చెరకు రసం


చెరకు రసం అంటే చెరకును గట్టిగా పిప్పిలాగా కొట్టి సేకరించిన ద్రవ పదార్థం. చెరకును వాణిజ్యపరంగా పండించే దేశాలలో - ఆగ్నేయాసియా, భారత ఉపఖండం, ఉత్తర ఆఫ్రికా, ప్రధానంగా ఈజిప్ట్ దక్షిణ అమెరికా, బ్రెజిల్ లలో పానీయంగా వినియోగిస్తారు. చెరకును ఒక యంత్రంలో గట్టిగా చెరకును నలిపి రసాన్ని తీస్తారు. ఇది రమ్ దీని ప్రధాన పూర్వరూపాలలో ఒకటి.
చెరకు 'పోయేసి' కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం 'సాకరమ్ అఫిసినారమ్'. దీనిని ఉప-ఉష్ణమండల, ఉష్ణమండల ప్రాంతాలలో పండిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా సాగు చేయబడే పంటలలో ఒకటి. దీని వార్షిక ఉత్పత్తి సుమారు 1.8 బిలియన్ టన్నులు, ఇది పరిమాణ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద పంట. బ్రెజిల్ తర్వాత భారతదేశం చెరకు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, పుదుచ్చేరి, కేరళతో సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఏడాది పొడవునా వివిధ రకాల చెరకు పండుతుంది.[1]
వివిధ దేశాలలో చెరకు రసం
[మార్చు]దక్షిణ ప్రాంతానికి చెరకు పరిచయం కావడానికి ముందే, ఇది అనేక శతాబ్దాలుగా ఆగ్నేయాసియా, భారతదేశంలో దాని తీపి రసం కోసం సాగు చేసేవారు. దీనిని ముడి చక్కెర ఉత్పత్తికి ఉపయోగించేవారు. 1751లో జెస్యూట్ పూజారులు, న్యూ ఓర్లీన్స్ దిగువ పట్టణంలో చెరకు పండించడం ప్రారంభించినప్పుడు, అధిక ఖర్చులు, అవిశ్వసనీయత, లాభదాయకంగా లేకపోవడంవలన దాని రసాన్ని సమర్థవంతంగా చక్కెరగా మార్చడంలో వారు సవాళ్లను ఎదుర్కొన్నారు. అయితే, 1790ల నాటికి, ఎటియన్నే డి బోర్ అనే వ్యాపారవేత్త, శాంటో డొమింగోకు చెందిన నిపుణుడు, చక్కెర తయారీదారు ఆంటోయిన్ మోరిన్తో కలిసి, చెరకు రసాన్ని గ్రాన్యులేటెడ్ చక్కెరగా మార్చి విజయవంతంగా శుద్ధి చేసి, తద్వారా ఈ ప్రక్రియలో లాభదాయకతను చూపించాడు.[2]
బ్రెజిల్
[మార్చు]బ్రెజిల్ లో స్థానికంగా 'కాల్డో డి కానా', లేదా గరపా అని పిలిచే చెరకు రసాన్ని సాధారణంగా ఇక్కడి వీధి వ్యాపారులు విక్రయిస్తారు.[3][4] భారతదేశంలోని వీధి వ్యాపారుల మాదిరిగానే, చెరకును నొక్కడానికి యంత్రాలను ఉపయోగిస్తారు, చెరకు రసం తీస్తారు.[5] దీనిని కొన్నిసార్లు నిమ్మ లేదా పైనాపిల్ రసంతో కలిపి అందిస్తారు.
