 2003 లో పూర్తి చేసారు. [12] తంజావూరు - తిరువారూర్ బ్రాడ్-గేజ్ సెక్షన్ను 2006లో, తిరువారూర్- నాగోర్ సెక్షన్ 2010లో ముగిసాయి. [13]


192 km (119 mi) -పొడవైన విలుప్పురం-తంజావూరు మార్గాన్ని 2010 లో బ్రాడ్ గేజ్‌గా మార్చారు. [14]

చెంగల్పట్టును అరక్కోణంతో కలుపుతూ బ్రాడ్-గేజ్ లైన్ (మీటర్-గేజ్ నుండి మార్పిడి) 1999-2000లో నిర్మించారు. అరక్కోణం నేవల్ ఎయిర్ స్టేషన్‌కు సమీపంలో ఉన్నందున థాకోలం-అరక్కోణం సెక్టార్‌ను మార్చాల్సి వచ్చింది. [15] [16]

రైల్వేల పునర్వ్యవస్థీకరణ[మార్చు]

గ్రేట్ సదరన్ రైల్వే ఆఫ్ ఇండియా, కర్నాటిక్ రైల్వేలు 1874 లో విలీనమై దక్షిణ భారత రైల్వే కంపెనీగా ఏర్పడ్డాయి. [7]

1950ల ప్రారంభంలో, అక్కడ ఉన్న స్వతంత్ర రైల్వే వ్యవస్థలను స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తూ చట్టం చేసారు. 1951 ఏప్రిల్ 14 న మద్రాస్ అండ్ సదరన్ మహరాఠా రైల్వే, సౌత్ ఇండియన్ రైల్వే కంపెనీ, మైసూరు స్టేట్ రైల్వేలను కలిపి దక్షిణ రైల్వేగా ఏర్పాటు చేశారు. తదనంతరం, నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేని కూడా దక్షిణ రైల్వేలో విలీనం చేసారు. 1966 అక్టోబరు 2 న, సికింద్రాబాద్, షోలాపూర్, హుబ్లీ, విజయవాడ డివిజన్లు, నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే యొక్క పూర్వ భూభాగాలను, మద్రాస్ అండ్ సదరన్ మహరాఠా రైల్వేలోని కొన్ని భాగాలను దక్షిణ రైల్వే నుండి వేరు చేసి దక్షిణ మధ్య రైల్వేగా ఏర్పరచారు . 1977లో, దక్షిణ రైల్వేలోని గుంతకల్ డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వేకు, షోలాపూర్ డివిజన్ను సెంట్రల్ రైల్వేకు బదిలీ చేసారు. 2010లో ఏర్పాటైన ఏడు కొత్త జోన్లలో నైరుతి రైల్వే కూడా ఉంది. దీన్ని దక్షిణ రైల్వే నుండి వేరు చేసి ఏర్పాటు చేసారు. [17]

మూలాలు[మార్చు]

 1. "Four Cauvery Delta Branches". IRFCA. Retrieved 3 January 2014.
 2. R. Rajaram (20 April 2011). "More BG sections to be electrified". The Hindu. Archived from the original on 20 April 2014. Retrieved 7 January 2014.
 3. "Villupuram District at a Glance". Villupuram district administration. Archived from the original on 26 December 2013. Retrieved 7 January 2014.
 4. 4.0 4.1 "IR History: Early Days – I". Chronology of railways in India, Part 2 (1832–1865). Archived from the original on 7 March 2005. Retrieved 30 December 2013.
 5. "Chugging into the past". The Hindu. 18 December 2004. Archived from the original on 22 January 2005. Retrieved 30 December 2013.
 6. 6.0 6.1 6.2 R. P. Saxena. "Indian Railway History Time line". Irse.bravehost.com. Archived from the original on 29 February 2012. Retrieved 1 January 2014.
 7. 7.0 7.1 "IR History: Early Days – II". Chronology of railways in India, Part 2 (1870–1899). Retrieved 30 December 2013."IR History: Early Days – II". Chronology of railways in India, Part 2 (1870–1899). Retrieved 30 December 2013. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "irfcaii" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 8. "New trains, lines cheer passengers". The Hindu. 27 February 2013. Archived from the original on 3 January 2014. Retrieved 3 January 2014.
 9. A.Srivathsan (16 August 2010). "How electric suburban railway service began". The Hindu. Archived from the original on 20 September 2011. Retrieved 7 January 2014.
 10. 10.0 10.1 Bharath Moro. "Chennai Area Gauge Conversion". IRFCA. Retrieved 6 January 2014.
 11. Moro, Bharath (May 2005). "Chennai Area Gauge Conversion". The Hindu. Archived from the original on 22 January 2005. Retrieved 30 December 2013.
 12. "Trichur rly division nets Rs. 23.77 cr. Passenger earnings". The Hindu. 16 August 2004. Archived from the original on 16 April 2005. Retrieved 30 December 2013.
 13. "More trains in pipeline for delta districts, says Southern Railway GM". The Hindu. 19 February 2011. Archived from the original on 3 January 2014. Retrieved 3 January 2014.
 14. "Cholan Express back on track". The Hindu. 28 April 2010. Archived from the original on 14 August 2010. Retrieved 30 December 2013.
 15. Selvan, Dennis (25 February 2011). "Electrify 8 km on Thakolam-Arakkonam track". The New Indian Express. Archived from the original on 1 January 2014. Retrieved 31 December 2013.
 16. Selvan, Dennis (25 February 2011). "Rail budget '99". The New Indian Express. Archived from the original on 4 March 2016. Retrieved 31 December 2013. Gauge conversion to be completed in 1999–2000
 17. "Geography – Railway Zones". IRFCA. Archived from the original on 19 August 2007. Retrieved 30 December 2013.