Jump to content

ఛత్రపాల్ సింగ్ గాంగ్వార్

వికీపీడియా నుండి
ఛత్రపాల్ సింగ్ గాంగ్వార్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జూన్ 4
ముందు సంతోష్ గంగ్వార్
నియోజకవర్గం బరేలీ

పదవీ కాలం
మార్చి 2017 – మార్చి 2022
ముందు అతౌర్రెహ్మాన్
తరువాత అతౌర్రెహ్మాన్
నియోజకవర్గం బహేరి

వ్యక్తిగత వివరాలు

జననం (1956-01-20) 1956 జనవరి 20 (వయసు: 70)
దమ్ఖోడా, ఉత్తర ప్రదేశ్ , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి రంజనా సింగ్
సంతానం 2
పూర్వ విద్యార్థి మహాత్మా జ్యోతిబా ఫూలే రోహిల్‌ఖండ్ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు

ఛత్రపాల్ సింగ్ గాంగ్వార్ (జననం 20 జనవరి 1956) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బరేలీ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఛత్రపాల్ సింగ్ గాంగ్వార్ భారతీయ జనతా పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2002లో జరిగిన ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బహేరి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి అటా-ఉల్ - రెహ్మాన్ చేతిలో 2883 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2007 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి అంజుమ్ రషీద్‭పై 8262 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ఛత్రపాల్ సింగ్ గాంగ్వార్ 2012లో జరిగిన ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బహేరి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి అతౌర్రెహ్మాన్ చేతిలో 18 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయన 2017 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి నసీమ్ అహ్మద్‭పై 42,837 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై రెవిన్యూ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[2][3]

ఛత్రపాల్ సింగ్ గాంగ్వార్ 2022లో జరిగిన ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బహేరి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి అతౌర్ రెహమాన్ చేతిలో 3,355 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బరేలీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి ప్రవీణ్ సింగ్ అరోన్ పై 34,804 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  2. "Decoding Yogi's cabinet expansion" (in ఇంగ్లీష్). India Today. 27 September 2021. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
  3. "Yogi Adityanath expands UP Cabinet; Channi's cabinet takes oath in Punjab" (in ఇంగ్లీష్). The Indian Express. 27 September 2021. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
  4. "Lok Sabha 2024 Election Results: Bareilly" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
  5. "बरेली लोकसभा सीट से जीतने वाले बीजेपी के छत्रपाल सिंह गंगवार कौन हैं, जानिए अपने सांसद को". TV9 Bharatvarsh. 6 June 2024. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.