చౌడేపల్లె మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 13°26′02″N 78°41′24″E / 13.434°N 78.69°E / 13.434; 78.69Coordinates: 13°26′02″N 78°41′24″E / 13.434°N 78.69°E / 13.434; 78.69
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
మండల కేంద్రంచౌడేపల్లె
విస్తీర్ణం
 • మొత్తం234 కి.మీ2 (90 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం42,103
 • సాంద్రత180/కి.మీ2 (470/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి992


చౌడేపల్లె మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలం.ఇది పుంగనూరు శాసనసభ నియోజక వర్గంలో ఉంది. పుణ్య క్షేత్రమైన తిరుపతి నుంచి ఈ మండలానికి బహు బాగా బస్సు సౌకర్యం ఉంది. బస్సు మార్గంలో తిరుపతి నుంచి చౌడేపల్లెకు (96 కి.మీ) పాకాల మీదుగా మదనపల్లెకు వెళ్ళు బస్సులో వరుసగా వచ్చే ప్రధాన ఊర్లు: తిరుపతి- చంద్రగిరి- పాకాల- దామలచెరువు-కల్లూరు-సదుం-సోమల->చౌడేపల్లె.బస్సు మార్గంలో చౌడేపల్లె నుంచి మదనపల్లెకు: చౌడేపల్లె-పుంగనూరు (16 కి.మీ)->మదనపల్లె OSM గతిశీల పటం

చూడదగ్గ ప్రదేశాలు[మార్చు]

ఇక్కడి మృత్యుంజయేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. చుట్టూ కొండలు,ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ మహిమాన్వితుడుగా మృత్యుంజయుడు పూజలందు కొంటున్నాడు. ఆలయ నిర్మణ కర్త అయిన పుంగనూరు జమిందారు మరణశయ్య నుంచి స్వామి వారి కటాక్షంతో మృత్యువును జయించడంతో పాటు, పూర్తి స్దాయిలో ఆలయ నిర్మాణం పూర్తి చేశాడు .రాష్ట్రం లోనే ఏ ప్రాంతంలోను లేని విదంగా మృత్యుంజయుని ఆలయం నిర్మించబడింది. రాష్ట్రం నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడుల నుంచి విశేష సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మృత్యుంజయుని దర్శించుకుంటారు.

ఆలయ స్థల పురాణం[మార్చు]

పుంగనూరు జమిందారుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేది. సా.శ. 600 శతాబ్డంలో రాజా చిక్కరాయలు ఈ ప్రాంతాన్ని పాలించేవారు. పుంగనూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఆవులపల్లి దుర్గాలలో జమిందారులు వేసవి విడిది కోసం వేళ్ళేవారు. ఈ నేపథ్యంలో ఓ వేసవిలో చిక్కరాయలు తన పరివారంతో విడిది కోసం ఆవుల పల్లి దుర్గాలకు వేళ్ళాడు. అక్కడ నిద్రిస్తుండగా రాయలకు శివుడు కలలో కనిపించాడు. ఇక్కడ సమీపంలోని ఓ కోనేరు వద్ద తమ విగ్రహలున్నాయనీ వాటిని తీసి ఆలయాన్ని నిర్మించాలని రాయలను ఆదేశించాడు. వెంటనే రాయలు వెళ్ళి కోనేరులో తవ్వించి చూడగా శివ, పార్వతిల విగ్రహాలు లభించాయి. తమ సంస్థానంలో ఆలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో స్వామి వారి విగ్రహాలను పుంగనూరుకు తరలించే ప్రయత్నం చేస్తూండగా చుట్టుకొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం గల ఓ ప్రాంతానికి వచ్చేసరికి పొద్దు పోవడంతో అందరూ విశ్రాంతి తీసుకోసాగారు. నిద్రిస్తూన్న రాయల వారి కలలో శివుడు ప్రత్యక్షమై ఈ ప్రాంతం తనకు నచ్చిందని ఇక్కడే ఆలయాన్ని నిర్మించాలని రాయలకు ఆదేశించాడు. దీంతో చిక్కరాయలు స్వామివారికి ఆలయాన్ని నిర్మించేందుకు సిద్దపడ్దారు. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చి ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. పనులు జరుగుతున్న సమయంలో రాయలు అస్వస్థతకు గురయ్యాడు. ఆలయ నిర్మాణం పూర్తయ్యేవరకు తనను బ్రతికించాలని రాయలు శివుని ప్ర్ర్ర్రార్థించాడు. వెంటనే ఆయనకు జబ్బు నుంచి విముక్తి లభించింది. కోరిన కోర్కెలు తీర్చి మృత్యవు నుంచి కాపాడాడు కాబట్టి శ్రీ అభీష్టదమృత్యంజయేశ్వర స్వామిగా స్వామివారు ప్రసిద్ధికెక్కారు. ఆలయ నిర్మాణం పుర్తయి ద్వజస్తంభం నిలబెట్టేస్దాయికి పనులు జరిగాయి. 60అడుగులు పొడవుతో ఏకశిలగా రూపొందించిన ద్వజస్తంబాన్ని ఎవరూ నిలబెట్టలేక పోయారు. దీంతో ఆలయ నిర్మాణం అర్ధాంతరంగా నిలిపేసి మనస్ధాపంతో రాయలు పుంగనూరుకు వెనుదిరిగాడు. కొంతదూరం వేళ్ళేసరికి ఒక బ్రాహ్మణుడు చిక్కరాయలుకు ఎదురుపడి సమాచారం అడిగి తెలుసుకొన్నాడు .అతను రాజా ఓ సారి వెనుదిరిగి చుడమని బ్రాహ్మణుడు చెప్పగా రాయలు తిరిగి చూశాడు.ఆలయం వద్ద ద్వజస్తంభం నిలబడి ఉన్న దృశ్యం ఆయనకు కనిపించింది. వెంటనే బ్రాహ్మణుడుని చూసేసరికి అతను మాయమయ్యడు. శివుడే తనకు ఎదురుపడ్డాడాన్ని తలచిన రాయలు అక్కడ ఓ కొనేరు తవ్వించి గాలి గోపురాన్ని ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆప్ర్రాంతాన్ని దొరబావిగా పిలుస్తున్నారు.అప్పటి నుంచి ఎవరు అయితే గుడి యొక్క అబివృద్ధిని చేస్తారో వారి పాదుకులను రాజు తన యొక్క తల మీద పెట్టుకుంటానని రాయలవారు శిలాశాసనంలో లిఖించాడు.మొదట చౌడేపల్లెని చిక్కరాయపురం అని పిలిచేవారు. గ్రామదేవతగా చౌడేశ్వరమ్మ ఆవిర్బావంతో అటూ పిమ్మట చౌడపురిగా అ తర్వాత కాల క్రమేణా చౌడేపల్లెగా రుపాంతరం చెందిది. చౌడేపల్లెలో బోయకొండ గంగమ్మ ఆలయం ఉంది.ఈ ఊరి బొరుగులు సహితం బహు ప్రసిద్ధి. ఒకప్పుడు బొరుగులు తయారు చేయడం పెద్ద కుటుంబ పరిశ్రమగ వెలుగొందింది.ఫ్రసిద్ధి చెందిన మాబడి, పాఠశాల మాస పత్రికలు ఈ ఊరి నుంచే వెలువడుతాయి.ఈ ఊరిలో ప్రతి మంగళవారము వారపు సంత జరుగును.ఈ ఊరి గ్రామ దేవత పేరు చౌడేశ్వరీదేవి

