చైతన్య తంహానే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చైతన్య తంహానే
కోర్ట్ సినిమా ట్రైలర్ ఆవిష్కరణలో చైతన్య (2015)
జననం (1987-03-01) 1987 మార్చి 1 (వయసు 37)
వృత్తిసినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత

చైతన్య తంహానే (జ. 1 మార్చి 1987) మరాఠి సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత. 2014లో చైతన్య దర్శకత్వంలో వచ్చిన కోర్ట్ అనే మరాఠీకు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. అంతేకాకుండా ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో 88వ అకాడమీ అవార్డులకు భారతదేశం తరుపున అధికారికంగా నామినేట్ చేయబడింది.[1][2] ముంబై నగరంలోని కోర్టులో వృద్ధాప్య జానపద గాయకుడి కేసు విచారణ ద్వారా భారత న్యాయ వ్యవస్థను పరిశీలించే నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.

జీవిత విషయాలు[మార్చు]

1987, మార్చి 1న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు.

సినిమారంగం[మార్చు]

మొదట్లో సిక్స్ స్ట్రాండ్స్ అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. కోర్ట్ చిత్రంతో 9వ ఆసియా ఫిల్మ్ అవార్డులలో ఉత్తమ స్క్రీన్ రైటర్ గా ఎంపికయ్యాడు, 16వ ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ దర్శకుడిగా బహుమతి అందుకున్నాడు.[3] 2018లో బాలెకెంపా అనే కన్నడ సినిమాకు క్రియేటీవ్ ప్రొడ్యూసర్ గా పనిచేశాడు.[4]

ఇతడు తీసిన రెండవ సినిమా ది డిసైపుల్ (2020) 77వ వెనిస్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[5] వెనిస్ లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్,[6] అవార్డుతోపాటు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డును కూడా గెలుచుకుంది.[7]

సినిమాలు[మార్చు]

  • సిక్స్ స్ట్రాండ్స్ (2011) [షార్ట్ ఫిల్మ్]
  • డెత్ ఆఫ్ ఏ ఫాదర్ (2014) [షార్ట్ ఫిల్మ్]
  • కోర్ట్ (2014)
  • ది డిసైపుల్ (2020)

అవార్డులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Court is India's official entry for Oscars". Indian Express. 23 September 2015. Retrieved 28 June 2021.
  2. Bhushan, Nyay (24 September 2015). "Oscars: India Selects 'Court' For Foreign-Language Category". The Hollywood Reporter. Retrieved 28 June 2021.
  3. Bhushan, Nyay. India's Court wins at Mumbai Film Festival. Published 21 October 2014. Retrieved on 28 June 2021.
  4. Sibal, Prachi (15 February 2018). "Mandya to Rotterdam". India Today. Retrieved 28 June 2021.
  5. Hipes, Patrick (31 July 2020). "Venice Pic 'The Disciple' Sees Alfonso Cuarón Board As EP; Endeavor Content & New Europe Film Sales To Rep It". Deadline Hollywood. Retrieved 28 June 2021.
  6. "Venice Film Festival 2020: Chaitanya Tamhan's The Disciple wins FIPRESCI award". India Today. 13 September 2020.
  7. "Venice Film Festival 2020 Winners: Nomadland Takes Golden Lion, Vanessa Kirby Is Best Actress". IndieWire. Retrieved 28 June 2021.
  8. "'Court' gets triple win at Buenos Aires film fest". Indian Express. Indo-Asian News Service. 27 April 2015. Retrieved 28 June 2021.

బయటి లింకులు[మార్చు]