చెవాంగ్ ఫున్సోగ్
| చెవాంగ్ ఫున్సోగ్ | |
|---|---|
| జననం | భారతదేశం |
| వృత్తి | ప్రభుత్వ ఉద్యోగి |
| పురస్కారాలు | పద్మశ్రీ జమ్మూకాశ్మీరు ప్రభుత్వ సర్టిఫికెట్ ముఖ్యమంత్రి స్వర్ణ పతకం |
చెవాంగ్ ఫున్సోగ్ భారతీయ ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (PESB) ఛైర్మన్.[1][2] ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి.[3] వుడ్రో విల్సన్ స్కూల్లో ఆల్బర్ట్ పర్విన్ ఫెలో అయిన ఫున్సోగ్,[3] 1998 లో భారత ప్రభుత్వం నుండి నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని అందుకున్నాడు.[4]
జీవిత చరిత్ర
[మార్చు]మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన ఫున్సోగ్, 1968లో శ్రీనగర్‌లోని పూర్వపు రీజినల్ ఇంజనీరింగ్ కళాశాలలో (ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీనగర్ ) అధ్యాపకుడిగా తన కెరీర్ ప్రారంభించాడు. అక్కడ మూడు సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేశాక, 1978 లో, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరాడు.[3] ఒక సంవత్సరం తర్వాత, విరామం తీసుకుని, 1979 నుండి 1980 వరకు ఆల్బర్ట్ పర్విన్ ఫెలోగా ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలోని వుడ్రో విల్సన్ స్కూల్లో నోబెల్ గ్రహీత ఆర్థర్ లూయిస్ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ ఎకనామిక్స్‌ను అభ్యసించాడు. భారతదేశానికి తిరిగి వచ్చి, జమ్మూ కాశ్మీర్ కేడర్‌లో తన సేవను తిరిగి ప్రారంభించాడు. అక్కడ ఆయన సబ్-డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, అదనపు కార్యదర్శి, జిల్లా మేజిస్ట్రేట్, డెవలప్మెంట్ కమిషనర్, డివిజనల్ కమిషనర్, టూరిజం సెక్రటరీ, ఫైనాన్షియల్ కమిషనర్ వంటి అనేక పదవులను నిర్వహించాడు. తరువాత హోం మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా, చివరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.[3] ఈ పదవిలో ఆయన 2007 వరకు పనిచేశాడు.[5]
ఆ తరువాత, పరిశ్రమల మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా కేంద్రానికి వెళ్ళాడు. అక్కడే, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (బయోటెక్నాలజీ డైరెక్టర్‌గా), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (అంతర్గత భద్రత, మానవ హక్కుల సంయుక్త కార్యదర్శిగా) వంటి ఇతర మంత్రిత్వ శాఖలలో పనిచేశారు. ప్రధానమంత్రి కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా కూడా పనిచేశాడు.[3] యునైటెడ్ కింగ్డమ్లో భారత హైకమిషన్‌లో మంత్రి (ఆర్థిక)గా లండన్ వెళ్లాడు.[6] 2008 లో ఫున్సోగ్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (PSEB) సభ్యుడిగా నియమితుడయ్యాడు. 2009లో దానికి చైర్మన్ అయ్యాడు. ఈ కాలంలో, జమ్మూ కాశ్మీరులో రాష్ట్రపతి పాలన విధించబడినప్పుడు,[7] గవర్నరుకు సలహాదారుగా కూడా ఒక సంవత్సరం పనిచేశాడు.[8] 2012లో PSEB ఛైర్మన్‌గా పదవీకాలం ముగిసినప్పుడు, ప్రభుత్వం ఆయనను మరొక పదవీకాలానికి తిరిగి నియమించింది.[9] ఛైర్మన్‌గా, భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలకు నియామకాలను నియంత్రించే సంస్థకు ఆయన నాయకత్వం వహించాడు.[10]
1983 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఫున్సోగ్ను మెరిట్ సర్టిఫికేట్ తో సత్కరించింది.[3] భారత ప్రభుత్వం 1998 లో ఆయనకు పద్మశ్రీ పౌర గౌరవాన్ని ప్రదానం చేసింది.[4] 2007 లో రాష్ట్ర ప్రభుత్వం నుండి, ముఖ్యమంత్రి బంగారు పతకం, మెరిట్ సర్టిఫికేట్ కూడా అందుకున్నాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Available Notification". Administrative Tribunal & Administration. 2012. Archived from the original on March 4, 2016. Retrieved October 27, 2015.
- ↑ "DoT mess: officers miss bus to key BSNL post". Hindustan Times. 4 January 2010. Retrieved October 27, 2015.
- 1 2 3 4 5 6 7 "PSEB profile" (PDF). Public Enterprises Selection Board, Government of India. 2015. Retrieved October 27, 2015.
- 1 2 "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on October 15, 2015. Retrieved July 21, 2015.
- ↑ "Kundal takes over as CS". Greater Kashmir. 1 November 2007. Retrieved October 27, 2015.
- ↑ "Indian Overseas Cong flays UK MPs for J&K plebiscite move". Indian National Overseas Congress. 2015. Archived from the original on August 26, 2015. Retrieved October 27, 2015.
- ↑ "Kashmir under President's rule". Reuters. 11 July 2008. Retrieved October 27, 2015.[permanent dead link]
- ↑ "Volume II - Finance Commission, India" (PDF). Finance Commission. 2015. Retrieved October 27, 2015.
- ↑ "Notification" (PDF). Government of India. 2012. Archived from the original (PDF) on March 4, 2016. Retrieved October 27, 2015.
- ↑ "ONGC head seeks changes in PSU appointment rules". Economic Times. 10 June 2010. Archived from the original on March 5, 2016. Retrieved October 27, 2015.