మండలంలోని గ్రామాలు[మార్చు]

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 40,410 - పురుషులు 20,266 - స్త్రీలు 20,144
అక్షరాస్యత (2001) - మొత్తం 60.43% - పురుషులు 73.65% - స్త్రీలు 47.17%
గ్రామ జనాభా (2001) - మొత్తం 6,911 - పురుషుల 3,444 - స్త్రీల 3,467 గృహాలు. 1542 విస్తీర్ణము 1036 హెక్టార్లు ప్రజల భాష తెలుగు. ఉర్దూ.

సమీపగ్రామాలు[మార్చు]

పందిళ్లపల్లె, 2 కి.మీ. చారాల 3 కి.మీ. కొండమర్రి 3 కి.మీ. దుర్గసముద్రం 5 కి.మి. వీరపల్లె 8 కి.మీ దూరములో ఉన్నాయి.

చుట్టుప్రక్కల మండలాలు[మార్చు]

సోమల, పుంగనూరు పెద్దపంజాని, నిమ్మనపల్లె., మండలాలు.

రవాణా సౌకర్యం[మార్చు]

రోడ్డు రవాణా..

ఇక్కడికి దగ్గరగా వున్న టౌన్ పుంగనూరు 16 కి.మీ. దూరములో ఉంది. సోమల బస్ స్టేషను, పుంగనూరు బస్ స్టేషనులు ఇక్కడికి సమీపములో ఉన్నాయి. ఇక్కడి నుండి ఇతర ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ వారి బస్సులు అనేకము తిరుగుతున్నవి.

రైలు వసతి.

ఇక్కడికి పది కి.లోమీటర్ల లోపు రైలు వసతి లేదు. ప్రముఖ రైల్వే స్టేషను కాట్పాడి ఇక్కడికి 78 కి.మీ దూరములో ఉంది.

పాఠశాలలు[మార్చు]

ఇక్కడ ఒల జిల్లాపరిషత్ పాఠశాల మరియి ఒక మండలపరిషత్ ఉర్దూ పాఠశాలలు ఉన్నాయి.

ఉపగ్రామాలు[మార్చు]

పొదలపల్లె, నగిరిమిట్టపల్లె, చిన్నయెల్లకుంట్ల, కిన్నకొండమర్రి, చిట్టిరెడ్డిపల్లె, గోసులకూరపల్లె.[3]

మూలాలు[మార్చు]

  1. https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Chittoor%20-%202018.pdf.
  2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2823_2011_MDDS%20with%20UI.xlsx.
  3. "http://www.onefivenine.com/india/villages/Chittoor/Chowdepalle/Chowdepalle". Archived from the original on 23 జూన్ 2016. Retrieved 24 June 2016. {{cite web}}: Check date values in: |archive-date= (help); External link in |title= (help)

వెలుపలి లంకెలు[మార్చు]