చౌటుప్పల్ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చౌటుప్పల్ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి భువనగిరి
మండలం చౌటుప్పల్
ప్రభుత్వము
 - చైర్‌పర్సన్‌ వెన్ రెడ్డి రాజు
 - వైస్ చైర్‌పర్సన్‌ బత్తుల శ్రీశైలం
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 15,745
 - స్త్రీల సంఖ్య 15,533
పిన్ కోడ్ - 508252
ఎస్.టి.డి కోడ్ - 08694
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చౌటుప్పల్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] చౌటుప్పల్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం భువనగిరి లోకసభ నియోజకవర్గంలోని, భువనగిరి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న చౌటుప్పల్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం[మార్చు]

చౌటుప్పల్ 80.33 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17.25°N 78.89°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. జిల్లా కేంద్రం భువనగిరి నుండి 34 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 31278 మంది కాగా, అందులో 15745 మంది పురుషులు, 15533 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 1 రెవెన్యూ వార్డుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెన్ రెడ్డి రాజు చైర్‌పర్సన్‌గా, బత్తుల శ్రీశైలం వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[7]

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. కొరగోని లింగస్వామి
  2. బత్తుల రాజ్యలక్ష్మీ
  3. బండమీది మల్లేష్
  4. అంతటి విజయలక్ష్మీ
  5. పోలోజు వనజ
  6. ఆలె నాగరాజు
  7. కాసర్ల మంజుల
  8. కొయ్యడ సైదులు
  9. దండ హిమబిందు
  10. బొడిగె అరుణ
  11. పోలోజు శ్రీధర్ బాబు
  12. తాడూరి శిరీష
  13. సుల్తాన్ రాజు
  14. సందగళ్ళ విజయ
  15. ఉబ్బు వరమ్మ
  16. వెన్ రెడ్డి రాజు
  17. గోపగోని లక్ష్మణ్
  18. కామిశెట్టి శైలజ
  19. బత్తుల శ్రీశైలం
  20. ఎండీ బాబాషరీఫ్

మూలాలు[మార్చు]

  1. "Choutuppal Municipality". choutuppalmunicipality.telangana.gov.in. Retrieved 21 March 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 21 March 2021. CS1 maint: discouraged parameter (link)
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 21 March 2021. CS1 maint: discouraged parameter (link)
  4. "Basic Information of Municipality, Choutuppal Municipality". choutuppalmunicipality.telangana.gov.in. Retrieved 21 March 2021.
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 21 March 2021. CS1 maint: discouraged parameter (link)
  6. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 21 March 2021. CS1 maint: discouraged parameter (link)
  7. skannegari. "Choutuppal Municipality into 20 wards - Telangana NavaNirmana Sena". tgnns.com. Retrieved 11 April 2021.

వెలుపలి లంకెలు[మార్చు]