ఈజిప్ట్
[మార్చు]ఈజిప్టులో చెరకు రసాన్ని 'అసబ్' అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా పండ్ల రసాల దుకాణాలలో విక్రయిస్తారు. ఈజిప్టులో పండ్ల రసాల దుకాణం 'గిజా సాఫ్ట్ ఎల్ లాబన్'. ఈజిప్టు ప్రజలు కూడా నిమ్మకాయను అసబ్ కలిపి, పులియబెట్టిన పానీయాన్ని ఉత్పత్తి చేయడానికి, పులియబెట్టడానికి అనుమతిస్తారు. అత్యంత విలువైన అసబ్ ఈజిప్ట్ లోని మిన్యా నుండి వచ్చింది.[6]
భారతదేశం
[మార్చు]చెరకు రసాన్ని వీధి వ్యాపారులు భారతదేశం అన్ని చోట్ల విక్రయిస్తారు. అమ్మకందారులు చెరకును ఒక యంత్రంలో ఉంచి, నొక్కి రసాన్ని తీస్తారు. ఈ చెరకు రసాన్ని సాధారణంగా నిమ్మరసం, అల్లం రసంతో కలిపి పానీయంగా అందిస్తారు. ఇది ఇక్కడ చాలా ప్రజాదరణ పొందిన పానీయం, ముఖ్యంగా వేసవి నెలల్లో, వేడి నుంచి ఉపశమనంగా ఉంటుంది.[7]
ఇండోనేషియా
[మార్చు]ఇండోనేషియా లో చెరకు పానీయాన్ని మినుమన్ సరి తేబు' అని పిలుస్తారు. చల్లటి చెరకు రసాన్ని 'ఎస్ టెబు' అంటారు.[8] ఇండోనేషియాలో 'టెబు' అంటే చెరకు, ఎస్' అంటే మంచు. ఇండోనేషియాలో వీధి ప్రక్కన సాధారణంగా విక్రయించే సాంప్రదాయ పానీయాలలో ఇది ఒకటి.[9] పురాతన కాలం నుండి జావాలో చెరకు మొక్కలను సాగు చేస్తున్నారు. మొట్టమొదటగా దీని ప్రస్తావన 'మేదంగ్ మాతరం' కాలం నాటి 9వ శతాబ్దపు శాసనం నుండి వచ్చింది, ఇది 'నలకా రస' అనే తీపి పానీయాన్ని ప్రస్తావిస్తుంది, దీని అర్థం "చెరకు రసం".[10]
చెరకు నుండి రసాన్ని పిండడానికి యంత్రాన్ని ఉపయోగించి చక్కెర రసాన్ని వెలికితీస్తారు. ఈ యంత్రం మానవ శక్తితో లేదా గ్యాసోలిన్ ఇంజిన్ లేదా విద్యుత్ ద్వారా పనిచేయవచ్చు. అక్కడ విక్రయించే రసాన్ని ఎల్లప్పుడూ మంచు ఘనాలతో చల్లగా ఇస్తారు. ముఖ్యంగా వీధి వైపు తమ దుకాణాలని ఏర్పాటు చేసే వీధి విక్రేతల ద్వారా దేశవ్యాప్తంగా దొరుకుతుంది.[11]
కెన్యా
[మార్చు]కెన్యాలో చెరకు రసం అనేది ఒక ప్రసిద్ధ పానీయం, ఇక్కడ కూడా సాధారణంగా పండ్ల రసాల దుకాణాలలో విక్రయిస్తుంటారు.

మడగాస్కర్
[మార్చు]మడగాస్కర్ తూర్పు ప్రాంతంలో, చెరకు రసాన్ని పులియబెట్టడం ద్వారా 'బెట్సా-బెట్సా' అని పిలిచే చవకైన మద్యాన్ని తయారు చేస్తారు. ఈ పానీయం ఇది బీర్ కంటే చౌకైనది, స్థానికులలో ప్రాచుర్యం పొందింది.[12]
మయన్మార్
[మార్చు]
మయన్మార్ చెరకు రసాన్ని 'క్యాన్ యే' అని పిలుస్తారు, ఇది దేశవ్యాప్తంగా లభిస్తుంది.[13] దీనిని సాధారణంగా వేసవి కాలంలో తయారు చేస్తారు, కావలసిన వారికి సున్నం, జుజుబే లేదా నారింజ కలుపుతారు.[14]
పాకిస్తాన్
[మార్చు]2019లో పాకిస్తాన్ ప్రభుత్వం చెరకు రసాన్ని పాకిస్తాన్ జాతీయ పానీయంగా ప్రకటించింది.[15]
యునైటెడ్ స్టేట్స్
[మార్చు]యునైటెడ్ స్టేట్స్, ఆహార లేబుల్లపై పదార్థాల వివరణను FDA (Food and Drug Administration) నియంత్రిస్తుంది.[16] FDA "చెరకు చక్కెర" అని ప్రత్యేకంగా నిర్ణయించబడిన పదాన్ని సిఫారసు చేస్తుంది. వారు "తుది మార్గదర్శకత్వాన్ని సమీక్షించి, వారి లేబులింగ్ పరిభాష ఉపయోగించిన స్వీటెనర్, ప్రాథమిక స్వభావం, లక్షణాలను ఖచ్చితంగా వివరిస్తుందా అని పరిగణిస్తారు".[17][16]
వియత్నాం
[మార్చు]
చెరకు రసం వియత్నాంలో సాధారణంగా ఉపయోగించే ఒక పానీయం. దీనిని 'నూక్మియా' లేదా 'మియాడా' అని పిలుస్తారు. దీని తీపిని సమతుల్యం చేయడానికి 'కుంక్వాట్' లేదా 'చాన్ ముయి' వంటి ఇతర పండ్ల రసాలను జోడిస్తారు.[18] దీనిని ప్లాస్టిక్ సంచులలో వీధి దుకాణాలలో విక్రయిస్తారు. ఇంకా మంచుతో నిండిన సీసాలలో, పునర్వినియోగపరచలేని ప్లాస్టిక్ పాత్రలలో కూడా విక్రయిస్తారు.[19]
ఆరోగ్య ప్రయోజనాలు
