చోళ సామ్రాజ్యం
చోళ సామ్రాజ్యం சோழர் குலம் | |||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| 300 క్రీ.పూ.–1279 | |||||||||
|
జండా | |||||||||
చోళ సామ్రాజ్యం క్రీ.శ. 1050 లో ఉత్థాన స్థితిలో. | |||||||||
| రాజధాని | మొదటి చోళులు: పూంపుహార్, ఉరయూర్, మధ్యయుగ చోళులు: పుజైయారాయి, తంజావూరు గంగైకొండ చోళపురం | ||||||||
| సామాన్య భాషలు | తమిళం | ||||||||
| మతం | హిందూ మతము | ||||||||
| ప్రభుత్వం | రాజరికం | ||||||||
| రాజు | |||||||||
• 848-871 | విజయాలయ చోళుడు | ||||||||
• 1246-1279 | మూడవ రాజేంద్ర చోళుడు | ||||||||
| చారిత్రిక కాలం | మధ్య యుగం | ||||||||
• స్థాపన | 300 క్రీ.పూ. | ||||||||
• మధ్యయుగ చోళుల ఆవిర్భావం. | 848 | ||||||||
• పతనం | 1279 | ||||||||
| |||||||||


చోళ సామ్రాజ్యం (తమిళ భాష:சோழர் குலம்), 13 వ శతాబ్దం వరకు ప్రధానంగా దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన తమిళ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం కావేరి నది పరీవాహక ప్రాంతంలో పుట్టి దక్షిణ భారతదేశం అంతా విస్తరించింది. కరికాళ చోళుడు, రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, కుత్తోంగ చోళుడు చోళ రాజులలో ప్రముఖులు. చోళ సామ్రాజ్యం 10,11,12 శతాబ్దంలో చాలా ఉచ్ఛస్థితిని పొందింది. మొదటి రాజరాజ చోళుడు మరియు అతని కుమారుడు రాజేంద్ర చోళుడు కాలంలో చోళ సామ్రాజ్యం ఆసియా ఖండంలోనే సైనికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా చాలా అభివృద్ధి పొందింది. చోళ సామ్రాజ్యం దక్షిణాన మాల్దీవులు నుండి ఉత్తరాన ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్|లోని గోదావరి పరీవాహక ప్రాంతం వరకు విస్తరించింది. రాజరాజ చోళ భారతదేశంలోని దక్షిణ ద్వీపకల్ప భాగాన్ని, శ్రీలంకలోని కొన్ని భాగాలు, మాల్దీవులుకి తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. రాజేంద్ర చోళ ఉత్తర భారతదేశం మీద విజయ యాత్ర చేసి పాటలీపుత్రంని పరిపాలిస్తున్న పాల రాజు మహిపాలుడిని జయించాడు. తరువాత "మలయా ద్వీపసమూహం" (మలయ్ ఆర్కిపెలగో) వరకు కూడా చోళ రాజులు జైత్ర యాత్రలు జరిపారు. 12 వ శతాబ్దంకి పాండ్య రాజులు, 13వ శతాబ్ధానికి హోయసల రాజులు వారి వారి సామ్రాజ్యాలు స్థాపించడంతో చోళుల ఆధిపత్యం క్షీణించింది.
రాజరాజ చోళుడు
రాజరాజ చోళుడు ప్రముఖ చోళరాజులలో ఒకడు. స్థానిక స్వపరిపాలనకు సంబంధించి అనేక సంస్కరణలు చేశాడు. తంజావూరులో గొప్ప శివాలయాన్ని నిర్మించినది ఇతడే.
ఇవీ చూడండి
పాద పీఠికలు
మూలాలు
- Chopra, P.N (2003) [2003]. History of South India ; Ancient, Medieval and Modern. New Delhi: S. Chand & Company Ltd. ISBN 81-219-0153-7.
{{cite book}}: Unknown parameter|coauthors=ignored (|author=suggested) (help) - Das, Sisir Kumar (1995) [1995]. History of Indian Literature (1911–1956) : Struggle for Freedom - Triumph and Tragedy. New Delhi: Sahitya Akademi. ISBN 81-7201-798-7.
{{cite book}}: Cite has empty unknown parameter:|coauthors=(help) - Gupta, A.N. Sarojini Naidu's Select Poems, with an Introduction, Notes, and Bibliography. Prakash Book Depot.
{{cite book}}: Unknown parameter|coauthors=ignored (|author=suggested) (help) - Harle, J.C (1994). The art and architecture of the Indian Subcontinent. New Haven, Conn: Yale University Press. ISBN 0-300-06217-6.
{{cite book}}: Cite has empty unknown parameter:|coauthors=(help)
బయటి లింకులు
నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి