చేతి బాంబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Infobox general

చేతి బాంబు (Hand Grenade) అనేది చేతితో విసరగల ఏదైనా చిన్న బాంబు. చేతి బాంబులను పేలుడు బాంబులు మరియు రసాయన మరియు వాయు బాంబులు అనే రెండు వర్గాలు వలె వర్గీకరించారు.[1] పేలుడు బాంబులను ఎక్కువగా ఆధునిక యుద్ధాల్లో ఉపయోగిస్తారు మరియు తదుపరి ప్రభావం లేదా కొంత సమయం తర్వాత పేలే విధంగా రూపొందించబడతాయి. రసాయన మరియు వాయు బాంబులు పేలుడు కోసం కాకుండా, మండటానికి లేదా ఒక వాయువును విడుదల చేయడానికి ఉద్దేశించినవి.[1]

గ్రేనైడర్‌లు అనేవారు వాస్తవానికి బాంబులను విసరడంలో నైపుణ్యం సాధించిన సైనికులు.

శబ్ద వ్యుత్పత్తిశాస్త్రం[మార్చు]

ఆధునిక ఫ్రెంచ్ బాంబు నుండి 1590ల్లోని "చిన్న విస్ఫోటన గుండు" అనే దానికి అర్థం "దానిమ్మ" మరియు ఈ పదాన్ని పాత ఫ్రెంచ్ pomegrenate నుండి తీసుకున్నారు (ఇది స్పానిష్ granada చే ప్రభావితం అయ్యింది). ఈ విధంగా పిలవడానికి కారణంగా పలు గింజల గల పండును పొడితో నిండిన, విభజించగల బాంబు లేదా ఒకే రకమైన ఆకృతిని కలిగి ఉండటం వలన చెప్పవచ్చు.[2]

రసాయన మరియు గ్యాస్ బాంబులు[మార్చు]

రసాయన మరియు గ్యాస్ బాంబుల్లో పొగ బాంబులు మరియు దాహక బాంబులు ఉంటాయి. విస్ఫోటన బాంబులు వలె కాకుండా, రసాయన మరియు గ్యాస్ బాంబులు పేలడానికి కాకుండా మండటానికి లేదా ఒక వాయువును విడుదల చేయడానికి రూపొందిస్తారు.[1]

పొగ[మార్చు]

స్మోక్ గ్రెనేడ్

పొగ బాంబులను భూమిపై మరొక స్థలానికి లేదా భూమిపై నుండి గాలిలో సంకేతాలను ఇచ్చే పరికరాలు, గమ్య లేదా చేరుకోవల్సిన ప్రాంతాన్ని గుర్తించడానికి పరికరాలు మరియు దళం కదలిక కోసం పరిశీలన పరికరాలు వలె ఉపయోగిస్తారు. ఇది ఎగువ మరియు దిగువ భాగాల్లో వాయువును విడుదల చేయడానికి రంధ్రాలతో ఒక ఉక్కు రేకుతో రూపొందించిన సిలిండర్‌గా ఉంటుంది. ఈ రంథ్రాలు బాంబును మండించినప్పుడు వాయువు విడుదలను అనుమతిస్తాయి. రెండు ప్రధాన రకాలు ఉనికిలో ఉన్నాయి, రంగు రంగుల పొగ బాంబు (సంకేతాలు ఇవ్వడానికి) మరియు పరిశీలన పొగ బాంబు. రంగు రంగుల పొగ బాంబుల్లో, పూరకం 250 మరియు 350 గ్రాముల రంగు రంగుల పొగ మిశ్రమం (ఎక్కువగా పొటాషియం క్లోరేట్, లాక్టోజ్ మరియు ఒక రంగు) ఉంటుంది. పరిశీలన పొగ బాంబులు సాధారణంగా HC (హెక్సాక్లోరోథేన్/జింక్) పొగ మిశ్రమం లేదా TA (టెరెఫ్థాలిక్ ఆమ్లం) పొగ మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. HC పొగ మిశ్రమం పీల్చడం వలన హాని కలుగుతుంది ఎందుకంటే దీనిలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. అత్యధిక ప్రభావం కోసం ఉద్దేశించని ఈ బాంబులు అసురక్షిత చర్మంపై బొబ్బలు వచ్చేలా వేడిని పుట్టిస్తుంది లేదా మండేలా చేస్తుంది మరియు పేల్చిన బాంబును చల్లబడేవరకు తాకకూడదు.

అల్లర్ల నియంత్రణ[మార్చు]

సిఎస్ గ్యాస్ గ్రెనేడ్

బాష్పవాయువు బాంబులు ఆకృతి మరియు కార్యాచరణలపరంగా పొగ బాంబులకు పోలి ఉంటాయి. బాష్పవాయువు బాంబుల్లోని పూరకంలో సాధారణంగా CS-లాడెన్ పొగ యొక్క ఒక ఏరోసోల్‌ను ఉత్పత్తి చేయడానికి మండే ఒక పేరోటెక్నిక్ సంరచనతో మిళితమైన 80 నుండి 120 గ్రాముల CS వాయువు ఉంటుంది. దీని వలన కళ్లల్లో తీవ్రమైన దురద ఏర్పడుతుంది మరియు పీల్చినట్లయితే ముక్కు మరియు గొంతుల్లో కూడా బాధ కలిగేలా చేస్తుంది. (వాకో సీజ్ కూడా చూడండి). అరుదుగా CSకు బదులుగా CR వాయువును ఉపయోగిస్తారు.

ఇన్సెండియరీ గ్రెనేడ్

దాహక[మార్చు]

దాహక బాంబులు (లేదా థెర్మైట్ బాంబులు) ఒక రసాయన ప్రతిచర్య ద్వారా తీవ్రమైన వేడిని ఉత్పత్తి చేస్తాయి. బైజాంటైన్స్ తయారు చేసిన ప్రారంభ దాహక బాంబులు గ్రీక్ ఫైర్‌ను ఉపయోగించేవి.

ఆధునిక దాహక బాంబులు (లేదా థెర్మైట్ బాంబులు) ఒక రసాయన ప్రతిచర్య వలన తీవ్రమైన వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీని ఆకృతి వాస్తవానికి ఒక పొగ బాంబు ఆకృతిని పోలి ఉంటుంది. పూరకం 600 నుండి 800 గ్రాముల థెర్మేట్‌ను కలిగి ఉంటుంది, ఇది రెండవ ప్రపంచ యుద్ధం కాలానికి చెందిన థెర్మైట్ యొక్క మెరుగుపర్చిన సంస్కరణగా చెప్పవచ్చు. వేడిని పుట్టించే రసాయన ప్రతిచర్యను ఒక థెర్మైట్ ప్రతిచర్యగా పిలుస్తారు. ఈ ప్రతిచర్యలో, అల్యూమినియం లోహం మరియు ఐరన్ ఆక్సైడ్‌ల పొడి మోల్టెన్ ఉక్కు మరియు అల్యూమినియం ఆక్సైడ్ యొక్క ఒక తరంగిణిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రతిచర్య 2,200 °C (3,992 °F)తో మండుతూ అత్యధిక మొత్తంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీని వలనే ఇది ఆయుధ కోశాలు, ఫిరంగులు మరియు వాహనాలను నాశనం చేయడానికి ఉపయోగపడే దాహక బాంబులుగా పేరు గాంచాయి. ఒక బాహ్య ఆక్సిజన్ అవసరం లేకుండా అమలు అయ్యే దాని సామర్థ్యంతోసహా ఇతర సౌలభ్యాలు నీటి అడుగున మండటానికి కూడా సహాయపడతాయి. దీనిని విసరడానికి ఉద్దేశించినవి కాని కారణంగా, థెర్మేట్ దాహక బాంబులు సాధారణంగా ఇతర బాంబులు కంటే నెమ్మదిగా సమ్మిశ్రణం చేస్తారు (ఉదా. రెండు సెకన్లు).

తెల్లని పాస్పరస్‌ను (పొగ బాంబుల్లో కూడా ఉపయోగిస్తారు; పైన చూడండి) కూడా ఒక దాహక కారకం వలె ఉపయోగిస్తారు. ఇది 2,800 °C (5,070 °F) ఉష్ణోగ్రతతో మండుతుంది. తెల్లని పాస్పరస్‌ను ప్రధానంగా రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ హోమ్ గార్డ్‌చే నం 76 ప్రత్యేక దాహక బాంబులో ఉపయోగించారు.

ఇవి చాలా త్వరగా మండటం వలన మరియు అత్యధిక ఉష్ణోగ్రత వలన థెర్మైట్ మరియు తెల్లని పాస్పరస్‌లు కొన్ని తీవ్ర మరియు చాలా బాధాకరమైన కాలిన గాయాలకు కారణమైంది. దీనితో పాటు, తెల్లని పాస్పరస్ చాలా విషపూరితం: 50-100 మిల్లీగ్రాముల మోతాదు సగటు మానవునికి ప్రాణాంతకమైనది.

ఒక సాధారణ మెరుగుపర్చిన దాహక బాంబుగా మోలోటోవ్ కాక్‌టైల్‌ను చెప్పవచ్చు.

చరిత్ర[మార్చు]

బైజాంటైన్ సామ్రాజ్యం[మార్చు]

మొట్టమొదటి దాహక బాంబు లియో III (717-741) హయానికి కొంతకాలం తర్వాత తూర్పు రోమన్ (బైజాంటైన్) సామ్రాజ్యంలో వెలుగులోకి వచ్చింది.[3] మునుపటి శతాబ్దంలో ఒక బైజాంటైన్ సృష్టి అయిన గ్రీకు అగ్నిని బైజాంటైన్ సైనికులు నేర్చుకున్నారు, ఇది శత్రువుపై ఫ్లేమ్‌థ్రోవర్‌లతోనే కాకుండా, రాతి మరియు సెరామిక్ జాడీల్లో కూడా తయారు చేసేవారు.[3] తర్వాత, గాజు పాత్రలను ఉపయోగించారు. 10వ నుండి 12వ శతాబ్దాల వరకు గ్రీకు అగ్నితో బైజాంటైన్ చేతి బాంబులను ఏథెన్స్‌లోని నేషనల్ ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు. గ్రీకు అగ్ని లేదా తదుపరి రకాల వాడకం నియర్ ఈస్ట్‌లో ముస్లిం సైన్యాలకు విస్తరించింది, ఇది ఇక్కడ నుండి 10వ శతాబ్దంనాటికి చైనాకు చేరుకుంది.[3]

గ్రీక్ ఫైర్ తో నింపిన హ్యాండ్ గ్రెనేడ్; చుట్టూ క్యాల్ ట్రాప్స్ (10th-12th c. జాతీయ హిస్టారికల్ మ్యూజియం, ఏథెన్స్, గ్రీస్)

రెండవ ప్రపంచ యుద్ధం[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధంలో, యునైటెడ్ కింగ్‌డమ్ తెల్లని పాస్పరస్‌తో చేసిన దాహక బాంబులను ఉపయోగించింది. నం. 76 ప్రత్యేక దాహక బాంబు అని పిలిచే బాంబును ముఖ్యంగా ఒక సంరక్షక ఆయుధం వలె హోమ్ గార్డ్‌లకు ఇచ్చేవారు, దీనిని అధిక సంఖ్యలో ఉత్పత్తి చేసేవారు; 1941 ఆగస్టునాటికి, 6,000,000 కంటే ఎక్కువ ఉత్పత్తి చేయబడ్డాయి.[4]

ఈ బాంబును చేతితో విసిరేవారు లేదా ఒక చిన్న మోర్టార్ నార్త్ఓవర్ ప్రొజెక్టర్ నుండి పేల్చేవారు; ఈ విధంగా పేల్చేదానికి బలమైన కంటైనర్ అవసరం మరియు ఈ రెండు రకాలు రంగు రంగుల బాంబులు. జాడీలో ఏవైనా పగుళ్లు చాలా ప్రమాదకరం, నీటి అడుగున నిల్వ చేయాలని సూచిస్తారు.

మోలోటోవ్ కాక్‌టైల్[మార్చు]

మోలోటోవ్ కాక్‌టైల్ అనేది ఆల్కాహాల్ (ఇథనాల్) లేదా గ్యాసోలైన్ (పెట్రోల్) తో నింపిన గాజు సీసా నుండి తయారు చేసిన ఒక మెరుగుపర్చిన దాహక బాంబు, దీనిని లక్ష్యంపై వేస్తున్న సమయంలో దానికి ఉన్న గుడ్డ ముక్కను వెలిగించడం వలన పేలుతుంది. మోలోటోవ్ కాక్‌టైల్ ఈ పేరును 1939 వింటర్ యుద్ధంలో ఫిన్లాండ్‌ను సోవియెట్ ముట్టడి సమయంలో పొందింది, కాని ఆ దశాబ్దంలో కొంతకాలం ముందు కూడా ఉపయోగించారు, స్పానిష్ అంతర్యుద్ధంలో ఫ్రాంకో యొక్క దళాలచే ఉపయోగించారు. ఈ పేరు వింటర్ యుద్ధంలోని ఫిన్నీష్ దళాల నుండి వచ్చింది. ఈ యుద్ధానికి కారణమైనట్లు పేర్కొనే మాజీ సోవియెట్ విదేశీ మంత్రి వేయాచెల్సావ్ మోలోటోవ్ పేరు నుండి తీసుకోబడింది మరియు సోవియెట్ బాంబులకు ఒక హాస్యస్ఫోరక సూచనగా ఫిన్లాండ్‌లో "మోలోటోవ్ రొట్టె బుట్ట" అని పిలుస్తారు.

విస్ఫోటక బాంబులు[మార్చు]

విస్ఫోటక బాంబులను విసిరిన తర్వాత లేదా నిర్దిష్ట సమయం తర్వాత పేలేందుకు ఉద్దేశించినవి.[1]

ఫ్రాగ్మెంటేషన్[మార్చు]

ఫ్రాగ్మెంటేషన్ బాంబు (సాధారణంగా ఒక ఫ్రాగ్ అని పిలుస్తారు) అనేది పేలిన తర్వాత తూటా తునకలను వెదజల్లడానికి రూపొందించబడింది. దీనిని కఠినమైన ప్లాస్టిక్ లేదా ఉక్కుతో తయారు చేస్తారు. ఫ్లెచెటెస్, తీగ ముక్కలు, బాల్ బేరింగ్స్ లేదా దాని పాత్ర కూడా ముక్కలను వెదజల్లుతుంది. సాధారణంగా grenade అనే పదాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మరియు ముఖ్యంగా పేర్కొన్నట్లయితే, అది సాధారణంగా ఒక ఫ్రాగ్మెంటేషన్ బాంబును సూచిస్తుంది.

ఈ గ్రనేడ్లను కొన్నిసార్లు రక్షణాత్మక గ్రనేడ్లుగా కూడా వర్గీకరిస్తారు. ఎందుకంటే కొన్ని గ్రనేడ్లు గాయపరచగల పరిధి వాటిని విసరగల దూరానికి సమానంగా, కొన్నిసార్లు ఎక్కువగా కూడా ఉన్నట్టు తేలింది. అందుకే వాటిని ఏదైనా చాటు చూసుకుని విసరాల్సి వస్తుంది. మిల్స్‌ బాంబ్‌, లేదా ఎఫ్‌1 గ్రెనేడ్‌ ఇలాంటి రక్షణాత్మక గ్రనేడ్లకు ఉదాహరణ. వీటి కాజువాల్టీ పరిధి[5] 30 నుంచి 45 మీటర్ల దాకా ఉంటుంది. వీటిని విసరగల 30 మీటర్ల దూరం కంటే ఇది ఎక్కువ.

అమెరికాకు చెందిన ఎం67 గ్రెనేడ్‌ వంటి ఆధునిక ఫ్రాగ్మెంటేషన్‌ గ్రెనేడ్లు గాయపరచగల పరిధి 15 మీటర్లు (పాత తరహా గ్రెనేడ్ల పరిధిలో సగమే. అవింకా వాడుకలోనే ఉన్నాయి). వీటిని 40 మీటర్ల దూరం దాకా విసరవచ్చు. వాటి శకలాలు 200 మీటర్ల దూరం దాకా వెళ్లగలవు.[6]

తీవ్రస్పందన[మార్చు]

యుఎస్ నావికుడు గ్రెనేడియర్ సర్టిఫికెట్తో కంకూషన్ గ్రెనేడ్ తో

కంకషన్‌ గ్రెనేడ్‌ యాంటీ పర్సనెల్‌ పరికరం. లక్ష్యాన్ని తన పేలుడు శక్తితోనే నష్టపరుస్తుంది. శకల గ్రెనేడ్లతో పోలిస్తే ఎక్స్‌ప్లోజివ్‌ ఫిల్లర్‌ సాధారణంగా ఎక్కువ బరువు, పరిమాణం కలిగి ఉంటుంది. దీని కేస్‌ కూడా చాలా సన్నగా ఉండి, వీలైనంత తక్కువ శకలాలుగా విడిపోయేలా డిజైన్‌ చేసి ఉంటుంది. ఆవృత పాంతాల్లో వాడినప్పుడు ఈ గ్రెనేడ్‌ సృష్టించే ఒత్తిడి శకల గ్రెనేడ్‌ కంటే ఎక్కువ. అందుకే అలాంటి ప్రాంతాల్లో ఇది బాగా ప్రభావవంతంగా ఉంటుంది.

వియత్నాంలో బ్రౌన్‌ వాటర్‌ బోట్ల నావికులు వేలాది కంకషన్‌ గ్రెనేడ్లను నదుల్లో వదిలి పెట్టారు. లాండింగ్‌ క్రాఫ్ట్‌ యుటిలిటీ (ఎల్‌సీయూ), లేదా యార్డ్‌ ఫ్రైట్‌ యుటిలిటీ (వైఎఫ్‌యూ) బోట్లలో పెట్టెల కొద్దీ కంకషన్‌ గ్రెనేడ్లను ఉంచేవారు. సాపర్‌ బృందాలు నీళ్ల అడుగున ఈదుకుంటూ వచ్చి బోట్లకు బాంబులు అమర్చకుండా నిరోధించేందుకే ఈ ఏర్పాటు. పెట్రోల్‌ బోట్‌ రివర్‌ (పీబీఆర్‌), ఇతర సాయుధ నదీ పడవలు నీటిపైన కాస్తంత సెంట్రీ రక్షణ ఇవ్వగలుగుతాయేమో. కానీ కంకషన్‌ గ్రెనేడ్లు మాత్రం శత్రువు నీటి లోపలి నుంచి రాకుండా చేస్తాయి. కంకషన్‌ గ్రెనేడ్‌ పరిధిలో ఉంటే దాని పేలుడు ధాటికి ఈతగాడి కర్ణభేరితో పాటు కళ్లలోని రక్తనాళాలు కూడా పగిలిపోతాయి. అలా అతను పనికిరాకుండా పోతాడు. రాత్రి సమయాల్లో కన్నుగప్పి శత్రువులు నీటి అడుగు నుంచి ఈదుతూ రాకుండా నిరోధించేందుకు వేళాపాళా లేకుండా గంటకు నాలుగైదేసి చొప్పున కంకషన్‌ గ్రెనేడ్లను నీళ్లలోకి విసురుతుంటారు.

సాధారణంగా ఈ గ్రెనేడ్లను దాడికి ఉపయోగించే ఆయుధాలుగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇవి నష్టం కలిగించగల పరిధి భూమిపై వాటిని విసరగలిగిన పరిధి కంటే తక్కువగా ఉంటుంది. కంకషన్‌ పభ్రావం శకల గ్రెనేడ్‌ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ భూ పరిధిపై విసిరే దూరాన్ని బట్టి దాని శక్తి శరవేగంగా తగ్గిపోతుంటుంది. ఈతగాన్ని నీటి లోపలి మార్గం గుండా రాకుండా నిరోధించే పరిధి 10 నుంచి 20 మీటర్ల లోపలే ఉంటుంది.

యూఎస్‌ ఎంకే3ఏ2 కంకషన్‌ గ్రెనేడ్‌ను టీఎన్‌టీతో నింపి ఉంచుతారు. దాని ఉపరితలాన్ని నల్లని కార్డ్‌బోర్డుతో తయారు చేస్తారు. దానిపై భాగంలో స్పూన్‌ ఉంటుంది. ఇది స్ప్రింగ్‌ లోడెడ్‌ ఆయుధ పరికరం. స్పూన్‌ను గ్రెనేడ్‌ పక్కన పట్టి ఉంచే కాటర్‌ పిన్‌పై ఉండే రింగును లాగడం ద్వారా దీన్ని యాక్టివేట్‌ చేస్తారు. ఒకసారి పిన్‌ను తొలగిస్తే విసిరే వ్యక్తి స్పూన్‌ను గ్రెనేడ్‌కు ఎదురుగా పట్టుకోవడం ద్వారా దాన్ని సరైన స్థానంలో ఉంచాల్సి ఉంటుంది. అలా స్పూన్‌ను రిలీజ్‌ చేస్తే, స్ప్రింగ్‌ దాన్ని గ్రెనేడ్‌ నుంచి పక్కకు నెట్టేస్తుంది. దాంతో గ్రెనేడ్‌ లోపల రసాయనిక ప్రతిచర్య మొదలవుతుంది. సాధారణంగా దీనివల్ల గ్రెనేడ్‌ 4 సెకన్లలో పేలిపోతుంది. అలాంటప్పుడు వెంటనే నీళ్లలోకి విసరకుండా దాన్ని రెండు సెకన్ల పాటయినా చేతిలోనే పట్టుకోవడం కాస్త సానుకూలతగా ఉంటుంది. కంకషన్‌ గ్రెనేడ్‌ నీటి అడుగుకు మునిగిపోయి, బురదలోకి కూడా చొచ్చుకుపోతే శత్రు సాపర్‌ ఈదే లోతులో సృష్టించేంతటి విధ్వంసాన్ని సృష్టించలేదు.