[మార్చు]వేసవికాలంలో చెరకు రసానికి విపరీతమైన గిరాకీ ఉంటుంది. చెరకు రసం వేసవిలో చల్లదనాన్ని, తక్షణ శక్తిని అందించే సహజమైన, ఆరోగ్యకరమైన పానీయం. చెరకులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, సహజ చక్కెరలు ఉంటాయి. ఇంకా కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫ్లవనోయిడ్స్ వంటి ఆరోగ్యానికి చాలా మేలు చేసే అవసరమైన పోషకాలు ఉన్నాయి. శక్తిని అందించడంతో పాటు మండే ఎండల్లో వ్యక్తులని నిర్జల స్థితి (డీహైడ్రేషన్) నుంచి కాపాడటంలో సాయపడుతుంది. దీన్లోని క్షారగుణం శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. మితంగా తీసుకుంటే ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.[20]
ఆరోగ్య సమస్యలు, సూచనలు
[మార్చు]ముడి చెరకు ద్వారా లెప్టోస్పిరోసిస్ వంటి కొన్ని వ్యాధులు వ్యాపిస్తాయి.[21] బ్రెజిల్ వాళ్ళు చెరకు రసాన్ని చాగస్ వ్యాధి కేసులతో సంబంధం ఉందని చెపుతారు, ఎందుకంటే చెరకులో 'ట్రైపనోసోమా క్రూజీ' అనే వ్యాధికారక జీవులుంటాయి. సరిగ్గా శుభ్రం చేయకపోతే వ్యాధి సోకిన కీటకాలు ఈ వ్యాధికారకాలను వ్యాపింపచేస్తాయి.[22] ఈజిప్టులో చెరకు రసం తాగడం వల్ల మైకోటాక్సిన్స్ అఫ్లాటాక్సిన్ B1 ఫ్యూమోనిసిన్ B1 అనే రసాయనాలతో కలుషితం కావడం వల్ల ఆరోగ్య ప్రమాదాలు ఏర్పడవచ్చు అని భావిస్తారు.[23][24]
అయితే, బరువు తగ్గాలనుకునేవారితో పాటు జీర్ణ సమస్యలు ఉన్నవారు చెరకు రసం తాగే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మధుమేహంతో బాధపడేవారు కూడా చెరకు రసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కాలేయం పనితీరును మెరుగుపరచడంలో ఇంకా మూత్ర సమస్యల నివారణలో సాయపడుతుంది. చెరకు రసాన్ని పగటిపూట తాగడం ఉత్తమం, ముఖ్యంగా ఉదయం 11 గంటల సమయంలో లేదా మధ్యాహ్నం వేళల్లో తాగితే మంచిది. రోడ్డు పక్కన దొరికే రసం వల్ల సంక్రమణాలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు పరిశుభ్రత విషయంలో జాగ్రత్త వహించాలి. బలహీనమైన దంతాలు లేదా పుచ్చు సమస్యలు ఉన్నప్పుడు ఈ చక్కెర దంతాలపై బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తుంది, దంత సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.[20]
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చెరకు రసం ప్రయోజనాలు పూర్తిగా దక్కాలంటే దాన్ని తాజాగానే 15-20 నిమిషాలలోపే సేవించాలి. చెరకు రసం తీసిన వెంటనే దానిలో ఆక్సిడేషన్ ప్రక్రియ ప్రారంభమయి దాని రుచి, రంగు, పోషకాలు వేగంగా మారడం ప్రారంభిస్తాయి. కాబట్టి నిల్వ చేసి తాగితే ఆరోగ్యానికి హానికరం, అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చిన రసాన్ని 15-20 నిమిషాలలోపే తాగవలసి ఉంటుంది.[25]
చెరకు పుప్పొడి మానవులలో అలెర్జీలకు దారితీయవచ్చు. అందువల్ల, చెరకు పొలాలను సందర్శించడం మానడం మంచిది. గర్భధారణ, చనుబాలిచ్చే సమయంలో చెరకు ఉపయోగం గురించి సమాచారం లేదు, అందుకని, సమస్యలను నివారించడానికి వైద్యుల సలహా తీసుకోవలసిందని సూచిస్తున్నారు.[1]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- 1 2 Dr. Malavika Athavale (2026-07-14). "Excellent Health Benefits Of Sugarcane Juice". PharmEasy. Retrieved 2026-07-24.
- ↑ SCOTT R., SIMMONS (2014). Sugar and Sugarcane (APA 7th ed.). The University of North Carolina Press. pp. 267–269. ISBN 978-0-8078-3146-5.
- ↑ "Brazilian Street Food - A Dica do Dia". Rio & Learn. 28 September 2015. Archived from the original on 22 April 2021. Retrieved 3 April 2021.
