Jump to content

చోళ రాజ్య దేవాలయాలు

Coordinates: 10°46′59″N 79°07′57″E / 10.78306°N 79.13250°E / 10.78306; 79.13250
వికీపీడియా నుండి
గొప్ప జీవన చోళ దేవాలయాలు
ప్రపంచ వారసత్వ ప్రదేశం
మూడు ఆలయాల దృశ్యాలు
స్థానంతమిళనాడు, భారతదేశం
Includesతంజావూరు బృహదీశ్వరాలయ సముదాయం
గంగైకొండచోళపురం బృహదీశ్వరాలయ సముదాయం
దారాసురం ఐరావతేశ్వరాలయ సముదాయం
CriteriaCultural: (i), (ii), (iii), (iv)
సూచనలు250bis
శాసనం1986 (10th సెషన్ )
విస్తరణ2004
ప్రాంతం21.88 ha (54.1 acres)
Buffer zone16.715 ha (41.30 acres)
భౌగోళిక నిర్దేశకాలు 10°46′59″N 79°07′57″E / 10.78306°N 79.13250°E / 10.78306; 79.13250
చోళ రాజ్య దేవాలయాలు is located in India
చోళ రాజ్య దేవాలయాలు
Location of చోళ రాజ్య దేవాలయాలు in India.
చోళ రాజ్య దేవాలయాలు is located in Tamil Nadu
చోళ రాజ్య దేవాలయాలు
చోళ రాజ్య దేవాలయాలు (Tamil Nadu)

గొప్ప జీవన చోళ దేవాలయాలు (Great Living Chola Temples) అనేది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న మూడు చోళుల కాలం నాటి హిందూ దేవాలయాల సముదాయానికి దక్కిన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం హోదా. తంజావూరు లోని దేవాలయం 1987లో ఈ జాబితాలో చేర్చబడగా, మిగిలిన రెండు దేవాలయాలు 2004లో చేర్చబడ్డాయి.[1]

క్రీ.శ. 11వ శతాబ్దం ప్రారంభం, 12వ శతాబ్దం మధ్యకాలంలో పూర్తయిన ఈ కట్టడాలలో ఇవి ఉన్నాయి:[2]

ప్రపంచ వారసత్వ ప్రదేశ గుర్తింపు

[మార్చు]

తంజావూరు లోని ఆలయ సముదాయం 1987లో గుర్తించబడింది. గంగైకొండ చోళపురం లోని ఆలయ సముదాయం, ఐరావతేశ్వరాలయ సముదాయాలు 2004లో ఈ ప్రదేశానికి పొడిగింపులుగా చేర్చబడ్డాయి. "గొప్ప జీవన చోళ దేవాలయాలు" ప్రదేశంలో చేర్చడానికి ప్రమాణాలు:

  • ప్రమాణం (i): దక్షిణ భారతదేశంలోని మూడు చొళ దేవాలయాలు స్వచ్ఛమైన ద్రావిడ శైలి దేవాలయ నిర్మాణ భావనలో అత్యుత్తమ సృజనాత్మక సాధనకు ప్రాతినిధ్యం వహిస్తాయి.
  • ప్రమాణం (ii): తంజావూరు లోని బృహదీశ్వరాలయం చోళ దేవాలయాలకు మొదటి గొప్ప ఉదాహరణగా నిలిచింది, దీనిని అనుసరించి జరిగిన అభివృద్ధికి ఇతర రెండు నిర్మాణాలు సాక్ష్యంగా నిలుస్తాయి.
  • ప్రమాణం (iii): దక్షిణ భారతదేశంలో చోళ సామ్రాజ్యం, తమిళ నాగరికత నిర్మాణాల అభివృద్ధికి ఈ మూడు గొప్ప చోళ దేవాలయాలు అసాధారణమైన, అత్యుత్తమ సాక్ష్యంగా ఉన్నాయి.
  • ప్రమాణం (iv): తంజావూరు, గంగైకొండచోళపురం, దారాసురం లోని గొప్ప చోళ దేవాలయాలు చోళుల భావజాల ప్రాతినిధ్యానికి, నిర్మాణ శైలికి అత్యుత్తమ ఉదాహరణలు.

