చెరుకుపల్లి వెంకటప్పయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చెరుకుపల్లి వెంకటప్పయ్య (1900-1950)

పరిచయం

[మార్చు]

చెరుకుపల్లి వెంకటప్పయ్య బి.ఎ (ఆనర్సు)., బి.యల్ 1921 నుండి 1926 వరకూ టంగుటూరి ప్రకాశం గారి స్వరాజ్యపత్రికకు మద్రాసులో ఉపసహాయకులు (సబ్ఎడిటర్) గానుండి ధారాళమైన ఇంగ్లీషు భాషాతో సరళమైన పత్రికాసంపాదకజ్ఞానంతో ప్రకాశంగారికి కుడిచేయిలాంటివారని పేరుగాంచటమే కాక ప్రకాశంగారికి దాదాపుగా వ్యక్తిగత కార్యదర్శిగా నుండేవారు. 1928 నుండి విజయవాడలో న్యాయవాది వృత్తిలో ప్రవేశించి కొద్ది రోజుల లోనే బిజీప్రాక్టీసు కలిగి పుష్కలమైన ఆదాయంతో బాగా జరుతున్న జీవిత మధ్యకాలంలోనే 1950 లో అసాధారణ మృత్యు వాత పడి అకాలంగా అస్తమించారు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

కృష్ణాజిల్లా నూజివీడుకు చెంది విజయవాడలో కాపురముండిన చెఱుకుపల్లి బుచ్చిరామయ్య గారి పెద్ద కుమారుడు. శ్రీ బుచ్చిరామయ్య గారు వారింటిపేరులోని రను బండిర 'ఱ ' గా వ్రాశేవారు. చాల గొప్ప దైవభక్తి నిష్ఠలతో ఎల్లప్పుడూ విభూతి నామాలతో గంధంము కుంకమ బొట్టు తెల్లని వస్త్రములతో నుండే నల్లని విగ్రహం లాగనుండేవారు. వెంకటప్పయ్య గారు మే నెల 20వ తారీఖు, 1900 సంవత్సరము (శార్వరి నామ సంవత్సరం) లోజన్మించారు. బాల్య విద్యాభాసం విజయవాడ యస్ కె పి వి వి హిందూ ఉన్నత పాఠశాలలో చేశారు. 1915 లోనే యస్ యస్ యల్ సి క్లాసుకు చేరుకుని సంవత్సరం క్లాసులకెళ్లినా పరీక్షవ్రాయ టానికి వయస్సు తక్కువని స్కూలువారు ఆపేసి మరుసటి సంవత్సరం 1916 పరీక్షకు పంపించారు. 1916 లో మద్రాసు లోనిప్రసిడెంసీ కళాశాలలో ఇంటరుమీడయట్ లో చేరారు. అదే సంవత్సరంలో అక్కడే చేరిన దిగవల్లి వేంకట శివరావు గారు అప్పటినుండి మిత్రులై జీవితాంతం సన్నిహితంతో వుండేవారు. 1918 ఇంటరు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై అక్కడే బి.ఎ.ఆనర్సు చదవి 1921 లో ప్యాసైన తరువాత విద్యాభ్యాసమునకు విరామం ఇచ్చి ఉద్యోగపర్వములో ప్రవేశించారు.

పత్రికా సంపాదకీయం, ప్రతినిధత్వం

[మార్చు]

చరిత్ర ప్రధానమైన బ.ఎ ఆనర్సు చేసియుండుట వలన, అనేక పుస్తకములు చదువుట వలన వారికి చరిత్రతో పాటు ఇంగ్లీషు భాషాజ్ఞానంలో నైపుణ్యం కలిగినది దానికి తోడు పత్రికా సంకలనం సంపాదకం ఫొటోగ్రఫీ మీద గొప్పఅభిరుచి కలిగియున్ననవారు అప్పుడే 1921 లో స్థాపించబడ్డ స్వరాజ్య పత్రికకు టంగుటూరి ప్రకాశంగారు మేధాశక్తితో ఏరికోరి తెచ్చిన సంపాదక బృందంతో ఘంటారావంగా మద్రాసు లోని యావత్పప్రజల అభిమాన పత్రికైనది. ఆ పత్రిక సంపాదక బృందములో చెరుకుపల్లి వెంకటప్పయ్యగారు ఉపసంపాదకులుగా చేరారు. వారితో పాటుగా ఆ పత్రిక సంపాదక బృందములో కె.ఎయమ్. పణిక్కర్ , ఖాసా సుబ్బారావులు సంపాదకులు గానుండిరి. చెరుకుపల్లి వెంకటప్పయ్యగారి భాషానైపుణ్యం, వారి సాత్విక స్వభావం త్వరలోనే పత్రికాధిపతి టంగుటూరి ప్రకాశంగారి ముఖ్యసిబ్బందిలో ఒకరిగా చేసింది. వెంకటప్పయ్య గారు వారికి కుడిచేయి లాగ పరిగణంపబడేవారు. అంతేకాక దాదాపుగా వారికి వ్యక్తగతకార్యదర్శిగా నుండేవారు. 1922 లో జరిగిన కాకినాడ కాంగ్రెస్సు మహా సభలకు వెంకటప్పయ్యగారు స్వరాజ్య ప్రతినిధిగా వెళ్ళారు. వారితోపాటు వారి ఎడిటర్ ఫణిక్కర్ గారు గూడాయున్నారు. వెంకటప్పయ్యగారు ఆ పత్రికలో సంపాదకులు నుండగా ఇంగ్లీషులో కొన్ని వ్యాసాలు వ్యాసేవారు. అందులో ఒకటి "Gandhi at work and rest" అను వ్యాసమ విశేషమైనది. 1925లో వారి ఎడిటర్ ఫణిక్కర్ గారు స్వరాజ్య వదలి ఇండియన్ ఎక్సప్రెస్సులో సంపాదకవర్గములో చేరి క్రొత్త ఢిల్లీ వెళ్లిపోయారు. అటు తరువాత 1926 లో వెంకటప్పయ్యగారు కూడా ఉద్యోగాని వీడ్కోలు చెప్పి న్యాయశాస్త్ర పట్టా తీసుకోటానికి మద్రాసులోని లా కాలేజీలో 1926 లో జేరి 1928 లో ప్రథమశ్రీణిలో ఉత్తీర్ణులై న్యాయవాది వృత్తి అవలంబింప విజయావాడ చేరుకున్నారు.