కంకషన్‌ అనే పదాన్ని చాలాసార్లు పొరపాటుగా స్టన్‌ గ్రెనేడ్లకు వాడుతుంటారు. ఈ గ్రెనేడ్‌ పేలుడుతో వచ్చే ఫలితాలకు ఇది సరైన నిర్వచనం కాదు. లక్ష్యాలను చంపేందుకు ఈ గ్రెనేడ్‌ తన పేలుడు శక్తిపైనే పూర్తిగా ఆధారపడతుఉంది. అందుకే దీనికి కంకషన్‌ అనే పదాన్ని వాడతారు. ఎంకే40 టీఎన్‌టీ నింపిన గ్రెనేడ్‌. దీన్ని ముఖ్యంగా శత్రు డైవర్ల కోసం, ఫ్రాగ్‌మెన్‌ కోసం వాడతారు. ఈ గ్రెనేడ్‌ను ముఖ్యంగా యాంటీ పర్సనెల్‌ డెప్త్‌ చార్జ్‌ల్లో శత్రువులను చంపేందుకు, లేదా పూర్తి స్థాయి డెప్త్‌ చార్జ్‌కు దీటుగా నీటిలోపల కల్లోలం సృష్టించి వారిని అశక్తులను చేసేందుకు ఉపయోగిస్తారు.[7]

ట్యాంక్‌ విధ్వంసక[మార్చు]

తొలి ట్యాంక్‌ విధ్వంసక గ్రెనేడ్లు అధునాతన పరికరాలు. జర్మన్లు తొలుత మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ అధునాతన ట్యాంక్‌ విధ్వంసక గ్రెనేడ్లను వాడారు. తమ ఆలూ మాషర్‌ను రెండో మూడో పేలుడు పదార్థాల పై భాగాలను హ్యాండిల్‌ లేకుండా కలిపి ఒక పూర్తి గ్రెనేడ్‌ను తయారు చేస్తారు. యుద్ధాల్లో ఆయుధాల తర్వాత గ్రెనేడ్‌ను వాహనాలపైన, ఆయుధాలు తక్కువగా ఉన్న చోట ఉంచుతారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పలుదేశాలు ఈ అధునాతన ట్యాంక్‌ విధ్వంసక గ్రెనేడ్లను పలు భారీ పేలుడు సామర్థ్యమున్న గ్రెనేడ్లను ఇసుక బస్తాల్లో పెట్టడం ద్వారా తయారు చేశారు. వాటి బరువు కారణంగా ఈ గ్రెనేడ్లను సాధారణంగా చాలా దగ్గరి నుంచి విసురుతారు. లేదా నేరుగా శత్రువు వాహనాలపైకి పడేలా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో ఉంచుతారు.[ఉల్లేఖన అవసరం] 1940ల్లో బ్రిటిష్‌ హోం గార్డులు మరో పద్ధతిని వాడారు. భారీ పేలుడు పదార్థాలను దట్టమైన సాక్స్‌లో ఉంచి, దాని దిగువ భాగానికి గ్రీజు పూసి, అలా గ్రీజుతో కప్పిన భాగాన్ని సరైన పరిమాణంలోని టిన్‌ క్యాన్‌లో కప్పి ఉంచేవారు. యాంటీ ట్యాంక్‌ సాక్‌ను బయటికి రాగగానే ఫ్యూజ్‌ వెలిగేది. సాక్‌ను వాహనం వేపుగా విసిరేవారు. అక్కడ అది పేలిపోయేది. ఇది ఆర్మర్‌ ప్లేట్‌లో అంతర్గత పేలుడుకు దారి తీసేది. దాని వల్ల ట్యాంక్‌ లోపలి సిబ్బందిని గాయపరచడం, హతమార్చడం వీలయ్యేది.[8] ఇలాంటి అధునాతన ట్యాంక్‌ విధ్వంసక గ్రెనేడ్‌ను యుద్ధాల్లో అసలెప్పుడైనా వాడారో లేదో మాత్రం స్పష్టంగా తెలియదు. 1940ల చివరి నాటికి బ్రిటిష్‌ వారు స్టికీ బాంబ్‌గా పిలిచే పర్పస్‌-బిల్ట్‌ అడెసివ్‌ ట్యాంక్‌ విధ్వంసక క్షిపణిని వాడకంలోకి తీసుకొచ్చేందుకు వీలుగా దాని ఉత్పత్తి మొదలు పెట్టారు.[9]

సోవియట్ ఆర్ పి జి 43 యాంటీ ట్యాంక్ గ్రెనేడ్

రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ట్యాంకులు ఇష్టారాజ్యంగా వీరవిహారం చేస్తున్న సందర్భంలో చేతి గ్రెనేడ్లను అధునాతన ట్యాంక్‌ విధ్వంసక పాతరలుగా వాడారు. వాటిని ట్యాంక్‌ దారిలో ఉంచి గానీ, వాటిపై విసిరి గానీ వాటి దారిని అడ్డగించేందుకు ప్రయత్నించేవారు. ఈ పద్ధతిని నిరాశలో కూరుకుపోయిన తర్వాత మాత్రమే వాడేవారు. సాధారణంగా మాత్రం ఇది ట్యాంక్‌లోని సిబ్బంది కంటే కూడా నేలపై ఉండే ఇతర సైనికులకే ప్రమాదకారిగా పరిణమించేది.

పర్పస్‌ డిజైన్డ్‌ ట్యాంక్‌ విధ్వంసక గ్రెనేడ్లను ట్యాంక్‌ ఆర్మర్‌లోకి చొచ్చుకుపోయేందుకు షేప్‌డ్‌ చార్జ్‌ సూత్రం ప్రకారం తయారు చేసేవారు. సైనిక పదజాలంలో చెప్పాలంటే వార్‌హెడ్లను తగిలించే షేప్‌ చార్జిలను హై ఎక్స్‌ప్లోజివ్‌ యాంటీ-ట్యాంక్‌ (హెచ్‌ఈఏటీ) వార్‌హెడ్లుగా పిలిచేవారు. ఇవి పనిచేసే తీరును బట్టి ఈ గ్రెనేడ్లు కచ్చితంగా వాహనాన్ని సరైన కోణంలోనే తాకేవి. తద్వారా వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. చిన్న డ్రోగ్‌ ప్యారచూట్‌ను గానీ, లేదా విసిరిన తర్వాత ఉపయోగపడేలా వస్త్రంతో కూడిన స్ట్రీమర్లను గానీ వాడటం ద్వారా దీన్ని సాధించేవారు.

ఇక బ్రిటన్ నంబర్‌ 74 ఎస్‌టీ గ్రెనేడ్‌ను తయారు చేసింది. దీన్నే అంతా స్టికీ బాంబ్‌ అంటారు. ఇందులో ప్రధాన చార్జిని బంకలాగా ఉండె ఈటెలో ఉంచుతారు. జర్మనీ దాడి చేస్తుందని అంచనా వేసిన ఇంగ్లండ్‌ సైన్యం సులువుగా ఉండి, వాడేందుకు బాగుండి, ఉత్పత్తికి సిద్ధంగా ఉండి, ట్యాంక్‌ విధ్వంసక ఆయుధంగా పనికొచ్చే గ్రెనేడ్ల తయారీని కోరింది. ఎస్‌టీ గ్రెనేడ్‌ నిజానికి ప్రభుత్వ ప్రోత్సాహిత చర్య.ఎంఐఆర్‌ (సీ) అనే ఒక గ్రూపు ఈ ఆయుధాలను జర్మనీ, ఇటలీ ఆక్రమిత భూభాగంలో వాడేందుకు అనువుగా అభివృద్ధి చేయడంలో నిమగ్నమైంది. చర్చిల్‌ కోరిక మేరకు ఎన్టీ గ్రెనేడ్‌ను భారీ పరిమాణంలో వారు ఉత్పత్తి చేయడం మొదలు పెట్టారు. కానీ అదెలా పని చేస్తుందో చూసిన తర్వాత ఇంగ్లండ్‌ సైన్యం దాన్ని తిరస్కరించింది. ఎందుకంటే దాని హోం గార్డ్‌ సాధారణ గ్రెనేడ్ల కంటే చాలా చిన్నదిగా ఉంది. నంబర్‌ 74 గ్రెనేడ్‌ను తర్వాత ఉత్తర ఆఫ్రికాలో అత్యవసర పరిస్థితుల్లో ఇటలీ యుద్ధ ట్యాంకులను నిరోధించే స్టాప్‌ గ్యాప్‌గా వాడేందుకు ఇంగ్లండ్‌ సైన్యానికి జారీ చేశారు. అయితే చాలామందిని ఆశ్చర్యపరుస్తూ ఇది చాలా ప్రభావవంతమైన ఆయుధంగా రుజువు చేసుకుంది. ఆ యుద్ధంలో కొంతకాలం తర్వాత ఫ్రెంచి దళాలు కూడా నంబర్‌ 74ను ప్రభావవంతంగా ఉపయోగించడం ద్వారా జర్మనీ వ్యవస్థాపనలెన్నింటినో విద్రోహపూరితంగా నాశనం చేసేందుకు ప్రయత్నించాయి.[10]

1941లో రష్యాను జర్మనీ ఆక్రమించిన కొద్దికాలం తర్వాత జర్మన్లు పంజెర్‌వుర్ఫ్‌మైన్‌ (ఎల్‌) అనే హెచ్‌ఈఏటీ గ్రెనేడ్‌ను కనిపెట్టారు. ఇది అత్యంత భారీ యుద్ధ ట్యాంకులను కూడా అతి సులువుగా నాశనం చేయగల సామర్థ్యమున్న గ్రెనేడ్‌. దీన్ని నేరుగా ట్యాంకులపై పడేలాగాల్లోకి విసిరేవారు. త్రోయర్‌ను రిలీజ్‌ చేసిన తర్వాత గాల్లో ప్రయాణించినంత సేపూ స్ప్రింగ్‌ ఔట్‌ కాన్వాన్‌ ఫిన్లు దాన్ని స్థిరంగా ఉంచేవి. పంజెర్‌వుర్ఫ్‌మైన్‌ (ఎల్‌) నిజంగా ప్రాణాంతకమైన గ్రెనేడే. పైగా దాని తయారీ కూడా ఎంతో చౌక! కానీ దాన్ని సరిగా అనుకున్న చోటికి విసిరేందుకు చాలా నైపుణ్యం కావాల్సి వచ్చేది. అందుకే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన ట్యాంక్‌ విధ్వంసక పదాతి దళాలకు మాత్రమే దాన్ని జారీ చేసేవారు.[11] రష్యన్లు జర్మనీ పంజెర్‌వుర్ఫ్‌మైన్‌ (ఎల్‌) ను స్వాధీనం చేసుకున్న తర్వాత తమదైన సొంత హెచ్‌ఈఏటీ గ్రెనేడ్‌ను తయారు చేసేందుకు ఆట్టే కాలం పట్టలేదు. 1940లో వారు ఒక క్రూరమైన ట్యాంక్‌ విధ్వంసక గ్రెనేడ్‌ను తయారు చేశారు. అది అతి సులువైన పేలుడు ప్రభావాన్ని అతి హెచ్చు స్థాయి పేలుడు చార్జి సాయంతో కల్పించేలా తయారు చేశారు. ఆర్‌పీజీ-40గా పిలిచిన ఈ ఆయుధం గాల్లో వెళ్లే సమయంలో దాన్ని విసిరిన తర్వాత విడుదలయ్యే రిబ్బన్‌లో స్థిరపడేది.[12] ఇక 1943లో వచ్చిన ఆర్‌పీజీ-43 నిజానికి ఆర్‌పీజీ-40కి అభివృద్ధి చెందిన నమూనాయే. ఇందులో ఒక కోన్‌ లైనర్‌, ఇంకా భారీ సంఖ్యలో ఫ్యాబ్రిక్‌ రిబ్బన్లు దాన్ని విడుదల చేసిన తర్వాత గాల్లో ఉండగా స్థిరపరిచేందుకు పనికొచ్చేలా వాడారు. యుద్ధం చివరి సంవత్సరంలో వారు ఆర్‌పీజీ-6 పేరుతో పూర్తిగా రీడిజైన్‌ చేసిన ఆర్‌పీజీ-43ని వాడారు. ఇందులో బాగా మెరుగుపరిచిన గాలిపటం తోక వంటి డ్రోగ్‌ను హెచ్‌ఈఏటీ హ్యాండిల్‌లో, వార్‌హెడ్‌ స్థానంలో స్టాండాఫ్‌గా వాడారు. తద్వారా దాని కచ్చితత్వాన్ని, చొచ్చుకెళ్లి, సరిగ్గా పై భాగాన విసరగలిగితే ఏ యుద్ధ ట్యాంకుకైనా కోలుకోలేని స్థాయిలో నష్టం కలిగించగలిగే లక్షణాన్ని ఎంతగానో పెంచేశారు. రష్యా తాలూకు ఆర్‌పీజీ-43, ఆర్‌పీజీ-6 గ్రెనేడ్లు యుద్ధంలో వాడేందుకు జర్మనీ తాలూకు పంజెర్‌వుర్ఫ్‌మైన్‌ (ఎల్‌) కంటే అత్యంత సులువైనవి. పైగా వాటి వాడకానికి విస్తృత శిక్షణ కూడా అవసరం లేకపోయింది.

రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక తూర్పు ఐరోపా దేశాలు ఆర్‌పీజీా6కు తమవైన సొంత నమూనాలను అభివృద్ధి చేసుకున్నాయి. తూర్పు జర్మనీ ఏజెడ్‌ 58 కే6 100 అలాంటిదే. ఇవన్నింటినీ పదుల కొద్ది వేలల్లో ఆయా దేశాలు తయారు చేసి పెట్టుకున్నాయి. వాటిని తమ తమ జాతీయ విముక్తి సైన్యాలకు అందజేశాయి. 1967, 1073ల్లో ఈజిప్టు సైన్యంతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను చూశాక అవి ఈ నిర్ణయానికి వచ్చాయి.[13][14][15]

రెండో ప్రపంచ యుద్ధం చివరి రెండేళ్లలో జపాన్‌వారు మరీ తీవ్రతరమైన హెచ్‌ఈఏటీ చేతి గ్రెనేడ్‌ను అభివృద్ధి చేశారు. ఇది చాలా సులువైన, 100 ఎంఎం వ్యాసార్థమున్న కోన్‌ తరహా హెచ్‌ఈఏటీ వార్‌హెడ్‌తో కూడిన గ్రెనేడ్‌. ఇందులో సులువైన ఫ్యూజ్‌ వ్యవస్థ బేస్‌ వద్ద ఉంటుంది. వార్‌హెడ్‌ చివర్లో చూస్తే ఒక తుడిచే కర్ర మూతిలా కన్పించేది. సైనికుడు ఈ యుద్ధ ట్యాంకు విధ్వంసక గ్రెనేడ్‌ను దాని సాక్‌ నుంచి బయటికి తీసి, పిన్‌ లాగి, తుడిచే కర్ర వంటి భాగాన్ని హ్యాండిల్‌గా పట్టుకుని, బలంగా విసిరేవాడు. ఇది చాలా ప్రమాదకరమైన గ్రెనేడ్‌, ఎందుకంటే ఇందులో విడుదల తర్వాత చేతికి ఎలాంటి రక్షణా ఉండేది కాదు. దీని చొరబాటు పరిధి 50 ఎంఎంగా నమోదైంది.[ఉల్లేఖన అవసరం]

ఇక ఒంటరిగా దొరికే శత్రు ట్యాంకులను, వాయు మార్గాన వచ్చి పడే వాటిని నాశనం చేసేందుకు తమ ఆయుధగారంలో, రియర్‌ ఏరియా యూనిట్లకు అత్యవసర పరిస్థితుల్లో పనికొచ్చే ట్యాంకు విధ్వంసక ఆయుధలేవీ లేవని అమెరికా సైన్యం 1970ల్లో ఆందోళన చెందసాగింది. ఇందుకు పరిష్కారాల కోసం సైన్యం కోరిన మీదట అమెరికా సైనిక ల్యాబుల్లోని ఇంజనీర్లు రతూర్పు జర్మనీ ఏజెడ్‌-58-కే-100 ట్యాంక్‌ విధ్వంసక గ్రెనేడ్‌ను ఆధునికీకరించి కొత్త ఆయుధాన్ని తయారు చేయాల్సిందిగా సూచించారు. ఈ విధానాన్ని హై ఎక్స్‌ప్లోజివ్‌ యాంటీఆర్మర్‌ గ్రెనేడ్‌ (హెచ్‌ఏజీ) అని పిలిచారు. ఇది నిజంగా గొప్ప ఉపాయమని అమెరికా సైన్యం కోసం పని చేసే పౌర ఇంజనీర్లు భావించగా, ఉన్న సైనికాధికారుల్లో దాదాపుగా అందరూ దీన్ని ముక్తకంఠంతో తిరస్కరించారు. ఎందుకంటే వారంతా గతంలో చాలా ప్రమాదకరమైన యుద్ధక్షేత్రాల్లో పని చేసిన వారే. ఈ తరహా గ్రెనేడ్‌ శత్రు వాహనాల కంటే కూడా తమ సొంత దళాలకే చాలా ప్రమాదకరమని వారు గమనించారు. అందుకే 1085 కల్లా ఈ ఆలోచననే పూర్తిగా పక్కన పెట్టేశారు.[16][17]

ఇక ప్రచ్ఛన్న యుద్ధానంతర శకంలో నేడు అత్యంత విస్తృతంగా పంపకాలు జరిగిన ట్యాంకు విధ్వంసక గ్రెనేడ్లుగా 1950లు, 1960ల్లో రష్యా రూపొందించినవిగా, ముఖ్యంగా ఆర్‌కేజీ-3గా చెప్పాలి.

ఆధునిక యుద్ధ ట్యాంకుల్లో వచ్చిన కొత్త పోకడల కారణంగా యుద్ధ ట్యాంకు విధ్వంసక గ్రెనేడ్లను సాధారణంగా పెద్దగా ప్రభావం చూపనివిగానే భావించారు. అయితే ఇటీవలి ఇరాక్‌ యుద్ధంలో అమెరికా తేలికపాటి వాహనాలపై ప్రధానంగా వాడిన ఇరాకీ చొరబాటుదారుల రూపంలో ఆర్‌కేజీ-3 గ్రెనేడ్‌ తిరిగి తెరపైకి వచ్చింది. తద్వారా అమెరికా అదనపు సైనిక దళాలను ఇరాక్‌లో మోహరించాల్సి వచ్చింది.[18]

చరిత్ర[మార్చు]

చైనా[మార్చు]

ఫైర్ లాన్స్ మరియు గ్రెనేడ్ (కుడివైపు చివర) యొక్క ఆరంభ ప్రాతినిధ్యం, డన్ హాగ్, 10వ శతాబ్దం CE.[19]

చైనాలో సాంగ్‌ వంశం (క్రీస్తుశకం 960ా1279) పాలనలో జెన్‌ తియాన్‌ లెయ్‌గా పిలిచే ఆయుధాలను చైనా సైనికులు తుపాకీ మందును సెరామిక్‌, లేదా లోహ పాత్రల్లో నింపి వాడినప్పుడు కనిపెట్టారు. 1044లో వూజింగ్‌ జోంగ్‌యావో (చిరస్మరణీయ యుద్ధాల సంకలనం) పలు రకాలైన తుపాకీమందు తయారీ విధానాలను వివరించింది. వాటిలో ఒక చోట ఆధునిక చేతి గ్రెనేడ్‌ మాతృకను చూడవచ్చని జోసెఫ్‌ నీదామ్‌ అంటారు.[20]

తొలి ఇనుప బాంబు శకలాలు, గ్రెనేడ్లు ఐరోపాలో 1467కు గానీ రాలేదు.[21] ఆ తర్వాత కేవలం రెండు శతాబ్దాల్లోనే చైనావాయులు కానన్‌బాల్‌ షెల్స్‌ను తుపాకీ గుండుతో దట్టించడం ద్వారా పుట్టుకొచ్చే పేలుడు శక్తిని కనిపెట్టగలిగారు. తర్వాత జియావో యూ 14వ శతాబ్దం మధ్యలో రాసిన హువోలోంగ్‌జింగ్‌ (ఫైర్‌డ్రేక్‌ మాన్యువల్‌ ) ల సోంగ్‌ వంశం తొలినాళ్లలో తయారు చేసిన ఇనుప యుద్ధ ట్యాంకును ఫ్లయింగ్‌ క్లౌడ్‌ థండర్‌లాప్‌ కానన్‌ (ఫైయున్‌ పిలి పావో) గా అభివర్ణించారు. ఈ చేతిరాత ప్రతిలో ఈ విషయముంది (నీదామ్‌ రాసిన మోడిఫైడ్‌ వేడే గిల్స్‌ స్పెలింగ్‌)

The shells (pào) are made of cast iron, as large as a bowl and shaped like a ball. Inside they contain half a pound of 'divine fire' (shén huǒ, gunpowder). They are sent flying towards the enemy camp from an eruptor (mu pào); and when they get there a sound like a thunder-clap is heard, and flashes of light appear. If ten of these shells are fired successfully into the enemy camp, the whole place will be set ablaze...

[22]

హువోలోంగ్‌జింగ్‌ లోని విషయం 14వ శతాబ్దం నాటి చైనీయుల చేతి గ్రెనేడ్‌ను అర్థం చేసుకోవడానికి చాలా ప్రాణమైనది. ఎందుకంటే బాంబు తయారీ, వాడకానికి సంబంధించిన చాలా విషయాలను సవివరంగా వివరించిన గ్రంథమది.[23]

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లోవోవ్లో అమియా క్రజోవా సౌకర్యంతో సిడోల్వోకా హ్యాండ్ గ్రెనేడ్ల తయారీ

ఐరోపా[మార్చు]

1643లో ఇంగ్లండ్‌ అంతర్యుద్ధం సందర్భంగా హోల్ట్‌ బ్రిడ్జి వద్ద వేల్ష్‌ వారు తమలో తాము బహుశా గ్రెనాడోలను విసురుకున్నట్టు భావిస్తారు. గ్రెనేడ్‌ అనే పదం మహా విప్లవం (1688) సందర్భంగా పుట్టుకొచ్చింది. అప్పుడు క్రికెట్‌ బాల్‌ పరిమాణంలోని ఇనుప ఈటెల్లో తుపాకీ మందును దట్టించి నెమ్మదిగా మండే తోకలను వాటికి కలిపి వాడేవారు. వీటిని తొలుత జాకోబైట్లకు వ్యతిరేకంగా కిలియెక్రాంకీ, గ్లెన్‌ షీల్‌ యుద్ధాల్లో వాడారు.[24] ఈ గ్రెనేడ్లు అంత ప్రభావం మాత్రం చూపలేదు (బహుశా ఎందుకంటే గ్రెనేడ్‌ ప్రభావం చూపాలంటే దానితో నేరుగా దాడి చేయడం అవసరం కనుకనేమో). అందుకే వీటిని అప్పుడు పరిమితంగానే వాడారు.

అయితే గెరిల్లా యుద్ధ రీతిలో మాత్రం గ్రెనేడ్లకు బాగా ప్రాధాన్యం దక్కింది. క్రిమియా యుద్ధం (1954-1856) లో అధునాతన గ్రెనేడ్‌ను వాడినట్టుగా కల్నల్‌ హూ రాబెర్ట్‌ హిబర్ట్‌ తన సోదరికి రాసిన లేఖలో పేర్కొన్నాడు.

We have a new invention to annoy our friends in their pits. It consists in filling empty soda water bottles full of powder, old twisted nails and any other sharp or cutting thing we can find at the time, sticking a bit of tow in for a fuse then lighting it and throwing it quickly into our neighbours pit where it bursts, to their great annoyance. You may imagine their rage at seeing a soda water bottle come tumbling into a hole full of men with a little fuse burning away as proud as a real shell exploding and burying itself into soft parts of the flesh.[25]

మొధటి ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్రెంచ్ దళాలు హ్యాండ్ గ్రెనేడ్ విసరడం కోసం కాటాపాల్ట్ ను వినియోగించారు.

అమెరికా అంతర్యుద్ధం[మార్చు]

అమెరికా అంతర్యుద్ధ కాలంలో ఇరు వర్గాలూ చేతి గ్రెనేడ్లను విరివిగా వాడాయి. వీటిలో నేలపై పడగానే గ్రెనేడ్‌ను పేల్చేసే ప్లంజర్‌ ఉండేది. ఉత్తర దళాలు కెచమ్‌ తయారీ ప్రయోగాత్మక గ్రెనేడ్లపైనే ఎక్కువగా ఆధారపడ్డాయి. వీటిలోని తోక కారణంగా మూతి భాగం సరిగ్గా లక్ష్యాన్ని తాకి పేలిపోవడం వీలయేది. ఇక సమాఖ్య దళాలు మాత్రం దాదాపు ఆరు పౌండ్ల బరువుండే ఈటె ఆకృతిలోనే చేతి గ్రెనేడ్లను వాడాయి. కొన్ని సార్లు వీటిని పేపర్‌ ఫ్యూజ్‌ సాయంతోనే విసిరేవి. వీటితో పాటు రెయిన్స్‌, ఆడమ్స్‌ గ్రెనేడ్లను కూడా వాడాయి. అవి అచ్చం చూసేందుకు, పనితీరులో కెచంలా ఉండేవి.