దేవాలయాలు

[మార్చు]

తంజావూరు చెన్నైకి నైరుతి దిశలో సుమారు 340 kilometres (210 mi) దూరంలో ఉంది. గంగైకొండ చోళపురం, దారాసురం దానికి ఈశాన్యంలో వరుసగా 70 kilometres (43 mi), 40 kilometres (25 mi) దూరంలో ఉన్నాయి.

చోళ రాజ్య దేవాలయాలు is located in Tamil Nadu
తంజావూరు
తంజావూరు
గంగైకొండ చోళపురం
గంగైకొండ చోళపురం
దారాసురం
దారాసురం
చెన్నై
చెన్నై
మధురై
మధురై
బెంగళూరు
బెంగళూరు
కోయంబత్తూరు
కోయంబత్తూరు
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో చోళ దేవాలయాల స్థానం.

తంజావూరు లోని బృహదీశ్వరాలయం

[మార్చు]
తంజావూరు లోని బృహదీశ్వరాలయం

తంజావూరు లోని బృహదీశ్వరాలయం శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం.[3][4] ఇది దక్షిణ భారతదేశపు అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా, సంపూర్ణంగా రూపుదిద్దుకున్న తమిళ నిర్మాణ శైలికి ఆదర్శప్రాయమైన ఉదాహరణగా నిలుస్తుంది.[5] దీనిని క్రీ.శ. 1003, 1010 మధ్య ఒకటవ రాజరాజ చోళుడు నిర్మించాడు. 11వ శతాబ్దపు ఈ దేవాలయ మూల కట్టడాలు ఒక కందకం చుట్టూ నిర్మించబడ్డాయి. ఇందులో ప్రధానంగా శైవమతంతో పాటు హిందూమతంలో వైష్ణవ, శాక్తేయ సంప్రదాయాలకు సంబంధించిన గోపురం, ప్రధాన ఆలయం, దాని భారీ టవర్, శాసనాలు, కుడ్యచిత్రాలు, శిల్పాలు ఉన్నాయి. చరిత్రలో ఈ దేవాలయం దెబ్బతిన్నది, కొన్ని కళాకృతులు ఇప్పుడు కనబడవు. ఆ తరువాతి శతాబ్దాలలో అదనపు మండపం, ఇతర కట్టడాలు చేర్చబడ్డాయి. 16వ శతాబ్దం తర్వాత నిర్మించిన కోట గోడల మధ్య ఇప్పుడు ఈ దేవాలయం నిలువెత్తున కనిపిస్తుంది.[6][7]

గ్రానైట్‌తో నిర్మించిన గర్భగుడిపై ఉన్న విమానం దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన వాటిలో ఒకటి.[4] ఈ ఆలయంలో భారీ స్తంభాలతో కూడిన ప్రాకారం (కారిడార్), భారతదేశపు అతిపెద్ద శివలింగాలలో ఒకటి ఉన్నాయి.[4][8] ఇది శిల్పాల నాణ్యతకు ప్రసిద్ధి చెందింది. 11వ శతాబ్దంలో నృత్యానికి అధిపతి అయిన శివుడిని ఇత్తడి నటరాజ విగ్రహంగా రూపొందించిన ప్రదేశం కూడా ఇదే. ఈ సముదాయంలో నంది, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వినాయకుడు, సభాపతి, దక్షిణామూర్తి, చండేశ్వరుడు, వారాహి, తదితర దేవతల ఉపాలయాలు ఉన్నాయి.[9] ఈ దేవాలయం తమిళనాడులో అత్యధిక మంది సందర్శించే పర్యాటక ఆకర్షణలలో ఒకటి.[10]