న్యాయవాది వృత్తి, స్వతంత్రోద్యమములు

[మార్చు]

గాంధీ గారి స్వతంత్రోద్యమం జోరు గానున్న రోజులలో 1928 లో విజయావడలో న్యాయవాది వృత్తిలో ప్రవేశించారు ప్రత్యక్షంగా స్వతంత్రోద్యమములో ఆందోళన చేయలేదు. కానీ కాంగ్రెస్సు వాదే. వారి మిత్రలుందరూ కాంగ్రెస్సు కార్యకర్తలు చాలామందివుండిరి. కాంగ్రెస్సు ఉద్యమాలను గూర్చి దిగవల్లి వేంకట శివరావు గారు రచించిన పుస్తకము సత్యాగ్రహచరిత్ర మార్చి 1930 లో వెంకటపయ్యగారు మంచాల సుబ్బారావు గారు, డా ఘంటసాల సీతారామ శర్మ గార్ల చే ప్రకటింప బడింది. 1933 గాంధీ ఇర్విన్ పాక్టుక్రింద జాతీయోద్యమములో విర్బందించబడ్డ కాంగ్రెస్సు నేతలందరినీ జైళ్ల నుండి విడుదలచేయటం వారిపై రాజద్శారోహం కేసులు ఉపసంహరించటం జరిగింది. అదే సమయంలో విజయవాజడలోని గాంధీ (కాంగ్రెస్సుః భవనమును కూడా పోలీసు వారు వారి కస్టడీనుండి విడుదల చేసి అప్పట్లో నేతలెవ్వరూ ఇంకా జైలు నుండి విజయవాడ చేరుకోనందున పోలీసువారు ఆ కాంగ్రె స్సు భవనమును దిగవల్లి శివరావూగారికి అప్పచెప్పిన పిదప జైలునుండి వచ్చిన నేతలు కార్యకర్తలకు కాంగ్రెస్సు భవనంలో స్వాగతోత్సవం చేసే ప్రయత్నంలో చెరుకుపల్లి వెంకటప్పయ్య గారు గొప్పశ్రమదానముచేసి కాంగ్రెస్సు భవనమునకు స్వయముగా రంగులు వెేసి కార్యక్రమములో పాల్గొన్నారు. వారి న్యాయవాది వృత్తి దినదినాభివృధ్ది చెంది 1940-50 మధ్య దశాబ్దములో ప్రముఖన్యాయవాదిగా పేరు కలిగి బిజీ ప్రాక్టీసు కలిగియుండెను.

సహకారవస్తునిలయోద్యమము

[మార్చు]

1930 దశాబ్ధములో దేశవ్యాప్తముగా మొదలైన సహకారోద్యమము బెజవాడలో కూడా జరుగుతున్న రోజులలోసహకారసంస్ధల ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవహగానము చేయుటకు కృషిచేసినవారిలో వెంకటపయ్యగారొకరు. విజయవాడలో ఏప్రిల్ 1935 లో కృష్ణాకోఆపరేటివ్ స్టోర్సు అను సహకారవస్తునిలయమును స్థాపించి దానికి ప్రథమ అధ్యక్షులుగాను, దిగవల్లి వేంకట శివరావుగారు కార్యదర్సిగాను కొన్నాళ్లు నడిపించారు.

అకాలనిర్యాణం

[మార్చు]

1950 అక్టోబరు 12 వతారీఖు ప్రొద్దుటే బయటకు పనిమీద వెళ్లిన నెంకటప్పయ్య గారు ఇక తిరిగి మళ్లీ రాలేదు. ఆరోజు వారు కోర్టులోచేయవలసిన కేసులున్నీ వాయదాలు పడినవి. వారి ఆచూకీ లేదు. ఇంటా బయటా వారి కోసం తహతహ లాడిన కుటుంబ, బంధు మిత్రులు, వారి కక్షిదారులు గాలింపులతో విఫల ప్రయత్నంచేశారు. వారి మృత దేహం మర్నాడు విజయవాడ రవీసు కాలవ కోమటి గుంట లాక్కుల దగ్గర తేలినది. ఆ ఘటన ఎలా జరిగినదీ ఎవ్వరకీ తెలియదు. వారి 50 వ ఏట అకాల అస్తమయంతో వయోవృధ్దులైన వారి తల్లితండ్రులు, భార్య ముగ్గురు పిల్లలు అనాథలైనారు