Jump to content

చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ

వికీపీడియా నుండి
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ


బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, ఐ అండ్‌ పీఆర్‌ శాఖ మంత్రి
పదవీ కాలం
2022 ఏప్రిల్ 11 – 2024 జూన్ 03

బీసీ సంక్షేమ శాఖ
పదవీ కాలం
26 జులై 2020 – 2022 ఏప్రిల్ 10

శాసనసభ్యుడు
పదవీ కాలం
2019 – 3 జూన్ 2024
నియోజకవర్గం రామచంద్రపురం

వ్యక్తిగత వివరాలు

జననం 1964
అడవిపాలెం గ్రామం, రాజోలు మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జీవిత భాగస్వామి వరలక్ష్మి
సంతానం నరీన్, ఉమాశంకర్‌

చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ (జననం 1964 డిసెంబరు 23) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. వేణుగోపాల కృష్ణ ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1][2] కల్లుగీత కార్మిక కుటుంబంలో శెట్టిబలిజ సామాజి వర్గానికి చెందిన మంచి నాయకుడు జిల్లా పరిషత్ సభ్యులు నుండి  తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా శాసనసభ్యులుగా ఒక మంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గౌడ్.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లా, రాజోలు మండలం, అడవిపాలెం గ్రామంలో చెల్లుబోయిన వెంకన్న, సుభద్రమ్మ దంపతులకు 1964 డిసెంబరు 23న జన్మించాడు. ఆయన బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి బి.ఏ పూర్తి చేశాడు.[3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

శ్రీనివాస వేణుగోపాలకృష్ణ 2001, 2006లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రాజోలు జడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 2006 జూలై 22వ తేదీన ఆయన జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) సభ్యుడిగా పనిచేశాడు. వేణుగోపాలకృష్ణ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణాంతరం వైఎస్సార్‌సీపీలో చేరి కాకినాడ గ్రామీణ శాసనసభ నియోజకవర్గం నుంచి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాడు. అనంతరం వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశాడు.

శ్రీనివాస వేణుగోపాలకృష్ణ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తోట త్రిమూర్తులుపై 75365 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాడు.[5] చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ 26 జూలై 2020న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.[6][7][8][9] ఆయన 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, ఐ అండ్‌ పీఆర్‌ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[10]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (26 July 2020). "బాధ్యతలు చేపట్టిన సీదిరి అప్పలరాజు". Sakshi. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  2. "Venugopala Krishna takes charge as Andhra Backward Classes welfare minister". BW Businessworld. 29 July 2020. Retrieved 10 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. Sakshi (23 July 2020). "మంత్రులుగా చెల్లుబోయిన, సీదిరి". Sakshi. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  4. Sakshi (18 March 2019). "తూర్పు గోదావరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రొఫైల్స్‌". Archived from the original on 2021-12-08. Retrieved 9 December 2021.
  5. Sakshi. "Ramachandrapuram Constituency Winner List in AP Elections 2019". www.sakshi.com. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  6. Outlook India (22 July 2020). "Two ministers inducted in AP cabinet". outlookindia.com/. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  7. Sakshi (22 July 2020). "మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణం". Sakshi. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  8. 10TV (21 July 2020). "ఫస్ట్ చాన్స్‌లోనే కేబినెట్‌లోకి.. కొత్త మంత్రులు వీరే, రేపే కేబినెట్ విస్తరణ andhra pradesh cabinet expansion". 10TV (in telugu). Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  9. Sakshi (15 February 2021). "శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు". Sakshi. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  10. Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.