గంగైకొండ చోళపురం లోని బృహదీశ్వరాలయం

[మార్చు]
గంగైకొండ చోళపురం లోని బృహదీశ్వరాలయం

గంగైకొండ చోళపురం లోని బృహదీశ్వరాలయం తంజావూరు బృహదీశ్వరాలయానికి సుమారు 70 కి.మీ దూరంలో గంగైకొండ చోళపురంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. తన కొత్త రాజధానిలో భాగంగా ఒకటవ రాజేంద్ర చోళుడు ఈ ఆలయాన్ని క్రీ.శ 1035లో పూర్తి చేశాడు. చోళుల కాలం నాటి ఈ దేవాలయం 11వ శతాబ్దపు ఆలయాన్ని పోలిన రూపకల్పన, పేరును కలిగి ఉంటుంది. దీనిని కొన్నిసార్లు కేవలం గంగైకొండచోళపురం దేవాలయం అని పిలుస్తారు.[11][12][13]

ఇది శివుడికి అంకితం చేయబడినది, చతురస్రాకార ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ఈ దేవాలయం విష్ణువు, దుర్గ, సూర్యుడు, హరిహరుడు, అర్ధనారీశ్వరుడు, తదితరుల విగ్రహాలతో హిందూమతంలో వైష్ణవ, శాక్తేయ, సమకాలీన సమానత్వ ఇతివృత్తాలను భక్తితో ప్రదర్శిస్తుంది.[12][14][15] శివలింగంతో ఉన్న ప్రధాన గర్భగుడితో పాటు ఆలయ సముదాయంలో అనేక చిన్న గుడులు, గోపురం, ఇతర కట్టడాలు ఉన్నాయి. వీటిలో కొన్ని పాక్షికంగా శిథిలమయ్యాయి లేదా తరువాతి శతాబ్దాలలో పునరుద్ధరించబడ్డాయి. ఈ దేవాలయం కాంస్య శిల్పాలు, గోడలపై కళాకృతులు, నంది, వంపు తిరిగిన గోపుర పరిమాణానికి ప్రసిద్ధి చెందింది.[12][16][17]

ఐరావతేశ్వర దేవాలయం

[మార్చు]
ఐరావతేశ్వర దేవాలయం

ఐరావతేశ్వర దేవాలయం కుంభకోణం నగరం శివార్లలోని దారాసురంలో ఉంది, ఇది క్రీ.శ 1166లో పూర్తయింది.[18] కుంభకోణం ప్రాంతంలో ఉన్న పద్దెనిమిది మధ్యయుగ కాలం నాటి పెద్ద హిందూ దేవాలయాల సమూహంలో ఇది ఒకటి.[19] ఈ దేవాలయం శివుడికి అంకితం చేయబడింది. ఇది శైవమత భక్తి ఉద్యమ సాధువులైన అరవై మూడు మంది నాయనార్లకు సంబంధించిన ఇతిహాసాలతో పాటు హిందూమతంలో వైష్ణవ, శాక్తేయ సంప్రదాయాలను కూడా భక్తితో ప్రదర్శిస్తుంది.[20][21][22]

ఇంద్రుడి తెల్ల ఏనుగు ఐరావతం పేరు మీదుగా పిలువబడే ఈ ఐరావతేశ్వర దేవాలయం భారతదేశంలోని తమిళనాడులో ఉన్న మూడు ప్రధాన చోళ కాలపు దేవాలయాల సమూహమైన గొప్ప జీవన చోళ దేవాలయాలలో భాగం. ఒకటవ రాజరాజ చోళునితో ప్రారంభమైన చోళ పాలకుల కాలంలో నిర్మించిన మూడు దేవాలయాలలో ఇది చివరిది, దీనిని క్రీ.శ. 1150 లో రెండవ రాజరాజ చోళుడు నిర్మించాడు. ఈ దేవాలయం రాజగంభీర తిరుమండపానికి (రాయల్ కోర్ట్‌యార్డ్) ప్రసిద్ధి చెందింది, ఇందులో సంక్లిష్టంగా చెక్కబడిన స్తంభాలు, పొడవైన గ్రానైట్ మెట్లు, గుర్రాలు లాగుతున్నట్లుగా ఉన్న రాతి రథాలు ఉన్నాయి. ఈ ప్రదేశం కుంభకోణం సమీపంలోని దారాసురంలో ఉంది.

