చెవేంద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెవేంద్ర
—  రెవిన్యూ గ్రామం  —
చెవేంద్ర is located in Andhra Pradesh
చెవేంద్ర
చెవేంద్ర
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°20′36″N 81°07′40″E / 16.343427°N 81.127712°E / 16.343427; 81.127712
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెడన
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,197
 - పురుషులు 1,146
 - స్త్రీలు 1,051
 - గృహాల సంఖ్య 634
పిన్ కోడ్ 521366
ఎస్.టి.డి కోడ్ 08672.

చేవెండ్ర, కృష్ణా జిల్లా, పెడన మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 366., ఎస్.టి.డి.కోడ్ = 08672.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు[మార్చు]

ముదినేపల్లి, గూడూరు, పెడన, బంటుమిల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

శింగరాయకొండ, గుడ్లవల్లేరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 63 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం[మార్చు]

చేవెండ్ర గ్రామ పరిధిలోని చేవెండ్ర పాలెం ఎస్, వాడలో, 24, ఆగష్టు-2014 ఆదివారం నాడు, గంగానమ్మ అమ్మవారి సంబరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. మహిళలు ఊరేగింపుగా తరలివచ్చి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి భక్తులు, యువకులు అధికసంఖ్యలో విచ్చేసారు. [2]

శ్రీ రామాలయం[మార్చు]

  1. గ్రామంలో 100 సంవత్సరాలక్రితం నిర్మించిన చిన్న ఆలయాన్ని, ఆ తరువాత శ్రీ చేవేండ్ర వెంకటనరసయ్య దంపతులు, ఆలయ ముఖమంటపం నిర్మించి అభివృద్ధి చేసారు. ఆలయానికి మరింత ప్రాచుర్యం తీసికొని రావాలనే సంకల్పంతో, ఇటీవల, గ్రామానికి చెందిన శ్రీ చేవేండ్ర హనుమంతరావు, శ్రీ చేవేండ్ర శ్రీవెంకటేశ్వరరావు, ముందుకు వచ్చి, గ్రామస్తుల, భక్తుల విరాళాలు రు. 30 లక్షలతో, ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేసారు. తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురానికి చెందిన శిల్పులతో, ఈ ఆలయాన్ని నిర్మించారు. పెడన ప్రాంతంలో ఇంత సుందరంగా తీర్చిదిద్దిన ఆలయం ఇంకెక్కడా లేకపోవడం విశేషం.[4]
  2. ఈ ఆలయానికి గ్రామవాసి శ్రీ చేవేండ్ర చెల్లయ్య, ఒక ఎకరం భూమిని ఉదారంగా అందజేసినారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015, మే నెల-6వ తేదీ బుధవారం నుండి ప్రారంభించి, 8వ తేదీ శుక్రవారం ఉదయం 9-45 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితుల ఆధ్వర్యంలో, ధ్వజస్తంభ, ముఖమండప, శిఖర, సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు భారీగా అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు వివిధ ప్రాంతాలనుండి అధికసంఖ్యలో తరలివచ్చారు. [5]&[6]

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ మదనగోపాలస్వామివారి ఆలయం[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, కూరగాయలు, అపరాలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

శ్రీ కూనపరెడ్డి వెంకటేశ్వరరావు[మార్చు]

చేవేండ్రపాలెం గ్రామానికి చెందిన వీరు, పాలెం షావుకారు గా గుర్తింపు పొందినారు. వీరు చేవేండ్ర గ్రామ సర్పంచిగా, మచిలీపట్నం రోటరీ క్లబ్ అధ్యక్షులుగా పనిచేసారు. వీరికి జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటులో వీరి కృషి ఎంతో ఉంది. ఈ కేంద్రానికి ఆయన రహదారి ప్రక్కనే ఉన్న 50 సెంట్లభూమిని వితరణగా అందజేసినారు. ఇదిగాక గ్రామంలో పాఠశాల ఏర్పాటుకు గూడా ఆయన స్థలం అందించారు. వీరు పలు సేవాకార్యక్రమాలు నిర్వహించి, ప్రజల మన్ననలు పొందినారు. చేవేండ్ర గ్రామ సర్పంచిగా పనిచేసిన వారిలో నిబద్ధతగా పనిచేసి, తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారు. గ్రామంలో ఆశ్రమం ఏర్పాటుచేసి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. వీరు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా గూడా పనిచేసారు. వీరు 93 సంవత్సరాల వయసులో, 2015, మార్చ్-18వ తేదీ బుధవారం రాత్రి, మచిలీపట్నంలో కన్నుమూసినారు. 2016, ఏప్రిల్-5న, ఈ గ్రామంలో, శ్రీ వెంకటేశ్వరావు, ఆయన భార్య శ్రీమతి రామకోటేశ్వరమ్మల విగ్రహాల ప్రతిష్ఠను వైభవంగా నిర్వహించారు. [3]&[7]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,197 - పురుషుల సంఖ్య 1,146 - స్త్రీల సంఖ్య 1,051 - గృహాల సంఖ్య 634;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2503.[2] ఇందులో పురుషుల సంఖ్య 1253, స్త్రీల సంఖ్య 1250, గ్రామంలో నివాసగృహాలు 635 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Chevendra". Archived from the original on 25 ఫిబ్రవరి 2017. Retrieved 2 July 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.

[2] ఈనాడు కృష్ణా; 2014, ఆగష్టు-25; 5వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015, మార్చ్-19; 10వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015, మార్చ్-27; 11వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2015, మే-4; 5వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2015, మే-9; 11వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2016, ఏప్రిల్-6; 4వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=చెవేంద్ర&oldid=3320725" నుండి వెలికితీశారు