1900లు[మార్చు]

విస్తృతంగా వాడి పెర్‌కుషన్‌ చేతి గ్రెనేడ్లను దాదాపుగా 1903 నాటికి సెర్బియా సైన్యంలో కల్నల్‌ మిలోస్‌ వాసిక్‌ డిజైన్‌ చేశాడు. 1912లో కల్నల్‌ వాసిక్‌ తన చేతి గ్రెనేడ్‌ను వాసిక్‌ పేరుతో ఎం.12 మోడల్‌గా రీడిజైన్‌ చేశాడు. వీటిని సెర్బియా సైన్యం 1912లో తీసుకుంది. అప్పుడే (1912-1913) వచ్చి పడ్డ బాల్కన్‌ యుద్ధంలో వాగా వినియోగించింది. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా ఈ గ్రెనేడ్లను సెర్బియా విరివిగా వాడింది.[26] అప్పట్లో దాని తయారీదారు పేరిట వాసికా గా, లేదా క్రగుజెవ్‌కా (దాని తయారీ ప్రాంతం. సెర్బియాలోని సైనిక సాంకేతిక పనుల ప్రాంతం) గా ఈ గ్రెనేడ్‌ అందరి నోళ్లలో నానింది. వాసిక్‌ డిజైన్‌ను తర్వాత కొత్త చేతి గ్రెనేడ్ల సిరీస్‌గా అభివృద్ధి చేస్తూనే వచ్చారు. ఇది రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన చాన్నాళ్ల దాకా కొనసాగింది.[27]

ఇక వాసిక్‌ హ్యాండ్‌ గ్రెనేడ్లను నియోగించి దారుణమైన మారణకాండకు పాల్పడ్డ ఉదంతం 1914లో సెరాజెవో ఫెర్డినాండ్‌ ఆర్చిడ్యూక్‌ ఫ్రాంజ్‌ను హతమార్చేందుకు ముందే చోటుచేసుకుంది. ఫెర్డినాండ్‌ కారుపై ఒక ద్రోహి గ్రెనేడ్‌ విసిరాడు. అది వెనక్కు ఎగిరిపోయి వెనక వస్తున్న కారుపై పడింది. దాంతో 20 మంది గాయపడ్డారు. ఆ మర్నాడే ఫెర్డినాండ్‌తో పాటు ఆయన ఆర్యను కూడా కాల్చి చంపారు. గ్రెనేడ్లు విసిరిన సందర్భంగా ఆస్ట్రో-హంగేరియన్‌ వర్గాలు హంతకుల నుంచి రెండు వాసిక్‌ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నాయి. ఈ హత్యల్లో సెర్బియాకు కూడా భాగముందని ఆరోపించేందుకు వీటిని వారు సాక్ష్యంగా వాడుకున్నారు. ఉత్తరోత్తరా ఇదే రెండో ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణంగా నిలిచింది![ఉల్లేఖన అవసరం]

మొదటి ప్రపంచ యుద్ధం[మార్చు]

మొదటి ప్రపంచ యుద్ధం మొదైలన తొలి రోజుల్లో ఇరు వర్గాలూ కేవలం యుద్ధానికి ముందు కాలంలో తయారు చేసిన చిన్న గ్రెనేడ్లపై మాత్రమే ఆధారపడ్డాయి. ఉదాహరణకు ఇటలీలో బెసోజీ గ్రెనేడ్‌ ఉండేది. ఇది పేలేందుకు 5 సెకన్లు తీసుకునేది. దీని తోక భాగాన్ని సైనికుని చేతిలో ఒక రింగుపై రాపిడి కలిగించడం ద్వారా అంటించాల్సి వచ్చేది.[28] మధ్యంతర చర్యగా ఆ దళాలు వీటిని తమంత తాముగా మెరుగు పరుచుకుని కూడా వాడుకునేవి. జామ్‌ టిన్‌ గ్రెనేడ్‌ అలావచ్చిందే. ఇవన్నింటినీ తొట్ట తొలి ఆధునిక శకల గ్రెనేడ్‌ అయిన మిల్స్‌ బాంబ్‌ తయారీతో పక్కన పెట్టేవారు. ఈ గ్రెనేడ్లు త్వరలోనే ఇంగ్లండ్‌ యుద్ధ సైనికులకు అందుబాటులోకి వచ్చేశాయి.

మిల్స్‌ బాం బు[మార్చు]

36 ఎం మిల్స్ బాంబ్, 1942 నుంచి

మిల్స్‌ బాంబును ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హమ్‌లోని మిల్స్‌ మునిషన్స్‌ ఫ్యాక్టరీలో తయారు చేశారు. ఈ గ్రెనేడ్‌ను తొలి సురక్షిత గ్రెనేడ్‌ ఇంగ్లండ్‌ అభివర్ణించుకుంది. దాదాపుగా 7.5 కోట్ల గ్రెనేడ్లను మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో తయారు చేశారు! రఇవన్నీ కూడా స్టీలు కనిస్టర్లలో పేలుడు పదార్థాలను నింపి, ట్రిగ్గరింగ్‌ పిన్‌, కొత్తదైన, లోతుగా నొక్కిన ఉపరితలంతో కూడి ఉండేవే. శకలాలను పెంచేందుకు, గ్రెనేడ్‌ను మరింత ప్రాణాంతకంగా మార్చేందుకే ఈ ఏర్పాటు. కానీ ఈ విభాగీకరణ వల్ల వల్ల దాని శకలాల సంఖ్య పెద్దగా మెరుగు పడలేదని తర్వాత పరిశోధనల్లో తేలింది. లోపలి వైపున నోట్చ్‌ల ద్వారా శకలాలు ఎక్కువగా వచ్చే డిజైన్లను తర్వాతి కాలంలో గానీ తయారు చేయలేకపోయారు. కానీ ఆ సమయంలో మాత్రం వాటి తయారీ చాలా ఖర్చుతోకూడిన వ్యవహారంగా మారింది. సిసలైన మిల్స్‌ బాంబ్‌ బహిర్గత విభాగీకరణను యథాతథంగా ఉంచేశారు. ఎందుకంటే అది సానుకూల గ్రిప్‌ ఉపరితలాన్ని వీలు కల్పించింది. ఈమౌలి క పిణ్‌అన్‌-పైనాపిల్‌' తరహా డిజైన్‌ను కొన్ని అధునాతన గ్రెనేడ్లలో కూడా వాడారు. మరోవైపు, అమెరికా ఎం67 విభాగీకరణ గ్రెనేడ్‌లో మృదువైన బహిర్భాగం ఉండేది. ఇది చదునైన ఆర్క్‌లోకి విసిరేందుకు, నేలమీదుగా జారవిడిచేందుకు కూడా ఎంతో అనువుగా ఉండేది.

కాటలోనియా[29] కు నివాళి అర్పించిన సందర్భంగా, 1936-37లో స్పెయిన్‌ అంతర్యుద్ధంలో తాను కిరాయి సైనికునిగా ఉన్న సమయంలో ట్రెంచ్‌ యుద్ధరీతిలో ఈ చేతి గ్రెనేడ్లకు బాంబ్‌ అనే పదాన్ని జార్జ్‌ ఆర్వెల్‌ వాడాడు. మిల్స్‌ బాంబ్‌తో వాటికున్న పోలికలను (పైన చూడండి) కూడా ఆయన గమనించాడు. కానీ చేతి గ్రెనేడ్‌ అనే పదాన్ని మాత్రం ఆయన ఒకే ఒక్కసారి, బార్సిలోనాలో 1937 మే నెలలో జరిగిన వీధి పోరాటాన్ని వర్ణించిన సందర్భంగా వాడాడు.

“The din was so loud that I made sure someone must be firing at us with a field gun. Actually it was only hand-grenades, which made double their usual noise when they burst among stone buildings.”[30]

స్టీల్ హ్యాండ్ గ్రెనేడ్ మోడెల్ 24 యొక్క విభాగం

మిల్స్‌ బాంబు, దాని మాదిరి ఇతర బాంబులకు సమాంతరంగా జర్మన్లు కూడా 'స్టిక్‌ హాండ్‌ గ్రెనేడ్‌ (స్టీల్‌హాండ్‌గ్రెనేడ్‌ మోడల్‌ 24 )ను జారీ చేశారు. ఇందులో పేలుడు పదార్థం లోహపు క్యాన్లఓ ఉంటుంది. దానిపైన కర్ర షాప్ట్‌ విసిరేందుకు అనువుగా అమర్చి ఉంటుంది. ఈసులువై న డిజైన్‌ తొలి, రెండో ప్రపంచ యుద్ధాలు జరిగినంత కాలమూ అభివృద్ధి చెందుతూనే పోయింది. రమోడల్‌ 24 గ్రెనేడ్‌ (దీన్నే ప్రఖ్యాతంగా పొటాటో మాషర్‌ అని పిలిచేవారు) చిన్న ఆయుధాలన్నింటిలోనూ అతి సులువుగా గుర్తించగలిగిన దానిగా గుర్తింపు పొందింది. జర్మనీ సైనికునికి ఇది పర్యాయపదంగా కూడా నిలిచింది!

ఆకృతి[మార్చు]

’’లైవ్‘‘ మరియు ఉపయోగించిన ఎం69 ట్రైనింగ్ గ్రెనేడ్లు

చాలా గెనేడ్లు పేలగానే కేసింగ్‌ తాలూకు ముక్కలను (షార్పనెల్‌), సెరేటెడ్‌ వైర్‌ను, లేదా అలాంటి ఇంసేన్ద్రియరి పరికరాలను వెదజల్లుతాయి. పొగ గ్రెనేడ్ల మాదిరివి కేవలం కాలుతాయి. మాస్కింగ్‌, మార్కింగ్‌, సిగ్నలింగ్‌ అవసరాల కోసం పొగను మాత్రమే వెదజల్లుతాయి. సీఎస్‌ రాయిట్‌ గ్రెనేడ్లు కూడా ఇదే మాదిరిగా పని చేస్తాయి. గ్రెనేడ్లలో పేలుడు, లేదా రసాయనిక పదార్థముంటుంది. దాంతోపాటు ఫ్యూజ్‌ కోసం చిన్న ఓపెనింగ్‌ కూడా. అధునాతన చేతి గ్రెనేడ్లలో ఈ ఫ్యూజ్‌ను బయటి మంట కంటే కూడా అంతర్గత పరికరం ద్వారానే వెలిగిస్తున్నారు.

చేతి గ్రెనేడ్లకు ఐదు లక్షణాలుంటాయి:

 • తక్కువ పరిధి
 • తక్కువ చంపగల పరిధి, దాదాపుగా 8 మీటర్లు
 • ఎక్కువ ప్రభావవంతమైన నష్టకారక పరిధి, దాదాపు 15 మీటర్లు
 • సురక్షితంగా విసిరేందుకు వీలు కల్పించే విలంబన లక్షణం
 • పేలే ముందు గోడల వంటి గట్టి ఉపరితలాలపైన జారిపోయేందుకు వీలు కల్పించే గట్టి షెల్‌

చేతి గ్రెనేడ్లలో ఇవి ఉంటాయి:

 • ఫిల్లర్‌తో కూడిన శరీరం
 • శకలాలుగా వెదజల్లబడే రసాయన, లేదా పేలుడు పదార్థం ఫిల్లర్
 • గ్రెనేడ్‌ను వెలిగించి, పేల్చే ఫ్యూజ్‌

పేలుడు విధానం[మార్చు]

పెర్‌కుషన్‌
ఫ్రెంచ్ ఎఫ్ 1 పెర్కూసన్ గ్రెనేడ్

పెర్‌కుషన్‌ గ్రెనేడ్‌ లక్ష్యాన్ని తాకగానే పేలిపోతుంది. పెర్‌కుషన్‌ గ్రెనేడ్లకు మంచి ఉదాహరణలుగా బ్రిటిష్‌ గామన్‌ బాంబ్‌, నంబర్‌ 69 గ్రెనేడ్‌లను చెప్పవచ్చు. కొన్ని పెర్‌కుషన్‌ గ్రెనేడ్లలో బ్యాకప్‌ పేలుడు పరికరంతో కూడిన సంప్రదాయిక పైరోటెక్నిక్‌ ఫ్యూజ్‌ కూడా ఉంటుంది.