- ↑ Andrade, Maria do Carmo; Joaquim Nabuco Foudantion. "Sugarcane Juice (Caldo de Cana)". basilio.fundaj.gov.br. Recife, Brazil: Government of Brasil. Archived from the original on 22 May 2022. Retrieved 3 April 2021.
- ↑ "Sugar Cane Juice aka "Caldo de Cana"". Colorful Foodie. 9 April 2015. Archived from the original on 19 April 2022. Retrieved 3 April 2021.
- ↑ Bruce Kraig; Colleen Taylor Sen (2013). Street Food around the World. ABC-CLIO. p. 130. ISBN 978-1-59884-955-4.
- ↑ Monisha Bharadwaj (16 July 2018). Indian Cookery Course. Octopus Books. pp. 1093–. ISBN 978-0-85783-593-2.
- ↑ "Kisah di Balik Segarnya Minuman Es Tebu". CNN Indonesia (in ఇండోనేషియన్). Archived from the original on 2017-11-15. Retrieved 2017-11-15.
- ↑ W, Rian Yulianto. Minuman Tradisional Indonesia (in ఇండోనేషియన్). Gulajava Ministudio. p. 36.
- ↑ Widjanarko, Tulus. "Hanya Ada Di Candi Sojiwan: Menu Hidangan Raja Mataram Kuno". Tempo (in ఇండోనేషియన్). Archived from the original on 2017-09-29. Retrieved 2017-11-15.
- ↑ Mediatama, Grahanusa. "Menyedot laba manis minuman tebu". kontan.co.id (in ఇండోనేషియన్). Archived from the original on 2017-11-15. Retrieved 2017-11-15.
- ↑ Bradt, Hilary; Austin, Daniel (1 July 2014). Madagascar. Bradt Travel Guides. ISBN 978-1-84162-498-3 – via Google Books.
- ↑ "နွေရာသီနဲ့ လိုက်ဖက်တဲ့ သဘာဝ ကြံရည် သောက်ခြင်းရဲ့ ကျန်းမာရေး ကောင်းကျိုး ၆ ခု". ဧရာဝတီ (in బర్మీస్). 2018-03-15. Archived from the original on 2020-10-25. Retrieved 2021-01-12.
- ↑ "နွေရာသီနဲ့ ကြံရည်". MyFood Myanmar (in బర్మీస్). 6 April 2016. Archived from the original on 2021-09-22. Retrieved 2021-01-12.
- ↑ "Govt declares sugarcane juice as 'national drink' of Pakistan". The Nation. 25 January 2019. Archived from the original on 10 February 2019. Retrieved 10 February 2019.
- 1 2 "Ingredients Declared as Evaporated Cane Juice: Guidance for Industry". Center for Food Safety and Applied Nutrition, US Food and Drug Administration. 1 May 2016. Archived from the original on 14 December 2019. Retrieved 22 August 2019.
- ↑ "Federal Register: Ingredients Declared as Evaporated Cane Juice; Guidance for Industry; Availability". Center for Food Safety and Applied Nutrition, US Food and Drug Administration. 25 May 2016. Archived from the original on 22 August 2019. Retrieved 22 August 2019.
- ↑ "Sweetest at the throat". 30 March 2010. Archived from the original on 11 November 2011. Retrieved 7 November 2011.
- ↑ "Nuoc mia, or sugar-cane juice". 6 November 2008. Archived from the original on 21 September 2011. Retrieved 7 November 2011.
- 1 2 డాక్టర్ ఆర్ నిష్మిత; శ్రీధర్ రెడ్డి, పుత్తా (2026-05-07). "షుగర్ ఉన్నవారు చెరకు రసం తాగొచ్చా, అసలు ఎవరు దూరంగా ఉండాలి, ఏ టైమ్లో తాగాలో తెలుసా?". Samayam Telugu. Retrieved 2026-07-24.
- ↑ Fisheries, Agriculture and. "Leptospirosis". Business.qld.gov.au. Archived from the original on 26 March 2016. Retrieved 1 November 2018.
- ↑ "Perguntas frequentes". Fundação Oswaldo Cruz (in పోర్చుగీస్). Archived from the original on 2017-08-15.
- ↑ (2016). "Mycotoxin Contamination in Sugarcane Grass and Juice: First Report on Detection of Multiple Mycotoxins and Exposure Assessment for Aflatoxins B1 and G1 in Humans".
- ↑ (1 February 2020). "Risk characterization and quantification of mycotoxins and their producing fungi in sugarcane juice: A neglected problem in a widely-consumed traditional beverage".
- ↑ "Sugarcane Juice: చెరకు రసం ఎంతకాలం నిల్వ ఉంటుందో తెలుసా." ABN ఆంధ్రజ్యోతి. 2025-04-26. Retrieved 2026-07-24.