చెలికాని లచ్చారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చెలికాని లచ్చారావు ప్రచురణకర్తగా ప్రసిద్ధి చెందినవాడు. ఆంధ్ర భాషావిలాసిని అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం మండలానికి చెందిన చిత్రాడ గ్రామం నుండి ఇతడు అమూల్యములైన పుస్తకాలను అందించాడు. దానికోసం శ్రీరామ విలాస ముద్రాక్షరశాల అనే పేరుతో ఒక ముద్రణాలయాన్ని నడిపాడు. కావ్యనిధి అనే బిరుదును కలిగియున్నాడు.

ఇతడు ప్రకటించిన కొన్ని గ్రంథాలు:

 1. కవి ప్రభునామ గుంభిత విచిత్ర పద్యగర్భిత కందపద్య సకలేశ్వర శతకము
 2. కామేశ్వరీ శతకము
 3. చిరవిభవ శతకము
 4. వేంకటాచల నిలయ శతకము
 5. బది నీతులు
 6. జాహ్నవీ మాహాత్మ్యము
 7. సీమంతినీ కళ్యాణము[1]
 8. విజయనందన విలాసము
 9. వాల్మీకి చరిత్రము
 10. రంగనాథ రామాయణము
 11. శ్రీరంగమాహాత్మ్యము
 12. సారంగధర చరిత్రము

మూలాలు[మార్చు]

 1. పెనుమళ్ల సోమన్నకవి, చెలికాని లచ్చారావు (సంపాదకుడు) (1919). సీమంతినీ కళ్యాణము. పిఠాపురం: చెలికాని లచ్చారావు. Retrieved 8 May 2015.