చౌటపాలెం (పొన్నలూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


చౌటపాలెం
రెవిన్యూ గ్రామం
చౌటపాలెం is located in Andhra Pradesh
చౌటపాలెం
చౌటపాలెం
నిర్దేశాంకాలు: 15°13′26″N 79°44′46″E / 15.224°N 79.746°E / 15.224; 79.746Coordinates: 15°13′26″N 79°44′46″E / 15.224°N 79.746°E / 15.224; 79.746 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంపొన్నలూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,461 హె. (3,610 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,784
 • సాంద్రత120/కి.మీ2 (320/చ. మై.)
కాలమానం[[UTC{{{utc_offset}}}]]
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08599 Edit this at Wikidata)
పిన్(PIN)523109 Edit this at Wikidata

చౌటపాలెం, ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలానికి చెందిన [1] పిన్ కోడ్: 523 109. ఎస్.టి.డి కోడ్:08599.

గ్రామ భౌగోళికం[మార్చు]

చౌటపాలెం కందుకూరుకు 16 కి.మీ దూరంలో ఉంది. పొన్నలూరుకు 5 కి.మీ దూరంలో ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

విప్పగుంట 2 కి.మీ, [మాలపాడు]] చెరుకురు 3 కి. మి]]

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన చీమకుర్తి మండలం, తూర్పున సంతనూతలపాడు మండలం, పశ్చిమాన మర్రిపూడి మండలం.

సమీప పట్టణాలు[మార్చు]

కొండపి 6.4 కి.మీ, సంతనూతలపాడు 12.9 కి.మీ, చీమకుర్తి 15.2 కి.మీ, మర్రిపూడి 18.8 కి.మీ.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఈ ఊరికి దగ్గరగా సింగరాయకొండ రైల్వే స్టేషను ఉంది. సింగరాయకొండ-కందుకూరుకు 12 కి.మీ, సింగరాయకొండ జాతీయరహదారి మీద ఉంది. ఈ ఊరికి కందుకూరు నుంచి ఆటోలు ఆర్.టి.సి. బస్సు సౌకర్యం ఉంది.

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

ఈ ఊరిలో 7వ తరగతి వరకు "మండల జిల్లా పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల" ఉంది.

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

విద్యుత్తు[మార్చు]

ఈ గ్రామములో రు. 1.25 కోట్ల వ్యయంతో ఒక 33/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రాన్ని నిర్మించారు. ఈ నిర్మాణాన్ని, విద్యుచ్ఛక్తిశాఖవారు, కేవలం 45 రోజులలోనే పూర్తిచేయడం విశేషం. ఈ కేంద్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఇప్పగుంట యశోధర రామకృష్ణారావు, 2015,జూన్-2వ తేదీనాడు ప్రారంభించారు. [4]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఈ గ్రామ సమీపంలోని పందివాగుపై ఒక చెక్ డ్యాం నిర్మాణానికి అనుమతి మంజూరయినది. [5]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013-జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ చెన్నయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రామాలయం.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం.

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

శ్రీ ఐ.వి.ఆర్.కృష్ణారావు[మార్చు]

  1. 2014,జూన్-2న కొత్తగా ఏర్పడిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తొలి ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ #ఐ.వి.ఆర్.కృష్ణారావు, (ఇప్పగుంట యశోధర రామకృష్ణారావు) ఈ గ్రామస్థులే. 22 జనవరి-1956న జన్మించిన వీరి తల్లిదండ్రులు, శ్రీమతి సరస్వతమ్మ, శ్రీ భుజంగరావు. వీరి విద్యాభ్యాసం, పదవ తరగతి వరకు, కొండపి ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఇంటరు విద్య కందుకూరు ప్రభుత్వ టి. ఆర్.ఆర్.ప్రభుత్వ కళాశాలలోను, డిగ్రీ కర్నూలులోని సిల్వర్ జూబిలీ కలాశాలలోను, ఎం.ఏ. (ఎకనామిక్స్), అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరా విశ్వవిద్యాలయంలోనూ అభ్యసించారు. [2]
  2. వీరు తన స్వగ్రామాన్ని దత్తత తీసికొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే, ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడే, గ్రామంలో, స్థానిక రామాలయం పునర్నిర్మాణ సమయంలో విగ్రహాలు సమకూర్చారు. నాగిరెడ్డిపాలెం ఎస్.సి.కాలనీలో నిధుల లేమితో అర్ధంతరంగా నిలిచిపోయిన రామాలయం నిర్మాణం పూర్తి చేయించడానికి రు.5 లక్షలు మంజూరు చేయించారు. [3]

శ్రీ చెన్నారెడ్డి శరత్‌బాబు[మార్చు]

ఈ గ్రామములోని ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన శ్రీ చెన్నారెడ్డి నరసింహం, సుబ్బమ్మ దంపతులకు 1972లో జన్మించిన శ్రీ శరత్‌బాబు, ఉన్నత చదువులు చదివి అమెరికాలోని ఒక పెద్దసంస్థలో కొలువుచేయుచున్నారు. వీరు తన మాతృభూమిపై మమకారంతో, గ్రామాభివృద్ధికి లక్షల రూపాయల ఆర్ధిక సహకారం అందించుచూ, జన్మభూమిసేవలో తరించుచున్నారు. [6]

గణాంకాలు[మార్చు]

  1. 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,352. ఇందులో పురుషుల సంఖ్య 620, మహిళల సంఖ్య 732, గ్రామంలో నివాస గృహాలు 364 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,461 హెక్టారులు.
  2. జనాభా (2011) - మొత్తం 1,784 - పురుషుల సంఖ్య 911 -స్త్రీల సంఖ్య 873 - గృహాల సంఖ్య 492

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు మెయిన్; 2014,జూన్-3; 3వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015,మార్చి-4; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015,జూన్-3; 15వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015,అక్టోబరు-3; 15వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2017,జూన్-9; 8వపేజీ.