చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ | |
---|---|
సాధారణ సమాచారం | |
Location | EVR Periyar Salai, Park Town, Chennai 600 003 భారతదేశం |
Coordinates | coord |
Elevation | 3.46 మీటర్లు |
నిర్వహించువారు | భారతీయ రైల్వేలు |
లైన్లు |
|
పట్టాలు | 30 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | ప్రామాణికము (భూమి మీద స్టేషను) |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | MAS |
Fare zone | దక్షిణ రైల్వే |
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ (2019 నుండి అధికారికంగా పురచ్చి తలైవర్ డాక్టర్ ఎం.జి. రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్; "పేర్లు" చూడండి) చెన్నైలో గల ప్రధాన రైల్వే స్టేషన్. ఇది దక్షిణ భారతదేశం లో గల అత్యంత ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దక్షిణ భారతదేశంలో గల అత్యంత రద్దీ గా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది చెన్నై నగరపు ప్రధాన ఆనావాళ్ళలో ఒకటి.దీనిని 1873 లో జార్జ్ హార్డింగ్ అనే వాస్తుశిల్పి రూపొందించాడు. మరల దీనికి 1959 లోను, 1998 లో మార్పులు చేసారు. ఇక్కడ నుండి ప్రతిదినం సుమారు 3,50,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ద్వార సుమారు 269 రైళ్ళు తమ ప్రయాణాన్ని ప్రారంభించడం / ముగించడం /ఈ రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించడం జరుగుతుంది.సుమారు 644 రైల్వే స్టేషన్లు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ తో అనుసంధానించబడినవి. ఇది దేశంలో 28వ రద్దీగా ఉండే స్టేషను.[1]
పేర్లు
[మార్చు]తేదీ | తెలుగు | తమిళం | హిందీ | ఆంగ్లము |
---|---|---|---|---|
1873 - 1996 | మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషను | மெட்ராஸ் மத்திய தொடர்வண்டி நிலையம் | मद्रास सेंट्रल रेलवे स्टेशन | Madras Central Railway Station |
1996 - 2019 | చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను | சென்னை மத்திய தொடர்வண்டி நிலையம் | चेन्नई सेंट्रल रेलवे स्टेशन | Chennai Central Railway Station |
2019 - ప్రస్తుత | పురచ్చి తలైవర్ (విప్లవ నాయకుడు) డాక్టర్ ఎం.జి. రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ | புரட்சித்தலைவர் டாக்டர் எம்.ஜி.ராமச்சந்திரன் மத்திய இரயில் நிலையம் | पुरैची थलाइवर (क्रांतिकारी नेता) डॉ॰ एम॰ जी॰ रामचंद्रन सेंट्रल रेलवे स्टेशन | Puratchi Thalaivar (Revolutionary Leader) Dr. M. G. Ramachandran Central Railway Station |
చరిత్ర
[మార్చు]భారతదేశంలో రైల్వేలు మొదలయిన తరువాత దక్షిణ భారతదేశం లో మద్రాసు రైల్వే కంపెని రైల్వేలను నిర్వహించేది . మొదటగా రాయపురం రైల్వే స్టేషన్ ను 1856 లో నిర్మించారు. అది కొంతకాలం మద్రాసు నగరానికి ప్రధాన రైల్వే స్టేషన్ వుండేది. తరువాత రైల్వేలను విస్తరించినప్పుడు మద్రాసు రైల్వే స్టేషన్ (పార్క్ రైల్వే స్టేషన్) ను 1873 లో నిర్మించారు. 1907 లో మద్రాసు రైల్వే కంపెని మద్రాసు సెంట్రల్ రైల్వేస్టేషన్ ను ప్రధాన రైల్వే స్టేషన్ గా మార్చింది . 1922 లో దీనిని మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వేలతో అనుసందానించి మద్రాస్ సెంట్రల్ రైల్వేస్టేషన్ ను వాటికి ప్రధాన కేంద్రం గా ఏర్పాటు చేసారు.తరువాత మద్రాసు రైల్వే కంపెని దక్షిణ భారత రైల్వే కంపెని లో విలీనం అయింది. దక్షిణ భారత రైల్వే 1853 లో బ్రిటన్ లో స్థాపించబడి, బ్రిటిష్ వలస పాలనలో 1859 లో రిజిస్టర్ గావించబడి. గ్రేట్ దక్షిణ భారతదేశం రైల్వే (కంపెనీ) కం.గా రూపొందింనది. దీనిని తిరుచిరాపల్లి (ట్రిచ్చి) లో ప్రధాన కార్యాలయంగా 1890 లో లండన్ లో కేవలం ఒక సంస్థగా నమోదు చేశారు.
ప్లాట్‌ఫారములు
[మార్చు]చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషనులోని 17 ప్లాట్‌ఫారములు కలవు .వీటిలో 12 ప్రధానంగా ఎక్స్‌ప్రెస్ రైలుబండ్ల కు మిగిలినవి సబర్బన్ రైళ్ళకు కేటాయించారు. 12 ప్రధాన ప్లాట్‌ఫారములు 24 కంటే ఎక్కువ బోగీలు కల ఎటువంటి రైలుబండి నయినా కూడా తీసుకుని, నిర్వహించగలవు. . అన్ని ట్రాక్లను బ్రాడ్‌గేజ్‌గా మార్చబడనవి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించు రైళ్ళు తమ దిశను మార్చుకుని ప్రయాణించవలసిరావడం వల్ల అవి అధిక సమయం తీసుకుంటాయి.
ప్రయాణీకుల సౌకర్యాలు
[మార్చు]ఈ స్టేషనులో లాడ్జింగ్ (బస), రెస్టారెంట్లు, కేఫ్‌లు, కాఫీ షాప్, బుక్ స్టాల్స్ (పుస్తకం దుకాణాలు), వెయిటింగ్ హాల్స్ (వేచి ఉండు మందిరాలు), క్లోక్ రూములు (అంగీ గదులు), సైబర్ కేఫ్ వంటి అనేక సౌకర్యాలు, పర్యాటక ఎజెంట్ కౌంటర్లు, రైలు విచారణ కౌంటర్లు, రైలు స్థితి ప్రదర్శన (డిజిటల్) బోర్డులు, రైలు స్థితి ప్రకటనలు, లిఫ్ట్ బ్రిడ్జి (అడుగు వంతెన) లు మొదలైనవి ప్రయాణికులు ఉపయోగించుకోవడం కోసము ఏర్పాట్లు ఉన్నాయి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో గల ప్రధాన వేచియుండు మందిరం లో (వెయిటింగ్ హాల్స్) లో సుమారు 1000 మంది వేచివుండవచ్చు. ప్రయాణికులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే తక్షణం ప్రాథమిక చికిత్స చేసేందుకు ఇక్కడ అత్యవసర వైద్యశాల కలదు. ఇవది 24గంటల పాటు ప్రయాణికులకు సేవలు అందిస్తుంది.
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి బయలు దేరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ , ఎక్స్‌ప్రెస్ రైళ్లు
[మార్చు]రైలుబండి నంబరు. | రైలుబండి పేరు | వివరము | బయలుదేరు స్థలం/నివాసస్థానం | చేరుకొను స్థలం/గమ్యం | బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ |
---|---|---|---|---|---|
12711/12 | పినాకిని ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | విజయవాడ జంక్షన్ | పురచ్చి తలైవర్ డాక్టర్ ఎం.జి. రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ | ప్రతిరోజు |
12077/78 | జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | చెన్నై సెంట్రల్ | విజయవాడ జంక్షన్ | మంగళవారం మినహా |
12759/60 | చార్మినార్ ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | చెన్నై సెంట్రల్ | హైదరాబాద్ | ప్రతిరోజూ |
12621/22 | తమిళనాడు ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | చెన్నై సెంట్రల్ | హజరత్ నిజాముద్దీన్ | ప్రతిరోజూ |
12433 | చెన్నై రాజధాని ఎక్స్‌ప్రెస్ | రాజధాని ఎక్స్‌ప్రెస్ | చెన్నై సెంట్రల్ | హజరత్ నిజాముద్దీన్ | ఆదివారం, శుక్రవారం |
12615/16 | గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | చెన్నై సెంట్రల్ | హజరత్ నిజాముద్దీన్ | ప్రతిరోజూ |
12839/40 | హౌరా చెన్నై మెయిల్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | హౌరా | చెన్నై సెంట్రల్ | ప్రతిరోజూ |
12841/42 | కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | హౌరా | చెన్నై సెంట్రల్ | ప్రతిరోజూ |
12655/56 | నవజీవన్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | అహ్మదాబాద్ | చెన్నై సెంట్రల్ | ప్రతిరోజూ |
16057/58 | సప్తగిరి ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | చెన్నై సెంట్రల్ | ప్రతిరోజూ |
16203/04 | గరుడాద్రి ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | చెన్నై సెంట్రల్ | ప్రతిరోజూ |
16053/54 | తిరుపతి - చెన్నై ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | చెన్నై సెంట్రల్ | ప్రతిరోజూ |
12007/08 | చెన్నై సెంట్రల్ -జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ / మెయిల్ | చెన్నై సెంట్రల్ | మైసూరు | బుధవారం మినహా |
12243/44 | చెన్నై సెంట్రల్ - జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ / మెయిల్ | చెన్నై సెంట్రల్ | కోయంబత్తూరు | మంగళవారం మినహా |
12639/40 | బృందావన్ ఎక్స్ ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | చెన్నై సెంట్రల్ | బెంగుళూరు | ప్రతి రోజూ |
11027/42 | చెన్నై సెంట్రల్ - ముంబైఛత్రపతి శివాజీ టెర్మినస్ సూపర్‌ఫాస్ట్/ మెయిల్ | సూపర్‌ఫాస్ట్ / మెయిల్ | చెన్నై సెంట్రల్ | ముంబైఛత్రపతి శివాజీ టెర్మినస్ | ప్రతిరోజూ |
మూలాలు
[మార్చు]- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
బయటి లింకులు
[మార్చు]- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
- http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- http://www.indianrail.gov.in/index.html