చేమకూర వెంకటకవి
కాలము | 17 వ శతాబ్దం |
రచనలు | విజయ విలాసము సారంగధర చరిత్ర |
బిరుదులు | {{{బిరుదులు}}} |
అంకితమిచ్చినది | రఘునాథరాజు |
ప్రాంతము | తంజావూరు |
చేమకూర వెంకటకవి నాయకరాజుల్లో ముఖ్యుడు, సాహితీప్రియుడైన రఘునాథనాయకుని కొలువులో కవి. దక్షిణాంధ్ర సాహిత్య యుగంలో చేమకూర వెంకటకవిది ముఖ్యస్థానం.
జీవిత విశేషాలు[మార్చు]
చేమకూర వెంకట కవి కాలం క్రీ.శ.1630 ప్రాంత. తంజావూరు నాయకరాజులలో ప్రసిద్దుడగు రఘునాథరాజు ఆస్థానంలో ఈ సరసకవి ఉండేవాడు. ఈ కవి వృత్తి రిత్యా రఘునాథుని వద్ద, క్షాత్ర ధర్మం నిర్వర్తిస్తూ రాజు సైనికులలోనో, సైనికాధికారులలోనో ఒకరిగా ఉండేవారు.
రచనలు[మార్చు]
చేమకూర వెంకటకవి సారంగధర చరిత్ర, విజయవిలాసం రచించారు. ఆయన రచనల్లో విశిష్టమైన విజయవిలాసాన్ని అర్జునుడి(విజయుని) తీర్థయాత్ర, మానవ, నాగ కన్యలను అయన వివాహం చేసుకోవడం ఇతివృత్తంగా రచించారు.
శైలి[మార్చు]
ప్రబంధయుగాన్ని దాటి దక్షిణాంధ్రయుగంలోకి సాహిత్యం అడుగుపెట్టాకా ఆ శైలిలో అత్యున్నత స్థాయిని అందుకున్న కవి చేమకూర వెంకన్న. ఆశ్చర్యకరమైన, అద్భుతమైన చమత్కారాలతో కళ్లు మిరుమిట్లుగొలిపేలా చేస్తారంటూ ఆయన శైలిని సాహిత్యవేత్త బేతవోలు రామబ్రహ్మం ప్రశంసించారు.
ప్రఖ్యాతి[మార్చు]
చేమకూర వేంకటరాజకవిని, అతడు వ్రాసిన ప్రబంధరాజాలువిజయవిలాసం, సారంగధర చరిత్రలను నోరార ప్రశంసించని కవులుగాని, పండితులుగాని, విమర్శకులుగాని ఈ మూడువందల యాభై సంవత్సరాల్లో ఆంధ్రదేశంలో ఎవ్వరూ లేరని నిరాఘాటంగ చెప్పవచ్చు. కొందరు చేమకూర పాకాన పండిందన్నారు. ఇంటిపేరు నసగా ఉన్నా కవిత్వం పసగా ఉందన్నారు కొందరు. చక్కెరమళ్ళలో అమృతం పారించి పండించిన చేమకూర అని ఒకరు అన్నారు. ఇంకొకరు కడుంగడుం గడుసువాడు అని మెచ్చారు.
"అచ్చ పదములను పొందికగ గూర్చి కవనము చెప్పు నేర్పు ఈ కవికి కుదిరినట్లు మరియొక కవికి కుదిరిందని చెప్పవనలు వడదు ...పింగళ సూరనార్యుని ప్రభావతీ ప్రద్యుమ్నమునకు తరువాత విజయవిలాసము సర్వ విధములచేతను తెలుగులో శ్లాఘ్య కావ్యముగ నున్నది, జాతియాది చమత్కృతినిబట్టి విజయవిలాసమే శ్లామ్యతరమయినదని అనేకు లభిప్రాయపడుచున్నారు" అన్నారు. కృతిపతి రఘునాథనాయకుడు "ప్రతి పద్యంలోనూ చమత్కృతి ఉండేట్టు రచించా"వని చేమకూర వెంకన్నను ప్రశంసించారు.
బయటి లింకులు[మార్చు]
- మధుర తంజావూరు నాయక రాజుల నాటి ఆంధ్ర వాఙ్మయ చరిత్ర - మధుర తంజావూరు నాయకరాజుల కాలంలో విలసిల్లిన సాహిత్యాన్ని గురించిన పరిశోధన.