రాతి దేవాలయం రథ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు, బ్రహ్మ, సూర్యుడు, విష్ణువు, సప్తమాత్రికలు, దుర్గ, సరస్వతి, శ్రీదేవి (లక్ష్మి), గంగ, యమున, సుబ్రహ్మణ్యుడు, వినాయకుడు, మన్మధుడు, రతీదేవి తదితర ప్రధాన వైదిక, పౌరాణిక దేవతలు ఇందులో కొలువై ఉన్నారు.[23] శాసనాల ప్రకారం ఈ దేవాలయం చాలా పెద్దదిగా ఉండేది, ఒకప్పుడు ఏడు ప్రాంగణాలను కలిగి ఉండేది. ఇప్పుడు కేవలం ఒక ప్రాంగణం మాత్రమే మిగిలి ఉంది; గోపురం లాంటి ఆలయ భాగాలు శిథిలావస్థలో ఉన్నాయి, ప్రధాన దేవాలయం, దానికి అనుసంధానించబడిన ఉపాలయాలు మాత్రమే ఒంటరిగా నిలుచున్నాయి.[24] ఈ దేవాలయం ప్రతి సంవత్సరం హిందూ యాత్రికులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తూనే ఉంది.[25][23][26]

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Great Living Chola Temples". World Heritage: Unesco.org. Retrieved 6 November 2010.
  2. "Great Living Chola Temples" (PDF). UNESCO. Retrieved 6 November 2010.
  3. Thanjavur, Encyclopaedia Britannica
  4. 4.0 4.1 4.2 "The Archaeological Survey of India (ASI)".
  5. Keay, John (2000). India, a History. New York, United States: Harper Collins Publishers. pp. xix. ISBN 0-00-638784-5.
  6. S.R. Balasubrahmanyam 1975, pp. 1–21.
  7. Michell, George (2008). Architecture and art of Southern India. Cambridge University Press. pp. 16–21, 89–91.
  8. S.R. Balasubrahmanyam 1975, pp. 20–21.
  9. S.R. Balasubrahmanyam 1975, pp. 1–26.
  10. Gopal, Madan (1990). K.S. Gautam (ed.). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. p. 185.
  11. S.R. Balasubrahmanyam 1975, pp. 241–245.
  12. 12.0 12.1 12.2 Great Living Chola Temples, Archaeological Survey of India, Government of India
  13. Michell 1988, p. 4, 51-53, 145.
  14. PV Jagadisa Ayyar (1993), South Indian Shrines, Asian Educational Services, ISBN 81-206-0151-3, pages 291-295
  15. S.R. Balasubrahmanyam 1975, pp. 241–249.
  16. S.R. Balasubrahmanyam 1975, pp. 243–249.
  17. "Great Living Chola Temples". UNESCO World Heritage Centre. 2004.
  18. Michell, George (2012). Hegewald, Julia A. B.; Mitra, Subrata K. (eds.). Re-Use-The Art and Politics of Integration and Anxiety. SAGE Publications. pp. 91–93. ISBN 978-81-321-0981-5.
  19. Ayyar 1992, pp. 349-350
  20. S.R. Balasubrahmanyam 1979, pp. 225–245.
  21. Harle, James C. (1994). The Art and Architecture of the Indian Subcontinent. Yale University Press. p. 318. ISBN 978-0-300-06217-5.
  22. Dehejia, Vidya (2010). Art of the Imperial Cholas. Columbia University Press. pp. 106–115. ISBN 978-0-231-51524-5.
  23. 23.0 23.1 S.R. Balasubrahmanyam 1979, pp. 225–234.
  24. Ayyar 1993, p. 351
  25. Ayyar 1992, pp. 350-351
  26. Pal, Pratapaditya; Huyler, Stephen P.; Cort, John E.; et al. (2016). Puja and Piety: Hindu, Jain, and Buddhist Art from the Indian Subcontinent. University of California Press. p. 65. ISBN 978-0-520-28847-8.

ఆధారాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]