టైమ్డ్‌ ఫ్యూజ్‌

టైమ్డ్‌ ఫ్యూజ్‌ గ్రెనేడ్‌లో సేఫ్టీ లీవర్‌ను విడుదల చేశాక ఫ్యూజ్‌ కాలుతుంది. టైమ్డ్‌ ఫ్యూజ్‌ గ్రెనేడ్లను సాధారణంగా చేత్తో విసిరే పెర్‌కుషన్‌ గ్రెనేడ్లుగానే పిలుస్తారు. ఎందుకంటే వాటి ఫ్యూజింగ్‌ తీరుతెన్నులు సురక్షితం, పెర్‌కుషన్‌ గ్రెనేడ్లలో వాడేవాటి కంటే చాలా ప్రభావవంతమైనవి.

తయారీ[మార్చు]

ఆధునిక గ్రెనేడ్‌ తయారీదారుల్లో వీరున్నారు:

 • డియెల్‌[31] (జర్మనీ)
 • మెకర్‌[32] (బెల్జియం)
 • రీన్‌మెటల్‌[33] (జర్మనీ, గతంలో అర్జెస్‌, ఆస్ట్రియా)
 • రుఆగ్ [34] (స్విట్జర్లాండ్)

గ్రనేడ్లను వినియోగించడం[మార్చు]

1944: An American soldier throwing a live "pineapple" hand grenade at the training range of Fort Belvoir
2005: U.S. Army grenade training during initial entry training includes throwing both dummy and live hand grenades, range instructor at right observes an M67 grenade in flight. The Grenade as well as the safety lever can be seen

క్లాసిక్‌ చేతి గ్రనేడ్‌కు సేఫ్టీ హ్యాండిల్‌ లేదా లివర్‌ (దాని పరిమాణం మరియు ఆకృతి కారణంగా సాధారణ మాటల్లో స్పూన్‌గా చెప్పవచ్చు) మరియు తొలగించదగిన సేఫ్టీ పిన్‌ ఉంటుంది. ఈ పిన్‌ హ్యాండిల్‌ విడిపోకుండా నిరోధిస్తుంది. కొన్ని గ్రనేడ్‌ రకాలు రవాణా సందర్భంగా హ్యాండిల్‌ విడిపోకుండా అదనంగా సేఫ్టీ క్లిప్‌ను కూడా కలిగి ఉంటాయి.

గ్రనేడ్‌ను వినియోగించడానికి సైనికుడు దానిని విసరడానికి వీలుగా సేఫ్టీ లివర్‌ స్థానంలో అతని వేలును పట్టుకుని ఉంటాడు. దీనిని మృత్యువు పట్టు అని అంటారు. ఎందుకంటే లివర్‌ను తొలగించడం గ్రనేడ్‌ను పేలేలా చేసి విసిరే వ్యక్తి మృత్యువుకు కారణమవుతుంది. ఎడమ చేతివాటం సైనికులు గ్రనేడ్‌ను తిప్పి పట్టుకోవాలని సూచిస్తారు. దీనిని వల్ల వేలు సేఫ్టీ లివర్‌పై ఉన్న సంఖ్యలపై ఉంటుంది. తర్వాత సైనికులు సేఫ్టీ లివర్‌ పిన్‌ను పట్టుకుని రింగును సూచిక ఆధారంగా లేదా మరో చేయి మధ్య వేలితో లాగి మరియు దానిని లాగడం మరియు తిప్పే కదలికతో తొలగిస్తారు. తర్వాత గ్రనేడ్‌ను లక్ష్యం వైపు విసురుతారు. చేతి పైనుంచి విసరడాన్ని సూచిస్తుంటారు. కానీ ఇది ప్రతి పోరాట పద్ధతిలో అనుకూలంగా ఉండకపోవచ్చు. సైనికులు నుంచుని, ముందుకు వాలి, మోకాళ్లపై కూర్చుని, మోకాళ్లపై కూర్చుని ముందుకు వాలి మరియు ఇతర వాలి ఉన్న పద్ధతుల్లో మరియు లోపల లేదా పక్క చేతులతో విసిరేలా శిక్షణ ఇస్తారు. ఒకవేళ గ్రనేడ్‌ను నించుని విసిరితే విసిరిన వ్యక్తి తప్పనిసరిగా వెంటనే దేని పక్కనయినా రక్షణ తీసుకోవాలి లేదా పక్కన ఏం లేకపోతే కిందకు వాలిపోవాలి.

ఒక్కసారి సైనికుడు గ్రనేడ్‌ను విసిరితే, సేఫ్టీ లివర్‌ విడుదలవుతుంది, విసిరే వ్యక్తి సేఫ్టీ లివర్‌ను గ్రనేడ్‌కు దూరంగా విసురుతాడు. ఎందుకంటే అది తిరుగుతూ కొద్దిగా పేలుడు సృష్టింస్తుంది. ఈ పేలుడు ఫ్యూజును మండిస్తుంది (కొన్నిసార్లు ఆలస్య కారకం అంటారు). ఫ్యూజు డిటోనేటర్‌ను కాలుస్తుంది. దాంతో ప్రధాన చార్జి పేలుతుంది.

వ్యక్తిగతం కాని గ్రనేడ్లను వినియోగించినపుడు సంబంధిత అంశాలు గ్రనేడ్‌ పేలుడును కలిగి లక్ష్యం దాని ప్రభావ పరిధిలో ఉండాలి. పలు నాటో దేశాలు ఉపయోగించిన ఎం67 ఫ్రాగ్మెంటషన్‌ గ్రనేడ్‌ ప్రభావత్మక మృత్యు పరిధి ఐదు మీటర్లు, గాయాలకు గురయ్యే పరిధి దాదాపు పదిహేను మీటర్లు.[35] దాని భాగాలు సుమారుగా 230 మీటర్ల దూరం వరకు ఎగురుతాయి. సాధారణంగా 15 మీటర్ల పరిధిలోని ప్రజలు ప్రాణాంతకం కాని రీతిలో తీవ్రంగా గాయపడతారు.

కుకింగ్‌ ఆఫ్‌ అనేది పిన్‌ను లాగి, హ్యాండిల్‌ను రిలీజ్‌ చేసిన తర్వాత కూడా గ్రెనేడ్‌ను కావాలనే చేతిలో పట్టుకుని ఉండటానికి పేరు. తద్వారా ఫ్యూజును పాక్షికంగా కాలేందుకు, విసిరిన తర్వాత అది పేలిపోయేందుకు పట్టే సమయాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. గ్రెనేడ్‌ను వెనక్కు విసిరేందుకు గానీ, దాని బారి నుంచి తనను తాను కాపాడుకోవడానికి గానీ శత్రువుకు సమయం ఇవ్వకుండా ఉండేందుకు ఈ టెక్నిక్‌ను వాడుతుంటారు. పైగా శత్రువు తాలూకు రక్షణాత్మక పొజిషన్లపై గాల్లోనే గ్రెనేడ్‌ పేలేలా విసిరేందుకు కూడా ఇది తోడ్పడుతుంది.[36] కాకపోతే ఈ టెక్నిక్‌ చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఫ్యూజులు ఒక గ్రెనేడ్‌ నుంచి మరో గ్రెనేడ్‌కు మారుతుంటాయి. ఈ కారణంగా కుకింగ్‌ ఆఫ్నఉ అతి తక్కువ అభిలషణీయమైన టెక్నిక్‌గా అమెరికా మెరైన్స్‌ (ఎంసీడబ్ల్యూపీ 3-35) అభివర్ణించింది. దీనికి బదులుగా, శత్రువు గ్రెనేడ్‌ను తిరిగి విసిరే అవకాశాన్ని నివారించేందుకు హార్డ్‌ త్రో, స్కిప్‌/బౌన్స్‌ టెక్నిక్‌ను సిఫార్సు చేసింది.

మిత్ర పక్షాలను హెచ్చరించేందుకు వీలుగా గ్రెనేడ్‌ను విసిరే ముందు ఒక హెచ్చరికను జారీ చేయడం పరిపాటి. దీనికి గుర్తుగా ఫ్రాగ్‌ ఔట్‌, లేదా ఫైర్‌ ఇన్‌ ద హోల్ ‌ వంటి అరుపులను అరుస్తుంటారు. ఎప్పుడైనా సరే, వీటి ఉద్దేశం తమ మిత్ర, సొంత పక్షాలను సురక్షితంగా దాక్కోమని చెప్పడమే. అమెరికా సైన్యంలో గ్రెనేడ్‌ను సొరంగం, గది, ట్రెంచ్‌ వంటి మూసిఉన్న భాగాల్లో విసిరే ముందు అలావవిసిరే వ్యక్తి అనివార్యంగా ఫైర్‌ ఇన్‌ ద హోల్‌ అని అరుస్తాడు. తద్వారా పేలుడు జరగబోతోందని సంకేతమిస్తాడు. ప్రామాణిక అమెరికా సైనిక పద్ధతుల్లో ఫాగ్ర్‌ ఔట్‌ అని అరవడం కూడా ఒకటి. శకల గ్రెనేడ్‌ను విసురుతున్నట్టు చెప్పడానికిది సంకేతం. గ్రెనేడ్‌ అనే పదాన్ని తమ పరిసరాల్లోకి వచ్చి పడ్డ శత్రువు గ్రెనేడ్‌ బారి నుంచి కాపాడుకోవాల్సిందిగా సొంత దళాలను హెచ్చరించేందుకు వాడతారు.

గ్రెనేడ్లను తరచుగా బూబీ ఉచ్చులను ఏర్పాటు చేసేందుకు వాడుతుంటారు. సంభావిత లక్ష్యాన్ని (అంటే తలుపు తెరవడం, లేదా కారును స్టార్ట్‌ చేయడం) వంటివాటి ద్వారా గ్రెనేడ్లు పేలేలా ఏర్పాటు చేస్తారు. ఇలా గ్రెనేడ్‌ ఆధారిత బూబీ ఉచ్చులను తయారుగా ఉన్న సామగ్రి సాయంతో తయారు చేయడం చాలా సులువు. గ్రెనేడ్‌ను ఒక గట్టి పఆంతంలో పిన్‌ను లాగినా సేఫ్టీ లీవర్‌ బయటికి రాకుండా ఉంచడం ఇందులోని మౌలిక పద్ధతి. అప్పుడు ఒక స్ట్రింగ్‌ హెడ్‌ అసెంబ్లీ నుంచి మరో నిలిచి ఉన్న పదార్థానికి వరుసలా కట్టేసి ఉంచుతారు. సైనికుడు ఆ దారంపై కాలు పెట్టినప్పుడు ఇరుకైన దారి గుండా గ్రెనేడ్‌ లాగబడుతుంది. సేఫ్టీ కవర్‌ వదులైపోయి గ్రెనేడ్‌ ఒక్కసారిగా పేలుతుంది.

