చేమురు
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
పాలను కాగబెట్టిన తరువాత ఆ పాలను పెరుగుగా మార్చేందుకు ఉపకరించే ద్రవాన్ని అనగా మజ్జిగను చేమురు అంటారు. పాలు బాగా కాగిన కొంత సమయం తరువాత చల్లారుతున్న సమయంలో అనగా పాలు గోరు వెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా మజ్జిగను సుమారు లీటరు పాలలో చెంచా మజ్జిగను వేస్తారు. రాతిరి పాలలో చేమురు వేస్తే ఉదయానికి ద్రవరూపంలో ఉన్న పాలు గడ్డ పెరుగుగా మారుతుంది. పాలలో వేసే చేమురు పాల వెచ్చదనాన్ని బట్టి వేసే చేమురు పరిమాణాన్ని బట్టి పెరుగు గడ్డ కట్టుకుండే సమయం, పెరుగు రుచి ఆధారపడి ఉంటుంది. పాలలో చేమురు ఎక్కువగా వేస్తే పెరుగు పుల్లగాను, చేమురు తక్కువగా వేస్తే పెరుగు తీయగాను ఉంటుంది. రాతిరి మిగిలిన అన్నంలో పాలను కలిపి దానికి చేమురును జత చేయడం ద్వారా ఉదయానికి ఆ అన్నం పెరుగన్నంలా తయారవుతుంది. ఈ విధంగా తయారైన అన్నాన్ని దద్ధోజనం అంటారు.