నార్తర్న్ కువైట్లో తొలగించిన ఆర్ జి డి 5 హ్యాండ్ గ్రెనేడ్ (లైవ్ కానీ అన్ ఫ్యూజ్డ్)

ఇలా తయారు చేసి వదిలేసిన బూబీ ఉచ్చులు, మామూలుగా వదిలేసిన గ్రెనేడ్లు చాలా ప్రమాదాలకు, పేలని ఆయుధాల వల్ల తలెత్తే ఎన్నో సమస్యలకు దారి తీస్తాయి. ట్రిప్‌ వైర్‌-ట్రిగర్గ్‌ గ్రెనేడ్ల (సాధారణంగా మందుపాతరలతో పాటుగా) వాడకం ఒట్టావా సంధి ప్రకారం నిషిద్ధం. అలా వాడటాన్ని యుద్ధ నేరంగా పరిగణిస్తారు కూడా. భారతదేశం, చైనా, రష్యా, అమెరికా ఈ ఒప్పందంపై ఎన్ని అంతర్జాతీయ ఒత్తిళ్లు వచ్చినా సంతకం చేయలేదు. ఆత్మ రక్షణ అవసరాలను అందుకు కారణంగా ఈ దేశాలు చూపాయి.

గ్రెనేడ్లను పొగ, టియర్‌ గ్యాస్‌, ఇతర గ్యాస్‌లను వదిలేందుకు కూడా తయారు చేస్తారు. వీటితో పాటు వెలుతురును విరజిమ్మే ఎనేడ్లు కూడా ఉంటాయి. పత్య్రేక దళాలు తరచూ ఏదైనా గదిలోకి ప్రవేశించే ముందు అక్కడున్న వారిని నిశ్చేష్టులను చేసేందుకు స్టన్‌ గ్రెనేడ్లను వాడుతుంటాయి.

కొన్ని గ్రెనేడ్లను మామూలు కంటే సుదూరాలకు విసిరేందుకు కూడా తయారు చేస్తారు. జర్మనీ తయారుచేసిన పొటాటో-మాషర్‌ గ్రెనేడ్‌కు పొడవాటి చెక్క హ్యాండిల్‌ ఉంటుంది. దీని ద్వారా ఆ గ్రెనేడ్‌ పరిధి 50 శాతం దాకా పెరిగిపోతుంది.[ఉల్లేఖన అవసరం] పొటాటో-మాషర్‌ను దానిపై ఉన్న ఫ్రిక్షన్‌ ఇగ్నైటర్‌ ద్వారా పేలుస్తారు. బోలుగా ఉండే హ్యాండిల్‌ ద్వారా పుల్‌ స్ట్రింగ్‌ తాడును లాగి యాక్టివేట్‌ చేస్తారు. గ్రెనేడ్‌ను విసిరేందుకు సరిగ్గా ముందు సైనికుడు ఫ్రిక్షన్‌ ఇగ్నైటర్‌కు కలిపి ఉండే స్ట్రింగ్‌చివర్లోని చిన్న పోర్సిలిన్‌ బాల్‌ను లాగుతాడు. దాంతో టైమ్‌ ఫ్యూజ్‌ మొదలైనట్టే. కాసేపటి తర్వాత గ్రెనేడ్‌ పేలిపోతుంది. పొటాటో-మాషర్‌ ఫ్యూజ్‌ తరహా ప్రభావం కలిగిస్తుందని తరచూ పొరపాటుగా భావిస్తూ ఉంటారు. కానీ అలా ఉండదు. మామూలుగా చెప్పాలంటే 1908ల నాటి బ్రిటిష్‌ స్టిక్‌ గ్రెనేడ్‌ డిజైన్‌కు ఇది దాదాపుగా దగ్గరగా ఉంటుంది.

ఇతర రకాలు[మార్చు]

స్టన్‌[మార్చు]

ఎం 84 స్టన్ గ్రెనేడ్

స్టన్‌ గ్రెనేడ్‌ను ఫ్లాష్‌బ్యాంగ్‌ అని కూడా అంటారు. ఇది ప్రాణాంతకమైన ఆయుధం కాదు. ఇలాంటి తొలి పరికరాలను 1960లో బ్రిటీష్‌ ప్రత్యేక వాయు సేవల్లో సామర్థ్యాన్ని తగ్గించడానికి ఆర్డరుపై రూపొందించారు.

ఈ గ్రెనేడ్లను శత్రువుల ఇంద్రియాలను స్థితిభ్రాంతికి గురిచేసి వారి పోరాట సామర్థ్యాన్ని తాత్కాలికంగా స్తంభింప చేసేలా తయారు చేశారు. దీని నుంచి వెలువడే వెలుతురు కంటిలోని వెలుతురుకు సంబంధించిన కణాలను చైతన్యం చేస్తాయి. ఫలితంగా దాదాపు ఐదు సెకన్లపాటు మళ్లీ కళ్లు సాధారణ స్థితికి వచ్చేవరకు దేనిని చూడలేం. తీవ్రమైన భారీ శబ్దంతో చోటుచేసుకునే గ్రెనేడ్‌ పేలుడు చెవిలోని ద్రావణాలను గందరగోళపరచడం ద్వారా దాని పనిచేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.

ఐడిఎఫ్ స్టన్ గ్రెనేడ్

పేలుడు సంభవించినపుడు జతపరిచిన ఫ్యూజు/గ్రెనేడ్‌ భాగాలు అలాగే ఉంటాయి. రంధ్రాలతో ఉన్న ట్యూబ్‌ భాగం, పక్కల నుంచి వెలుతురును మరియు పేలుడు శబ్ధాన్ని వెలువరిస్తుంది. ఇది పదునైన గాయాలను నివారిస్తుంది, కానీ మండుతూనే ఉంటుంది. డిటోనేషన్‌ పేలుడు ధాటికి గాయాలు కావచ్చు మరియు అక్కడ పుట్టే వేడి మండే గుణం కల పదార్థాలైన ఇంధనం మొదలైన వాటిలో మంటను పుట్టించగలదు. లండన్‌లోని ఇరానియన్‌ ఎంబసీ స్వాధీనం సందర్భంగా జరిగిన అగ్ని ప్రమాదానికి స్టన్‌ గ్రెనేడ్‌ లే కారణం. ఇందులో నింపే వాటిలో 4.5 గ్రాముల పైరోటెక్నిక్‌ మెటల్‌-ఆక్సిడెంట్‌ మిశ్రమమైన మెగ్నీషియం లేదా అల్యుమినియం మరియు ఆక్సిడైజర్‌లైన అమ్మోనియం పెరాక్లోరైడ్‌ లేదా పొటాషియం పెరాక్లోరైడ్‌ ఉంటాయి.

స్టింగ్‌[మార్చు]

స్టింగ్‌ గ్రెనేడ్లు (రబ్బరు బాల్‌ గ్రెనేడ్లు అని కూడా అంటారు) ఫ్రాంగ్మెంటేషన్‌ గ్రెనేడ్ల ఆకృతిపై ఆధారపడి ఉంటాయి. పదునును ఉత్పత్తి చేయడానికి మెటల్‌ కేసింగ్‌ను ఉపయోగించడానికి బదులుగా రెండు గుండ్రని కఠిన రబ్బర్లను ఉపయోగించి రూపొందిస్తారు. చిన్న గోళం లోపల పేలుడు చార్జి, ప్రైమర్‌, మరియు డిటోనేటర్‌ ఉంటాయి. రెండు గోళాల మధ్య ఖాళీని పలు చిన్న కఠిన రబ్బరు బంతులతో నింపుతారు. పేలుడు తర్వాత వినియోగించిన వస్తువుల వేగం కారణంగా సంబంధిత అంశం సామర్థ్యం కోల్పోవడం, గాయపడడం, లేదా చాలా స్వల్పంగా పైనుంచి దెబ్బతినడం జరుగుతుంది.

కొన్ని రకాలు అదనపు పేలుడు రసాయనాలైన సీఎస్‌ వాయువు తదితరాలను కలిగి ఉంటాయి.

ఫ్లాష్‌బ్యాంగ్‌తో పోలిస్తే ప్రయోజనాలు:

 • గ్రెనేడ్‌తో లక్ష్యాన్ని చూసే అవసరం లేదు. ఇది బహిరంగ ప్రాంతాల్లో పూర్తి ప్రభావం చూపుతుంది.
 • స్టింగ్‌ గ్రెనేడ్లు ఎక్కువగా సంబంధిత లక్ష్యం పడిపోయేలా లేదా బాధతో కుంగిపోయేలా చేస్తాయి. ఫలితంగా ఆ ప్రాంతంలోని లక్ష్యాలు దెబ్బతినకుండా చక్కగా కనపడేలా ఉంచుతాయి.

ఈ కారణంగానే స్టింగ్‌ గ్రెనేడ్లు రౌడీ ఖైదీల చిన్న బృందాలను ఉంచడానికి అనుకూలమైనవి. అనుమానితుడు కవర్ల వెనక నక్కినపుడు వాటిని కాల్చే అవకాశాన్ని ఇవి కల్పిస్తాయి. లేదా ఆ చిన్న గదుల్లోకి స్వాట్‌ జట్లు చేరుకుని దానిని తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది.

స్టింగ్‌ గ్రెనేడ్ల వల్ల నష్టం ఏమిటంటే సంబంధిత అంశాల సామర్థ్యాన్ని అవి కచ్చితంగా తగ్గిస్తాయని చెప్పలేం. ఆయుధాలు కలిగి ఉన్న లక్ష్యాల విషయంలో వీటిని వినియోగించడం ప్రమాదకరం. ఎందుకంటే స్టింగ్‌ గ్రెనేడ్లు ఇంద్రియాలు స్వీకరించే వాటిపై కాకుండా ప్రతికూల పరిస్థితుల్లో శరీరం స్పందించే తీరుపై (నొప్పి మరియు పదును లేని ఆయుధాలతో గాయం) ఆధారపడి ఉంటాయి. తగిన మానసిక సామర్థ్యం ఉన్న వ్యక్తి తన దృష్టిని కేంద్రీకరించడం ద్వారా స్టింగ్‌ గ్రెనేడ్‌ పేలుడును తట్టుకోగలడు. అదే స్టన్‌ గ్రెనేడ్‌ భాతికంగా దృష్టిని మరియు ఇంద్రియాలను ప్రభావితం చేస్తుంది. స్టన్‌ గ్రెనేడ్‌తో పోలిస్తే స్టింగ్‌ గ్రెనేడ్‌ ప్రభావ పరిధి పరిమితం. అదనంగా వేగంగా విసిరే అంశాల వల్ల అంధులవడమే కాకుండా తీవ్రమైన శారీరక గాయాలయ్యే ప్రమాదం ఉంది.

కొన్నిసార్లు స్టింగ్‌ గ్రెనేడ్లను స్టింగర్‌ గ్రెనేడ్లు, అని కూడా అంటారు. ఇవి జెనరిసైజ్డ్ ట్రేడ్ మార్కయిన స్టింగర్‌గా డిఫెన్స్‌ సాంకేతికతలో దాని సొంత పేరైన స్టింగ్‌ గ్రెనేడ్లుగా ట్రెడ్‌మార్కు పొందింది.

స్టన్‌ ప్రభావం[మార్చు]

బ్లాంక్ ఫైరింగ్ గ్రెనేడ్

ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ధి బ్లాంక్‌-ఫైరింగ్‌ ఇంపాక్ట్‌ గ్రెనేడ్‌ (బీఎఫ్‌ఐజీ). పలు సందర్భాలలో దీనివైపు మొగ్గు చూపుతున్నారు, ముఖ్యంగా శిక్షణ సందర్భంగా, మరో రెండు కారణాల వల్ల కూడా; అవి పునర్‌ వినియోగం, మరియు ఆర్థికంగా అందుబాటులో ఉండడం, ఎందుకంటే ఖాళీ పేలుడు పదార్థాల వ్యయం స్థిరంగా ఉంటుంది, మరియు వాటిని విడిగా ఉంచినపుడు తరలించడానికి చాలా తక్కువ రవాణా నిబంధనలు ఉంటాయి. బీఎఫ్‌ఐజీలో కాల్చడానికి బ్లాంక్‌ కార్ట్రిడ్జ్‌ పద్ధతి ఉంటుంది. దీనిని కఠినమైన ఉపరితలంపై మీటరు లేదా అంతకంటే ఎత్తునుంచి ఏ కోణంలోంచయినా పడేయవచ్చు. కేవలం ఇంపాక్ట్‌పై ఏ మిశ్రమంతోనైనా పేలుడు చోటుచేసుకుంటుంది.[37]

అలంకారికంగా గ్రెనేడ్లు[మార్చు]

ఫ్రెంచ్ ఆర్మీ యొక్క కెపీపై గ్రెనేడ్

ఆకట్లుకునేలా ఉండే తొలినాటి గ్రెనేడ్లు, మంటను వెలువరించే వాటిని సైనిక దుస్తులపై అలంకారానికి ఉపయోగించేవారు, ముఖ్యంగా ఫ్రాన్స్‌లో (ప్రత్యేకంగా ఫ్రెంచ్‌ జెండర్‌మెరి మరియు ఫ్రెంచ్‌ ఆర్మీ), మరియు ఇటలీ (కారబినయిరీ). లోహ ఆయుధాలతో కూడిన బ్రిటీష్‌ మరియు కామన్‌వెల్త్‌ సంస్కృతి (ఉదాహరణకు యువరాణి లూయిస్‌ ప్యూజిలియర్స్‌, కెనడియన్‌ ఆర్మీ) లో దాడుల్లో గ్రెనేడ్ల చారిత్రక వినియోగాన్ని ప్రతిబింబించేలా వెలుగుతున్న గ్రెనేడ్‌లాంటి క్యాప్‌-బ్యాడ్జ్‌ను ధరిస్తారు. బ్రిటీష్‌ గ్రెనేడయర్స్‌ గార్డ్స్‌ వారి పేరును మరియు వెలుగుతున్న గ్రెనేడ్‌లాంటి క్యాప్‌ బ్యాడ్జ్‌ను వాటర్‌లూలో దాడి సందర్భంగా ఫ్రెంచ్‌ గ్రెనేడయర్స్‌ నుంచి తీసుకున్నారు. స్పానిష్‌ ఫిరంగి దళం వెలుగుతున్న గ్రెనేడ్‌ను దాని బ్యాడ్జ్‌గా ఉపయోగిస్తోంది. రష్యన్‌ పదాతి దళం పతాకంలో కూడా వెలుగుతున్న గ్రెనేడ్‌లాంటి పరికరం ఉంటుంది. యూ.ఎస్‌. ఆర్మీ ఆయుధ దళంలో పలు శాఖల్లో అధికారాన్ని సూచించడానికి కూడా ఈ గుర్తును ఉపయోగిస్తారు. సాధారణంగా గ్రెనేడ్‌ పేలుడు ఆయుధాలకు గుర్తు. సంయుక్త రాష్ట్రాల నావికా దళం కూడా వారి యూనిఫాంపై గ్రెనేడ్‌ను వినియోగిస్తోంది: మాస్టర్‌ గన్నరి సార్జెంట్‌ ర్యాంకును సూచించడానికి మూడు చెవరన్లు పైకి, నాలుగు రాకర్స్‌ కిందకు కలిగి ఉంటాయి. దీని మధ్యలో పేలిన బాంబు లేదా గ్రెనేడ్‌ ఉంటుంది. యూ.ఎస్‌. నేవీ ఏవియేషన్‌ ఆయుధ దళంలో రేటింగ్‌ బ్యాడ్జ్‌పై ఇదే ఆకృతిలో రెక్కలున్న పరికరం ఉంటుంది. ఉక్రెయిన్‌ యంత్ర పదాతిదళం మరియు ఇంజినీర్లు వారి శాఖ ర్యాంకు గుర్తుగా మండుతున్న గ్రెనేడ్‌ను ఉపయోగిస్తారు. ఫినిష్‌ ఆర్మీ ఇంజినీర్ల దళం గుర్తు స్టిక్‌ హ్యాండ్‌ గ్రెనేడ్‌ (విధ్వంసానికి గుర్తు) మరియు పార (నిర్మాణానికి గుర్తు) గా వారి సాల్టైర్‌పై కలిగి ఉంటారు.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • నిల్స్ వాల్టర్సెన్ ఆసెన్, మోడెమ్ హ్యాండ్ గ్రెనేడ్ తయారీదారు.
 • రాకెట్ ఆధారిత గ్రెనేడ్
 • రైఫిల్ గ్రెనేడ్
 • గ్రెనేడ్ లాంచర్
 • సాట్చెల్ చార్జ్
 • సాంగ్ డైనాస్టీ యొక్క టెక్నాలజీ

సూచనలు[మార్చు]

గమనికలు
 1. 1.0 1.1 1.2 1.3 "గ్రెనేడ్". ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా.
 2. http://www.etymonline.com/index.php?term=grenade
 3. 3.0 3.1 3.2 రాబర్ట్ జేమ్స్ ఫోర్బ్ : ’’పురాతన టెక్నాలజీలో స్టడీస్‘‘, లీడెన్ 1993, ISBN 978-90-04-00621-8, p.107
 4. నార్త్ఓవర్ ప్రాజెక్టర్స్ - WO 185/23, ద నేషనల్ ఆర్చీవర్స్
 5. (Ukrainian లో) [1]
 6. అమెరికా సైంటిస్టుల ఫెడరేషన్ ఎం 67 ఫ్రాగ్మెంటేషన్ హ్యాండ్ గ్రెనేడ్
 7. డోకెరీ 1997, p. 188.
 8. 1941లో విడుదల అయిన లైఫ్ మ్యాగజైన్లో చూపించిన ఫొటో, యాంటీ ట్యాంక్ గ్రెనేడ్లను ఎక్స్ ఆకారపు స్లిట్ ట్రెంచెస్ను ఉపయోగించి ఎలా తయారు చేయాలి.
 9. ఇయాన్ హాగ్ ’’గ్రెనేడ్లు మరియు మోర్టార్స్ పేజి 38 బాలంటైన్ పుస్తకాలు1974
 10. ఇయాన్ హాగ్ గ్రెనేడ్లు మరియు మోర్టార్స్ జేజి 39 బాలంటైన్ పుస్తకాలు 1974
 11. క్రిస్ బిషప్ ’’రెండో ప్రపంచ యుద్ధం యొక్క ఆయుధాలు‘‘ పేజి 207-208 బేమ్స్ అండ్ నోబుల్స్ పుస్తకాలు 1998
 12. డెనిస్ హెచ్.ఆర్. ఆర్చర్ ’’జేన్ యొక్క ఇన్ ఫాంట్రీ ఆయుధాలు‘‘ పేజి 462
 13. క్రిస్ బిషప్ ’’రెండో ప్రపంచ యుద్ధం యొక్క ఆయుధాలు‘‘ పేజి 214 బేమ్స్ అండ్ నోబుల్స్ పుస్తకాలు 1998
 14. డెనిస్ హెచ్.ఆర్. ఆర్చర్ ’’జేన్ యొక్క ఇన్ ఫాంట్రీ ఆయుధాలు‘‘ పేజి 464-465
 15. గమనిక: రష్యన్ యాంటీ ట్యాంక్ గ్రెనేడ్లు ఎలా పని చేస్తాయో తెలిపే డ్రాయింగ్స్ ఈ ఆర్టికల్ లోని ’’యాంటీ ట్యాంక్‘‘ విభాగంలో ఉన్న హెచ్ఎజిలో అదనపు ఇమేజ్ గా ఉంది.
 16. ఎరిక్ సి. లుడ్విగ్సెన్ ’’అసోషియేషన్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ గ్రీన్ బుక్ 1984-85" page 348
 17. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇతర ఆర్మీలలో ఇలాంటి యాంటీ ట్యాంక్ గ్రెనేడ్ను విజయవంతంగా వినియోగించాక, సీనియర్ అధికారుల నిర్ణయాలను కల్చరల్ అంశాలు ప్రభావితం చేశాయనే అవగాహనకు వచ్చారు. అదే విధంగా, యు.ఎస్.లో అనేక ప్రాంతాల్లో ఖాళీకి ఈ నిర్ణయం కారణమైంది. ఎం 2 హెవీ మిషన్ గన్ కంటే పెద్ద ’’యాంటీ ట్యాంక్ ఆయుధం‘‘ లేదు.
 18. స్కూగల్, జెఫ్ (అక్టోబరు 20, 2009) [2] Archived 2009-10-24 at the Wayback Machine."ఎంఆర్ఏపీ లను ఆర్కెజి 3 యాంటీ ట్యాంకర్ గ్రెనేడ్లుగా మార్చారు. చుక్కలు మరియు గీతలు (దినపత్రికలు)
 19. ది జీనియస్ ఆఫ్ చైనా రాబర్ట్ టెంపుల్
 20. జోసెఫ్ నీథమ్ : చైనాలో సైన్స్ మరియు నాగరికత వాల్యూమ్ 5, పార్ట్ 6: కెమిస్ర్టీ మరియు కెమికల్ టెక్నాలజీ: మిలటరీ టెక్నాలజీ: మిస్సైల్స్ మరియు సీగెస్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ 1994, ISBN 0-521-32727-X
 21. నీథమ్, వాల్యూమ్ 5, పార్ట్ 7, 179.
 22. Needham, Volume 5, 264.
 23. నీథమ్, వాల్యూమ్ 5, పార్ట్ 7, 179-180.
 24. Cramb, Auslan (2004). "Battlefield gives up 1689 hand grenade". Scotland Correspondent. Unknown parameter |month= ignored (help)
 25. "The National Archives, records of the UK government". Letters of Hibbert, Hugh Robert, 1828-1895, Colonel, ref. DHB/57 - date: 14 June 1855. Retrieved 2006-08-09.
 26. "Istorijat". Zastava-arms.co.yu. మూలం నుండి 2009-04-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-12-26. Cite web requires |website= (help)
 27. LEXPEV. "Yugoslavian hand- and riflegrenades". Lexpev.nl. మూలం నుండి 2008-08-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-12-26. Cite web requires |website= (help)
 28. ఆధునిక గ్రెనైడర్ ఎలా ఆయుధం అయింది: ఒక పురాతన ప్రాక్టీస్, గొప్ప యుద్ధంలో ఒక ట్రెంచ్ ఫైటింగ్ ద్వారా బయటపడింది. , పాపులర్ సైన్స్ మంత్లీ, జనవరి 1919, page 14, గూగుల్ బుక్స్ ద్వారా స్కాన్ చేయబడింది: http://books.google.com/books?id=HykDAAAAMBAJ&pg=PA14
 29. Pub. 1952; cf. చాప్టర్ 7
 30. ibid. Chap. X, p128
 31. http://www.janes.com/ఆర్టికల్స్/జేన్స్-ఇన్ ఫాంట్రీ-వెపన్స్/Diehl-DM-51-అఫెన్సివ్-డిఫెన్సివ్-హ్యాండ్-గ్రెనేడ్-జర్మనీ.html
 32. http://www.mecar.be/content.php?langue=english&cle_menus=1156765274
 33. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2012-08-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-01-07. Cite web requires |website= (help)
 34. http://www.ruag.com/en/Ammotec/Defence_and_Law_Enforcement/Handgranades/HG_85-Linie
 35. యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ ఫీల్డ్ మాన్యువల్ 3-23.30, గ్రెనేడ్స్ మరియు పైరో టెక్నిక్ సిగ్నల్స్ (2005 revision), page 1-6
 36. United States Army Field Manual 3-23.30, Grenades and Pyrotechnic Signals (2005 revision), pages 3-11 to 3-12
 37. "Impact Stun Grenade from HFM Pyrotechnics:". Hfmgroup.com. మూలం నుండి 2008-12-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-12-26. Cite web requires |website= (help)
గ్రంథ సూచిక
 • నీధమ్, జోసెఫ్ (1986). చైనాలో సైన్స్ మరియు నాగరికత: వాల్యూమ్ 5, 7వ భాగం 7 . తైపీ: కేవ్స్ బుక్స్ లిమిటెడ్.

బాహ్య లింకులు[మార్చు]